కేతన కాదంబరియందు —
శా. |
డాచే యంకతలంబుఁ జేర్చి వలచేతన్ మాలికన్ దాల్చి...
| 282
|
జైమినిభారతమున —
శా. |
డిండీరోత్తరవీచులం దరసి యుద్రేకించి కూలంకషల్
మండూకీపరిణీయమానవిలసన్మాహాత్మ్యమున్...
| 283
|
ఆముక్తమాల్యదయందు —
చ. |
ఇలఁగలవస్తుసంతతుల నెల్లను గెల్చెడుమత్స్యజాతపా
టల రుచి యింక వేఱె యొకదారికి వచ్చునె?....
| 284
|
మఱిన్ని, ఈయభేదయతికి నన్నయభట్టు లక్షణసారంబున —
క. |
వపయోరభేద మనియెడు, నెపమునఁ బఫబభలు వాకు నిలిచినయెడలం
దుపమింప వచ్చుఁ గృతులం, దుపనిషదుచితార్ధసూక్తి యొనరుట వలనన్.
| 285
|
తా. |
పఫబభ యీ నాలుగక్షరములకు వకారమునకు యతి చెల్లును.
|
|
భారతము, ద్రోణపర్వమున —
క. |
తురగము తురగము కరి కరి, నరుఁడు నరుఁడు తేరు తేరు నలిఁ దాఁకినయ
ప్పరుసుఁదన మేమి చెప్పుదుఁ, బొరి మిణుఁగురు లెగఁసె గైదువులపొడి రాలెన్.
| 286
|
భారతము, ఆదిపర్వమున —
......
క. |
వీరుం డగునరుఁ డేయున, పారశరావళుల నడుమ వారింపంగా
నేరక యే టుడిగి మహా, శూరుఁడు రాధేయుఁ డింద్రజున కి ట్లనియెన్.
| 287
|
భారతము, ఆదిపర్వమున —
చ. |
నుతజలపూరితంబు లగునూతులు నూఱిటికన్న సూనృత
వ్రత యొకబావి మేలు మఱి బావులు నూఱిటికన్న నొక్కస
త్క్రతు వదిమేలు సత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త
త్సుతశతకంబుకంటె నొకసూనృతవాక్యము మేలు చూడఁగన్.
| 288
|
ఎక్కటియతి
భీమనచ్ఛందమున (సంజ్ఞ 72) —
క. |
ధర ఙఞ అనునీరెండ, క్షరములు విన్నయది లేదు శబ్దము మొదలన్
మరవఱల లనెడియైద, క్కరములు తమతమకె చెల్లుఁ గమలాధీశా!
| 289
|
అనంతచ్ఛందముశ (1.118) —
క. |
ధర నెక్కటివ ళ్లై చను, లరమఱవలు వానిలోఁ దొలంగక ళాకున్
సరిలా యని విశ్రమవే, ళ రమాధిప! రెండునుం గలసి వర్తిల్లున్.
| 290
|