Jump to content

పంచతంత్రము (బైచరాజు)/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

పంచతంత్రము

చతుర్థాశ్వాసము



సత్యాలోకనజని
తాసమశరకరణసంభ్రమాధికనరక
త్రాసవిధిప్రౌఢరణా
భ్యాసభుజార్గళసనాథ హరిహరనాథా.

1


వ.

దేవా లబ్ధనాశనాభిధానచతుర్ధతంత్ర మాకర్ణింపు మధీతనీతిశాస్త్రమర్ముం డవ్విష్ణు
శర్ముండు సుదర్శనకుమారుల కిట్లనియె.

2


క.

పరకపటాలాపపరం, పర కేర్పడ భ్రమసి విడుచు ప్రాప్తార్థముగా
పురుషుఁడు విడువఁడె మును సా, గరమునఁ గపిశింశుమారకము దుష్ఫణితిన్.

3


క.

నావిని రాజకుమారకు, లావిప్రవతంసుఁ బలికి రది యెట్లు వయ
ప్రావీణ్యా యాకథ జెపు, మా వినియెద మనిన వారి కతఁ డిట్లనియెన్.

4


సీ.

నీరదపథికపానీయనికేతంబు మేదినీయువతికటీదుకూల
మంబరచనవరాభ్యవహారసత్రంబు సరిదలంకృతికార్యకరణశాలి
కార్పణ్యభయదవీక్షణవధూజనికర్త రాక్షసజిద్విహారస్థలంబు
మునిరోషనష్టనాకనిసర్గశుభదాయి నిస్తులరత్నపూర్ణితకరంక


తే.

ముగ్రశతధారధారాసమగ్రభీతి, పరవశాగత బహుకుభృద్భరణనిపుణ
మతనుసత్వ మలక్షితౌర్వానలంబు, వఱలు దక్షిణశరధి సర్వజ్ఞశరధి.

5


సీ.

ఇమ్మహాగాంభీర్య మెవ్వని కొదవు నీవాహినీభరణ మెవ్వనికిఁ గలుగు
నీగోత్రరక్షణ మెవ్వని కబ్బు, నీయనిమిషావాప్తి యెవ్వరికి దొరకు
నీసత్యసౌభాగ్య మెవ్వని కెసఁగు నీఘనహితాచరణ మెవ్వనికి నొదగు
నీగాఢజీవన మెవ్వని కుండు నీకనకరత్నోర్ము లెవ్వనికి వశము


తే.

నీలలితరాజసన్మాన మెవ్వనికి లభించు నెవ్వని కిట్టియొప్పిదము నిత్య
మాతనికె కాక యని లోకు లభినుతింపఁ, గ్రాలు నిర్భరవిభుఁ దాపగావిభుండు.

6

క.

అపరిమితం బుడుపతర, ణ్యుపసక్తం బఖిలజలధరోపాస్యం బా
త్మపదస్థానిమిషంబు, ద్విపులాక్షౌమం బనంతవిధ మెఱిఁగించున్.

7


క.

ఆనీరధితటమువ బహు, మానుం డనువాఁడు వృద్ధమర్కటుఁడు మహా
వానరులు ముఖరపత్ర, స్థానరులు భజింప సుముఖుఁడై వర్తిల్లున్.

8


ఉ.

వానికిఁ గంటిలో నెరసువంటివిరోధి సమీపపర్వత
స్థానమునం జయోన్ముఖుఁడు తామ్రముఖుండు చరించు నమ్మహా
వానరసార్వభౌముఁడు ప్లవజ్జవసంగబహుప్లవంగసే
నానతగోత్రుఁ డౌచు నొకనాఁడు సమిత్కరణేచ్ఛ వచ్చినన్.

9


క.

కైకొనఁగలబహుమానుం, డాకంఠక్రోధవివశుఁడై ప్రతివీరా
నీకినిపై బలధిక్కృత, నాకపుల న్గపులఁ బనిచిన న్నిశ్శంకన్.

10


క.

ఆహవ మొనరించె సము, త్సాహత నిరువాఁగు దొడరి దంతాదంతిన్
బాహాబాహి ముఖాముఖి, నాహా వాఙ్ముఖరఖచర మై నభ మొప్పన్.

11


శా.

లావు ల్పేర్కొని నొంతు రుర్విఁ బిడికిళ్ళం ద్రెళ్ళ పార్శ్వాచల
గ్రావంబు ల్పెకలించి ఱువ్వుదురు మ్రగ్గ న్మ్రొగ్గ వృక్షాగ్రశా
ఖావర్గంబుల నెత్తి మొత్తుదురు స్రుక్కం జిక్కఁ గంఠచ్ఛటల్
గావుల్పట్టుదు రొండొరు ల్మదమణంగం బ్రుంగ నవ్వానరుల్.

12


క.

చఱతురు పెడచేతులనోఁ, గఱతురు తెరనోళ్ళఁ బిసితఖండంబులు రా
విఱుతురు పెళపెళ నెమ్ములు, పఱిబోవనికలిమిబలిమిఁ బ్లవగాధ్యక్షుల్.

13


క.

విరసము నెఱసాహసమున్, బురిగొన ని ట్లుభయసైన్యములు పోర న్ర
క్తరసతరసములు గదురఁగ, శరనిధిసత్వములు వెలివిసరి రాఁదొడఁగెన్.

14


వ.

ఆప్లవంగసంగరం బావిష్కృతారుణంబు నవ్యక్తతారకంబు నగుచు నహర్ముఖం
బును లుంఠితాగమనంబు లుంచితశ్మశ్రురోమంబు నగుచు బౌద్ధకర్మంబును నదృ
ష్టశాస్త్రంబు ననక్షతపరికరంబు నగుచు యావనవివాహంబును బరిభ్రంసితచరణం
బుం బ్రణష్టవళీవిలాసంబు నగుచుఁ గుకవికవిత్వంబును ననుకరించె.

14


క.

అంతఁ దనఘనబలంబులు, పంతము దిగనాడి యోడి పఱచిన సంవ
ర్తాంతకుఁడన బహుమానుఁడు, తాంతేతరతామ్రముఖపతాకినిఁ బోలెన్.

16


తే.

అప్పు డూర్ధ్వశిఖుం డైనయనిలసఖుఁడు, పోలె మత్తామ్రముఖుఁడు చూపులన నతిస్ఫు
లింగసంఘాత ముదయింప నింగినింగి, దాఁకుచందాన బహుమానుఁ దారసించి.

17


చ.

తఱిమి వధింప శత్రునకుఁ దానసమీకసమీకరంతయై
యఱిముఱిఁ బల్కె నోరిజఠరా పెఱఠావున కేగు నా బలం

బెఱిఁగియుఁ జావ నేల యిపు డీ వన నబ్బహుమానుఁ డోరి ద
బృఱలకు రాకు తాఁకునెడపల్కుల కోర్చినవాఁడఁగాఁ జుమీ.

18


క.

పందకుఁ గాక పలాయన, కందళిసాహసునియందు గలుగునె యని మి
న్నందినకోపంబున వై, చెం దామ్రముఖుండు పుల్లసిల శిలనలుకన్.

19


క.

మఱియొకకుటవిటపంబునఁ, జఱచి ఘనక్రోధదృష్టి సమకొన ముష్టిన్
బఱియపడ నురముఁ బొడిచిన, మఱియుం బడ కపుడు తామ్రముఖుఁ డుగ్రుండై.

20


క.

బలవంతు మాల్యవంతుం, జలధికడం గడఁగి నొంప సమయింపంగాఁ
దలఁచుహనుమంతుఱంతున, నలవృద్ధుం గ్రుద్ధుముష్టిహతి క్షితిఁ గూల్చెన్.

21


తే.

కూల్చి చంపక యుసురుతోఁగూడ నతని, నతనికాంతాళిఁ గైకొని యతులగతులఁ
బఱచి వారాశిరాశితత్ప్రాంతకాంత, ధరఁ జిరాదృతి శైత్యకృత్యము లొనర్ప.

22


క.

కొండొకకాలమునకుఁ గపి, మండలపతి మూర్ఛఁ దేఱి మహిరహితోఁ గూ
ర్చుండి కనువిచ్చి రిపు ను, ద్దండపరాక్రమునిఁ గాంచి తలవంచుకొనెన్.

23


వ.

అగణ్యదాక్షిణ్యాభిముఖుం డగుతామ్రముఖుం డబ్బహుమాను నన్వర్థనాముఁ
గావించి పంచిన.

24


చ.

జరఠకపీంద్రుఁ డట్లరిగి సాగరతీరమునందు మానితాం
బురుహభవాండషండపరిభూషితుఁడై వెలుఁగొందుచున్నయీ
శ్వరుఁడన నుజ్జ్వలజ్జటిలసారఫలంబులఁ బూర్ణమై మహా
గరిమ వహించుదాని మధుగర్భమునాఁ జను మేడిదోఁచినన్.

25


క.

పరికించి యయ్యదుంబర, తరువెక్కి తదీయపక్వతరఫలసేవా
గరిమం బ్రాణానిలసం, భరణముఁ గావించికొనుచుఁ బ్లవఁగుం డుండెన్.

26


క.

అలకపిచేతిపచేళిమ, ఫలము ప్రమాదమున జారి పాథోధిజలం
బులఁ బడియెఁ బడిన నొండొక, బుళబుళశబ్దంబు సంప్రభూతం బయ్యెన్.

27


క.

ఆనినదము కర్ణంబుల, కానందవిధావిధాయి యగుటయు గణనా
హీనము లగుతత్ఫలముల, వానరుఁ డక్కడలినీట వైవఁగఁ దొడఁగెన్.

28


క.

వనచరకరముక్తములై, వనధింబడు మేడిపండ్ల వారణ లోలో
దినుచుఁ జలింపక క్రకచుం, డను దారుణశింశుమార మచ్చోనుండన్.

29


క.

అధికతమోదుంబరఫల, మధురరుచిం జొక్కి శింశుమారము మాసా
వధిగా నచ్చోటన కర, మధివసియించె న్నిజప్రియావిముఖంబై.

30


చ.

క్రకచునిభార్య కూర్మిచెలిఁ గన్గొని యిట్లనుఁ బ్రాణవల్లభుం
డకట యెటేనిఁబోయి తడవయ్యె విలంబనహేతు వెద్దియో

తికమకమైతి నా నెగులుఁ దీర్పుము నీ విపు డేఁగి చూచి నా
యకసుఖవార్తఁ జెప్పుమని యంచిన దూతిక పోయి ముందరన్.

31


క.

ఒకచో వికచోదుంబర, నికటంబున ముసలిక్రోతి నెయ్యంబునఁ బా
యకయున్న శింశుమారుం, గ్రకచాంకుని దూతి ప్రీతిఁ గని చని యెదురన్.

32


చ.

చెలువఱియున్నకూర్మిచెలిఁ జేరి వినం గన గ్రొత్తలైన వో
చెలి తెలియంగ నంతయును జెప్పెద రోయక విన్ము నేను నీ
యుఘునియోగమూఁది చని యక్కడ నొక్కెడఁ జూచి వచ్చితిం
దొలఁగక వానరప్రమదతోఁ గవఁబాయనివాని నీపతిన్.

33


క.

నే నెఱుకచేయుకొఱ కిట, వెనువెనుకకు వచ్చివచ్చి వెలఁది కొలందిన్
జన నీపని చెప్పితిఁ బర, వనితారతి లుబ్ధుఁ డేల వచ్చు న్మగుడన్.

34


క.

నావిని కాఁపుర మెటువలె, నీవిధమునఁ బ్రాణనాథుఁ డితరస్త్రీమై
త్రీవశుఁడయి యుండఁగ నని, పావకశిఖిపోలె మండిపడి యది మదిలోన్.

35


చ.

కనుఁగవ నశ్రులోడికలు గట్టఁగఁ దైలనిషిక్తయై నిజా
నన మరవాంచియుండె సదనంబున నత్తఱి శింశుమారుఁ డ
వ్వనచరనాథు వీడ్కొని యవారిగఁ దియ్యనిమేడిపండ్లు గొం
చు నిలువ కేఁగుదెంచి యిచ్చి కులాంగనఁ జూనఁ జూడ్కికిన్.

36


ఉ.

ఒండొకభంగిఁ దోఁచుటయు నుల్లము ఝల్లని పల్కె శింశుమా
రుండు ప్రియానయాతిగవిరోధినె హృత్ప్రమదాప్రమాదినే
యండకు వచ్చినం బలుక వక్కట నీ వన శింశుమారి ని
ష్ఖండవిధాన మైనయలుకం దల యెత్తదు చూడ దెంతయున్.

37


క.

అది యట్టిద యప్పనికిం, బొదరగుటం దూతి ప్రీతిఁ బురికొనఁ బలికెన్
జదురాలికిఁ దెవులెత్తిన, యది నీతో నెట్లు మాటలాడం గూడున్.

38


క.

మందులు దెమ్ముని చెప్పిన, మందులు నినుఁ గొలుచుభటులు మాతోఁ దమలో
నిం దెవ్వరుఁ బలుకరు నీ, చందముగా నెల్లు సాధ్విజా రుజ మానున్.

39


క.

నావిని క్రకచుం డను మ, జ్జీవము లౌషధము లయినఁ జేడియ కీలో
సేవింపఁజేసి నిర్గదఁ, గావించెదఁ జెపుము దాఁచఁగా నేమిటికిన్.

40


క.

అని కూర్మి తేటపడఁ బ, ల్కినపల్కులు శింశుమారి గెంటనివేడ్కన్
విని నీతితంత్రమంత్రిం, గనుఁగీఁటిన నతఁడు చేరి క్రకచుని కనియెన్.

41


క.

ఎలనాఁగరోగ మణఁపం, గలమందులు చెప్పుఁడనిన ఘనశాస్త్రకళా
బలవేద్యులు వైద్యులు గే, వలరీతిం గ్రోఁతిగుండె వలెనని రధిపా.

42

క.

అది ముదిత కొసఁగకున్నన్, బ్రతుకదు చెడచెడఁగరాదు పరిణామమనన్
మదిఁగదిరిన వెఱఁ గ్రకచుం, డిది యెవ్విధి దొరకు భార్య నెట్లీడేర్తున్.

43


క.

బహుమానుం డొకఁ డున్నాఁ, డహితుఁడు గాఁ డతఁడు హితుఁడు హాహా ముక్త
స్పృహగృహరక్షార్ధము దు, స్సహకుహనాప్రజ్ఞ నెట్లు చంపుదు నతనిన్.

44


చ.

నిరతము విశ్వసించు నతినిర్మలచిత్తున కెగ్గుసేయుకా
పురుషుఁడు దక్క భూరికులభూమిధరంబులు గావు సప్తసా
గరములు గా వరణ్యములు గావు భరంబని ధాత్రి మైత్రి నా
సిరిపరుతోడ విన్నపము సేయదె వేఁడిన నట్లు గావుతన్.

45


చ.

కడపట భార్యనిల్కడకుఁ గాఁ జెలికానికి నెగ్గుసేఁత యె
క్కుడుదురితంబు కాఁపురము గూలఁగఁ జూచుటయు న్మహాఘ మి
ప్పడఁతుకపట్టున న్సఖునిపట్టున నింతి విశేష మింతకై
చెడుపనియేనియుం దగిలి చేయక మానఁగరాదు గొబ్బునన్.

46


వ.

అని నిశ్చయించి బహుమానవధోద్యోగంబునం దిరిగి వచ్చె నప్పు డుప్పొంగుసమ్మ
దంబునం బ్లవంగపుంగవుండు.

47


క.

క్రకచావికచాదృతియొ, ద్దకుఁ గ్రమ్మర నరుగుదెంచెదవు కులకాంతా
నికట మకటా యసహ్యం, బొకొ సత్యముఁ జెప్పుమనిన నుదచరుఁ డనియెన్.

48


ఉ.

ఏను భవన్నియోగమున నేగి ఫలంబులు కాను కిచ్చినన్
మానిని పల్కె నీ వరిగి మాసకమయ్యెఁ బ్రవాస మెవ్విధిం
బోనిది నీకు నెద్ది గతమో గతమోహభవద్విరంబు నా
తో నెఱిఁగింపుమన్న భయదూరసదాదృతి నంటి దానికిన్.

49


చ.

తనరు ననూనధామతిమిధామతటంబున లెక్క కెక్కుడౌ
ఘనఫలరాజిఁ గ్రాలు మధుగర్భమునాఁ జనుమేడి దానిపై
మను వనువాసరంబు బహుమానుఁడు తత్కపిచక్రవర్తిప్రో
పున నితరం బెఱుంగక యపూర్వసుఖస్థితి నుంటి దాలిమిన్.

50


చ.

మఱువఁగ రానిసఖ్య మది మాటలు వేయును నేల పుట్టి
బెఱిఁగితిఁ గాని యట్టిజగదేకపవిత్రునిఁ జూడ నెందు నో
తెఱవరొ యంచుఁ బాఠకుగతిం గృతి నీయుపకారకృత్యముల్
గుఱిగడవం బ్రియంబుతమిఁ కొండలు కోటులు చేసి చెప్పితిన్.

51


ఉ.

చెప్పిన నంతరంగమున సింగఁడు బూకఁడునై ప్రియంబు సొం
పుప్పతిలంగఁ బల్కె నది యోయికృతఘ్నుఁడ వీవు గావె య

పృప్ప సుహృత్తముం డయిన యాయన నింటికిఁ దెచ్చి వేల్పు నే
చొప్పునఁ గొల్తు రట్లు పరిశుద్ధసపర్యల దేల్చుటొప్పదే.

52


ఉ.

ఎక్కతి మేడిపై నిలువ నేటికి నేఁటికిఁ గాదు నిల్చుఁగా
కిక్కడఁ బెద్దకాల మఖిలేప్సితభక్ష్యము లావహింతు నా
మ్రొక్కనిమ్రొక్కి పెక్కుప్రియము ల్నయము ల్పచరించి తోడితె
మ్మక్కపినాథునంచుఁ బ్రియ యంచిన ని న్గొనిపోవవచ్చితిన్.

53


క.

కారణవిముఖంబై యుప, కారముఁ గావింపలేరుగద లోకము కై
వారం బగు నిట్లన ని, ష్కారణవత్సలుఁడ వీవు కారణజన్మా.

54


క.

కపివర నీచే నందిన, యుపకారపుటప్పుఁ దీర్సనోప న్గరుణా
నిపుణమతి నాగృహంబున, కిపు డీవే తెమ్ము పూజ లిచ్చెద భక్తిన్.

55


క.

ఇలువాడి మ్రుగ్గులిడి కూ,రలు గూ ళ్లమరించి యేల రాఁడాయెనొకో
వెలలెం బ్రొద్దని యట నీ, చెలియలు నేఁ డెదురుఁజూచు సేవించుటకున్.

56


క.

రారానిచోటు గాదు కృ, పారాజితపిచ్చుకుంటుపైఁ బర్వినభా
గీరథివిధమున నస్మద, గారమునకు రమ్ము కపిశిఖామణి యనుడున్.

57


వ.

ప్లవంగపుంగవుండు.

58


ఉ.

రాసిరణం బొనర్చి నిజరాజ్యముఁ గైకొని నన్ను గాసి గాఁ
జేసినవైరిఁ గన్గొనుచుఁ జెంగటనుండుట కష్ట మిందు నా
కోసఖ యట్లు గానఁ బదమూఁద సహింపదు వంతువెంబడిం
గాసిలియుండువారలకుఁ గాననిక్రంతలు మేలుగా నొకో.

