Jump to content

పుట:ఉదాహరణపద్యములు.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23

శా. ఆజ్ఞాసిద్ధికరంబు ముక్తిదము చిత్రానందసంధాయి శై
వజ్ఞానాంకురశిష్టబీజము ప్రభావప్రౌఢసంవిత్కళా
జిజ్ఞాసావిభవప్రదాయకము లక్ష్మీకారణం బూర్జిత
ప్రజ్ఞామూలము భక్తలోకమునకుం బంచాక్షరీమంత్రమున్.

(వీరమాహేశ్వరము)



సీ. కమలజాండంబులు కందుకంబులు సేసి
యొండొండ తాటింపనోపువారు
విలయవహ్నులఁ బట్టి వెసదండలుగ గ్రుచ్చి
యురమున ధరియింప నోపువారు
తివిరిసంహారభైరవునైనఁ బొరివోవ
నొకమాత్ర వసిమాల్పనోపువారు
కాలచక్రకియాఘటనంబు ద్రిప్పి
యొండొకలాగు గావింపనోపువారు
గీ. ప్రమథవీరులు వివిధరూపములతోడ
హసనలనుఘనదాపనాద్యలఘుగతులు
వెలయ గోటానకోటులు కొలిచి ...........
రతఁడు హరు గొల్వనేతెంచునవసరమున.

బ్రహ్మకు—
చ. వలపెటువంటిదో ముసలివాఁడనవచ్చునె యద్దిరయ్య ప
ల్కులజవరాలు దాఁ జదువులోన జపంబులలోనఁ బాయ ద
గ్గలముగ నెల్లప్రొద్దును మొగంబునఁ గట్టిన యట్టులుంటు నీ
నలువకు నంచుఁ గాముకులు నవ్వు విధాత శుభంబు లీవుతన్

(జైతరాజు ముమ్మయ – విష్ణుకథానిధానము)