పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

అనుభవసారము


డ్వర్గపరతంత్రునకు నప
వర్గసుఖంబును నసంభవము త్రిపురారీ!

88


చ.

జనవిను[1]తాశయా! విధివశం బగునే సుఖదుఃఖసంఘముల్
తనవశమే శుభాశుభవితానము? కర్మవశంబె పుణ్యపా
పనిచయ? మిన్నియుం గుడుపఁ బాఁపఁగ నీశుఁడె కర్త యై చనున్
దనరఁగఁ గూడునే [2]విధికృత మ్మని కర్మముఁ గూర్మి పల్కఁగన్.

89


చ.

కులమును రూపుఁ బ్రాయమును గూరిమి యర్థము గల్గి యాత్మలో
మలహరుభక్తి లేక చనుమానవుజన్మ మదెట్టు లన్నఁ దా
విలసితహావభావగుణవిభ్రమసంపద లెల్లఁ గల్గి [3]సం
చలనపుశక్తి లేక మనుజంతువిధం బగు సద్గుణాకరా!

90


చ.

హరుఁ డనుకల్పవృక్ష మమృతాంశుధరుం డనుకామధేను వీ
శ్వరుఁ డనుపెన్నిధాన మహివల్లభకుండలుఁ డన్‌సుధావశం
కరుఁ డనుమేరు వుండఁ దమకన్నులఁ గానక వాంఛితార్థముల్
సురపతిఁ గొల్చినం దమకుఁ జొప్పడునే శివభక్తశేఖరా!

91


చ.

హరువిభవంబు భర్గునిలయంబు సదాశివు రాజ్యలక్ష్మి శం
కరు ముద మీశునాజ్ఞ విషకంఠుని యాభరణంబు నిర్జిత
స్మరు సుఖలీల నాఁ బరఁగు సజ్జనభక్తి; తదీయభక్తిత
త్పరులకు భుక్తిముక్తు లవి బ్రాఁతులె? సజ్జనభక్తిశేఖరా!

92


ఉ.

ఆఱడిబోధలం బొదలి యాదిమతంబులు నూకి స్వేచ్ఛమై
వేఱొకబుద్ధులందలి విశేష[4]మతంబుల భక్తియుక్తులన్

  1. తాశ్రయా
  2. విధియుఁ దన్నును
  3. సంచలమతి ముక్కుచును జంతువిధంబున
  4. మదంబు