59


క.

అనఘా నీనిలయమునకుఁ, జనుదెంచెద మీకుఁ గాక జలసంచారం
బనువగునే మముఁ బోలిన, వనచరులకుఁ జెప్పు మనిన వాఁ డిట్లనియెన్.

60


క.

నీవాక్యము లుచితంబులు, గావె పయోవిహృతి యేడఁ గపు లేడ యెటే
నావీపున ని న్నిడికొని, యావాసముఃఁ జేర్చువాఁడ నరుదె మ్మనినన్.

61


వ.

తద్భాషితంబులు మాయాదూషితంబు లగు టెఱుంగక.

62


చ.

మెఱసి యుదుంబరద్రుమముమీఁద వసించినకీశరాజు చే
టెఱుఁగనికూనతెప్పవలె నేడ్తెఱఁ దోఁచినశింశుమారుపై
నుఱికెఁ దదీయపృష్ఠమున నుండినవాడు విశృంఖలత్వరం
బఱచి హుటాహుటి న్మనికిపట్టున కేఁగెడుత్రోని నేర్పడన్.

63


క.

నీరము తెరువునఁ గొండొక, దూరము చని యలసి నిలిచి దుర్దాంతవిషా
దారూఢహృదయమై చిం, తారతి నది యీ రెలుంగునం దనలోనన్.

64

ఉ.

న న్నితఁ డంతరంగమున నమ్మి యయో చనుదెంచుచున్నవాఁ
డెన్నిభవంబులం దొలఁగు నిష్టులఁ జంపిన ఘోరపాప మెం
దు న్ననువంటిదుష్టచరితుం బరికింపదు లోక మాక్రియల్
గన్నవిగావు విన్నయవిగా వొనరింపఁగఁ బాసె సఖ్యముల్.

65


క.

నడవడి పురుషుని భారం, బిడి భూరివృషంబు ఱాత హేమము నొఱయం
బడు శుద్ధిశక్తిరుచులకుఁ, బడఁతులహృదయంబు లొరయఁ బడ వేగతులన్.

66


క.

పరమద్రోహపురస్సరంబులు నయోపాయక్రియాదూరము
ల్దురితిచ్ఛన్నము లన్యతాపకరణోద్యోగంబు లప్రత్యయా
కరము ల్సత్యపరాఙ్ముఖంబులు సమగ్రక్షాంతినల్లీశిత
క్షురము ల్దంభమయంబు లెట్లెఱుఁగవచ్చుం గామినీచిత్తముల్.

67


క.

ఈమనసులు గలిగిన మహి, ళామాయామయతరోక్తులకు లోనై య
య్యో మదినమ్మిన కీశ, గ్రామణిఁ దెగటార్పవలసెఁగా నా కనుచున్.

68


క.

అలక్రకచుఁ డల్లనల్లనఁ, బలుకఁగ విని వానరాధిపతి భూరిభయా
కులమానసుఁడై యపు డో, దళితాఘా యేమి పలికెదవు నీ వనుడున్.

69


క.

ధృతిఁ గ్రకచుఁ డపుడ దత్త, ప్రతివచనుం డగుచు నుఱకపఱచుచునుండన్
వితతప్రజ్ఞం గపి యు, ద్ధతు వానిం గ్రమ్మఱించెదం గా కనుచున్.

70


క.

భీతి ప్రవాహ మతిధృతి, సేతువుచే నాఁగి పలికె చెలికాఁడా నీ
శాతోదరి నాసోదరి, కౌతుకమున నున్నె భవదగారం బమరన్.

71


క.

ఇది వినవలతుం జెపుమా, మది వొదలఁగ ననిన శింశుమారుఁడు పలికెన్
గదబాధిక యయియున్నది, గద నీయనుజాత యెట్లుగా ధరియింతున్.

72


సీ.

భార్యలేక యొనర్చుపండుపు దండువు కులకాంత పెట్టనికూడు గీడు
పత్నితోఁ బలుకనిపలుకులు చిలుకులు గృహిణిలేని కబంధకేళి జాలి
జాయ వాటింపనిసరసము ల్విరసము ల్ప్రాణేశ్వరికిఁ గానిపాటు చేటు
దయితకై చేయనిప్రియములు భయములు వల్లభ వెలియైనయిల్లు పొల్లు


తే.

ముద్దుకులకాంతసుద్దు లేప్రొద్దు వినని, చెవులు గవులు వృథా వేయుఁ జెప్ప నేల
యకట సతి లేనిబ్రతు కేల యర్థ మేల, వాహనము లేల కరు లేల వసుధ యేల.

73


క.

నావిని బహుమానుఁడు బా, ష్పావృతముఖుఁ డగుచు వాని కనుఁ గ్రకచా నీ
దేవి రుజ మాన్పుటకు లే, రే వెజ్జులు మందుఁ జెప్పరే వా రనినన్.

74


క.

చెప్పిరి వానరహృదయం, బప్పనికి నవశ్య మనుచు నగదంకారు
ల్తప్ప కది హేతువుగ ని, న్నిప్పుడు గొనిచనుట యని యహితుఁ డతఁ డాడెన్.

75

క.

నగచరుఁ డది విని నెఱఁబం, డ్లిగిలిచి వడవడ వడంకి యెదపడి చెడితిన్
దెగితిఁ గడచనితిఁ బొలిసితిఁ, బొగరువ నిట్లయితి మోసపోయితి ననియెన్.

76


క.

దారుణగహనంబున నా, హా రోఁతలఁ బెట్టు ముదిమి నసురుసురై కా
మారంభం బుడుగని యల, ఘోరాఘఫలంబు గట్టి కుడిపెడు నన్నున్.

77


క.

భీమాటవిలో నున్నం, గామాంధుని బొదవుబాతకంబులు రాజ
గ్రామముననున్న దూరిత, కాముని గల్మషము లంటఁగా శంకించున్.

78


క.

చిరకాల మరిగె సురిగెం, దరుణిమ యిక నేడ గామతంత్రం బనుచున్
బరలోకచింత సేయని, పురుషాధముఁ జేటుపాటు పొందదె యనుచున్.

79


చ.

క్రకచుని చూచి వానరశిఖామణి యిట్లను నీవిచార మే
టికిఁ జెడిపోయె నేమిటికి డిందె భవన్మతిప్రాణమైన భా
ర్యకు రుజ మాన్పఁ గీశహృదయంబునకుం జనుదెంచువాఁడ వీ
వకట యెఱుంగిఁ జెప్పవలదా మును గల్గగ నాకు నింతయున్.

80


ఉ.

చెప్పిన నాయుదుంబరపుఁజెట్టున నెప్పుడు దాచియుందు నొ
క్కప్పుడు మామకీనహృదయంబు సమర్పణఁ జేసి పుత్తు నీ
చొప్పున నింత దాచెదరె చుట్టమఁ గానె విరోధినే వృథా
త్రిప్పట జేసి తింకొరులు దెత్తురె ని న్గడవం బ్రతిక్రియల్.

81


క.

హృదయము దరువున నున్నది, గద నాకాయమున లేదుగద మునుగా నా
కిది చెప్పక పనిచెఱిచితి, గద రిపుఁడవు గాని చెలివి గా వంగనకున్.

82


సీ.

ధర్మార్థకామచింతకులకు భూదేవధారుణీవరవధూదర్శనములఁ
జనరాదు రిక్తహస్తములను గామ్యార్ధి వగునీకు మున్నుపాయనము వలయు
హృదయంబు మేడి నున్నది పోకమరలు నిర్ముండితారినికాయ గుండెకాయ
చేయార నీకు నిచ్చెదఁ బుచ్చుకొని చేరి జాయ నిరామయఁ జేయవయ్య


తే.

యనుచు బహుమానుఁ డాడుమాయామయోక్తు, లాగమోక్తులుగా నప్పు డాత్మఁ దలఁచి
తిరిగి యాశింశుమారుఁ డేతేరఁ దీర, వృక్ష మెగఁబ్రాఁకి కపి వాని వెక్కిరించె.

83


క.

కసినుస నాఁకట ఫలము, ల్మెసవుచు జలి విడిచి మేడిమీఁద న్మోదం
బెసఁగ నటియించువానరు, మసలక వీక్షించుశింశుమారుఁ డనియెన్.

84


చ.

కుజమున నున్నవానరునిగుండియ దండియశంబు నీకుఁగా
భుజబలసార యిమ్ము కొనిపోయెద నాయెద దీఱ మత్ప్రియా
రుజ కనఁ బల్కెఁ గాననచరుండు దురాత్మ విచారమూఢ యే

కుజముననుండు వానరునిగుండియ యెక్కడిజోలిపొ మ్మిసీ.

86


చ.

స్తుతులఁ గరంచి నాగృహము జూతువు రమ్మని తోడుకొంచుఁబో
యి తగవుమాలి నన్ను బొలియింపఁగ యత్నముఁ జేసితేను నీ
గతి భవదీప్సితం బొసఁగుకైవడి ని న్మరలించి మేని బ్రో
చితి జిరకాలజీవి మతిశీలుఁడ మోసము నాకు గల్గునే.

87


క.

కదలు మిఁక ననినఁ గ్రకచుం డెదపడి యేవలన మోసమెఱుఁగనినను ని
మ్ముదిక్రోఁతి మోసపుచ్చెం, గదరా యని విన్ననగుమొగముతో నున్నన్.

88


వ.

బహుమానుండు.

89


క.

దొరకిన నను విడుచుట క, బ్బురపడకుము నీకుఁ దోడుపోయినధరణీ
సురుఁ డొకఁడు లబ్ధమనుజే, శ్వరకన్యక విడిచి రిత్తవాఁడై చనఁడే.

90


క.

నానీరచారుఁ డాబహు, మానున కిట్లనియెఁ దెలుపుమా వినవలతున్
దా నేల విడిచె నయవి, ద్యానిధి బ్రాహ్మణుఁడు భూతలాధిపకన్యన్.

91


సీ.

అనిన శాఖామృగాధ్యక్షుఁ డాక్రకచుని గనుఁగొని పలికె నిక్కథ వినంగ
దగుదువు నేనును దగుడు నీ కెఱఁగింప మును విశాలాపురంబున సుకీర్తి
యనురాజు రాజిలు నమ్మహీజానికి భువనమోహిని యనుపుత్రి గలదు
దానికి మందాభిధానుఁ డొండొకధరాత్రిదశుండు సుముఖుఁడై చదువుఁ జెప్పు


ఆ.

నట్లు కొంతకాల మరిగిన నపరంజి, పసిఁడి కలరుతావివలె మనోజ్ఞ
ఫలము చెఱుకునందుఁబలె నేమి చెప్ప లేఁ, బ్రాయమయ్యె నానృపాలసుతకు.

92


మ.

సితరోచిర్ముఖికప్పుగొప్పు సుమనస్స్నేహం బధిష్ఠించి కృ
ష్ణత నొందం గని యోర్వలేక వదనాబ్జాతంబు గాంచె న్విధూ
న్నతి జన్నుంగవ యచ్యుతాప్తి బొదలెన్ మధ్యంబు దాల్చెన్ హరి
స్థితి రోమావళివల్లిచక్రిత భజించె న్నిష్ప్రయాసక్రియన్.

93


శా.

బింబోష్ఠంబు మధూద్ధతంబు పరహృద్భేదు ల్కటాక్షంబు లా
స్యం బుద్యద్ద్విజరాజమండలపరిస్సర్ధాళు వాకర్ణదీ
ర్ఘంబౌ గ్రాల్గనుదోయియుం గువలయప్రత్యర్థితారాపథా
లంబు ల్వాల్గురులేలొకో పొగడుబాలం జాల ముల్లోకముల్.

94


శా.

లీల న్రాగరసోధయస్ఫురణ దాల్చెన్ మైజగద్గీతస
ర్వాలంకారపదప్రవీణ యది యాహా యట్లు గాకుండినన్
వాలగ్రంధివరాళిమోవి నునుదీవం గూడి తోరంబులౌ
పాలిండ్లన్ ఫలమంజరీగరిమ జెప్సం జూపనౌ టెవ్విధిన్.

95

మ.

అతిభాస్వత్తరకాంచనంబు చెలినాసాగ్రంబు కల్యాణ మా
శతపత్రేక్షణమేను మేరుకుధరాంచత్కూటము ల్దావియు
న్నతవక్షోజము లేమి చెప్ప నది యంతాయంతబంగార మ
ప్రతిమం బానరనాథుపట్టి గణుతింప న్శక్యమే యేరికిన్.

96


క.

తనకుఁ బయోధరధృతి వ్రేఁ, గని మి న్నెలనాఁగమధ్య మయ్యె న టైనన్
జనదు పయోధరభారము, జననాంతరకర్మ మేల చను నెందున్నన్.

97


క.

పరమాణువు పరమమహ, త్పరిపూర్తి న్గోచరించుపరమమహత్తున్
బరమాణువై కనంబడు, దరుణీమధ్యస్తనేక్ష తత్త్వజ్ఞులకున్.

98


క.

కన్నులకు మొగము చాలదు, చన్నులకు నురస్థలంబు చాలదు వెన్నుం
బెన్నెరివేణికిఁ జాలదు, కన్నియచెలువంబుఁ బొగడఁగా నాతరమే.

99


వ.

ఈదృగ్విలాసధన్య యగునారాజకన్య చకోరికాపరివృత యగుచంద్రికయుంబోలె
సఖీజనసహాయయయి వన్నె మెఱసి యొక్కనాఁ డాస్థానంబునకు వచ్చె న ట్లేగుదెం
చిన కుమారీరత్నంబు సౌహార్దభాసమానోల్లాసంబునం దిగిచి యంగపీఠంబున నునిచి
సుకీర్తిబంధుజనాదులతోడఁ దత్సౌందర్యసౌశీల్యాదిగుణంబు లుగ్లడించుచు గొలు
విచ్చియుండె నాసమయంబున.

100


సీ.

చిఱుతకెంజడలఁ గీల్చినజాతిపటికంబు గళమున రుద్రాక్షకంఠమాల
యపరంజిపసిఁడికామాక్షులు డామూఁపుపై గొండ్లిఁ గావించుయోగపట్టె
చిన్నారికంటె గ్రుచ్చినశింగినాదంబు గుత్తంపుజిక్కులకుట్లబుఱ్ఱ
కరమునఁ బెనుచొఱగరిముల్లు మయూరబర్హనిర్మితమైనబవరిసురటి


తే.

భసితభస్త్రిక పులితోలుపచ్చడంబు, నాగబెత్తము దంతపుయోగనాగ
లమరఁ జెట్టునడిగినట్టు లవనినాథుఁ, జేరనేతెంచె నొకమహాసిద్ధుఁ డపుడు.

101


క.

ఏతెంచినఁ గాంచి ధరి, త్రీ లనాథుఁడు హృదంకురితనిర్ణిద్ర
ప్రీతి నెదురేఁగి నతుఁడై, యాతిథ్య మొనర్చి యమ్మహాయోగీంద్రున్.

102


క.

వినయమునఁ దెచ్చి కనకా, సనమున నిడి రాజు పలికె సదయా మీచూ
డనిభూములు వానం దడి, యనివారలు గలరె మిమ్ము నడిగెద నొకటిన్.

103


క.

రాజకుమారులలో రతి, రాజకుమారుల సురూపరసవిక్రమల
క్ష్మీజయముల మించినవాఁ, డోజగదారాధ్య కలఁడె యొకఁ డట్లున్నన్.

104


క.

ఆసర్వజ్ఞున కపర, వ్యాసా కులగోత్రజాత యగునీసుత ను
ల్లాసగుణవసతి నిచ్చెద, నాసక్తిం తెలుపుమనిన నతఁ డిట్లనియెన్.

105


క.

ఇలఁగలరాజకుమారుల, దెలివిపడం దిరిగిచూచితిని బాటలపూ

ర్నిలయుఁడు జయసేనుఁ డనం, గలఁ డాతఁడు నీకుమారికకుఁ దగుఁ గూర్పన్.

106


క.

ఆత్రైలోక్యశ్లోకిత, గాత్రుఁ బ్రశంసింప నేల కనుఁగొను మనుచుం
జిత్రరస మావహిల్లం, జిత్రించి మునీంద్రుఁ డధిపుచేతికి నిచ్చెన్.

107


వ.

ఇచ్చినం బుచ్చుకొని యచ్చిత్రరూపంబుఁ జూచి యచ్చెరువంది యమ్మనోహరా
కారంబు తనయనుంగుతనయకుఁ గానంజేసి యజ్జయసేనుండు దనకు మేనల్లుం
డు గావున సదృశసంబంధంబున కలరుచు.

108


క.

జనపతి మునిపతిఁ బూజా, వినుతి నతిక్రియలఁ బల్లవిలఁజేసి ప్రియం
బున వీడుకొలిపి తామం, జనియెఁ గొలువు విరిసి రత్నసదనంబునకున్.

109


ఆ.

అట్లు రాకాజపుత్రి యాచిత్రరూపంబు, గన్ను దనియఁజూచి కంకదఘ్న
మోహసింధుపతితయై హార మాహార, మాళిజనవిహార మరుచి పుట్టి.

110


వ.

చింతించుచుండ నెచ్చెలు లారామంబునకుం గొని చని.

111


సీ.

కలకంఠి కతిశయోత్కలికావిలాసంబుఁ దార్పదే యారామధామకేళి
లీల నేతత్ప్రియాళికి నమందానందలహరిఁ బుట్టింపవే లతలు విరులు
వికసిల్లునీపద్మినికి సదామోదంబు జరుపదే కాసారసారవిహృతి
శిఖిబర్హతులితకైశికకు సంతాపంబుఁ బాపదే ఘనకదంబకకులంబు


తే.

సడలెనుగదమ్మ లావుకాంచనకలాప, పరిచయము మానెనమ్మ దెప్పరపువంత
నాడెనుగదమ్మ మాతోడ నాడదమ్మ, కొమ్మ మ్రాన్పాటు కె ట్లోర్చుకొనఁగవచ్చు.

112


వ.

అని నెచ్చెలు లచ్చెలి నాలోకించి సుముఖిగాఁ జేయువారయి శిలీముఖప్రముఖం
బులం జూపి యిట్లనిరి.

113


చ.

కరటులపొందునం గడపుఁగాలము బల్లవసంగమంబున
న్దిరుగుఁ గుజాతమైత్రి నెడత్రెవ్వక శీధువుఁ గ్రోలు మాలలం
దరసిననుండు మ్రోఁత తఱు చాత్మభవైకసుపర్వధర్మముం
గుఱుచయొనర్చు నెట్లు పొసఁగుం జెలి దీని ప్రియాళిగాఁ గొనన్.

114


చ.

కలగుణము ల్ద్యజించి పలుగాకులవంటి ననంగవచ్చు నే
ఫలదళపారణ ల్వినయపాటవము ల్మఱి ప్రాప్తకాలభా
షల సుముహత్తరు ల్చెలిమి సల్పఁగ నున్కి దగుం దృగంగదీ
ప్తులు వెలిగాఁ దపస్వినులు వోకలకంఠులు మాకుఁ జూడఁగన్.

115


మ.

