పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఉ.

మాటికి సర్వతంత్రముల మర్మముఁ దెల్పెడువాఁడు గల్గు నె
చ్చోటను శాత్రవుం దునుమఁ జొప్పడుఁ దొల్లి రఘూద్వహుండు దా
మేటి విభీషణుండు నలమిత్రసుతుండును గల్గఁ బట్టి యె
ప్పాటును లేక రావణునిఁ బట్టి వధింపఁడె వాలిఁ ద్రుంపఁడే.

39


సీ.

బలవంతుతోడుతఁ గలహింపుచును దన
            యరి ప్రయాసంబున నంది నప్పు
డతనిభండారంబు నతనిబలంబులఁ
            జెఱుపఁగాఁ దగుఁ దనుఁ జెఱుపకుండ
నొకశాత్రవునిఁ బట్టి పెకలించివైవ పై
            నొకబలవద్వైరి యొదవెనేని
మునుపటి పగఱనే తనవానిఁగా జేసి
            కొని నేర్పుతోఁ గూడికొనఁగవలయు


గీ.

కులమువారల తోడుతఁ గూడి బలియు
దండఁ గొని యుండువైరి నాతని కులంబు
వాని కొకశత్రుఁ గల్పించి వాని మిగులఁ
బెంపు సేయుచు విధుఁ డరి నొంపవలయు.

40


సీ.

విసముచేతనె యెందు విసము నాశము నొందు
         వజ్రంబుచేఁ దెగు వజ్ర మెపుడు
మీలు మీలను బట్టి మ్రింగుచు నుండును
         గరియును గరిచేతఁ గట్టుపడును
దాయాదియును దనదాయాదిచేఁ జెడు
         నటుగాన రావణు నడచు నప్పు
డల విభీషణుఁ బూజ నందించి పట్టె శ్రీ
         రామచంద్రుండు గౌరవము జయము