పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

17


సీ.

అఖిలవేదాతీత మగుమూలమంత్రాక్ష
          రములకు నతనివాక్యములతేట
యయ్యక్షరాత్మకుం డగులింగమూర్తి కా
          తనిమనోభావంబు జనితభూమి
యాలింగమూర్తికి నాశ్రయం బైనశ
          రణుని కాతనికరాగ్రంబు తల్లి
యమ్మహాశరణున కాభరణం బైన
          భక్తి కాతనిపదాబ్జములె యూఁత


తే.

యట్టిభక్తి కాది యైనజీవన్ముక్తి
కతనిఘనదయామృతావలోక
నంబె పరమపదవి యమ్మహత్తరకీర్తి
నొప్పుగురునిమహిమఁ జెప్పఁ దరమె.

37


క.

జ్ఞానాతీతుని నతివా
ఙ్మానసగోచరుని గురునిమహిమ నుతింపం
గా నలవియే [1]మదీయ
జ్ఞానమనోద్గతము లైనశబ్దార్థములన్.

38


సీ.

అచ్యుతబ్రహ్మామరాగోచరుం డయ్యు
          వరశుద్ధభక్తైకవత్సలుండు
నన్నాదబిందుకళాతీతుఁ డయ్యు నా
          శ్రితశిష్యవర్గసంతతికుటుంబి
స్థిరసత్పరవ్యోమసింహాసనుం డయ్యు
          [2]సాధకాత్మాంభోజషట్పదుండు

  1. తదీయ
  2. సాజకా