మురిపంబుల్ గలమిండతేటికడియంబుల్ మారుతోక్షభ్రమిం
దిరుగం భాసురకేసరేక్షుకణికాధిష్టానకించిద్విక
స్వరపుంగ్రొవ్విరిఱోళ్ళఁ జైత్రహరి నించం జంచరీకాలకా

కురిసెం బుష్పరసైక్షవంబు చిగురాకుం గొప్పెర ల్నిండగన్.

116


చ.

సరసులలో సువర్ణపరిషక్తములై కనుపట్టుకోశముల్
గర మనురక్తి చూచి మృదులస్వర ముట్టిపడ న్సుభాషితో
త్కరము విధాత కెక్కుడగుగౌరవ మొప్పఁ బడించుఁ జూచితే
హరిణవిలోచనా పరమహంసవతంసము లూర్జికస్థితిన్.

117


మ.

గమకంపుంబసనేలపై దిగినశాఖల్ హస్తపాద్విభ్రమా
భ్రమఁ బుట్టింప లతాంతబిందుకులముల్ పైదేర నుద్యద్ద్రవ
త్సుమధూళీమదధార లూర నళీపంక్తుల్ గప్ప నుద్యానపా
నమహిం గానఁగనయ్యెఁ జూచితివె పున్నాగంబు బింబాధరా.

118


ఉ.

ఉన్నతి నంబరం బొరసి యొచ్చె మొకింతయులేక కొమ్మలం
గన్నులపండుపై బవరిగా నరుదెందిన ప్రాసవాసవో
త్పన్నఝరం బగడ్త దెలుప న్గులపాలిక యొప్పె జూడు మా
సన్నబలైకపత్రకవిశాలము సాల మఖండమూలమున్.

119


చ.

చదువులమేలు లేదొ శుకసంతతి గాదొ వినీతిరీతి చా
లదొ భజియించునీచతురుల న్మఱిమాటకు వచ్చునిచ్చలుం
బదివదిగా నొనర్చు ఫలభంగము నెమ్మొగ మెఱ్ఱజేయు న
ల్లదె పరికింపు చిల్కహృదయంబున గోపము జిల్కె దొయ్యలీ.

120


చ.

సరళగభీరశబ్దఘనసారసమృద్ధిఁ బ్రసిద్ధిగన్నయా
సరసులఁ గూడి చారుగతి సద్వితతు ల్భజియింప బాదప
స్ఫురణ ఘటింపుచుం దొడుసు పుట్టక యుజ్జ్వలధారచే నుదా
హరణము జేయుచున్నకవి నారసి చూడు మరాళగామినీ.

121


క.

నిరుపమఘనరసపుష్టీ, స్ఫురణం బాదములు మెఱయ భూభువనమునన్
సరి జెప్పఁగలదె యిందిం, దిరకుంతల యీవసంతతిలకంబునకున్.

122


క.

విరికొఱవులఁ బథికపరం, పర జూడుంజూడు మిట్టిపరుషపలాశో
త్కరమునకు నెట్లు గలిగెం, ధరణీసురదండవిధిసుధామధురోష్ఠీ.

123


చ.

గళితఫలాశఁ బూజకలికాచ్ఛలనంబున విస్ఫులింగము
ల్చిలుకుచు మత్తకోకిల విశృంఖలఘోషమిషంబుచేత గ
ర్జిలుచు ధూపరాగముల రేఁచి నడి న్సుడిగొంచువచ్చెడిం
బెలుచమనోజమాంత్రికుఁడు పెంచిన గాలిపిశాచిఁ జూచితే.

124

ఉ.

వేవెడఁగేల డీలు పడవ్రేసినఁ బైఁబడ వక్ర్రశీధుని
ష్ఠీవన మాచరించినవడిం జరణంబున దన్నిన న్రహిన్
బోవనిసార్థివస్ఫురణఁ బొందియు నుత్కళికాప్తి నొందుహే
లావతి యిట్టినీచతరులం బరికించితె యిమ్మహావనిన్.

125


సీ.

నెలఁత నీపలుకులో నిది కర్ణికారంబు వనిత నీనగ వెఱింగినది పొన్న
మెలఁత నీకనుసన్న నలరుబొట్టుగ ముద్దు పొలఁతి నీచేసంజ్ఞఁ బొదలుమావి
ముగుద నీసమ్ముఖంబున గ్రాలుసంపెంగ రామ నీహృదయపారగము క్రోవి
పడఁతి నీపద మాసపడునశోకము వినఁ బ్రియపడునీపాటఁ బ్రేంకణంబు


తే.

అతివ యుష్మత్పదగ్రహాశ్రితము పొగడ, యువిద వావిలి యలరు నీయుసురు కలిసు
బంధుమధ్యమ మివ్వనాభ్యంతరంబు, విద్రుమాధర కన్నిచ్చ విశ్రమింపు.

126


సీ.

ఘనసుమనఃకులంబున నెట్లు పుట్టెనో యొరులచేరువ నున్న నుడుకుఁ జూపు
బహుపత్రభరణసౌభాగ్య మె ట్లందెనో యుగ్రగంధస్ఫూర్తి నుల్లసిల్లు
నిరవధికామోదభరిత మె ట్లయ్యెనో మహిబుణ్యతరులకొమ్మలఁ బెనంగు
సతతాభివృద్ధి రాజస మెట్లు గల్గెనో కఠినకంటకమైత్రిఁ గడపుఁ బ్రొద్దు


తే.

ననుచు బెనుచూరపోలె జెల్లాట మెసఁగ, నసమకుసుమాపచయకౌతుకాప్తి నడరి
సంపెఁగల మల్లికాగుగుచ్ఛములఁ బొన్న, విరుల మఱి గేదఁగుల రెమ్మి వెలఁదు లంత.

127


ఉ.

కోయెలనోరుసోఁకనిచిగుళ్లు నికారపుఁజిల్క భిన్నము
ల్సేయనిపండ్లు కాలవడి లేవడి తెమ్మెరకూన రాశిగా
వ్రేయనికమ్మపుప్పొడి ప్రవృద్ధపిపాసమదాళికుత్తుకం
బోయనితేనియ ల్గమిచి పూవిలుకాని భజింప నంగనల్.

128


సీ.

కలకంఠముల నోరికడిదివ్వవలె నంచుఁ జికిలిగుబ్బెతలు గోసిరి చిగుళ్లు
చిలుకమూఁకలకూడు చెఱుతమా యని పువ్వుబోండ్లు మాఁగినపండ్లు పుచ్చుకొనిరి
యుదుటుదుమ్మెదలఁ బస్తునుతమా యని ముద్దుకొమరాండ్రు విరితేనె కొల్లఁగొనిరి
మదటగాలి వయాళి మాన్తమా యని కుమారికలు పుప్పొడు లావరించుకొనిరి


తే.

అతనువిలు మూలవేయింతమని సుధార, సాధరలు తానిపూవుల నపహరించి
రంత నా క్రీడ భూక్రీడ నలసి యంసి, తాంబుజాక్షులు కంకేళిహాళి వ్రాలి.

129


సీ.

మోమాటనలరుతమ్ములతావు లగలింప గనుసన్న మనుఝషకముల నలపఁ
జూడనాసనిమైత్రిఁ జొక్కినయళిరేఁప వరగుత్తికగుసంకు నలటఁబెట్టఁ
గైవసం బగుబిసాగ్రముల నున్మూలింప మాటకు లోనైన మధువు లొలుక
జనుమానమందిన జక్కవలను రేఁప దండఁ బాయని కుముదములఁ జెండఁ


తే.

జరణముల నాశ్రయించినసన్మరాళ, నీడజములపయోభూతి నేలఁగలప

నెత్తుకొని రెంతనిర్దయు లీలతాంగు, లనఁగఁ గంకేళికాంక్షఁ గా లాఁగ కరిగి.

130


ఉ.

చేరువ గాంచి రక్కలికిచేడియ లవ్వనపాళిఁ గేళికా
సారము దుంగభృంగకులఝంకృతిభాంకృతిసంగమంగళా
గారము గుంజపుంజబిసఖండనచండమరాళలోలవాః
పూరము దారకోరకితపుండ్రగపూగకుటీరతీరమున్.

131


చ.

కని బిసదండపత్రపుటికాపరిపూర్ణసువర్ణకర్ణికా
కనకఘటీస్ఫుటీభవదఖండసహస్రదళాతపత్రముల్
దినపకరోష్మఁ దీర్ప నిరుదిక్కులఁ బత్రము లాశ్రయింప ని
ల్చినయలరాజహంసపటలిం గని సమ్మదవార్ధిఁ దేలుచున్.

132


చ.

వడిఁ బుటమెత్తి వ్రాలు నిడువాలువచాలుపులింత నంత పై
నిడువెలిగుంచెలం దెలుప నీదరగాడ్పులఁ గ్రిందుమీఁదుగాఁ
బడుజలజచ్ఛదంబులు శుభవ్యజనక్రియఁ జేయ రాజుకై
వడి గనుపట్టునంబురుహవాసముఁ జూచి ముదాప్తి నొందుచున్.

133


ఉ.

చుట్టి సమాఖ్యమాలికలచొక్కపుఁదావులు సోడుముట్టఁ జూ
పట్టునిరల్పకంకణవిభ ల్నయనోత్సవ మాచరింపంగా
మట్టపుటూర్ముల న్మెఱయు మంజుసరోరుహరాగపూగముల్
పట్టపురాణిరీతిఁ గనుపట్టుసరోరమఁ జూచి యుబ్బుచున్.

134


ఉ.

పొంగ నఖండతుండరవము ల్జవముల్ ఘనపక్షనిర్భరా
సంగమునం బహుప్రసవజాకలరేణువు లంటిరాఁ బరి
ష్వంగితసాధుశీధుమదసంపద నింపొదవించుతుంగసా
రంగములం గనుంగొని మృగాక్షులు సమ్మదవార్ధిఁ దేలుచున్.

135


చ.

సరసమృణాళనాళతనుసంభృతము న్వికచచ్ఛదస్ఫటో
ద్ధరణము కెసరప్రసరదంష్ట్రము ఝంకృతిభాగలీనభూ
త్కరణమిషంబునై సొగసుగాడ్పుల దూలుచు మాగుతుండిక
ద్విరసనభంగి నొప్పునరవిందముఁ గన్గొని సోలియాడుచున్.

136


ఉ.

జాతకుతూహలాప్తిఁ దమచక్కదనంబులఁ గాంచి యద్భుత
ప్రీతిరసంబు లుట్టిపడ బెద్దల నౌదలయూఁచు లోకవి
ఖ్యాతసరోరమాలలనకమ్మల మించిన క్రౌంచమండలీ
భీతిఁ దళుక్కున న్బెళుకుబేడసలం గని క్రేళ్లు దాఁటుచున్.

137


చ.

సిరిగలచోటులన్నియును జేకొని బంధురధారసత్రసం
వరణబలంబు నిత్యమయి వర్తిల దారుణమైనవిక్రమం

బురుభవనంబులం బొదల నున్నమహామధువుం గలంచి దు
స్థిర మగునచ్యుతాతిశయచక్రము గన్గొని సంభ్రమింపుచున్.

138


చ.

మిళితగరుత్కలాపముల మించుకుమారశిలీముఖాళిసోఁ
కుల నిజహృత్పుటు ల్విరిసి కోమలపత్రవిశాలలోచనాం
చలముల నీరుగప్ప మఱి జాబిలిరాకకుఁ గాక మోహినీ
కళ దుళకించుపద్మినులఁ గన్గొని గంధగుణంబు నొందుచున్.

139


చ.

తనభువనప్రశస్తబలదర్పమునం జననీక నిచ్చలుం
దనివి సనం బహుద్విజవతంసములం దినుచు న్నిరంకుశ
ధ్వనిఁ బ్రకటైకచక్రసవిధస్థలిఁ గ్రాలుబకున్మహత్తరు
ల్దను శిరసావహింపఁ దగులావరిఁ గన్గొని తెల్వి నొందుచున్.

140


ఉ.

బారులుగొన్ననీరకణపంక్తులు క్రొచ్చవిరచ్చ దెల్ప నిం
డారినకేసరంబులు శుభాక్షతరేఖ ఘటింప సారకా
సారవధూటిసాంగజవసంతున కీనమరించు పచ్చరా
యారతిపళ్ళెరంబులక్రియం దగుతామరపాకుఁ జూచుచున్.

141


వ.

కదియంజని ప్రహృష్టచక్రంబు గావున రాజహంసోపలాలితంబయి సిద్ధసంతాన
వేష్టితంబు గావున మత్స్యకూర్మకుక్కుటాద్యాసనభాసమానంబయి విడంబితశంబ
రారంభంబు గావున నాక్రాంతపాఠీనాంకంబయి కుముదప్రకాశోదయంబు గావున
నావిష్కృతపుష్కరంబయి యలరుచుండుట కలరుబోండ్లు.

142


క.

ఒసపరినడకలు మృదుసా, రసవిసరవిజేత లగుకరంబులు గంధో
ల్లసనము కొమ్ములు నమరఁగఁ, గుసుమాస్త్రునిమదపుటేనుఁగులగతిఁ జెలువల్.

143


వ.

కాసారంబు ప్రవేశించి.

144


మ.

పొగడంజొచ్చినభంగి రత్నవలయంబు ల్మ్రోయఁ జేయెత్తి కెం
జిగురుంగొమ్మున వైచె నోర్తు నొకరాజీవాస్య యవ్వాటునం
బగులం గంచుక ముబ్బి చన్నుఁగవ చూపట్టె న్ముఖాగ్రంబులం
దగ నండంబులు వ్రచ్చి వెల్వడు నరిద్వంద్వంబుచందంబునన్.

145


ఉ.

పూని ఛటాత్కృతు ల్మొరయ బుఱ్ఱటకొమ్మున నీరు నించి యౌ
రా నెఱజాణ నా నొకధరాకటి యొండొకబోటి వైవ నె
మ్మే నదరంటఁ దాఁకి నెఱిమించినఁ బయ్యెద వ్రయ్య నంత న
మ్మానిని యొప్పె పేరొఱఁ దెమల్చినపూవిలుకానివా లనన్.

146


చ.

మరువిరితూపురూపుససమాపు నొయూరపుఁజూపు సూరెలం
దిరువులు గట్ట విభ్రమవతీమణియోర్తుక యన్నుగన్నులం

దొరల జలంబుఁ జల్లె నది దోయిట వక్త్రముఁ గప్పె రోహిణీ
చిరవిరహార్తి నొందినశశిం జిగురాకులఁ దార్చుచాడ్పునన్.

147


ఉ.

చే నొకబోటి కెంజివురుఁ జిమ్మనగ్రోవి యొనర్చి తమ్మిపూఁ
దేనియఁ బీల్చి సోగవిరిదిండుగ నొండొకకొమ్మ జిమ్మ పె
మ్మే ననుకైన నమ్మెలఁత మించె జగంబులు గెల్చి శాంతిరే
ఖానియతి న్మరుండు గడుగం గడుఁగ్రాలు మెఱుంగువాలనన్.

148


చ.

పొలఁతుకయోర్తు గెంజివురు బుఱ్ఱటకొమ్మన స్రుక్క నొక్కనె
చ్చెలి చలి వీడివైవ నది చిత్తజుఁ డేడ్తెఱఁ జూచి వైచుకే
వలకరవాలసంహతులవైఖరి గానఁబడంగ దానికే
వలకరవాలసంహతుల వంచి వికావిక నవ్వెఁ గ్రొవ్వునన్.

149


చ.

విరహులమారుమారుఘనవీరబలం బని పాంథకంధర
ల్దఱుగురమాకుమారు వడిదాలనిరాగవియోగజాతకా
తరగుణదాతృమన్మథపతాకనితేంట్ల నదల్చి కమ్మదా
మరలఁ గదల్చి వారిచరమండలిసొంపు వదల్చి రంగనల్.

150


చ.

గతి యతివేలరాగకరిగా నెఱిగాంచినవాలువాలముల్
ప్రతిరహితాంఘ్రులం బెనఁగఁ బైపస ముద్దులు గుల్క సమ్మద
స్థితి మితిమీఱఁ గొమ్ములను జేతులు పుష్కరలక్ష్మి దెల్పఁగా
హితసరసిం జయించి రలయింతులు కంతునిదంతులో యనన్.

151


ఉ.

కొమ్ములతోడిహస్తములు గుత్తపుముద్దెలముద్దుగుల్కుపొం
దమ్ము లనంగవృత్తజఘనద్వయసాంబుల నిల్వ రేఁగి పైఁ
దుమ్మెద లాడఁజూడ నవదోహదధూమమిళల్లతావితా
నమ్ములజాడఁ గుందరదన ల్గనరైరి మనోహరాకృతిన్.

152


ఆ.

ప్రసవభాగ్యమహిమఁ బ్రబలియు నెటువంటి, ముసిమియో యెఱుంగ విసువులేక
తారసించి ముద్దుతమ్ములఁ జివురాకు, బోండ్లు కొలను సొచ్చి పుచ్చుకొనిరి.

153


క.

నాళీకజైత్రనేత్రలు, హాళిం గేళీసరోవిహారశ్రీలం
దేలి కటీఘటితపటీ, జాలములు కలాపవేషసంగతు లమరన్.

154


ఉ.

మందమరుత్కిశోరహతి మువ్వపుఁదేనెలజాలువారుపూ
బందిలిక్రిందఁ గప్పురపుఁబల్కుల దిద్దినగద్దె నిందిరా
నందను నిల్పి వృత్తజఘన ల్రతివర్ణితభారతిం దదా
ళిందమునం ఘటించి కదళీదళగర్భలతాంతసంతతుల్.

155

క.

కరములఁ గైకొని చెలువ, ల్మరుజాపగుణీకృతభ్రమరుఁ బ్రతివినతా
మరు జైత్రార్పితమణిచా, మరు నారాధించి రప్రమత్తప్రజ్ఞన్.

156


క.

ఆరాధ్యద్యుమణిప్రభు, నారాధనవిధులఁ దనిపి యతిశయవర్షా
ధారాధరవేణుల మధు, ధారాధరఫణితి వినయతాయుత లగుచున్.

157


సీ.

తలయేఱు పట్టించె నెలదాల్పునకు భవత్కంఠనిష్కుంఠహుంకారరవము
వికుటిలత్రోటికోటికి దెచ్చె భారతీకాంత దావకభయంకరశరంబు
ముష్కనిర్భేదనంబున సాధు జేసె నీవైరంబు మఱి దివ్యవృషవతంసుఁ
గన్నచాయకుఁ బోయెఁగాని నీనెఱదాడిఁ జేరఁడు గ్రహరాజశేఖరుండు


తే.

నీప్రతాపాగ్ని దపియించి నీరజారి, సంశ్రయించె సురాచార్యశరణభూమి
సదృశులెవ్వరు నీకు ముజ్జగములందు, శంబరామరవిమతహింసారిరంస.

158


సీ.

వివిధాగమాంతప్రవేశచాతురి నెన్నదగుశుకాదులు వినీతత ఘటింప
మహిసురాప్తిసుహృ త్తమహిమ గాంచినయుత్తమాళులు హితవృత్తి ననుసరింప
ఘనదానవేగరాగముల మీఱినజగత్ప్రాణుండు నీమనోరథము గడప
నాశువాగ్గ్రహణమేధాశక్తి మాధవాదృతి భజించినమహాద్విజులు గొలువ


తే.

