పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

63


తరువోజ.

బాలుండు ద్రావినపాలసారంబు
        పసరంబు కలగన్న పదపదార్థములు
కాలినయినుము [1]క్రాగఁగఁ బడ్డనీరు
        కపివరు దేహంబుగత మైనడొక్క
పోలంగఁ జచ్చిన బొందిశబ్దంబు
        భువిలో నపుంసకుపుత్త్రుచరిత్ర
తాలోష్ఠసంపుటార్థము గానిపదము
        తలఁపఁగ లింగైక్యతత్త్వంబుననువు.

239


క.

ఈవిధమున వేదపురా
ణావిష్కృతసారసూక్తులం దొనరింపం
గా విదితం బగునీ కృతి
భూవినుతం బగును భక్తిపూజ్యత వెలయున్.

240


క.

అసమగురులింగజంగమ
ప్రసాదభక్తస్థలములఁ బరిపూర్ణం బై
యెసఁగులసత్కావ్యము నీ
కసలార నభీష్టదాయి యగుఁ ద్రిపురారీ!

241


క.

శివ మస్తు భక్తినిత్యో
త్సవ మస్తు కుటుంబమిత్రసకలాశ్రితసం
భవపూర్తి రస్తు విభవో
ద్భవ మ[2]స్తలనీల కంఠుదయఁ గృతిపతికిన్.

242
  1. త్రాగఁగ
  2. మస్తు సునీల