కుటుంబానికి 150 యూనిట్ల ఉచిత విద్యుత్, ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయల వార్షిక కవరేజితో ఆరోగ్య భీమా పధకం, 5,000 మంది గ్రామీణ చేనేత కుటుంబాలకు 2.81 లక్షల విలువచేసే ఇల్లు మరియు వర్కుషెడ్ల నిర్మాణపథకం, పట్టణాలలో నివసించే చేనేత కార్మికులకు 1.2 లక్షల విలువ చేసే ప్రత్యేక వర్కు షెడ్ల నిర్మాణం ఈ సమగ్రాభివృద్ధి ప్యాకేజీలో ఉన్నాయి.
71. డ్రైవర్ల సామాజిక మరియు ఆర్ధిక శ్రేయస్సు కోరుకుంటూ 150 కోట్ల రూపాయలు కేటాయింపుతో డ్రైవర్ల సాధికార సంస్థను స్థాపించటానికి నేను ప్రతిపాదిస్తున్నాను. ఈ సంస్థని రైతు సాధికార సంస్థ మరియు మహిళా సాధికార సంస్థ తరహాలోనే ఏర్పాటు చేస్తాము.
సాంఘిక భద్రత, పేదరిక నిర్మూలన
The test of our progress is not whether we add more to the abundance of those who have much; it is whether wer provide enough for those who have too little.
-Frankin D. Roosevelt
72. పెంచిన ఫించన్లు, ప్రజా పంపిణీ ద్వారా ఆహార భద్రత, ఎన్.టి.ఆర్. ఆరోగ్య వైద్య సేవ ద్వారా ఆరోగ్య భద్రత, ఎం.జి, ఎన్. ఆర్.ఇ.జి.ఎస్. ద్వారా నైపుణ్యం లేని కార్మికులకు ఉపాధి భద్రత, మెరుగైన గృహ భద్రత, చంద్రన్న బీమా ద్వారా ప్రమాదవశాత్తు మరణం లేదా అంగ వైకల్యం కలిగినప్పుడు ఉపశమనం కలిగించడం ద్వారా మా ప్రభుత్వం అత్యంత బలహీన వర్గాలకు సాంఘిక భద్రత కలిగించడానికి కట్టుబడి ఉంది.
7. ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్లు - అత్యంత బలహీన వర్గాలకు గౌరవప్రదమైన జీవితాన్ని కలిగించడం పెద్ద కొడుకుగా తన భాద్యత అని గౌరవ ముఖ్యమంత్రి గారి విశ్వాసం. అందుకనుగుణంగా, అధికార పగ్గాలు చేపట్టగానే, వృద్దులకు, వితంతవులకు, నేత కార్మికులకు, గీతకార్మికులకు, హెచ్.ఐ.వి. సోకిన వారికి పింఛను రూ.200 నుండి రూ.1000లకు, 5 రెట్లు, దివ్యాంగులకు రూ.500 నుండి రూ.1500 వరకూ, 2 నుండి 3 రెట్లు పెంచడమైనది.
74. అంతేకాక, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకునే వారికి, ఒంటరి స్త్రీలకు, లింగమార్పిడి జరిగిన వారికి, మత్స్యకారులకు పింఛను సదుపాయం వర్తించడమైనది. తద్వారా గత నాలుగు సంవత్సరాలకు రూ.24,618 కోట్ల వ్యయంతో 50.51 లక్షల మందికి లబ్ది చేకూరింది. అంతేకాక డప్పు కళాకారులకు నెలకు 1500 రూపాయల చొప్పున, సాంప్రదాయ చర్మకారులకు 1000 రూపాయల చొప్పున పింఛను చెల్లిస్తున్నాము.
75. కుటుంబ ఖర్చులు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకొని, 'ప్రతి ఇంటి పెద్దకొడుకు'గా తన బాధ్యతను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రిగారు అన్ని సామాజిక భద్రతా పింఛన్లను రెట్టింపు చేసారు. 2019 జనవరి నుండి నెలకు రూ.2000 మరియు రూ.3000కు వరుసగా పెంచారు. దీనితో కలిపి ఈ ఐదేళ్ళ పదవీ
14