గువలయప్రీతికాముఁడై నెవఁడు రాజు, గాఢరూఢప్రసన్నతఁ గాంచి తిరుగ
సాధుబుద్ధివి గావైతి శంబరారి, వేమునకు బోయుపాలయ్యె వృద్ధసేవ.

159


ఉ.

పూతమరందబృందకరము ల్శరము ల్ప్రతిపర్వసంధిసం
జాతమధూద్ధతంబు విలుసారసమీరకుమారవారణో
ద్ధూతసుజాతచూతరసతుందిల మౌర రమాకుమార నీ
చేతిగుణంబు మాన వదె చేతిగుణం బిటులయ్యె నక్క,టా.

160


సీ.

ఆర్తి వహించు నీయస్త్రపీఠమునకు నిలుపుగన్నుల నీక నివ్వటిల్లె
నతిముక్త మగుతావకాయుధంబున కహో దొరకె జండాలురతోడిమైత్రి
వ్రంతఁబాయని భవద్ధ్వజవాశ్చరమునకుఁ గలిగెఁ బేరలుఁగులఁ బొలిసి పోవ
బుట్టుగ్రుడ్డైన నీబూమెరతేజికిఁ దగిలె మహావినీతప్రతీతి


తే.

యకట జాతికిఁ బాసిన యనుఁగుఁజెలికి, నెసఁగె మఱి వేళవేళ మానిసితనంబు
నొడలుమాపిన నీ కయ్యె నుగ్రకృత్య, మంగభవనిందితులకు మే లావిహిలునె.

161


మ.

అమదప్రక్రియ మూఁడుకాళ్ళజరఠుం డైయున్నతండ్రిం ద్రివి
క్రమునిం దమ్ములఁ జేరి తత్ప్రబలపత్రచ్ఛాయ వర్తించునా
దిమసాధ్వి న్రమఁ జేర రమ్మనక యుద్వృత్తి న్విజృంభింతు నీ
తిమనీషోదయలాభ మెట్లు జనికర్తృద్రోహియౌ వానికిన్.

162

ఉ.

అల్లనఁ గాచి మిత్రగృహ మారటఁబెట్టుసఖుండు నీతిపొం
దొల్లఁడు మంత్రిమానులకు నొప్పమిఁ జేయురథంబు నీవునుం
బల్లవధర్మ మూఁది రతిపైఁ దమివర్తిలు దట్టినీకు ను
త్ఫుల్లదయానయాదిగుణము ల్జనియించునె శంబరాంతకా.

163


వ.

అని యనంగు నంగనారత్నంబులు దూఱి తన్మాతులుండగు నీరజారిం బేరుకొని.

164


ఉ.

నీదయ పంచబాణశరనిర్భరతాపదవాగ్ని గ్రాఁగిపో
నీదయ నీదయోదయసమృద్ధి సదా వెదచల్లుచుండుఁ దా
నీదయ సేదఁ దేర నొకయింత యిదెక్కడివింత నేఁడు నీ
పాదములాన మావికచపంకజనేత్రకు సారసాంతకా.

165


ఉ.

కాలగతిం ద్వదీయజనికర్తప్రతిక్షపము న్గరాళకో
త్తాలకృపీటజన్మపరితశ్శిఖలం గడు గ్రాఁగునాతనిన్
బోలి కళంకినై మొదలఁ బుట్టినవానికి నీకు శైత్య మే
వేళ జనించు వి త్తొకటి విత్తినఁ జె ట్టొక టౌనె జాబిలీ.

166


చ.

పరుషమహాకృపీటభవభావము నీయెడ సత్య మత్తెఱం
గరయక నిన్ను శీతకరుఁ డందు రటేని సుజాత శీతల
స్ఫురణ పయోధికిం గలదె పొంగుకళంకముపేరఁ గ్రొంబొగ
ల్గురియుదె మింట నాలికలు గ్రోయుదె లోలకళాచ్ఛలంబునన్.

167


చ.

పరిథిమిషంబునం గుడుసుపడ్డశరాసముఁ బూని శైత్యవి
స్ఫురణ మెఱుంగులీను ఘృణిభూరిశరంబుల వేఁడిగా రహిన్
విరహిజనాళి నొంచెదవు వేఱె మనోభవుఁ డేల నీపయిన్
సరసత లే దనంతపదసంశ్రయ మేమయిపోయె జాబిలీ.

168


ఉ.

గోత్రులు రాకపోక నినుఁ గోల్కొననీరు దురంతశీతరు
ఙ్మైత్రి దృఢాంబరాశ్రయము మానవు ని న్నవి రోయు నీకళా
మాత్రవిభూతి నిట్టియిడుమం బడితో హరిణాంక వారిరు
ట్పత్రసుగంధలం గిరణపాతనశాతనరీతి నొంతురే.

169


ఉ.

కందళితానురాగములు గావు మనంబులు విన్నయంతలో
నందఱు పారవశ్యపద మందురు చల్లదనం బొకింత లే
దిందున శంకరాభరణ మె ట్లయి తీవు శశాంక నీపదం
బుం దుది నంత శూన్యమగుఁ బో వివరింపఁగ మాట లేటికిన్.

170


చ.

సదవనవైభవంబు పరచక్రవధోద్యతనంబు నిస్తులా
భ్యుదయ మనూనదానవిధియు న్సుఖలబ్ధపటుప్రసాదసం

పదబలవత్తమోదళనపాండితియుం దగురాజవైన నీ
కదయత కామినీజనులయం దుదయించుట పాడియే శశీ.

171


మ.

కృతదక్షాపకృతి న్మహామయుఁ గళంకి న్సోదరీమందిర
ప్రతిపక్షస్రజనీచరుం గురుకళత్రప్రాప్తభూయఃకళా
పతను న్ని న్శిరసావహించెఁ ద్రిపురప్రత్యర్థి సర్వజ్ఞు లా
శ్రితదోషస్మృతివిస్తృతివ్రతులు గారే రోహిణీవల్లభా.

172


ఉ.

మేదిని నర్జునస్ఫురణ మించి చరించుట సింధుచక్రర
క్షాదృతి నీ కనంతతిలకాంతమునో హరిణాంకకృష్ణప
క్షోదయము న్గురూపకృతియున్ ఝషకేతువిరోధివిగ్రహా
హ్లాదము లే ద దేమి చెపుమా వెఱఁగయ్యడు నీకు నక్కటా.

173


వ.

అని హాలాహలవిరోధి శిరోధిగృహమేధి యగు నవ్వనజవిరోధింబలికి చెలికిఁ దాపో
పశాంతిఁ గానక వరారోహలు గంధవాహు నుద్దేశించి.

174


సీ.

కాండభృద్ఘనబాధ గాసినొందినమిత్రు నోమవే సుఖవృత్తి నుల్లసిల్ల
మోచివచ్చినకార్యములచోట నొసఁగవే కుసుమబాణునకు నెక్కుడుధనంబు
చెలిమిఁ బక్షీకరించినమహాశిఖికిఁ జేరుపవెలె లావరిసమారోహణంబు
మొదల నిన్ను సహస్రముఖములఁ గొనియాడుచక్రి కీవె నితాంతసత్త్వగరిమ


తే.

నీవిహారంబు దాక్షిణ్యనిర్భరంబు, నిను సదాగతిగాఁ జూచు నిఖిలలోక
మోజగత్రాణ నీవంటియుత్తమునకు, నర్హమే పాంథయోషానిబర్హణంబు.

175


మ.

సలిలాహారుల గణ్యపుణ్యతరులం జంద్రాస్యలంగాక నీ
బల ముత్కృష్ట బలాధినాథులఁ దరల్పంజాలునే నిన్నుఁ గే
వలముం దైవము దెచ్చి మూలఁబడవైవ న్మించునీలావు లం
కలపాలై చన నీభవంబు దునియల్ గా కృష్ణనర్త్మప్రియా.

176


చ.

గరళగళప్రసాదమునఁ గన్నసుతున్ హరివంటివానిఁ గే
సరిసతి కీవె తజ్జఠరజజ్వలనైకశిఖాప్రశాంతికై
పరుషగతి న్మహామునులఁ బల్లటఁబెట్టవె యట్టినీకు నో
కరువలిమేఘవేణికల గాసియొనర్చుట ధాత్రిఁ జిత్రమే.

177


ఉ.

కొమ్మలచోట నీకుఁ బ్రతికూలత పుట్టుట యెంత చొక్కపుం
దమ్ముల సాధుమత్సరమునం దలఁకింతువు నిచ్చలుం బరా
గమ్ములరేఁతు వేమఱవు కాలుపదం బిటువంటినిన్నుఁ దా
నమ్మకచెల్ల సర్వభువనాసువుగాఁ దలపోయఁబోలునే.

178


వ.

అని సమీరు దూఱు నవసరంబున నలరాత్రి.

179

క.

స్మరమృగయు విశిఖబాధా, పరవశ యయి యున్నదానిఁ బద్మిని గాఢ
త్వరఁబరుషనీతి రుచిమ, త్కిరణనఖాగ్రములఁ జంధ్రకేసరి నొంచెన్.

180


క.

యువతికిఁ బ్రాణంబయ్యుం, బవతుగతిం బ్రోఁదిసేసె మలయక్షితిభృ
త్పవమానుఁడు దూరితరై, పవమానుఁడు మోహదానపావకశిఖలన్.

181


వ.

ఇట్లు మారతావేశకుమారసమీరబాధావిధురయై యమ్మధురభాషిణి శోషిల్లునుల్లం
బున నొల్లంబోయి నెచ్చెలులఁ గలయ నాలోకించి.

182


సీ.

కనలుచుక్కలరాజుకంటఁ బుట్టిన నేమి గాడ్పుపేరెమువాఱుఁ గాక యేమి
కంతుఁ డాకృతిఁ బెంచుఁగాక యేమి కంజాతకళితుఁడై మధు వుండుఁగాక యేమి
హంస మాపగవారికై పోవుఁగా కేమి గండుతుమ్మెద మ్రోయుఁగాక యేమి
చిలుకవాదులకు వచ్చినవచ్చుఁగా కేమి కలకంఠి గలహించుఁగాక యేమి


తే.

కమ్మచిగురాకుచే మించుఁగాక యేమి, కళిక లంతంత మొనఁజూపుఁగాక యేమి
వెఱపు నాకేల వెన్నెలవెల్లి ద్రెళ్ళి, ప్రాణసఖులార వలపంతఁ బాయుదాన.

183


క.

అని మోముదమ్మి వాద, న్మనసిజఃశిఖిమండ సకలమర్మస్థలముల్
దనువూటాడం గన్నియ, పెనుదెగువ న్గుబ్బతిలిన భీతిలి రతివల్.

184


క.

కామాస్త్రములకు నాళీ, గ్రామణి వైషమ్య మొదవుఁగా కెప్పటికిన్
సోమకుమారీమణి యీ, కౌముది దా నె ట్లసౌమ్యగా నేర్చునొకో.

185


వ.

అని జననాథకన్య నాలోకించి.

186


సీ.

దరహాసలేశధిక్కరణ మున్నదియె నీవంకవెన్నెల కేల వహ్ని గురియ
గినిసిమాటలు నేరవనుచు శిక్షించితే చిలుక కేటికి వళావళి యొనర్ప
బ్రతిపక్షి యని తిరస్కృతిఁ జేసితే సాధుపికమున కేల వాబిఱుసుఁ జూపఁ
జూడఁబోలనిచూపుఁ జూచితే చంచరీకమునకు నేల ఛిద్రములు వెదక


తే.

గోచరింపక యొకమూలఁ గూలి చనక, మందత వహింప కిట్లు త్రిమ్మరఁగ నేటి
కని యుదాసీనుఁ జేసితో యభ్రవేణి, యనిలశిశు వేల వీచివాటయ్యె నిపుడు.

187


సీ.

మనసుగన్న రమాకుమారికాసుతునకుఁ బూర్వాశ్రితుం డైనపూర్ణశశికి
జీవమువంటి దక్షిణసమీరమునకుఁ బేరైనకుసుమాస్త్రబృందమునకుఁ
బలుకుమారనిముద్దుచిలుకకు నెయ్యంపుఁబైకమై దీపించుఁ బరభృతాళి
కతులాళియయిన గయ్యాళితేఁటికి బెట్టుచెట్టైన లేఁబ్రోఁదిచిగురుమావి


తే.

కకట భయమందవలసె హా యనఁగవలసె, బెగడుపడియుండవలసె గంపింపవలసె
నాతురతఁ గూరవలసె బిట్టలయవలసె, జలదరింపఁగవలసె వే జడియవలసె.

188


ఉ.

చేరునమావికెంజివురు చేతికి లోనుగదమ్మ పద్మకాం
తారమరాళిమానసము నమ్మిన దింతెగదమ్మ కంతుబ

ల్వారువమైనచిల్క మిగులాతగులాయ మెఱుంగునమ్మ నీ
పైరుగదమ్మ మల్లికలు పల్లటమందఁగ నేల వానికిన్.

189


ఉ.

దారుణభంగిఁ బేర్చునినతాపదవజ్వలనోష్మమంటికం
ఠీరవమధ్యతాంతదశ నీతను వల్లవహించినం దగుం
గైరవసోదరస్ఫురణఁ గాంచిన నీనిడువాలుగన్నులే
లారజనిం గుభృజ్జనికళానిధిరాకకుఁ దల్లడిల్లెడిన్.

190


క.

అకటా యని చింతింపుచు, లికుచకుచ ల్నిలువ సంబళింపక శుకముం
బికము న్మలయానిలశా, బకము న్మదిఁ దలంచి వినయపాటవ మమరన్.

191


ఉ.

మాటకు రాకు ప్రోదిశుకమా యొకమారు జయింపరానికై
లాటము జేసె దేటికి భళా పికమా యిఁక మాను బోటి నీ
సాటియె ప్రాణమయ్యు వడచల్లుదురే యిటులైనజోటి యె
చ్చోటికిఁ బోవు నీచలువ చూపవనా పవనాఘనాదృతిన్.

192


క.

అని పలికి కలికిచెలువలు, మనసిజతాపాతపోష్మమందద్యుతియై
తనరువధూతనువల్లిక, ఘనశీతలరీతిఁ దేర్పఁగాఁ దగు ననుచున్.

193


చ.

చెలువల కిష్టమూలములు శీరము లుజ్జ్వలదంశుమదత్పలా
దళములు వెన్బలంబులు సదామృదులాకృతి మంచివారిలో
మెలఁగుమృణాళముల్ గరము మెచ్చొదవిందుమధూళి మాటలో
పలియవి యన్నిటం జెలికిఁ బంచశిలీముఖతాప మారదే.

194


వ.

అని శీతలోపచారంబు లాచరించిన.

195


సీ.

నునుమావిచిగురుపానుపు మహాతను శస్త్రశయ్యగాఁ దలఁచుఁ గంజాతనయన
కడిపోనివిరులకంకటి గణించునభూతకంటకాస్తరణంబుగా మృగాక్షి
వలపుగుంకుమపువ్వుతలిమ మంగభనాగ్నిశిఖగా విచారించుసింహమధ్య
శిరము కప్రపుఁబల్కు సెజ్జ సొక్కపుఁగామశరముగా వగచుయోషాలలామ


తే.

మంచిపడమటిపన్నీరు మకరకేతు, విషముగా బుద్ధి నూహించువిద్రుమోష్ఠి
తావిపుప్పొడి శంబరాంతకుపరాగ, మని వితర్కించులలన మోహైకకలన.

196


వ.

ఇట్లు మనోభవమోహదాహంబునం బొక్కి పొరలుచున్నకన్నియ నెచ్చెలులు నికేత
నంబునకు మరలఁ దోడ్కొనివచ్చి రంతఁ గొంతకాల మరిగిన నొక్కనాఁ డేకాంతం
బున విద్యామంటపంబుననుండి చదువుఁ జెప్పుచు దదీయసౌందర్యవయోవిలాసంబు
లీక్షించి మన్మథాతురుండై మందుండు భువనమోహిని కిట్లనియె.

197


చ.

నిరవధికత్వరం బఱచి నీచనుగొండలసంధి డెందపుం
దెరుబరిమారచోరనిహతిం బడి మోహవిదాహవేదనన్

బొరలెడుఁ దేర్పుపుణ్య మిదిపో యధరామృత మిచ్చి యిందునం
దరసిన గల్గునే పరహితాచరణప్రతిమానధర్మముల్.

198


క.

నవలా తావకమోహా, ర్ణవ మేమిట గడతు దుస్తరము వివరింపన్
భవదీయస్తనకుంభ, ప్లవ మబ్బిన గాక యీవిపత్సమయమునన్.

199


క.

ఆనిద్రాసుఖితంబులు, గానేరవు లోచనములు కంఠద్వయసం
బై నీలావణ్యరసం, బో ననిలా త్రేన్పు వెడలకుండుటవలనన్.

200


క.

హారవిలాసము గలని, న్నారసి చీకాకుపఱుప కతెనుఁడు ముక్తా
హారవిశేషము గలన, న్నీరసమున గాసివేయు టీ వెఱుఁగవొకో.

201


క.

గౌడరుచి న్రుచినం బనఁ, గూడదు నీయధరము ధరకుచచించైకా
మ్రేడితము కానిచో నే, లా దాపునఁ జూచువారలకు నోరూరున్.

202


క.

ఇన్నియును జెప్స నేటికిఁ, బన్నినమరుగాసివాసిఁ బాసితి నో రా
కన్నియ వన్నియ మెఱయం, గన్నెఱికపుభిక్ష నాకుఁ గరుణింపఁగదే.

203


క.

అని దీనాననుఁడై మో, డ్చినకరములతోడఁ బ్రియముఁ జేకొమ్మనుచుం
దనుఁ బ్రార్థించుధరాసురుఁ, గనుఁగొని రాజన్యకన్యకామణి పలికెన్.

204


క.

గురుఁ డనఁగఁ దండ్రి యఘసం, హరణగుణా శిష్యురాల నైనప్పుడె కూఁ
తుర మేర దప్పి కామా, తురబుద్ధిం గోర్కి సేయుదుర నాచోటన్.

205


మ.

నరకద్వారకవాటభేది యవమానప్రాప్తిమూలంబు దుః
ఖరుజాపథ్యము పుణ్యలోకగమనఘ్నం బస్ఖలత్కీర్తి సా
గరమంథాద్రి జనాపవాదహుతభుక్కాష్ఠంబు సత్కారసం
హరణోజ్జృంభము గీడుగాదె పరభామాసంగ మెవ్వానికిన్.

206


ఆ.

నీతి సాధువృత్తి నీయది ధరణీసు, రుఁడవు వేదపారగుఁడవు ధర్మ
తరులతాపరశ్వధము చెల్లఁబో యిట్టి, నీచచిత్త మెట్లు నీకుఁ గలిగె.

207


తే.

ఏను రాజన్యకన్యక నితరజాతి, భామగా నెట్లు పొసఁగు నీపాపవృత్తి
భూసురుఁడవైన యిది నీకు బుద్ధిగాదు, బ్రాహ్మ్యహాని తపోహాని ప్రాణహాని.

208


వ.

అని యనేకప్రకారంబుల బోధించుచున్న యన్నీలవేణికి బ్రాహ్మణుం డిట్లనియె.

209


ఆ.

నీవు మాటలాడనేర్తువు గురుఁ డేల, చెప్పుకొను విరాళి శిష్యురాలిఁ
గవయరాదు ప్రాణికల్పన నేర్చిన, పలువనలువ గూతుఁ బట్టికొనఁడె.

