పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మందిలో అష్టకుడనువాడు జ్యేష్ఠుడుగా నుండినమొదటి యేబదిమందియు దాని నంగీకరించ లేదు. వారు తండ్రిఆజ్ఞను నిరాకరించిరి. అందువలన విశ్వామిత్రుడు కోపించి వారిని శపించెను.

ఈ చరిత్ర ఐత రేయ బ్రాహ్మణమునం దిట్లు వినబడుచున్నది:-

ఐత రేయ బ్రాహ్మణము, సప్తమ పంచకా, తృతీయాధ్యాయము పదునెనిమిదవ బ్రాహ్మణము:-

"తస్య హ విశ్వామిత్ర:స్యైకశతం పుత్రా ఆను:, పంచాశదేవ జ్యాయాంసో మధుచ్ఛందస: పంచాశ త్కనీయాంస స్తద్యే జ్యాయాంసన తే కుశలం మేని రే; తానను వ్యాజహారాంతాన్వ: ప్రజా భక్షీ ష్టేతి; త ఏతేం ధ్రా: పుండ్రా: శబరా: పుళిందా మూతబా ఇత్యుదంతాన్ బహవో భవంతి వైశ్వామిత్రా దస్యూనాం భూయిష్ఠా:."

సాయన భాష్యం:-

విశ్వామిత్రాణాం వృత్తాంత ప్రారంభ: మధుచ్ఛం కోనామక: కశ్చిత్పుత్రో మధ్యమస్తతో పి జ్యేష్ఠా: కనిష్ఠాశ్చ ప్రత్యేకం పంచాశత్సం ఖ్యాకాఇత్యేన మేకశతంతస్య పుత్రా:' తేషాం మధ్యే జ్యేష్ఠానాం వృత్తాంత మాహ:

"తత్తేష్వేకశత సంఖ్యాకేషు మధ్యే యే మధుచ్ఛందసో జ్యేష్ఠా: పంచాశత్సంఖ్యాకా: సంతి; తే శునశ్శేఫస్య విశ్వామిత్ర పుత్రత్వం కుశలం న మేనిర ఇదం సమీచీనమిత్యేవం నాంగీకృతవంత: తాన్ జ్యేష్ఠాన్ పంచాశత్సంఖ్యాకా ననులక్ష్య విశ్వామిత్రో వ్యాజహార వ్యాహరణం శాపరూపం వాక్య ముక్తవాన్: 'హేజ్యేష్ఠ పుత్రా:! యుష్మాకంమదీయాజ్ఞతిలంఘినాం ప్రజా: పుత్రాదికాఅంతాన్ భక్షీష్ట - చండాలాదిరూపా న్నీ చజాతి విశేషాన్ భజతామితి; త ఏతే శస్తా: సంతో అంధ్రత్వాది పంచవిధనీచజాతి విశేషాభవంతి. ఇతి శబ్దస్య తత్ప్రదర్శనార్థత్వా దన్యేపి నీచజాతి విశేషా: సర్వే వివక్షి తా:.