పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుభవసారము

కఠినపదములకు, సాంకేతిక పదములకు అర్థములు

1.

గురువు = దీక్షాగురువు. లింగము = పరబ్రహ్మము, శివుఁడు. జంగమము = చరలింగము; జీవికూపమునఁ జరించుశివుఁడు; శివభక్తుఁడు. పశువులు = జీవులు.


4.

పాశము = భవము; అణవిక, కార్మిక, మాయామలరూపకముగ జీవుల నంటియుండునది.


7.

ఏకఏవరుద్రో... = రుద్రుఁ డొకఁడే దేవుఁడు. రెండవవాఁడు లేఁడు. అణోరణీయాన్...= అణువుకంటెను జిన్నది. మహత్పదార్థముకంటెను గొప్పది. అవాగ్గోచర = వాక్కునకు మనస్సునకుఁగూడ నతీతమై కనరానిది.


3.

సర్వవేదేష్వతోభవత్ = సమస్తమునందుండియే (లింగమనఁగాఁ బరబ్రహ్మము) నుండియే యుద్భవించినదని సకలవేదములు చెప్పును. శ్వపచోపి... = లింగార్చనమునం దాసక్తుఁడైనచోఁ జండాలుఁడైనను మునిశ్రేష్ఠుఁడే. సరుద్రైవ.. = భూతలమున నతఁడే (శివభక్తుఁడే) రుద్రుఁడు. అతనియందే శివుఁడు సన్నిహితుఁడై యుండును. సచ పూజ్యో = నావలెనే యతఁడుగూడఁ బూజింపఁదగిన వాఁడు.


9.

రుద్రేణాత్తమశ్నంతి = శివున కర్పితమయి యాతనివలన భుజింపంబడినదే భుజింతురు, పాన మొనర్పఁబడినదే క్రోలుదురు.


11-9.

అతికిల్బిషం...= శివార్పితము కానిపదార్థము మిక్కిలి యపవిత్రమయినది.' లోభాన్నధారయేత్ = శివనిర్మాల్యమును లోభముచే ధరింపరాదు. ప్రసాద మేవభోక్తవ్యమ్ = శివప్రసాదమే భుజింపఁదగినది. మలహరుఁడు = శివుఁడు.


13-18.

గోడగము = (1)బూటకము. (2) నిస్సారము. (3) సల్లాపము; గోపతి = శివుఁడు.


14-24.

గురులింగము = లింగమున ( శివున) కభిన్నుఁ డైనదీక్షాగురుఁడు. హస్తజాతుఁడు = గురుఁడు హస్తమస్తకసంయోగ మొనర్చి చిత్కళాన్యాస మొనరించినంతనే భౌతికశరీరము లింగశరీరముగ మాఱుటచే ద్విజన్మ మొందినవాఁడు = శిష్యుఁడు.


26.

సంవిక్పదము = విజ్ఞానపదము.


15-27.

లింగమథనము = ఆంతరంగికముగ లింగాంగసామరస్య(శివజీవైక్య)మున కయి కావించు కేళి. శరణులు = సతిపతినివలె ననన్య