210


క.

మరుబారిఁ బాఱి చంద్రుఁడు, గురుభామం బ్రేమఁ బిలుచుకొని వినుతబుధుల్
పరిణతముని విబుధుబుధుం, గరిగమనాగమనలీలఁ గాంచుట వినవే.

211


క.

గౌతమభార్య నహల్యన్, శాతోదరి బదరి పర్ణశాలం గాలా
తీత మొనర్చియుఁ గూడిన, యాతని కింద్రునకు నేమి యయ్యెం జెపుమా.

212

ఆ.

ఇట్టివట్టిసుద్దు లేటికి నీయంగ, సంగలాభ మైన జాలుఁ దెఱవ
వెఱవ మెఱసి మీఁదఁ బఱతెంచు నత్యు గ్ర, పాపమునకు నరకకూపమునకు.

213


చ.

కడపక నీవు నాపలుకుఁ గాదని వేదనిసర్గమార్గమం
దడిగెదవేని మేనియడియాసఁ దొఱంగి లతాంగి ప్రాణముల్
విడిచెద నీవు చూడ నలవేవడిఁ బాపములోన దీనిలో
విడిదలగాక వేకలఁచి వేచెడి దెయ్యది చూచికొ మ్మనన్.

214


శా.

ఆఘోరోక్తులు వీనులం బడిన నాహా పుట్టిరాపట్టి ని
ర్మోఘం బీయనమాట తుచ్ఛదురితంబు ల్ధర్మకర్మక్రియా
శ్లాఘ న్మాన్చుకొనంగవచ్చుఁ దుదిఁ దెళ్ళంబోనియాబ్రహ్మహ
త్యాఘం బేమిటఁ బాయు నా కొకయుపాయం బెద్ది యీచేఁతకున్.

215


క.

కులగోత్రశీలములకు, న్వెలియైనం దగు మహోగ్రవిప్రప్రాణా
నిలవిచ్యుతి కే నొప్పం, గలదాననె యింతకంటెఁ గలుషము గలదే.

216


క.

అనుచితకార్యము లేమే, నొనరించినయత్న మొప్ప నుత్తమజను లా
ర్తుని విప్రుని విధ్వస్తా, త్ముని నెప్పుడు సంతరింపుదురు మేలగుటన్.

217


ఉ.

కావున నొండుపాయములు గావు మహీసురరక్షణంబ మే
లై విలసిల్లు నేమి తెఱఁగైనను మంచిదె యంచు బుద్ధిలో
భావనఁ జేసి యచ్చెలువ పల్కె ధరాసుర రెండుజాలలో
నీవది కేగుదెంతు సరణిం జలియింపకయుండు మిత్తఱిన్.

218


వ.

అని యతండు విశ్వసించినట్టుగా నందులకుఁ గొన్నిశపథంబులం బలికి యక్కలికి
నగరి కరుగుచు నకురాహగతుం డగుగగనమణి నాలోకించి కీర్తించి కరంబు లురో
జాగ్రంబులఁ గీలించి యిట్లనియె.

219


క.

ఓలోకమిత్ర యోకరు, ణాలయ నీకులముదాన నవనీసుర దు
శ్శీలంబు మాన్చి యిట నా, యీలువు చెడకుండఁ బ్రోవవే నేఁ డనుచున్.

220


క.

చేరఁ జనుదెంచి యలసర, సీరుహహితుఁ డబల యట్ల చేయుదు చింతా
భావంబుఁ ద్రోఁచి కదలు మ, గారమునకు ననుచుఁ బఱచె గగనంబునకున్.

221


వ.

ఆసమయంబున.

222


చ.

ఇనుఁడు వసూద్ధతుం డరయ నెవ్వఁడు వానికి నీతి లేదు వీఁ
డినుఁడు వసూద్ధతుండు నయమెయ్యది తద్బిసినీదివారతిం
దనిసి ప్రదోషకాలమునఁ దానిదె వారుణి నానియున్నవాఁ
డని యలుకంబలె న్మరలె నా నడచెం దగ ఛాయ ప్రాచికిన్.

223

సీ.

ఇవి చెందిరికచీరలవుఁ గదా తిగిచి కుచ్చెలఁ బోసి కటులఁ గీల్కొలుపవచ్చు
నివి కుంకుమరసంబులవుఁ గదా గబ్బిగుబ్బల జొకటంబుగా నలఁదవచ్చు
నివి చెంగలువసెజ్జలవుఁ గదా కౌఁగిళ్లఁ బ్రియులుండ మెఱసి నిద్రింపవచ్చు
నివి చిగిర్చినమావులవు గదా కటికివేసవులనీడలఁ క్రీడ సలుపవచ్చు


తే.

నివి సరోజాతరాగంబులవు గదా బె, డంగడరుపేటికలఁ బెట్టి డాపవచ్చు
ననుచు వరుణాఐరోధకామినులు పలుక, నస్తగిరిఁ బ్రాఁకె జరఠారుణాతపములు.

224


మ.

తనచిత్తంబునఁ బద్మినిం బవలుపొంద న్వారుణీకేళికిం
జనఁ బైకొన్నప్రదోషపీడకు సహించ న్నేర్చె నింకెట్లుగా
దనువో మంగలవాఁడనందు భృగుపాతప్రీతి నేతెంచెనో
యన సేవించె సరోజబాంధవుఁడు ప్రత్యగ్భూమిభృత్కూటమున్.

225


తే.

అపరపర్వతశిఖరసింహాసనమున, గొంతదడవుండె గ్రహరాజు గ్రుంకుటుడిగి
సమయరమ మజ్జనంబాడి సాగరంబు, దండనుంచిన కుంకుమపిండ మనఁగ.

226


చ.

కరటనిషక్తఖర్జు వడఁగం జిరగర్వసమగ్రమంజన
ద్విరదము పాయుతన్మదసృతిం బొడుకెక్కినయస్తసానువం
దరదముఁ జారఁ బైనడుగు లానక యుర్వికి డిగ్గు నుద్ధత
త్వర ననఁ గ్రుంకె భానుఁ డవధాననికుంచితభానుహస్తుఁడై.

227


సీ.

పరిపక్వబింబవిభ్రాంతి దవ్వుల రాజకీరడింభములు గ్రుక్కిళ్ళు మ్రింగఁ
బ్రత్యగ్రశోణితభ్రమ నుపస్థితములై పంచాననంబుల బయలునాక
సల్లకీపల్లవచ్ఛదనశంక సగంధకరులు రిత్తకురిత్తకరము సాఁపఁ
బుంజీకృతక్రవ్యబుద్ధి నిర్ఝరవృద్ధశార్దూలములు నోళ్ళు చప్పరింప


తే.

గైరికద్రవవిచికిత్స గాన నాట, పాటలోష్ఠులు పాలిండ్లఁ బ్రామఁ దివురఁ
బ్రత్యగవనీధరంబునఁ బ్రాకుదెంచె, నపుడు దివసావసానసంధ్యామరీచి.

228


తే.

చరమదశఁ గన్న వాసరస్వామిఁ దలఁచి, తమ్ము లామోద మఱివంతఁ దలఁకుచుండ
నస్తముపగోత్ర మయ్యు రాగాప్తిఁ బొదలె, మొదలఁ బాశ్చాత్యకృత్య మట్టిదయ కాదె.

229


తే.

సద్ద్విజశ్రేణి దివసావసానవేళ, చలువఁదేరు వనప్రదేశములఁ జేరి
కన్ను లరమోడ్చి విసృష్టగతులు మీఱ, నారవవ్యాజమున జపం బాచరించె.

230


సీ.

తావులకొండనెత్తము డిగ్గి చెంగల్వదొనల చల్లనినీటఁ దొప్పదోఁగి
పరిగొన్నపచ్చకప్రపుదుమారము రేచి తరుణపల్లవపరంపరఁ దెరల్చి
వికసితప్రసవజాలకరేణువులవంటి గంధసంపద దేటిగములఁ బ్రోచి
బలిమి గాననపరంపరల నుఱ్ఱజటలూచి తీవపందిళ్ళలోఁ దిరిగి తిరిగి


తే.

యెండపొడ దూరక పగళ్లు నిర్లు గవయు, తియ్యమావుల క్రేనీడఁ దెరువుసాగ

కల్లనల్లనఁ జనుదెంచె నతనుభద్ర, వారణంబన సాయంసమీరణంబు.

231


చ.

సరసులసంగతిం గలుగుచక్కనితమ్ములఁ జేరఁబోయి క
న్నర మొగిడించి వ్రాల్చుచిగురాకుల డగ్గఱి పత్రము ల్నిశా
కరదృపదోఘముల్ గదిసి కళ్ళుపడం బరిముక్తవృంతకే
సరములఁ జెంది కందు నొకజక్కవ దారవియోగవేదనన్.

232


సీ.

నిండారుకమ్మదేనియ మజ్జనంబాడి కడిమిపుప్పొడివన్నె మడుగుఁగట్టి
రేకుగన్నుల జంచరీకాంజనముఁ జేర్చి తనువల్లి ఫేనచందనముఁ బూసి
తులలేనితూఁడుజేతుల నూర్మికలు దాల్చి జలకణమౌక్తికచ్ఛటలు పూని
మొగ్గపాలిండ్లసొంపున హిమాంబువు నుంచి యామోదసంపద నతిశయిల్లి


తే.

హంసకంబుల నిజపదం బలవరించి, భువనమోహన మైనవైభవముఁ గాంచి
కలువవిరిబోడి రాజురాకడ దలంచి, పొలిచె వాసవసజ్దికాస్ఫురణ నపుడు.

233


తే.

ఝంకృతివ్యాజమున హాళిసన్నుతాళి, యూఱడింపఁఁ దనకన్నవారిలోన
ననవధిక్లాంతిమిత్రమోహార్తి ఖిన్న, తమ్మికొమరాలు పత్రనేత్రములు మోడ్చె.

234


సీ.

కనలుసంధ్యార్చిఁ బేర్చిననభఃకరిమేన బుటములెత్తిననీరుబొబ్బ లనఁగఁ
గాలమాంత్రికుఁ డంధకారదానవబలిక్రియకు రాల్చినపేలగింజ లనఁగఁ
దాండవభ్రమిఖమూర్ధజకుఁ డంజలిపుటంబున విధిర్చినకమ్మపూవు లనఁగ
మైరవసింధుసంపర్కశర్కరదేవమును లొనర్చినలింగమూర్తు లనఁగఁ


తే.

గమలగర్భాండగోస్తనీకాయమాన, జటిపరిపక్వఫలగుళుచ్ఛము లనంగ
నఖిలజనలోచనోత్సవం బాచరించెం దామరసవైరికులదారతారకములు.

235


ఉ.

స్నేహవిరక్తిఁ గాలగతిచేఁ గని మిత్రుఁడు చామరక్రియా
మోహితుఁ డౌటఁ గన్గొని ప్రమోదవిధిం దనుఁ జేరె నీగురు
ద్రోహి శశాంకుఁ డెట్లనక దోయనిపూనిసశక్రదిగ్జగ
న్మోహినిమోమువిన్నఁదనమో యనఁ బాండిమ దోఁచె నెయ్యడన్.

236


సీ.

బలభిద్దిశావశాప్రతిమ గామినిముద్దుగులుకుటీరికనవ్వు తెలివి చెప్పి
యుదయమస్తక్రీడ నూడికోటులు మోవఁ గూలినచౌదంతికొమ్ముఁ బోలి
గగనవాహినిరొంపి గాడికొండొకదోఁచు కమలాప్తురథరథాంగంబు దొరసి
కాలకాపాలికాగ్రణికరంబున నెత్తిచూచు క్రొన్నెమలీకసురటి నొరసి


తే.

యంచు గనుపట్టి మఱియించుకంత మెఱసి, సగము పర్యాయకమున సాక్షాత్కరించి
బింబమంతయు వెలికి దీపింప నిలిచెఁ, జదలఁ బూర్ణకళాసీమ చందమామ.

237


సీ.

అది సుధాకరబింబమా కాదు మడికాసువన్నెవేలుపుటన్నవత్తి గాని
యది చంద్రమండలంబా కాదు చదలేటఁ దేలుదంతపుటరిగోలు గాని

యది నిండుచలివెలుంగా కాదు మబ్బుటేనుఁగుఁదోలు తెఱనోటిమెగము గాని
యది చకోరములవిందా కాదు దుగ్ధాబ్ధికడ జనించిన వెన్నకరుడు గాని


తే.

యది నిశామిత్రమా కాదు మదవియుక్త, యవఘరట్టశిలావలయంబు గాని
యని జను ల్చూచి కీర్తింప నతిశయిల్లెఁ, బ్రోడజాబిలికలువపూఁబోడికలిమి.

238


సీ.

ఇనకరాంకురముల కెడయీనిమ్రానిక్రీనీడజాడ డొంకి నిలిచెఁ గొన్ని
మధురసప్రస్నిగ్ధమాక్షికచ్ఛత్రభాగవులలో గవులలో నడఁగెఁ గొన్ని
కలనైన విఱు గెఱుంగనిపోటుపరికరామారుకత్తులమాటు జొచ్చెఁ గొన్ని
చేసేఁతబడి తలంచినలేదు బంతి యన్పలువకొమ్మలదాడిఁ బఱచెఁ గొన్ని


తే.

త్రాసమునఁ బొంది పద్ధతి భ్రంశనముల, రూపకుహరాంతరంబులఁ గూడెఁ గొన్ని
యిరులు తస్క ర లన నప్పు డేమి చెప్ప, రాజు బరచక్రహరణసంరంభుఁ జూచి.

239


సీ.

ప్రాయమింకినవాలుపాలిండ్లవెలయాండ్రు పడుపుపుట్టక మూలబడి కృశింప
నేపురేగినరంకుటెలదీఁగబోఁడులు వింతకౌఁగిలి లేక వెతలఁ బొందఁ
కడిపోనితెరనాటకపుటూరుజంగాలు కేళికల్ గూడ కోగిరము లెత్త
తడక ద్రోపరిమ్రుచ్చుపొదుపులు మఱి దొంగపనిచుక్కవాలైన బస్తు పొరల


తే.

గంటవేఁటల దిరుగాడుకఱకుటెఱుకు, మూక వెఱజిక్కి కాళ్ళు మోములును వావఁ
బిండి చల్లినచందానఁ బేదవారి, దివియవెన్నెల సాంద్రదీధితి వహించె.

240


సీ.

చేఁపుపుట్టినగభస్తికలు ముక్కులఁ గ్రుచ్చి క్రుచ్చి యూరటలేక క్రోలుఁ గొన్ని
యఱ్ఱులానఁగఁ ద్రావి యసుమరుచ్చరణకుఁ జోటుచాలక నేలఁ జూచుఁ గొన్ని
కడుసిగ్గుదేరుతొల్పడుపుదోమటఁ జొక్కి యానందమున జిందులాడుఁ గొన్ని
నిగరంపుమోవితేనియలతోన దొరల్చి చెలువలిచ్చిన సంతసించుఁ గొన్ని


తే.

యోలముల డాఁగి తలచూపనోడి తల్ల, డించు నరికోటిపైఁ బుక్కిలించి యుమిసి
బయలుఁ బట్టించి పేరెము ల్వారుఁ గొన్ని, కైరవాప్తాతపములఁ జకోరకములు.

241


వ.

ఆసమయంబున.

242


సీ.

కట్టినజినుగునీర్కావిధోవతి పింజయాపార్ష్ణిలంబియై యతిశయిల్ల
ధౌతోత్తరీయవస్త్రములోను శుభ్రశుభ్రంబులై బ్రహ్మసూత్రములు మెఱయఁ
గనకవీరుద్గ్రంధికలు కపోవాలావాలసీమబచ్చనిడాలు చివురువెట్ట
నామోదరసపుష్టి నచ్ఛిద్రమై సాలతలమున గోపిచందనము గ్రాల


తే.

నవటుతటఖేలనంబున నమరుబిళ్ల, సికచొకాటంబువిరులతోఁ జెలిమినేయ
నడుమ జగజంపుదోఁపుఁబచ్చడము దనర, వైదికబ్రాహ్మణుఁడు నిండువన్నె మెఱసి.

243


తే.

క్రముకభంగపరంపరాకలితమయిన, వన్నెఱికతిత్తిమేఖలావల్లి నిఱికి

యాకు లర్థించి యలబలం బడఁగు టరసి, యునికి వెలువడి బ్రాహ్మణుం డొక్కరుండు.

244


ఉ.

అప్పు డధిజ్యచాపధరుఁడై మరుఁ డేర్పడి వెంటనంటి రాఁ
జొప్పున జాలి మాలి యఘశూరుఁడు పాఱుఁడు వచ్చివచ్చి యా
యొప్పులకుప్పరామికి నయో విధియం చుదితాశ్రుధారలుం
గప్పఁగ మోము నిశ్వసనకంపితచారుతరాధరోష్ఠుఁడై.

245


క.

చెదరెడిమేనును జెక్కున, గదిసినకెంగేలు గ్రాలఁగా విప్రుఁడు లే
నిదురెఱుఁగనికంటం బడి, వదియగుమరుమంట మంటపంబున నుండెన్.

246


ఆ.

చీమ చిటుకుమన్నఁ జిమ్మెట బుఱ్ఱన్న, నెదుర మూషకములు మొదలుకొనిన
నిదుర లేక భూమినిర్జరుం డాలించు, నప్పు డబలకాలిచెప్పు డనుచు.

247


క.

రాదాయెఁ జూచితే యను, రాదా యడ్డంకిబట్టి రాదను నిర్మ
ర్యాదలు సీమంతినులను, హా దైవము ప్రొద్దుపోయె నని తలయూఁచున్.

248


క.

 ఎదురుకొన నరిగి చాయకు, గదలుతలారులకు వెఱచి క్రమ్మఱు నే
నమ్మదవతికి నేలదాదులు, పొదివికొన న్నిదురపోయెఁ బొమ్మని పలుకున్.

249


వ.

ఇట్లు మోహానలంబున దేహంబు విదాహింప నయ్యుర్వీగీర్వాణుండు చలితవియో
గిప్రాణుం డగుపంచబాణుం దలంచి.

250


మ.

ద్విజరాజుం దలదాల్చుకొన్నతనిదృగ్దృష్టిప్రభూతాగ్నులన్
రజమై పోయిననిన్ను నీతిరసదూరా మార యీకేవల
ద్విజరా జల్గిన నేమిసేయునొ ప్రశాంతిం గాంతి మత్సాయక
వ్రజముం గూర్పకు నారి నారి నను గూర్పం దేర్పఁ బుణ్యంబగున్.

251


చ.

శివ గణనాయకా యనిన శ్రీఘ్రమె కార్యము లడ్డపాటులే
కవు యదునాథపంచవిశిఖా యన హస్తపదాస్థికాండముల్
చివికెడువట్టినొప్పు లొడిసె ల్రసపొక్కులు గంట్లు బిబ్బపుం
డ్లవు నిటువంటిపుత్రుఁ దగవా కన నమ్మదుకైటభారికిన్.

252


వ.

అని పనివి పనివి యనంగబాణమూర్ఛితుండుంబోలె నమ్మందుండు నిద్రాముద్రా
లోచనుం డయ్యె నయ్యవసరంబున.

253


క.

