పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

45

మును యోగములచేతను, వాత జప యుపవాసంబుల చేతను, కృషింపజేయక యే పది వేలజన్మములకైనను మోక్షము రానేరదు. 113. గాంధీమహాత్ముడు లండనుకు పోయినపుడు చక్రవర్తి స్వయముగా లేచి మహాత్ముని చేబట్టుకొని తనతో సమానముగా సింహాసనము మీద కూర్చుండ బెట్టుకొనెను. ఆది చూచి యా దేశపు పండితు డొక్కడు మహాత్మునివంటి గౌరవము నాకుకూడా కావలెనని యున్నదిగాని వారిమాదిరిగా నేను ఆచరణయందు నిలువగలనో లేనోయని సందేహము గల్గుచున్నదని అన్నాడట. అట్లే మనలో కూడా చాలామందికి మేము గొప్పవారము కావలెననియు పూజింపబడవ లెనని యున్నదిగాని అయితే మహానుభావులు ఆచరించిన నియమ మములు మనము ఆచరించగలమా లేమా యని సందేహము గలుగుచుండును.

114. భూమియొక్క అణువులలో నుంచి క్రిమికీటక పశుపక్ష్యాది జన్మములు క్రమక్రమముగా మారి తుదకు మానవజన్మము వచ్చినదని పాశ్చాత్యులు చెప్పిరి. అట్లయినచో మనము తఱించవ లెనంటే మనకు గమ్యస్థానము మన్నేనని చెప్పవలసియున్నది. అందువలన మనము తుదకు మట్టిలో లయము కావ లెనని మన యొక్క సిద్ధాంతమగుచున్నది, వేదమతము ఏమి చెప్పుచున్నదనగా మానవునికి గమ్యస్థానము పరమాత్మయే యనియు అట్టి పరబ్రహ్మమునుండి జీవత్వము ఏర్పడినదనియు మరల క్రమక్రమంబుగా పరమాత్మలోనే చేరవలెననియు చెప్పిరి. కాన మన మతమునకును ఇతర మత ములకును ఎంత తారతమ్యమున్నదో గమనించుడు.