పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అదియును విగృహ్యాననంబును, సంధాయా,నంబును, బ్రసంగా
సనంబును, సంభూయాసనంబును, నుపేక్షాసనంబును నన నైదు
తెఱంగు లయ్యె వానిస్వరూపంబులు గ్రమంబున వివరించెద.

140


సీ.

ఒక్కరొక్కరిసీమ లొండొరుల్ గైకొని
           మెందొడ్డి యెత్తిపోకుండుటయును
గడువైరితోడ విగ్రహ మంది వాఁడు దు
           ర్గస్థుఁడై సాధ్యుండు కానివేళ
ధాన్యాదికము మిత్రతతులను గట్టియల్
           గసవును జొరకుండఁ గాఁచియుండి
ముట్టడిగాఁ జుట్టుముట్టుకొనుచునుండు
           నట్టిది మును విగృహ్యాసనంబు


గీ.

వైరిపై నిట్లు ముట్టడి వైచి యెంచి
ప్రకృతు లన్నియుఁ బెడఁ వాపి వగలుఁ దనకుఁ
గైవసము చేసికొనఁదగుకాల మెఱిఁగి
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

141


సీ.

రావణాసురుఁడు పూర్వమున నివాతక
           వచులతోఁ బోరాడి వారుఁ దాను
నలసి చతుర్ముఖు నంపి సంధి యొనర్చి
           నట్టులు విజిగీషు నరియుఁ వోరి
యలసి సంధి యొనర్చి కలసియుండుటయు సం
           ధాయాసనంబనఁ దనరుచుండు
నది గాక యరిమీఁద నలపునఁ గదరి వే
           ఱొకప్రసంగము చెంది యొరునిమీఁద