ఆనిశ ధరణీసుతునకుఁ దా నిచ్చినమాటపట్టు దలఁచి తేదీయ
స్థానీయపాలవీక్షా, ధీనాకృతిగాక నగ రతిత్వర వెడలెన్.

254


క.

జలధరమాలికలోపలి, తొలుకార్మెఱుఁ గనఁగ యమవిధుంతుదహాలా
హలకాచమేచకద్యుతి, గలనీలాంబరము ముసుఁగుగాఁ గైకొనుచున్.

255


క.

పరివృత్తకంఠయై దిశ, లరయుచు నడ దడవడంగ నరుదెంచి ధరా
సురు నిద్రపోయెదే యని, కరసంజ్ఞం దెలుప మేలుకని వాఁ డంతన్.

256

వ.

ఆదిత్యచోదితుండై క్రోధించి.

257


శా.

అయ్యో నేఁ డిట కేఁగుదెంతువని నీ కాశించి యిచ్చోట గ
మ్మయ్యంజాలక నిద్ర గాచి యిపు డేమోకూర్కితి న్మూడుజా
లయ్యె న్నాలవజాముఁ జొచ్చె దడవాయ న్వచ్చి విచ్చేయునీ
సయ్యాటం బిఁకఁ జాలు రోసితి ననుష్ఠానార్ధినై పోయెదన్.

258


చ.

కడువడి రెండుజాము లరుగం బరిరంభణ మీఁదలంచి నీ
కడ కరుదెంతు రానిపనిగల్గిననాఁటికిఁ దండ్రిఁ గాశిలోఁ
బొడిచినక్రూరకర్మమునఁ బోవుదు నంటివి సూనృతంబు నీ
కొడుకయిపోయె రాక కిదిగో గురులింపజరాత్రిపాపముల్.

259


క.

కడుసరసములకుఁ బ్రొద్దె, క్కడిది దురంతోపగూహగతులకుఁ బ్రొద్దె
క్కడిది యొకనెలవు సేసితె, కడజామున వచ్చి చాల్చొకాఱుకుబుద్ధిన్.

260


ఆ.

కొదవలేక రతుల గోవావుఁగోడెనై, పొదలఁ బెద్దతడవు ప్రొద్దులేదు
నొరసి తెడ్డు నాఁకి యుపవాసకర్మంబు, చెఱుచుకొనఁగ దీనిచేత నేమి.

261


క.

అని చిందరేఁగిన ట్ల, చ్చెనఁటిధరాసురుఁడు చెంతఁ జేపడిననిధి
న్మునిగాలఁ దన్ని చనుగతి, ఘనజఘనం బాసి యబ్బగాఁడుగఁబోయెన్.

262


క.

చనఁ దనకు మనసువచ్చిన, పని యది గా కునికిఁ దీరఁ బట్టక చనుఁగా
కని యూరకుండె న ట్లుం, డి నరాధిపకన్య దనదుడెందములోనన్.

263


క.

సరిప్రొద్దున నరునెంచితి, నరుణోదయసమయ మెట్టు లయ్యె దురంత
స్మరమాయాంధుఁడు గావున, నరరే విప్రుండు తుర్యయామం బనియెన్.

264


క.

కామాంధోపి నపశ్యతి, నా మును నే విన్నదాననకదా వెఱఁ గే
లా మందునిమాటల కని, యాముద్దులగుమ్మ మందహాసముఁ దాల్చెన్.

265


క.

నానీరచరాగ్రణి బహు, మానున కిట్లనియె నట్లు మహిసురుఁ డన్య
స్థానస్థుఁ డయినపిమ్మట, నానెలఁతుక యేమి సేసె ననఁ గపి పలికెన్.

266


క.

మహిసురుఁ డట్లరిగిన న, మ్మహిళారత్నంబు తొడసు మాలితి నని దు
స్సహరయమున భయమున నిజ, గృహమునకుం బోవఁ దత్తరింపఁగ నంతన్.

267


చ.

ననదసమృద్ధి నీలికడవంబలె నంబర మొప్పఁ జంచలల్
మినమినలీన దోన నుఱిమె న్వడి గండులు వ్రాలె వ్రాలెఁ దొ
ల్చినుకును దూర్పుఁటీద రొలసెం బలసెం జడివానసోన జో
తనఁ బుకవిద్విషద్గళసహస్రభవాకృతిఁ బర్వెఁ జీఁకటుల్.

268


క.

ఇది రాయిరప్ప పల్లం, బిది మి ఱ్ఱిది మాకుమట్ర యిది పా మిది గా
మిది యని వివరింపఁగఁ బె, ట్టిదమై యొప్పెసఁగు నక్కటికచీఁకటిలోన్.

269

చ.

సుడివడి యింటిత్రోవ యనుచుం బెరచొప్పునఁ బోయిపోయి యా
ప్పడఁతి దృషద్వతీసరిదుపాంతదురంతవనాంతరంబులం
బడి ములుదీపలుం దవిలి భంగములై కురులుం దుకూలముం
దొడివినకంచుకం బెడలఁ దొట్టినభీతి నొడ ల్వడంకఁగాన్.

270


క.

ఈరము లూఱట నొందక, దూఱును నో రలయ నలున దూఱుచు రొంపిం
జాఱుచు నెంతేవెలవెలఁ, బాఱుచు రాజన్యకన్య పఱచి యలంతన్.

271


శా.

ఆయుగ్రాటవి వొక్కచోట భయదంబై తోఁచురక్షోవట
చ్ఛాయం బీనుఁగుఁ ద్రొక్కి కోమలకరాబ్జాతంబునం బట్టి య
య్యో యీమానవుఁ డెవ్వఁడొక్కో మృతి కేమో హేతు వంచు న్విచా
రాయత్తం బగునాత్మఁ బోఁ దెరువులే కచ్చోటఁ దా నున్నెడన్.

272


క.

ఆవటమునఁ ద్రింశద్వ, ర్షావధిగా నున్నభూసురాసురుఁడు విశా
లావరపుత్రికి హితసం, భావన సాక్షాత్కరించి పలికెం బ్రీతిన్.

273


క.

మనుజులు మిట్టాడని యీ, ఘనగహనంబున నిశీధకాలమునం జ
చ్చిననరుచక్కటి తెకేకటిఁ, దనుమధ్యా సంచరించెదవు నిశ్శంకన్.

274


తే.

ముంచుకన్నీరు మంచున మోముదమ్మి, వాడియున్నది దీర్ఘనిశ్వాసనిహతిఁ
దల్లడిల్లెడునధరోష్ఠపల్లవంబు, ఇంతవలవంత నవ్వ నీ వెవ్వ రనుచు.

275


క.

అనుమానింపక తనుభృ, త్తనువిసర నపారసప్రదానవిధాన
స్వనదుల్ముకంబు వదనం, బున ద్రిప్పుపలాశి కిందుముఖి యిట్లనియెన్.

276


క.

వినయవిశాల విశాలా, వనిపాలునిపుత్రి దైవవశమున నస్మ
జ్ఞననీజనకుల జనకుల. వినతులపొ త్తెడసి యాటవికసతి యయితిన్.

277


శా.

ఏ నిల్సేరుట యెట్టు లీపడినవాఁ డెవ్వాఁడు వర్షాతమః
పౌనఃపున్యముఁ దెల్పునల్పుచపలాప్రత్యర్థు లాలోకముల్
మేనభ్రంలిహ ముగ్రమృత్యుముఖగంభీరంబునో రెవ్వ ర
య్యా ని న్జూచిన గుండె ఝల్లురనుఁ దథ్యం బానతీవే యనన్.

278


మ.

అతఁ డత్యంతతమప్రసన్నహృదయుండై పల్కె నే నంచిత
శ్రుతిసంపన్నుఁడ బ్రహ్మరాక్షసుఁడ నిచ్చోఁ కాపురం బుండుదున్
మతి భీతిల్లకు నీకు నొజ్జ లితఁ డమ్మా నీకు నేకారి యీ
క్షితిజచ్ఛాయ మనోజబాణహతి నొచ్చె న్మాట లింకేటికిన్.

279


క.

గురుఁడ నిది శిష్యురా, లీతరుణీమణి గవయ దుష్కృతం బని మదిలో
నరసి యెఱుంగనియీదృశ, నరపశువుల మేలు పొందునా యెందైనన్.

280

క.

సూరిశ్రేష్ఠునకు వరా, చారగరిష్ఠునకు నీకు సద్విప్రా యీ
ఘోరనిశాచరవేషం, బేరూపునఁ గలిగే ననిన నెఱిఁగింతుఁ జెలీ.

281


సీ.

మొదల గౌశాంబి నుండుదు వేదశాస్త్రార్థచతురుండ నాపేరు చండశర్మ
కులకాంత శాంత యచ్చెలువతమ్ముఁడు మూలఘటకాంకుఁ డతఁ డొక్కకన్యఁ బెండ్లి
గాఁబోవుటయు గోడిగములకు నేనును బనిబూని యటు వాని ననుసరించి
యతిసభ్యునట్ల పోయితిఁ బోవ నను బెండ్లిపెద్దగాఁ దలఁచి యాబిడ్డతండ్రి


తే.

కదిసి యల్లునిగుణరూపగౌరవములు, వేఁడుటయు నావివేకంబు వీటిఁ బోవ
నవగుణంబుల ప్రోవు మూఢాత్ముఁ డంటి, ననిన నమ్మాట లతఁడు సత్యములఁ జేసి.

282


క.

కాతాళంబున నిచ్చిన, కూఁతు నతం డీక వెడలఁగొట్టిన నపుడా
చేఁతకు నాహృదయం బు, ఱ్ఱూతలఁ బ్రేంఖోళనప్రయోజన మానెన్.

283


క.

మఱఁది యని యుబుసుపోకల, నెఱుఁగక యిట్లాడి లోకు లెగ్గింపం దెం
పరినై కూడిన పెండిలిఁ, జెఱిచితి నాకన్న గష్టశీలుఁడు గలఁడే.

284


క.

ఈయుగ్రాఘం బేమిటఁ, బాయు నయో హృత్ప్రతీపపరితాపశిఖిం
గాయము వేఁగెడునని పల, చేయి కపోలమునఁ జేర్చి చింతిలుచుంటిన్.

285


చ.

అగణితధర్మకర్మరతుఁ డంచట ము న్నరుదెంచియున్నవాఁ
డగుట మదుగ్రకృత్య మపు డారసి ముద్గలనామతైర్థికుం
డగలక నన్నుఁ జూచి కుటిలాత్మ కళత్రసహోదరు న్మహా
సుగుణధురీణుఁ గాని మనుజుండని యూరక పల్కఁబోలునే.

286


ఆ.

వేయు బొంకి పెండ్లి సేయుదు రుత్తమ, జను లతిప్రయాసమునకు నోర్చి
చెనఁటిసేఁత నిట్లు మనువులఁ జెఱిచిన, విసుపువిత్తుఁ జెప్పు వినముగాని.

287


ఉ.

మోఘము గాక నీవు తల మోచి యొనర్చినయట్టియిద్దురం
తాఘము నేఁడు పిల్లికొలయై చరణంబులఁ బ్రాఁకుసజ్జన
శ్లాఘనయోగ్యభూమిసురజన్మము వీడ్కొని కానలోగ్రశా
ఖాఘనవృక్షవర్తివయి క్రాలు నిశాచరవేష మేర్పడన్.

288


ఉ.

వంకరకట్టెకింగలము వైద్యము నీ కిది వోలునంచు ని
శృంకనవృత్తి ముద్గలుఁడు శాపము నిచ్చిన శోకబాష్పధా
రాంకితనేత్రపంకజుఁడనై చరణంబుల వ్రాలి యోదయా
లంకృతచిత్త యోబుధకళానిధి యోగుణధుర్య కావవే.

289


చ.

అనుఁగుమఱంది గానఁ బరిహాసపురస్సరభాష లాడ నీ
పని జనియించె నీచరణపంకరుహంబులు సాక్షిగా మదిం

గనలు వహించి యిట్టికొఱగానిప్రయోజన మాచరింప నీ
యనుపమదివ్యదృష్టి కొకఁ డడ్డమె చూడుము నేర్పునేరముల్.

290


క.

అని యేను మేను వడఁక, న్వనితాజనతార్తిఁ బొగల వారించి ప్రబో
ధనిరీక్షణముల సర్వముఁ, గనుఁగొని యితఁ డనపరాధిగా యని శాంతిన్.

291


వ.

ముద్గలుండు న న్నాలోకించి యిట్లనియె.

292


చ.

కెలసముఁ బూని పెండ్లిపనికిం బ్రతికూలుఁడ వైతి విట్లు మొ
క్కల మిది గాదె నీమన సకల్మష మౌనటులైనఁ గేరడం
బుల కిది చోటె మోఘమయిపోవదు నావచనంబు గన్నచా
యల నిఁక బ్రహ్మరాక్షసుఁడవై యిల నీవు చరింపుచుండఁగన్.

293


ఉ.

అల్లినవరతమూలఘటకాంకుఁడు భూమినిలింపకన్యకా
హల్లకభల్లభగ్నహృదయస్థలుఁడై తను వుజ్జగించి మ
త్సిల్లున కుద్భవించుజయసేనుఁడు నా నలవిప్రకన్య యు
త్ఫుల్లసరోజనేత్ర ప్రియపుత్రికయై పొడము న్సుకీర్తికిన్.

294


ఉ.

ఆయెలనాగ దైవగతి నర్ధనిశం గతిదప్పి నీతరు
చ్ఛాయకు వచ్చు నాసరసిజచ్ఛదనేత్రకు నవ్వసుంధరా
నాయకసూతికిం దగులొనర్పుము సంశయ మేది యంతలో
బాయు మహీసురాసురత బ్రహ్మపదంబు భజింతు పిమ్మటన్.

295


మ.

అని శాపావధిఁ జెప్పి ముద్గలుఁడు పోవం బోవ నాలోన నె
ఱ్ఱనిగ్రుడ్లుం గులిశంబులం దెగడుకోఱ ల్బాడబస్ఫూర్జితా
ననముం జుంజురువెండ్రుక ల్భయదకర్ణద్వంద్వముం గల్గి మే
దినికి న్వ్రేగుగ బ్రహ్మరాక్షసుఁడ నైతిం జంచరీకాలకా.

296


వ.

అ ట్లుర్వీపూర్వగీర్వాణుఁడనై సకలప్రాణిభక్షణంబునఁ గౌక్షింభర్యంబు ప్రవర్తిల్ల
నివ్వటపి నాశ్రయించి యుండితి నిప్పటికి ముప్పదిసంవత్సరంబులు గడచె నమ్ముద్గ
లుండు చెప్పినట్లు నామరంది జయసేనుండై పుట్టె నవ్విప్రకన్యకవు నీవు ని న్నన్నర
నాథకుమారునకుం బరిణయంబు సేసి యాసురం బగు నివ్వేషం బపనయించెద
ననుటయు నలరుమొగంబున రాజన్యకన్య భూసురాసురున కిట్లనియె.

297


క.

ఇచ్చోట నానిమిత్తము, చచ్చిన యవ్విప్రు సుప్రసన్నత్వము నేఁ
డచ్చుపడ మనిచి పురికిం, బుచ్చి జగద్వినుతకీర్తిఁ బొగడొందఁగదే.

298


క.

భూసురహత్యాఘమహా, త్రాసమునకు వెఱతునని పదంబులఁ బడి గా
ఢాసక్తిం ప్రార్థించిన, నాసురకులశాత్రవుఁడు దయాభిముఖుండై.

299

ఉ.

ఆవిరితీవబోఁడికృప కద్భుతమంది భవన్నియోగ మే
లావృథయౌ ఫలింపక బలా యబలా యని విప్రుఁ గొంచు ర
క్షోవిభుఁ డేగి పీనుఁగున సుప్రదతీర్థమునం దొరల్చి సం
జీవితుఁ జేసి మందిరముఁ జేర్చి భజించి కుమారి కిట్లనున్.

300


క.

చనిపోయిన నీయెజ్జలు, మనుగడఁ గనియె న్వసించె మందిరమున నో
తనుమధ్యా మొగిడించిన, కనుఁగవతో నిలువు రాజుకడ నినుఁ జేర్తున్.

301


చ.

వలదు విలంబ మన్నఁ బ్రతివాక్యము లాడక మోడ్సుకంటితో
నిలిచిన బ్రహ్మరాక్షసుఁడు నిర్భరవేగధురాధురీణుఁడై
పొలఁతుక నప్పు డెత్తుకొనిపోయె మనోజవుఁ డౌట నిల్చఁ బా
టలనగరోపకంఠనిబిడద్రుమకాంచనసౌధవీథికన్.

302


వ.

ఆసమయంబున.

303


శా.

గొందు ల్వీడ్కొని పక్కణాంతరకుటికూటాధ్వసంధు ల్పరా
స్కందు ల్చూడ నవక్రచక్రములు ముచ్చ ట్లాడ నిచ్ఛారతిన్
గ్రిందు ల్మీఁదులుగా సతీపతులు గౌఁగిళ్ళూళ దీప్తు ల్దిశ
ల్పొందుల్ గూఢఁ ద్రిభంగిభంగి మొరసెం బుంస్కుక్కుటవ్రాతముల్.

204


చ.

అతికృతికన్య నందినమురారివిరాజదనంతభోగసం
స్థితి ప్రతివారముం బొదల శిష్యులు పుణ్యజను ల్జయక్రియో
న్నతులు దురంతశాస్త్రకలనం బ్రతివాదుల నోర్వ సర్వతో
గతమతికుండు నిల్చెఁ గవికౌశికదిక్కటకాగ్రపీఠికన్.

305


చ.

వరవసులక్ష్మి నుల్లసిలువారికి నేమిగొఱంత యీవిభా
కరునకు సంజనిచ్చి తిరుగంబడి లక్ష్మి హరింప నెట్టిదో
నెరవులసొమ్ము సత్య మగునే యని వెల్వలనయ్యె వహ్ని నాఁ
బరిగళితద్యుతి న్వెలకఁబాఱె నిశాంతనిశాంతదీపముల్.

306


చ.

కనుఁగొని చైత్యనిత్యపథికప్రవిబోధకరంబులై ఖగ
స్వనము లుదగ్రబాహ్యవనవాటికల న్విననయ్యె నయ్యెడన్
ఘనమదభృత్తమఃకరకంపితేదిగ్విటపస్ఫురన్నభో
వనరుహసంక్షరత్కుసుమవర్షముచాడ్పున జాఱెఁ జుక్కలున్.

307


సీ.

ధారాధరస్మయోదయవియచ్చిరకురబంధమునఁ దారాలతాంతములు రాలె
రోదసీతనుసమారోహాంధకారైణమదవిలేపనరేఖ మసలిపోయెఁ
జక్రవాకస్తనస్థాతృనీహారఘర్మాంబువు ప్రత్యక్షమై యడంగె
మధుపకజ్జలభాసమానకైరవలోచనముల నిద్రాముద్ర ననలుపెట్టె

తే.

మలయనిలయసుగంధసంబంధమంద, పవననిశ్వాసనీచిక ల్బారుదీరె
సంప్రభూతకళారమ్యసౌమ్యగమ్య, గంగసంగశ్రమాయామయామవతికి.

308


చ.

