Jump to content

పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తూర్పు గోదావరి జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలోని అన్ని పట్టణాలలో మరియు నగరాలలో ఉచితముగా పైప్ లైన్ వేయుటకు అనుమతులు మంజూరు చేయటమైనది. గత నాలుగున్నర సంవత్సరాలలో 330 కోట్ల రూపాయల పెట్టుబడితో వివిధ గ్యాస్ సంబంధిత మౌళిక సదుపాయముల కల్పన రాష్ట్ర వృద్ధికి ప్రతక్షంగా ఉపయోగపడింది.

126. రోడ్లు మౌళిక వసతులు: అమరావతి నుండి అనంతపురం వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్స్ వేక్రింద 384 కిలోమీటర్లు రోడ్‌ను సుమారు 20,000 కోట్ల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు నిర్మించుటకు అనుమతి లభించింది. దీని మూలంగా రాయల సీమ ప్రాంతం నుండి రాజధానికి మరియు పోర్టులకు మధ్య దూరం మరియు ప్రయాణ సమయములు తగ్గుతాయి. ఈ జాతీయ రహదారి యొక్క పొడవు 2014 సంవత్సరము జూన్ నుండి 2164 కిలోమీటర్లుగా పెరిగింది. ఇది ప్రస్తుతం ఉన్న పొడవు కంటే 50 శాతం ఎక్కువ. రాష్ట్రములోని నేషనల్ హైవే వింగ్ రహదారులు - భవనముల శాఖ మరియు నేషనల్ హైవే ఆథారిటీ వారిచే నిర్మింపబడి నిర్వహంచబడుచున్న రహదారులను చదును చేసి రెండు లైన్లగా 2020 నాటికి ఆధునీకరించుటకు నిర్ణయించడమైనది. జూన్ 2014 తర్వాత 2400 కిలోమీటర్ల రెండు వైపుల చదును చేసిన దహదారులను 12,729 కోట్ల రూపాయలతో 4 లైన్ల దహదారిగా విస్తరించుట జరిగినది. రాష్ట్ర రహదారుల వ్యవస్థ 41956 కీ.మీ. నుండి 46342 కీ.మీ. కు 2014-15 తర్వాత పెరిగినది. 1800 కీ.మీ. పొడవైన నాన్ బిటి రోడ్లను 1580 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2020 నాటికి బిటి రహదారులుగా మార్చడము జరుగుతుంది. 2000 PCUలకు పైగా ట్రాఫిక్ ఉండే అన్ని సింగిల్ రహదారులను రెండు లైన్లగా విస్తరించుటకు మా ప్రభుత్వము కృషి చేస్తుంది.

127. ప్రకృతి వనరులు - అడవులు: మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ ను స్థాపించిన తర్వాత రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం ఉండేలా 2029 నాటికి ఏర్పాటు చేయుటకు వనం - మనం అను కార్యక్రమమును లక్ష్యముగా పెట్టుకొనుట జరిగినది. ఈ లక్ష్యము దిశగా ప్రచారం నిర్వహించుట జరుగుతున్నది. జీవ వైవిధ్యంతో కూడిన విస్తృతమైన అడవులు మరియు కార్బన్ సింక్ తో కూడిన ఆంధ్రప్రదేశ్‌కు ఇది ఉపకరిస్తుంది. పౌరులకు సురక్షితమైన నివసించు ప్రదేశాలను రాష్ట్రములో కల్పించుట లక్ష్యంగా పెట్టుకొనుట జరిగింది.

శాంతి భత్రలు

128. శాంతి భద్రతల మెరుగుదలకోసం మాప్రభుత్వం చేపట్టిన చర్యలు అన్నిరకాల నేరాలను తగ్గించాము. పౌరుల తోడ్పాటు, ఎలువంటి అసహనం లేకుండా ఉడటంవలన ఇది సాధ్యపడింది. మహిళల పట్ల జరిగే హింసలు, నేరాలను అరికట్టడానికి షీ టీమ్‌లను అన్నిచోట్ల నియమించాము. ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పరచి దాని అక్రమరవాణా అరికట్టాము. కఠినమైన విధానాలవల్ల ఇది సాధ్యపడింది. అడవుల సంపదని, పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది.

24