పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

51


మానినీవృత్తము.

లింగగభీరులు లింగవిచారులు లింగవిహారులు లింగమతుల్
లింగవిధానులు లింగసమానులు లింగవిలీనులు లింగమయుల్
లింగసుశీలురు లింగవిలోలురు లింగకృపాళురు లింగరతుల్
లింగసదుక్తులు లింగనిషిక్తులు లింగసుభక్తులు లింగనిధీ!

200


సీ.

లింగసంజాతులు లింగవిఖ్యాతులు
         లింగసదర్థులు లింగముఖులు
లింగాభిమానులు లింగావధానులు
          లింగవిజ్ఞానులు లింగ[1]సఖులు
లింగప్రమోదులు లింగవినోదులు
          లింగాత్మవాదులు లింగసములు
లింగసత్ప్రాణులు లింగధురీణులు
          లింగనిర్వాణులు లింగసుఖులు


గీ.

లింగయోగ్యు లధికలింగసౌభాగ్యులు
లింగభక్తిపరులు లింగధరులు
లింగలీయు లాత్మలింగవిధేయులు
లింగతత్త్వమతులు లింగ[2]రతులు.

201


సీ.

అవ్యయు లనుపము లవినిషేధులు [3]ధీరు
         లఘటితఘటితు లార్యైకనుతులు
సుభగులు సుగుణులు సుమతులు సుజనులు
         సుప్రసన్నాత్ములు శుద్ధమతులు
దివ్యులు భవ్యులు త్రిభువనారాధ్యులు
         త్రిగుణవిదూరులు త్రిమలహరులు

  1. సుఖులు
  2. తతులు
  3. భువి