పుట:ఈశానసంహిత.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహాపర్వము ప్రవర్తించుటకుఁ గారణమగు "ఉరులింగోద్భవకథను” ఆపర్వమహత్త్వమును దెలుపుటకు సుకుమారచరిత్రమును బ్రధానాంశములుగా గ్రహించినాఁడు. సంహితాకారుఁడు అట్లుకాక శివరాత్రివ్రతవిధానము తత్ఫలస్తుతిరూపమగు శంకరయమసంవాదమును గథావస్తువులుగా గ్రహించినాఁడు. మఱియు సంహితయం దఁఱువదిశ్లోకములు దక్కఁ దక్కినభాగమంతయు పూజావిధానములు నామములు స్తోత్రములతోడనే కదా నిండియున్నది. అతఁడు కేవలము పౌరోహిత్యమే యాలంబించినవాఁడు కాకున్న ప్రథమాధ్యాయాంతమున “శివరాత్రిప్రాదుర్భావతద్వ్రతపూజావిధానంనామ" అను నక్షరములు వెలసియుఁడఁగలవా? అవియైనను సంహితాకారుని యప్రతిభత్వమురు ఛాందసత్వము నవీనత్వమును రుజువు చేయఁజాలవా?

సారాంశము

పైవిషయములన్నియు నాలోచింపఁగా నీశానసంహిత మిక్కిలి అర్వాచీరమే కాని ప్రాచీనము గాదనియు శ్రీనాథునిగ్రంథమున కిది మాతృకకాదు సరేకదా పుత్రికయనియు, నిది యొకయప్రౌఢపురోహితపండితునిచే రచింపఁబడినదనియు పండితాభిప్రాయము ప్రకటితమగుచున్నది. వింతలలో వింత. శ్రీనాథరచితమగు శివరాత్రిమాహాత్మ్య మిట్లు సంస్కృతీకరింపఁబడుటచే నామాహాత్మ్యము నవతారికాపద్యములు కూడ నతఁడు రచించినవి కావనియు సంహితాకారునిబోలు మహానుభావుఁ డెవరో దానిని బూరించెననియు వ్రాయఁబడిన పీఠికావాక్యముల కుపోద్బలము గలుగుచున్నది.

ముగింపు

గ్రంథద్వయము ననేకపర్యాయములు మిక్కిలి శ్రద్ధతోఁ జదివినమీఁదట నాకుఁ దోచిన విషయములు నేను వ్రాసితిని. నాకు సత్య