పుట:ఈశానసంహిత.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లును విడివిడిగఁగూడ ముద్రితాముద్రితము లగపడుచున్నవి. కాని యెందు నీయీశానసంహిత పేరైనఁ గనవినరాలేదు. పోనిండు. కొన్ని కథలైన నీసంహితలోని వనుపేర నగపడుచున్న వన నట్లును లేదు. నాలుగధ్యాయములు మనకు లభించిన దీనికిముందు నఱువది తొమ్మిదధ్యాయములు నేమైనవి. వీనికిఁ దరువాత నింకను గొన్ని యధ్యాయము లున్నవా? లేక వీనితోనే సంహిత ముగిసినదా? యనుసంశయములు వీడు టెట్లో యెఱుకపడకున్నది.

శివరాత్రిమాహాత్మ్యమున ఈశానసంహితానామ మొక్కతావుననే యొక్కమాటే పేర్కొనఁబడినది.

"స్కాందంబునం దీశానసంహితం జెప్పబడ్డయురులింగోద్భవంబును శివరాత్రిమాహాత్మ్యంబును” ఆ 1. ప 3.

“స్కాందపౌరాణికంబైన కథలలోన, ఘనత శివరాత్రిచరితంబు దెనుఁగుగాఁగ।" ఆ 1. ప 37.

“నూఱువేల్గ్రంథములతోడ నుతివహించి, శ్రీమహాస్కాందసంహిత శివుని జెప్పు" ఆ 1. ప 47.

"శంకరసంహితా కథాదీపిత భవ్యమార్గమున” ఆం 1. ప 47.

అని నాల్గుతావులందు మాత్రమే శ్రీనాథుని గ్రంథమునకు మూలము పేరు చెప్పఁబడినది. నాల్గుతావులందు నాల్గువిధములుగా నున్నది; కాని యీశానసంహితయేయని చెప్పుటకుఁ గారణము గానరాలేదు. ఈగ్రంథవిషయమై గొప్పపరిశోధనము గావించి నాతోడి వివాదమునఁ బెక్కువ్యాసములుర చించిన శ్రీ బండారు తమ్మయ్యగారుగాని యింకను గల పెక్కురు శైవపండితులుగాని యీశానసంహితయొకటి కలదనియో లేదా శివరాత్రిమాహాత్మ్యమునకు మూల మీసంహితయం దిట్లు కలదనియో దెలుపకుండుట చూడ శ్రీనాథుఁ డీగ్రంథము నాంధ్రీకరింపలేదనుటకు గొప్ప ప్రమాణము కాకపోదు.