పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

55


క.

పిలిచినఁ బని [1]యే మనకయుఁ
దలఁచినతలఁ పెఱిఁగి వారి[2]తలఁ పడుగమియున్
[3]గెలు పిచ్చి కీడు వడుటయుఁ
గలుగుట యది శుద్ధభక్తిగతి త్రిపురారీ!

215

సర్వతః ప్రాససీసము :-

మృడుభక్తు లేతేరఁ బొడగని యైనను
          బొడఁగానరానట్లు పెడమొగంబు
[4]నిడి తలవంచి యున్నెడ డాయవచ్చిన
         [5]కడగంటఁ గని యున్న [6]యెడన యుండి
వెడమ్రొక్కు మ్రొక్కి యక్కడఁ జూచుచును గొంత
        వడికిఁ గూర్చుండనె యెడము లేదు
తడవయ్యె వచ్చి యెక్కడఁ బోయెదరొ యంచు
        నుడువరి యై వారిఁ గడపి యుచిత


గీ.

మెడపి శివునిఁ గొల్వఁ గడఁగెద నని జాలిఁ
బడుట చేతివాని విడిచి కాలఁ
బడినవాని కాసపడినట్లు త్రిపురారి!
జడుని కేల భక్తిగడన దొరకు.

216


సీ.

ఉడురాజధరభక్తు లెడదవ్వులను రాఁగఁ
          బొడగని బిట్టుల్కిపడి సుఖాశ్రు
లెడతెగ కందందఁ గడకన్నులను జాఱఁ
          గడుసంభ్రమమునఁ గాల్దొడర నెదురు

  1. యే మగుటయు
  2. తలఁ పెఱుగమియున్
  3. గెలిపించి విడువఁబడుటయు
  4. నిడి వంచియున్నెడనెరి
  5. అరగంట
  6. యడర