తగఁ గుసుమాస్త్రకేళి దిగఁదన్నినచీరలు గౌఁగిలింతలుం
బగఁగొని యడ్డగింపఁగఁ దెమల్చినహారములు న్భరంబునన్
దిగిచినసొమ్ములు న్మదవతీతిలకంబులచేత వేఁకువ
న్మగుడ సపర్యఁ గైకొనియె మాన్యులు గారె గుణప్రదీపకుల్.

309


చ.

కణసి కవుంగిలింప నవకాశము చాలక ప్రొద్దుఁజూచి లోఁ
జివికెడువారు హస్తముల జీవితినాథుల గ్రుచ్చిపట్టి వే
గవరులమోవు లాని యరగ న్నిడువారును శయ్యలం బరా
భవ మొనరింపలేక వగపాల్పడువారును నైరి జవ్వనుల్.

310


శా.

నానాదీపమరీచికల్ గొనియెనో నాఁ జూడ నిద్రాపరా
చీనస్త్రీనయనంబులం బ్రియదృఢాశ్లేషప్రకుబ్జీభవ
న్మీనాక్షీకుచము ల్దిగం కనికరామ్రేడీకృతోత్క్రాంతకాం
తానుష్ణాధరము ల్జపాసుషమ చెన్నారె న్నిశాంతంబునన్.

311


మ.

తులనప్రేమరసోల్లసన్మిథునచేతోజాతసంగ్రామకాం
క్షల వారించె నుషఃప్రసూచకగతుల్ శాలాజరద్దీపికా
కళికల్ శైత్యదృఢస్తనస్తబకముక్తాహారము ల్వాసనల్
గలయం జల్లెడుపూఁత లిష్టరుచికృత్కర్పూరతాంబూలముల్.

312


సీ.

శ్రమవార్నిమజ్జనజటిలాలకంబులు సంధూతకుంకుమస్థానకములు
జాగరారుణితలోచనసరోజంబులు కాంతచుంబనముక్తకజ్జలములు
కరచపేటనిరస్తకరినక్రచిత్రంబు లభినవదిగలంకృతాధరములు
సృణినమత్కరికాభరణభృద్గళంబు లనూననిద్రాముద్రితాననములు


తే.

గాఢపరిరంభసంభ్రమక్లామ్యదచల, గురుపయోధరభరహారకువలమణులు
కలితతాంబూలరసరక్తగల్లతలము, లమరఁ గొమరాండ్రు పొలిచి రహర్ముఖమున.

313


శా.

ఆశాఖడ్గమిళత్తమోమలినహృత్యర్థంబు నిర్వంధ్యసం
ధ్యాశిల్పిప్రభుకల్ప్యమానకురువిందక్షోదసమ్మిశ్రలా
క్షాశాణం బనఁ బ్రాచి దోఁచె బిసినీకాంతుండు జాగ్రత్పురో
దేశాంగారకరాజినాఁగ మొదలం దీండ్రించె సంధ్యా ప్రభల్.

314


సీ.

ప్రసవితద్యుక్షేత్రఘసృణసస్యంబులు హల్లకప్రియసాలపల్లవములు
తిమిరేంధనప్రవర్ధితదావశిఖ లుషఃపవనభుగ్వరభోగఫలకమణులు

హరిపురంధ్రీకుసుంభాంబరంబులు ఘనప్రాక్పరివ్రాడ్జటారక్తిమములు
దంభోళిఖండితోదయపక్షరుధిరంబు లై రావణాంగసింధూరరజము


తే.

లక్ష్మివృత్తిప్రమోదకృద్యామినీవి, యోగదవధూవ్యధాతిఖిన్నోడురమణి
నవ్యహల్లకతల్పము ల్నాఁ జెలంగె, నంబరంబున నపుడు బాలాతపములు.

315


ఉ.

ఇమ్ములఁ బశ్చిమాంబునిధి కేగునెడం దగ వారక న్మయూ
ఖమ్ముల నెన్నికుంచితముగా నొనరించినవ్రేళ్ళరక్తిలోఁ
గ్రమ్మగఁ బ్రాక్ప్రవృద్ధిరవిరశ్ములఁ బద్మిని వేగుపాటునం
గ్రమ్మఱ లెక్కఁబెట్టెలె ననఁగా వికసించె సహస్రపత్రముల్.

316


ఉ.

గాసిలి రాజు మన్ననలు గాంచిన నే నొరుఁ జూడ నంచు క
న్మూసినభంగిఁ గైరవిణి మోడ్చెఁ బతివ్రతవోలెఁ బద్మినీ
వాసరకృద్వియోగవనవహ్నిసముత్థితధూమరాజులో
నాసరసీజగర్భసదనంబులఁ బాసి నటించె భృంగముల్.

317


తే.

ఇట్లు సూర్యోదయంబైన నేకతమున, బ్రహ్మరాక్షసుఁ డద్ధరాపాలుఁ గదిసి
పూర్వవృత్తాంతమంతయుఁ బొసఁగఁ జెప్పి, యబ్జముఖిఁ జూపి పెండ్లి గమ్మనుచు నిచ్చె.

318


వ.

ఇచ్చిన.

319


క.

ఆరామామణిఁ గైకొని, యారామరుఁ డాదరార్పితాతిథ్యుండై
యారామన్యగ్రోధధ, రారుహసౌధమున బ్రహ్మరాక్షసు నునిచెన్.

320


క.

ఉనిచి ప్రణమిల్లి క్రమ్మఱి, చని యవ్విప్రాసురునకు సరసాన్ననివే
దనవిధికిఁ బుణ్యభూసుర, జనుల నియోగించె జనితసౌహార్దమునన్.

321


ఉ.

కూరిమి తండ్రిపాదములకుం బ్రణమిల్లి సుకీర్తికన్య నం
భోరుహలోచన న్భువనమోహినిఁ జూపి ధరామరు న్నిశా
చారుచరిత్ర మేరుపడ సర్వముఁ జెప్పినఁ బుత్రు మెచ్చి యు
ర్వీరమణుండు బంధుపృథివీవరులం బిలిపించి యిట్లనెన్.

322


సీ.

ఘనులార మనకు రక్తస్పర్శసంబంధి గాఁడె సుకీర్తి విఖ్యాతమూర్తి
దైవయోగమున నాతనిపుత్రిఁ గాంచనప్రతిమానగాత్రి చేపడియె మనకు
మనజయసేనకుమారున కాపూర్ణశీతాంశుముఖిఁ బెండ్లి సేయవలయు
లాలన నవ్విశాలానాథుఁ డిచటికి వచ్చినఁ జుట్టంపువరుస గాదె


తే.

యతుల నయమార్గరతుల దండాధిపతుల, ననిచి రప్పింతమా యమ్మహామహంబు
నతఁడు వీక్షించుఁగాకన్న నాప్తమిత్రు, లుచిత మిక్కార్య మొనరింప నొప్పుననిరి.

323


క.

నావిని మత్సిల్లుఁడు హే, లావీక్షితనీతితంత్రుల న్మంత్రుల సం
భావించి పరుచుటయు న, ప్పావనమతు లరిగి వినయపాటవ మమరన్.

324

సీ.

రోహిణీవిరహభీరుక్షపాకరబింబ మన ఘనగ్లానదీనాస్య మమర
నొడలునిండారి వెల్వడినశోకరసంబుతీరున వేఁడికన్నీరు దొరుగ
మెఱుఁగుటద్దపుబిళ్ళమీదికెంపులతెరక్రియ గపోలమునఁ గెంగేలు మెఱయ
నతిమరుచ్చలమానలతభంగి నిశ్వాసధారచంద్రిక మోవి దల్లడిల్లఁ


తే.

దనయ నీలోన లేదుగదా ధరిత్రి, చూపుమా యంచు ప్రార్థించుసోయగమున
దగ శిరము వంచి తనలోన దాన పలుకు, మనుజపతిఁ గాంచి ప్రణమిల్లి మంత్రివరులు.

325


క.

నతులై వినయవిచారో, న్నతులై నిలుచుటయు వదననలినములఁ దరం
గితదృష్టి చంచరీక, ప్రతతులు నటియింప ధరణిపాలుం డనియెన్.

326


క.

అరుదెంచితి రెవ్వరు మీ, రరుదారం చెప్పుఁ డనిన నలికతటాంత
స్ఫురదంజలిపుటు లై య, న్నరనాథుం జూచి దండనాథవతంసుల్.

327


మ.

క్షితినాథోత్తమ నేఁడు నీమఱఁది మత్సిల్లుండు పుత్తేర వ
చ్చితి మాలింపు తదీయభాషితము లస్తేయవ్రతబ్రాహ్మణ
క్రతుభుగ్వైరివంతసయోగమున నీగారామునెచ్చూలి యొం
డితరక్షోణికిఁ బోకచేరె మము నీ వీక్షించి పో రాఁ దగున్.

328


క.

అని దేవరతో విన్నప, మొనరింపం బంపె విక్రమోపేతపతా
కినితో సంబంధిపురం, బున కరుదెం డనిన భూవిభుఁడు సుముఖుండై.

329


వ.

అమ్మంత్రులకుఁ బసదనంబు లిచ్చి యంతఃపురంబున కరిగి యింతికి నంతయుం దెలిపి
విన్న యది ప్రొద్దుగా సభార్యుండై చతురంగబలంబులు గొలువ వచ్చి సుకీర్తి మ
ధ్యాహ్నకాలంబునకు బాటలీపురోపకంఠంబు గదిసె నప్పుడు.

330


ఉ.

ఇంకనిఠీవి బావ తనయింటికి వచ్చినఁ జంద్రసేనుఁ డ
భ్రంకషసమ్మదాభ్యుదయభాసురుఁడై యెదురేఁగుదెంచి ప
ల్యంకిక నున్నయప్పచరణాబ్జములం బడి కాంతకాంతిమ
త్పంకజరాగపూగకృతధామకవీథికిఁ దెచ్చె దెచ్చినన్.

331


ఉ.

ముందఱ నేగి యబ్భువనమోహిని వాహినిపోలె నుబ్బునం
తం దలచుట్టు కన్దొగల దట్టముగాఁ బ్రవహించునశ్రువా
రిం దులితేతరస్తనశరీరములం దిగుపారఁజేయుచున్
వందన మాచరించి విరివాతెరతో మొగ మెత్త కేడ్చినన్.

332


సీ.

కడుపులోఁ జేపెట్టి కలఁచిన ట్లగుటయు భక్తిఁ గూరిమిపట్టిఁ బట్టియెత్తి
శిర మురంబునఁ జేర్చి చెఱువు వ్రస్సినరీతి నోడి కల్గట్టి పెల్లుఱులు నశ్రు
ధారల నతితాంతదశఁ గన్నతనువల్లి దడుపుచు గద్గదధ్వానలీల
భాషణంబుల నెంతపనియయ్యె నట్లుండె విధికృతం బనుచు నుర్వీవిభుండు

తే.

గూఁతు నొండొకచందానఁ గుస్తరించి, యార్తి వారించి వలినీట యాళిపాట
పాటలాధరవదనదర్పణముఁ గడిగి, యుచితకాంచనపీఠిఁ గూర్చుండె నంత.

333


ఉ.

చిత్తము చెంగలింప జయసేనుఁడు సాఁగిలి మ్రొక్కి న న్మదో
న్మత్తవిరోధిరోధిరుచిమద్ఘనమూర్తి సుకీర్తి భక్తిమై
నెత్తి కవుంగిలించె నపు డింపెసలారఁగఁ జంద్రసేనుఁ డు
ద్యత్తరసత్యభాషణవిధానుఁడు బావకు మ్రొక్కి యిట్లనున్.

334


క.

దళితారి నీకుమారి, న్మిళితాంగవిలాస మైనమేనల్లున కీ
వలదే యిపుడని బద్ధాం, జలి యై ప్రార్థించుటయుఁ బ్రసాదోన్మఖుఁడై.

335


వ.

బ్రహ్మరాక్షసోద్యోగంబును బాంధవ్యంబునుం దలంచి సుకీర్తి వర్తమానలగ్నంబున
మిథ్యావలగ్నజయసేనులకుఁ బెండ్లిజేసెద ననియె నమ్మహోత్సవంబు వీటఁబాటిలి
ననాగతసంబంధిబాంధవంబును నాయాతశైలూషిశైలూషషంబును నాగచ్ఛదఖిలా
వనిపనికరంబును నాహూతబ్రాహ్మణజాతంబును నాబద్ధశుద్ధమాణిక్యతోరణంబును
నలంకృతవిపణిమార్గంబును నభిరచితరంగవల్లీమతల్లికంబును నారాధితనవగ్రహం
బును నఖండవాద్యమాననానాతూర్యంబును నై యమ్మహామహంబు ప్రవర్తిల్లె నా
సమయంబున.

336


ఉ.

బంగరుపీటఁ బెట్టి దడివంబిడి రాజకుమారి దానిమీఁ
దం గదియించి తూర్యనినదంబుల రోదసి ఘూర్ణిలంగ ఠీ
విం గడుపాటిపాట వరవెండ్రుకలం గొమరౌసువాసినుల్
చెంగట నక్షతంబు లిడి చేఁడియకుం దలయంటి రాదృతిన్.

337


క.

సుమతైలప్లుతి నలరా, కొమరాలికి నలరెఁ గురులు కోకనదాంత
స్సుమధూళిమగ్న మంద, భ్రమరీసమరీతి నయనపర్వము లగుచున్.

338


తే.

బుగులుకొనుతావిసిరము కప్పురముతోడ, పడుపుదివ్వనిఘుసృణద్రవంబుతోడఁ
బొందుగా మేళవించిన చందనంబు, నాఁతి కొండొకకలకంఠి నలుగుఁ బెట్టె.

339


ఉ.

అజ్జలజాక్షివస్తుసుమహన్మతిమజ్జనశాలిబాలిక
ల్మజ్జనశాలఁ జేర్చి మణిమంజులపీఠముఁ బెట్టి దువ్వి పై
గొజ్జఁగినీరుచల్లి మెఱుఁగుల్గొన విప్పి విదిర్చి యొక్కచం
చజ్జఘనాంగ పెట్టె ఘనసారయుతామలకంబు నేర్పునన్.

340


ఉ.

తోరపుజాళువాపసిఁడితొట్టుల నొట్టినపశ్చిమంబు ప
న్నీ రపరంజిబుంగలను నించి మరోహరకక్షకాంతి బం
గారువసంతమాడఁ గరకంకణఝంకృతు లుల్లసిల్ల హే
లారతి నార్చె నొక్కనవలా జలకం బలకంబుకంఠికిన్.

341

సీ.

జిలుఁగుపావడమీఁదఁ జికురధిక్కృతమిళిందాళి యొక్కతివ మాంధాళిఁ గట్టె
తడియార్చి నేరు పేర్పడ దువ్వి యొకముద్దుకలికివాల్గంటి గీల్గంటు వైచె
నిలువుటద్దముమ్రోల నిలిపి యొండొకవధూతిలకంబు తిలకంబు దిద్దె నుదుట
నెరివుట్ట నొకదిట్ట నెఱవాదితన మూఁది కనుచెలు ల్వెఱఁగంద గంధ మలఁదె


తే.

నొకశుకాలాపహారవల్లికలు వైచె, నొకవిలాసిని మణులకంచుకముఁ దొడిగె
నొకలతాతన్వి పెట్టెఁ గేయూరకంబు, లొకతటిన్నేత్ర యిడియె బాలికకు సొమ్ము.

342


క.

అక్కరిణీనిభగామిను, లక్కరణి నలంకరించి రాలో ధరణీ
భుక్కులచూడారత్నము, నక్కడ గైసేసి రాప్తు లగువా రంతన్.

343


మ.

కదియంబోయెఁ బతంగుఁ డస్తకుధరాగ్రక్షోణిసత్క్రౌంచము
ల్పోదలె న్నిర్జరమార్గపల్వలమునన్ భూరిజ్వలజ్జ్వాలలున్
మెదలెం జాగృవియాపణాగ్రముల నెమ్మెల్సేసి దీపచ్ఛట
ల్వదలెం జోళ్ళు రథాంగదంపతులు విల్వంచెన్ మరుం డత్తఱిన్.

344


సీ.

సూరెల వెలుఁగుపంజులశరీరన్యస్తభూషామణిస్ఫూర్తి ప్రోదిసేయఁ
గైవారముఖరమార్గణవిలోచనకైరవముల నాననశశి వాడుదేర్ప
విమలబంధుస్వాంతవిధుకాంతముల గటాక్షజ్యోత్స్న విరవిర గరఁగుచుండఁ
గృతదృష్టికరణసంగతవధూటీహంసికల నీరజాకరము పిలువ


తే.

గలువచెలికాఁడు పొడపుగుబ్బలివసించు, గతి నలంకృతసామజస్కంధ మెక్కెఁ
బటహనిస్సాణముఖతూర్యపటల మెసఁగ, బుధజనాశీరవము లుబ్బ భూపసుతుఁడు.

345


వ.

తార్క్ష్యారోహణుం డగునారాయణునికరణి నేనుంగు నెక్కి జయసేనుండు నర్తకీ
నర్తకగాయనీగాయనమాగధీమాగధబ్రాహ్మణీబ్రాహ్మణనాట్యగానస్తవనాశీర్వాద
విశేషంబు లానందసంధాయకంబులుగా స్థానీయమీనలోచనమరీచికావీచికాకవ
చితరాజమార్గంబున నేఁగుదెంచుచుండ.

346


ఉ.

నీరము లాడి యాడి మదినిండినసొంపుపసం గటీస్థలిం
జీరచెఱంగు వీడిపడఁ జెక్కు చుఁ దక్కినకొంగు నేలపై
జీరగఁ దన్నుఁ దామఱచి చెచ్చెరఁ జూడఁగవచ్చె నొక్కనీ
రేరుహపత్రనేత్ర యధరీకృతకంతుని రాజనందనున్.

347


చ.

కుసుమసుగంధి యోర్తు నృపకుంజరుఁ గన్గొని మోహితాత్మయై
యసురుసురన్న దాని నికటాంగన యారసి నీకు నేటి కి
ట్లుసురన నన్న నింటికడనుం డిటకుఁ బరువెత్తివచ్చును
క్కస నుసురంటిఁ బొ మ్మనుచుఁ గ్రక్కునఁబోలఁగ బొంకె నయ్యెడన్.

348

ఉ.

పొంగినకిన్కఁ దోఁచినటు పోరుచు మంచము డిగ్గనీక చ
న్నుం గబళించుపుత్రునిఁ గనుంగొని యక్కట వీఁడు నాకు బ
ల్పంగడమయ్యె నేఁ డనుచు శయ్యపయిం బొరలించి త్రోచి వ
చ్చెం గలకంఠి యోర్తు నృపసింహము నెంతయఁ జూడ వేడుకన్.

349


ఉ.

కే లగలించి పట్టి రతికిం బిఱువీఁకులు సేయువల్లభుం
జాలుఁబొకాలు నిల్నిలువు సైఁచు మొకించుక తాళు మాను మీ
వేళ నిశాననం బనుచు వీడ్వడనాడి యురోజగౌరవా
ర్తాలసమధ్య యోర్తు కదియం జనుదెంచెఁ గుమారమన్మథున్.

350


చ.

అరవిరిబాగుతమ్మరస మంటిన కన్నులు డిల్లపాటు క్రొం
జిఱుచెమట ల్సను ల్మొనపుచెక్కులు చిక్కులు గొన్నహారముల్
విరిసినకొప్పు నిశ్వసనవీచికలం దగ వేగ నోర్తురా
మఱుఁ గిక నేల యీవిధము మంచిది పొమ్మని నవ్వి రంగనల్.

