Jump to content

పుట:ఉదాహరణపద్యములు.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

గీ. దండములు వెట్టెదము మోడ్చెదము కరములు
సేవ యొనరించెదము మమ్ముఁ గావు ప్రోవు
యాగవేదికి విచ్చేయు మారగింపఁ
బ్రథమజన్ముల యింటి కల్పద్రుమంబ.

వీరమాహేశ్వరము—
సీ. కఱకుచీకటులమూఁకలు నుగ్గునూచుగా
నురిచి నూరక త్రాగు నెరతనంబు
బొట్టేటిరాయని చొళయంబుఁ గదలించి
వాహ్యాళి గదలెడి వైభవంబు
క్రతుభాగములు దెచ్చి కైతప్పు గాకుండ
వేల్పుల కందించు వెరవుసొంపు
మూఁడుమూర్తులు దాల్చి మురువుతో జన్నంపు
వేదిపైఁ గొలువుండు విభ్రమంబు
ఆ. నీకుఁ జెల్లు నొరుల నీతోడిసాటికిఁ
బేరు గ్రుచ్చి యెన్నలేరు జగతి
వశమె నిన్నుఁ బొగడ స్వాహావధూకుచా
భ్యున్నతప్రకాశ యోహుతాశ.