పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

13


త్సవలీలాపరతంత్రుఁడు
శివ[1]చరణస్మరణవిమలచేతస్కుండున్.

15


క.

అన్నీలకంఠరూపిత
సన్నుతగురుసిద్ధలింగసారదయాసం
పన్నకరాబ్జోదయుఁ డన
మున్నయదేవుండు వెలయు ముల్లోకములన్.

16


క.

ఆమున్నేశ్వరగురుది
వ్యామృతహస్తావతంసుఁ డతికారుణ్యో
ద్దామతనూజుఁడు [2]శిష్టుఁడు
శ్రీమద్గురుసత్పదాబ్జసేవారతుఁ డై.

17


క.

గోడగ మగుసంసారము
గోడగ మని తెలుపఁ బూని గోపతియెదురన్
గోడగ మాడెడికతమున
గోడగినారయ్య నాఁగఁ గొఱలు ధరిత్రిన్.

18


క.

పరవనితాజనదూరుఁడు
పరమర్మపరాపకారపరనిందాని
ష్ఠురచిత్తుఁ డసత్యవచో
విరహితచరితుండు తత్త్వవేత్త తలంపన్.

19


క.

ఆనారనాఖ్యునకు లిం
గానర్పితభోగవిరహితాత్మునకుఁ బ్రసా
దానూననిత్యసౌఖ్య
శ్రీనిధికి మహానుభవవశీకృతమతికిన్.

20
  1. శరణ
  2. శిష్యుఁడు