పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

49


ఉ.

దుష్టభవప్రకీర్ణ[1]మలదూరులు ధీరులు నాదిసంభవో
త్కృష్టశివాగమవ్రతచరిత్రులు పాత్రులు శుద్ధభక్తి[2]సం
పుష్టమహోత్సవోల్లసనభోగులు యోగులు తత్త్వసన్మనో
ద్దిష్టశివార్చనాశ్రయవిధిజ్ఞులు తద్‌జ్ఞులు భక్తు లల్పులే?

192


మహాస్రగ్ధర.

అవినాశుల్ సంయమీశుల్ వ్యపగతవిషయాహ్లాదు లుద్యత్ప్రమోదుల్
ధ్రువకీర్తుల్ శాంతమూర్తుల్ దురిత[3]హరణసద్బుద్ధు లాజ్ఞాసమృద్ధుల్
భవదూరుల్ నిర్వికారుల్ ప్రణుతగుణమహాపాత్రు లానందగాత్రుల్
శివభక్తుల్ తత్త్వయుక్తుల్ చిరతరసుమనస్సిద్ధు లాత్మప్రబుద్ధుల్.

193


త్రిభంగి.

గురుమతసహితులు, దురితవిరహితులు
సురుచిరసజ్జనవర్తుల్, ధ్రువకీర్తుల్, శాంతసుమూర్తుల్
పరిహృతవికృతులు, నిరవధిసుకృతులు
మరణపునర్భవదూరుల్, సువిచారుల్, భక్తివిచారుల్
పరవశహృదయులు, నిరుపమసదయులు
పరసమయ[4]ప్రవిఫాలుర్ గుణశాలుర్ దానసుశీలుర్
పరహితచరితులు, వరగుణభరితులు
పరమపరాత్యనుషక్తుల్, శివభక్తుల్, శాంతనియుక్తుల్.

194


క.

అవిరళదాననియుక్తులు
భవదుఃఖవితానపాశబంధవిముక్తుల్

  1. ఘన
  2. సంస్పృష్ట
  3. హరతగద్బద్భ
  4. ప్రతిపాలుల్