పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

33


కుంటఁ జెడు [1]భక్తుఁ డాసల
రెంటికి నెడ తాకి చెడ్డరేవనిభంగిన్.

114


క.

వంచకునకుఁ గపటునకుం
గుంచితునకు దుర్వ్యసనికిఁ గుటిలాత్మునకున్
గించునకు భక్తిగుహ్యం
బించుకయునుఁ జెప్పఁ [2]గలదె యీడ్యచరిత్రా!

115


క.

లింగసువిధానికంటెను
జంగమసువిధాని మేలు సద్భక్తియెడన్
లింగోభయసువిధాని కి
లం గలరే సవతు చెప్ప? లలితగుణాఢ్యా!

116


క.

హరభక్తుఁ డేని నిందం
బొరయునె? హింసాగుణంబుఁ బొందునె? యొరులం
దిరియునె? యొరుమర్మముఁ దా
నరయునె? యనృతంబు పల్కు నయ్య? మహాత్మా!

117

ద్వంద్వప్రాస కందములు

క.

కన్నిడునే పరసతులకుఁ
ద న్నిడునే భక్తుఁ డన్యదైవంబులకున్
వెన్నిడునే భవములకును
మున్నిడునే మనము విషయములకు మహాత్మా!

118


క.

చేరునె మానవసంగతిఁ
గోరునె దుర్వ్యసనసుఖముఁ గుటిలాత్ముం డై

  1. భక్తి వాసల
  2. గలరె