పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


యమును గ్రహమునకు జాతరచేసి యూరివారు దానిని సాగ నంపుచుందురు.ఇది గ్రహముచేతనే కాకపోయినపక్షమునకు వర్షకాలములో నేల తగులపడకూడదు?

సుబ్ర-యిండ్లుకాలుట గ్రహము చేతనే యయినయెడల, ఒక సారి జాతరచేసిబంపిన గ్రహము మరలవచ్చుటకుఁ గారణమేమి? వర్షకాలములో ఇండ్ల కప్పులు వానతో నానియుండును కనుక-

సత్ర-గారణములు గీరణములు నాకు ఁ నాదెలియవు. నాకెప్పుడును యుపయుక్తులన్నఁదలనొప్పి; కాబట్టి నేను జెప్పిన మాటల కడ్డమాడక సత్యమని నమ్ము. ఇప్పుడు నమ్మకపోయినను రేపు జాతరగు చుండఁగా కన్నులారా చూచినప్పుడయినను నమ్మెదవు.

ఈ ప్రకారము సంభాషణముగా జరుగుచుండఁగా అగ్నిహోత్రుడు తన చెలికాఁడగు వాయు దేవుని సాయముచే కుమ్మరపేటను సంప్ణూముగా దహనము చేసి త్రప్తి పొంది ప్రశాంతి నొందెను. ఇండ్లు కాలినవారును సొత్తుపోయినవరును విచారించుచుండగాఁ కొందఱు చుట్టు కాల్చుకొనుటకు కావలిసినంత నిప్పు దొరకినదనియు రేపు బొగ్గులు చవుకగా దొరకగలవనియు సంతోషించుచుఁబోయిరి. వారి వెనుకనే సుబ్రహ్మణ్యమును సత్రపుబ్రాహ్మణునితోఁ గూడ బయలు దేఱి సత్రమును జేరెను. ఈ లోపల నెవ్వరో రుక్మిణి యత్తవారియూరికిఁ బోవుచున్న బ్రాహ్మణుఁడొకడు సత్రములోనికి భోజనమునకు రాఁగా ఆమె దుర్మరణ కథను జాబు వ్రాసి యుత్త్తరక్రియ లను వేగిరము జరిగించుటకయి యాజాబునతనిచేతికిచ్చి రాజశేఖరుఁడుగారు వియ్యంకునకుం బంపిరి.

ఆమఱునాడు పగలు రెండుజాములవేళ రాజశేఖరుఁడుగారు భోజనము చేసి వీధియరుగుమీఁద గూరుచుండియుండఁగా,ఆ దారిని