పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

33

82 ఈ జన్మమున భాగ్యవంతులై యున్నవారు ఇది వఱకు జన్మములో పుణ్యము జేసినవారే యగుచున్నారు. ఇప్పుడు నానాదరిద్రములు, కష్టము లనుభవించువారు ముందుజన్మ మున మహాపాపములు జేసినవారే యగుచున్నారు. ఏ కర్మ జేసినవారికి అదియే ప్రాప్తించును. ఎట్లనగా ఏ పేరు బెట్టుకొన్న వారికి యా ధాన్యమే వచ్చునుగదా ! అందుచేతనే కొందరికి ధన ముందురు. భూమి లేకుఁడును. కొందఱికి భూమియుండును, ధనము లేకుం డును. కొందఱికి భూమియు, ధనమును రెండుకు యుండును. కొందఱు మహాధనవంతులయ్యును గృహము బాగుగ లేకుండును. కొందఱికి గృహము చక్కగాయున్నను, ధనక నక ములు తక్కు వగాయుండును. భాగ్యముండియు కొందఱు రోగులై యుందుకు, బీద వారయ్యును కొంద రారోగ్యవంతులై యుందురు. కొందఱికి పశువులు బాగుగా వృద్ధియగును. కొందరికి గానేరవు. కొందరు ధనవంతులయ్యును కీర్తి పొందనేరరు. కొందఱు ధనము లేక నే కీర్తి. పొందుదురు. కొందఱు కొద్దికాలములోనే గొప్ప విద్యావంతు లయ్యెదరు. కొంద రెంత కాలము చదివినను విద్య రాదు. కొందఱు పసివారయ్యును, మహా భోగభాగ్యములుండియు మోషేచ్ఛ గల్గి విరక్తు లగుచున్నారు. మఱికొందఱు ముసలివారయ్యును, మహాకష్టము లనుభవించుచున్నను విరక్తు లగుట లేదు. గాన ఈ నవ్యత్యాసమంతయు పూర్వజన్మ పుణ్యపాపఫలము లే తెలియవలెను.

83. ఒక గురుకులవాసమునం దున్న వారందఱును నిష్క ల్మషమైన వా రైయినచో కొలదికాలమునకే వారు ముక్కు లయ్యెగరు; అట్లుగాక కొందఱు దుష్ప్రవృత్తులు గలవారుండి