పుట:ఈశానసంహిత.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డీవిమర్శనము వ్రాయుట తటస్థపడుట విచిత్రముగానే యున్నది. ఇతరు లెవ్రైన నీసంహితను విమర్శించి ప్రకటించినయెడల వివాదమునందు న్యాయముఁ దెల్పినవారయి యుండెడివారు. నే నన్ననో వాది ప్రతివాదులలో నొక్కఁడనై యున్నాను. కాలక్రమముననైన న్యాయము ప్రకటముకాక తీఱదుగదా? పరిషత్తువారు నాకు సంహిత పంపిన కొలఁదిదినములలోనే "ప్రాచ్యలిఖితపుస్తకాలయమునకు లభించిన సంహిత తాటాకుప్రతియా? కాగితపుఁబ్రతియా? ఏకాలమున వ్రాయఁబడినది? ఏ ప్రాంతమున లభించినది? "అత్రగ్రంథపాతః” అను వాక్యము మూలమం దున్నదా? ప్రతి లేఖకులు వ్రాసినదా? వ్రాఁతకత్తు ఏదేశపుది?" అని ప్రశ్నించుచు వ్రాసియుంటిని. కాని రెండునెలలైనను సమాధానము రామిచే నిరాశుఁడనై ప్రకృతవ్యాస మారంభించుచున్నాఁడను.

గ్రంథస్వరూపము

ప్రాచ్యలిఖితపుస్తకాలయమం దున్నప్రతిసంఖ్య Restored copy No. R 5583 T. 6. 38 Original No. 5.4.28. దీనికి ప్రతి వ్రాసి శ్రీప్రభాకరశాస్త్రిగారు పరిషత్తునకుఁ బంపిరి. దానిని జూచి పరిషత్తు మేనేజరు బ్ర. శ్రీ. చిలుకూరి పాపయ్యశాస్త్రిగారు వ్రాసినప్రతి నాకుఁ బంపినారు.

ఆప్రతి నాలుగధ్యాయములు గలదిగా నుండవలసిన ట్లగపడుచున్నను రెండధ్యాయములఁవఱకు మాత్రమే కలదు. పుల్ స్కేపు సైజు 1/4 పుటలు ముప్పదివాలుగు గలవు. పుటకు సగటున 22 పంక్తులు చొప్పునఁ గలవు. మొత్తము శ్లోకములు 339. అన్నియును అనుస్టుప్ శ్లోకములు. ఈభాగము కేవలము శివరాత్రిమాహాత్మ్యము నుద్దేశించియే యెత్తి వ్రాయబడిన ట్లగపడుచున్నది. అసలు సంహితయంతయు నింతియే యేమో యనుసంశయముగూడఁ గలుగుచున్నది. దీని హేతువులు ముందుఁ దెలుపుకొందును. ఈప్రతి 70 అధ్యాయముతో నారంభమై 73 అధ్యాయాంతముతో ముగియుచున్నది. 70 అధ్యాయాంతమున