పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

అనుభవసారము


దీక్షమైఁ 'జరవ్రతీతి' సువిఖ్యాత మ
         నంగ వ్రతస్థుండు జంగమంబు
[1]అ'ట్లచరాః పార్థి వాదయో' యనఁ బార్థి
         వంబు నయి ప్రతిష్ఠితంబు లింగ


గీ.

మట్లు గాన శివుని యపరావతారంబు
జంగమంబు గాన జంగమంబు
లింగ మనఁగ వలయు లింగసంగతగాత్ర!
భవలతాలవిత్ర! పరమపాత్ర!

179


క.

ఈకుల మాకుల మనక ని
రాకులమతి వారికొఱఁత లరయక భక్తా
నీకము శివుఁ డని కొలిచినఁ
జేకొనఁడే వాంచితార్థసిద్ధి? మహాత్మా!

180


సీ.

సిద్ధరసస్పర్శఁ జేసియె కాదె తా
         మ్రంబు శుద్ధము సువర్ణంబు మఱియు
సిద్ధంబుగా శివసిద్ధాంతవేదశా
         స్త్రోక్త మగుచు శుద్ధభక్తియుక్తి
తా 'నుమా మాతా పితా రుద్ర యీశ్వరః
         కుల మేవ చ' యనియుఁ గలదు గాన
సద్గురుకారుణ్యసంజాతు లెల్ల స
        గోత్రు లనక యన్యగోత్రు లనఁగఁ


గీ.

దగునె? యొక్కతల్లిదండ్రుల కుద్భవం
బైనప్రజలలో నహీనవంశ్యు

  1. యట యచరు పార్థి