351


ఉ.

మించి జయంబుఁ గైకొనునిమిత్తము నెత్తము లాడి యాడి యో
డించి పణంబు దెమ్మనుచుఁ డెక్కునఁ బట్టినప్రాణనాథువ
స్త్రాంచల మించుకేని విడనాడక నెవ్వడి నీడ్చుకొంచు శం
కించక నేగుదెంచె నొకకేసరిమధ్య గుమారుఁ జేరఁగన్.

352


ఉ.

[1]కీలు ఘటిల్లువేణిగతికిం బ్రతికూలత నొందఁ జంద్రజం
బాలిత మైనచన్నుఁగవ మధ్యముపై దయదప్ప ముత్తరు
ల్మేలిమి రాజిరాడఁగను మించులు శంపల గ్రమ్మఱింప మం
దాలసవృత్తి నొక్కజవరా లరుదెంచెఁ గుమారుఁ జూడఁగన్.

353


వ.

ఇట్లు పురస్త్రీరత్నంబులు నిజదృష్టిమసారసారంబుల నలంకరింపు నేగివచ్చి సుకీర్తి
మందిరద్వారంబున నవ్వారణావతరణం బొనరించి నారీజనార్పితనీరాజనంబు
లీక్షింపుచుఁ గక్ష్యాంతరంబులు గడచి చని ముందఱ [2]నతిముక్తాభిరామంబై
బ్రహ్మసభను పుణ్యద్రవ్యసమీచీనంబై యజనవాటంబును బల్లవకుసుమవిలసితంబై
వసంతసమయంబును బ్రసిద్ధవర్ణగౌరవంబై సంగీతంబును నాట్యకార్యంబునం

దనరి భరతంబును పర్వదూర్వహంబయి భారతంబును సర్వతోరణవిహారంబయి
జయశీలుని విబుధభవనసామ్యంబయి గ్రహమండలంబును రంభాలంకృతంబయి
స్వర్గలోకంబును విశ్రుతావితానవితానంబయి కురుక్షేత్రంబును బ్రతిష్ఠితదధిము
ఖపాత్రంబయి మధువనంబును ననుకరించువివాహమంటపంబు డాయంబోయి.

354


ఉ.

మోహనలీల నంత నొకముద్దియ గద్దియఁ దెచ్చినన్ మహో
త్సాహత భూమిపాలతనుసంభవుఁ డెక్కె ననంతరంబ దీ
నాహితనీతిసంచితగృహార్తుఁ డొసంగె సుకీర్తిభాసుర
వ్యాహృతి కుందనంపుహరిబాణమునన్ మధుపర్క మయ్యెడన్.

355


క.

దానవశాత్రవుఁగా జయ, సేనుని నారాచకూఁతు సిరిగా మది న
మ్మానవపతి దలపోసి య, థానియతిని ధారఁబోసెఁ దనయన్ సనయన్.

356


క.

లగ్నంబు గదిసె గగనవ, లగ్నం దెమ్మనిన బుధులు లలితగతి న్ము
న్మన్నలు గుచభరకించి, ద్భుగ్నలు నగుచెలులు సొంపుతోఁ జని కడకన్.

357


క.

తుద కొప్పు మెఱయ గవిసెన, గదియించినమరునివింటిగతి నతిశయిలన్
దుద కొప్పు మెఱయ నింతికి, ముదితలు చిత్రాంబరమున మునుఁగిడి వేడ్కన్.

358


క.

నడపింపఁగ మడుఁగులపై, నుడురాజనిభాస్య యడుగు లొప్పెం గడున
య్యడుగులు కూర్మము లగునఁట, మడుగులపై బొరయకేల మానఁగ నేర్చున్.

359


ఉ.

[3]మోవవశమ్ము గాని తెలిముత్తెపుసొమ్ములతోడికమ్మపూఁ
దీవలవంటిబోంట్లు కవదివ్వెలతోఁ జెలిఁ దెచ్చి రద్ధరి
త్రీవరపుత్రుఁ జేర నధరీకృతరోహిణి రోహిణిం బ్రమో
దావహజక్క నుక్కుతునియ ల్హరిణాంకునిఁ జేర్చుచాడ్పునన్.

360

ఉ.

ఆహరిణాక్షికేలు పతిహస్తమునం బతికేలు తజ్జగ
న్మోహినికేల నుల్లసిల నూతనసాత్వికకంకణాంకుర
వ్యూహముతోడ రాజతనయోత్తమహస్తమునన్ మహావరా
రోహకరంబునం దిడె గురుండు సమంత్రకకంకణాంకముల్.

361


ఉ.

అంతటఁ జిత్రభాగ్యవనికాంతరితం బరితశ్చరద్ధరా
కాంతపటానకుంఠవృతకామినిఁ గన్గొనరామి వక్త్రసం
క్రాంతవిలాసలక్ష్మిఁ గనుకైవడి గడ్డముపట్టి యెత్తి ధీ
మంతుఁడు రాజనందనుఁడు మంగళసూత్రము గట్టె నింతికిన్.

362


చ.

అపుడు వధూకరోన్నమితయై తెలిముతైపుసేసఁబ్రా ల్ధరా
ధిపసుతునౌదల న్మదవతీమణి నించె విభుండు నమ్మద
ద్విపనిభయానమౌళిఁ బొదివెం దలఁబ్రా లవి జాతికెంపుల
బ్లపరిమితప్రియాప్రియకరాంబుజశోణిమ నొప్పె నెంతయున్.

363


చ.

సరిమెటుఁ బ్రాలపుట్టికలసందున బట్టినపట్టుపుట్టముం
దెరఁ దెరలింపఁజూచె సుదతిం బతి యవ్విభుఁ జూచె నింతి య
య్యిరువురజూపులం గలసి యేసెఁ బరస్పరమర్మలక్ష్యము
ల్శరముల నిల్చి నెన్నడుమ సారసబాణుఁడు సవ్యసాచియై.

364


క.

విడువనితగు లిరువుల కి,వ్వడువున ననుకరణి నుభయవస్త్రాంచలము
ల్విడిదేరునక్షతలతో, ముడిఁబెట్టిరి పంచశరుఁడు ముడిఁ బెట్టంగన్.

365


ఉ.

అంబరదంశితాఖిలసముగ్రమణిస్ఫుటవేదికాంతరౌ
దుంబరపీఠి నుండిరి వరధూవరు లయ్యెలనాఁగ యగ్నిహో
త్రంబున వేల్చె లాజలు ధరావరసూనుఁడు సంభృతానురా
గంబున నేమి చెప్పఁ దనకౌఁగిటి కింతిమొగంబు వ్రేల్వఁగాన్.

366


క.

ఆగామిప్రణయరణో, ద్యోగం బణఁచుటకు నేఁడ దొరకనె నితఁడం
చాగురుకుచనగ నయరే, ఖాగురుఁ డడుగూఁది సన్నెకలు మెట్టించెన్.

367


సీ.

అవలోక మొనరించి రసురఘస్మరపదధ్యానసంపాదినౌత్తానపాది
నేడ్వురుఋషులతో నీక్షించి రురుకుచశ్రీజితాహార్య వసిష్ఠభార్య
గళితచేలాంచలగ్రంధులై మ్రొక్కిరి యిలువేలుపులకు బెద్దలకు భక్తి
నుర్వీసుధాశనాశీర్వాదపూతాక్షతములు మస్తకములఁ దాల్చుకొనిరి


తే.

రాజకన్యక యంతఃపురమున నుండె, బెండ్లిచవికెకు నేతెంచెఁ బెండ్లికొడుకు
విప్రులకు బంధుజనులకు విద్యవారి, కుభయనరనాథు లీప్సితం బొసఁగి రంత.

368

చ.

నిరుపమశోభనాక్షతలు నించినపళ్ళెరము ల్ధరించి సు
స్వరమునఁ బూని యెన్నఁదగువర్ణములం బఠియింపుచుం ధరా
మరుల బహూకరింప గరిమంబున మూఁడవనాఁడు వర్తిలెం
బరమసుహృన్మనోజ్ఞ మయి ప్రాఁకెనయమ్మఱునాఁటివేకువన్.

369


మ.

నరలం గూర్చినకొప్పుతోఁ బసపుమిన్న ల్దేఱునెమ్మోముతో
గరిమ న్నాగమసానిప్రోలు దిరుగం గాఱంతులై తూర్యముల్
మొరయంగాఁ గడునొప్పె నాకబలియాలోశాటికాపేటికల్
సరసాప్తిం జదివించి రాప్తులగు రాజన్యు ల్గురు ల్మీఱఁగన్.

370


చ.

అతికృతులై నృపోపకృతులై హితులై తనరారుధారిణీ
పతు లతులప్రభం బురముఁ బాసి గృహంబుల కేఁగి రంత రు
డ్వ్రతిపరిపంథి రాజసమవర్తి సుకీర్తితనూజ కిచ్చె నూ
ర్జితగుణరత్నపేటికలఁ జేటికలం బదివేల వ్రేల్మిడిన్.

371


క.

ధాటీఘాటీఘటితవ, రాటీబోటీహృదార్తరవుఁ డజ్జగతీ
తాటంకవతీపతిపట, పేటీకోటీశతంబు బిడ్డకు నిచ్చెన్.

372


శా.

సౌరభ్యాహృతివిశ్వభూజనమనస్సంతాపము ల్విస్తృతాం
భోరుడ్రాగకరంకహృద్విహరణంబు ల్సారకర్పూరక
స్తూరీసాంకవగంధసారఘుసృణస్తోమంబుతో నిచ్చె సు
భ్రూరత్నంబున కేడువారములసొమ్ము ల్రాజు దేజంబునన్.

373


ఉ.

ఆహతగంధవాహముల నద్భుతహేషణదంభదూషణ
వ్యాహృతిభర్జితద్యుమణివాహములం గతిభిన్నమానస
వ్యూహములం గులీనమహిమోజ్జ్వలవాహములం గఠోరవీ
రాహితచిత్తభల్లుఁ డగునల్లుని కిచ్చె సుకీర్తికీర్తికిన్.

374


మ.

కటకస్థాతృమతంగజప్రభుమదౌత్కంఠ్యంబు వారించి యొ
క్కటన క్షోణిపుచేతఁ బ్రాభృతముగాఁ గైకొన్నవైంధ్యద్విప
చ్ఛటలం భిన్నదిశావశాప్రియలఁ జంచజ్జంగమగ్రావధీ
ఘటనస్ఫూర్తుల నిచ్చె నల్లునకు భూకాంతుం డుదాత్తస్పృహన్.

375


క.

అరదంబులఁ గుటిలాహిత, దరదంబులఁ గేతుపవనదళితప్రావృ
ట్ఛరదంబుల భరనతది, గ్ద్విరదంబుల నిచ్చె భూమివిభుఁ డల్లునికిన్.

376


వ.

వెండియుం బేరుగలవస్తువు లిచ్చి జామాత నాదరించి తాను నుపకృతుండై సుకీర్తి
యాఁడుబిడ్డ నాలోకించి యప్పు డశ్రుమిశ్రితాక్షుండై యిట్లనియె.

377

క.

జనియించినయింటికిఁ జొ, చ్చినయింటికిఁ గ్రొత్తక్రొత్తసిరిరా సరిరా
ననబోండ్లు మేలుమే లన, మనుమీ మనుమితుల మైనమా కిం పొలయన్.

378


చ.

మలసి ఋణానుబంధమహిమన్ హృదయేశ్వరుఁ డత్త నత్తమా
మలతల గాకయుండఁ బతిమాన్తురు కాంతలు వారి కెన్నఁడున్
గలుగవు వన్నెవాసు లటుగావునఁ బుట్టినచోటు బుద్ధిలోఁ
దలఁచి తదంఘ్రిభక్తి పరతంత్రవు గమ్ము కుమారీకామణీ.

379


చ.

కృతనుతలీల యైనసతికిం బతివంటిగురుండు లేఁడు ని
శ్చిత మిది యమ్మనీషికి విశిష్టగురు ల్దలిదండ్రు లమ్మహా
మతు లుసురన్న విప్రుఁ బరిమార్చినపాపము వచ్చుఁ గాన నీ
మతముఁ దలంచి యత్తకును మామకు సేవ యొనర్పు మోర్పునన్.

380


సీ.

ఆత్తమామలచిత్త మలర వర్తిలవమ్మ ధవుని దైవంబుగఁ దలఁపవమ్మ
తోడికోడండ్రపొత్తును బాయకమ్మ మఱఁదులఁ గని మని తిరుగవమ్మ
యనుఁగుఁజుట్టములపట్టున వెట్టగాకమ్మ వఱవుళ్ళపై రక్తి వదలకమ్మ
కాఁగానిచెలుల డగ్గఱి చరింపకుమమ్మ యుత్తమస్త్రీలపొం దుడుగకమ్మ


తే.

తోడుతోనైన నందనుతోడనైన, నొంటివాటున భాషించు టుడుగవమ్మ
పనులఁ గొనకమ్మ భూసురాంగనలచేత, వ్రేలఁ జూపించుకొనక జీవింపవమ్మ.

381


ఉ.

శ్రీవరవర్ణినీదనుజశిక్షణదీక్షులయట్లు దేవియున్
దేవర బోలి నీవు భవదీయవిభుండు నఖండసౌఖ్యసం
భావితులై మహాతనుకుమారు నఖర్వసుపర్వధర్ము నా
శావినుత్తెకశక్తిధరు జంపతు లూర్జితలీలఁ గాంచుఁడీ.

382


శా.

తల్లీ ని న్నెడఁబాసి యొండొకముహూర్తంబైన సైరింప నా
యుల్లం బోర్చునె పుత్రు నీక నిను నయ్యో దైవ మిట్లిచ్చెనే
వెల్లింబోయినవంతఁ గుందవలసె న్వియ్యంబుఁ బ్రార్థించి వి
ద్యుల్లేఖానిభదేహ ని న్బిలువఁబుత్తున్ శీఘ్రకాలంబునన్.

383


వ.

అని సుకీర్తి యార్తిం దలవంచుకొనియె నంతఁ దదీయసతి కాంతిమతి పుత్రిం గవుం
గిలించుకొనుచుఁ గన్నీరు కరతలంబునం దుడిచి డగ్గుత్తికఁ బెట్టి యెట్టకేలకు ధైర్యంబు
చిక్కంబట్టి యిట్లనియె.

384


క.

నాయనుజుఁడు మత్సిల్లుం, డీయిలు నాయిలు సుసేనుఁ డీజయసేనుం
డోయబలా నీపెనిమిటి, పాయసమున నేయిదొరుఁగుబా గేర్పడియెన్.

385


చ.

ఇరువురమేను లారయఁగ నెక్కడ నుండిన నేమి యిక్కడం
దరలదు గాదె మాయసువితానము నిన్నదె వర్తమానవ

త్సరమునఁ బిల్వబంచెద విశాలకు నెమ్మదినుండు పోయి క్ర
మ్మఱియెద నంచుఁ బుత్రిఁ దగుమాటలఁ దేర్చి సగౌరవంబునన్.

386


వ.

వివిధాభరణంబులు చిత్రవస్త్రంబులు పరిమళప్రముఖంబు లగు సర్వవస్తువు లిచ్చి
బంధుజనులనియోగంబు నడపి చతురంతయానాధిరూఢ యగుచుఁ జతురంగసే
నాపరివృతుం డగుసుకీర్తుతోన మరలి పురంబున కరిగి సుఖం బుండె.

387


ఉ.

ఆజయసేనుఁ డంతఁ బరమాదరణంబున బ్రహ్మరాక్షసుం
బూజలఁ దన్పి కేల్మొగిచి పొండిఁక మీరన నుత్సహించి గో
త్రాజరదైత్యుఁ డానరవరాత్మజు మన్నన సేసిపోయె నం
భోజభవాలయంబునకుఁ బుష్పక మెక్కి సుర ల్భజింపఁగన్.

388


వ.

ఆరాత్రి మజ్జనభోజనాదికార్యంబు లాచరించి.

389


సీ.

చంద్రికపూవన్నెజిలుఁగుదువ్వలువమేల్కట్టు దంతపుఁగోళ్ళపట్టెమంచ
మొఱుగుబిల్లలు పట్టుపఱుపు కప్రపుఁబల్కుసురటి క్రొవ్విరులు కస్తూరిరాయి
పూపుగట్టినగందపొడికదంబముపెట్టె కలపంబుచికిలిబాగాలబరణి
పండుటాకులు నానవాల్పానకములును గండచక్కెర తెల్లపిండివంట


తే.

సంజసరిపట్టుబకదారిజాతిపారు, నములు గుజరాతికెంపుదీపములు బూతు
చిత్రపటములు కుడినీరుచెంబు గలిగి, తనరుసదనంబు రాజనందనుఁడు సొచ్చె.

390


సీ.

 మంచికప్రము మేళవించినపన్నీట సరసాళిజనము మజ్జనముఁ జేసి
జిలుగుమాంధాళి కుచ్చెలఁబోసి కట్టి దేహమునఁ గుంకుమరసం బప్పళించి
చికిలిపైఠాణికంచుకము గీలించి చొక్కము లైనమణులహారములు వైచి
సొగసుగా నుదుటఁ గస్తూరిరేఖ యమర్చి కళుకులు ముద్దుచెక్కుల ఘటించి


తే.

గోరజవ్వాదిపదనిచ్చి గూడదువ్వి, కుసుమగర్భంబుగా జాఱుకొప్పుఁబెట్టి
చవులచేర్చుక్క సీమంతసరణిఁ గూర్చి, కన్య నిష్టాన్నసంతుష్టఁగా నొనర్చి.

391


ఉ.

కూరిమి బుజ్జగించి యనుఁగుంజెలువ ల్దనుఁదేర సమ్మదాం
కూరమహావిలంబమునకుం బనిలే దనఁ బోకుపోకుమం
చూఱటలేక సిగ్గుతరువుండగ ముందఱఁబోయి పిమ్మటం
గ్రూరవిసాణమేషమయి కొమ్మ చనుం జనలేక క్రమ్మఱున్.

392


ఆ.

వనిత నిలిచి నిలిచి వచ్చుచు మంజీర, మండనములు మాని మాని మొరయ
లజ్జ విడువరాదు లావణ్యవతులకుఁ, బ్రాణనాథుతగులుఁ బాయరాదు.

393


వ.

ఇట్లు కేళిమందిరంబు చేరందెచ్చి.

394


ఆ.

చెలులు బలిమిఁజేసి పిలిచినఁ దల్పంబు, చేరరాక సిగ్గు చేర్లుకొనఁగఁ
గ్రొమ్ముడియును మోము కొండొకచూపట్టఁ, దలుపు దండగొనుదు నిలిచియుండె.

395

క.

రతిబోటులంత మంద, స్మితచంద్రికవదన పర్వశీతద్యుతులం
దతులగతి మెఱయఁ దేజో, న్వితునకు నృపసూతి కిట్లనిరి నే ర్పొలయన్.

396


క.

ఈపాపపూఁప వయసుది, నీపాదములాన మెత్తనిది పేర్కొనరా
దేపనిపాటలనేనియుఁ, గాపాడుదుగాని గాసిఁ గావింపకుమీ.

397


తే.

ఎంతతమకంబు గలిగిన నిగురుబోండ్లు, చేరనొల్లరు మగవారు చీరుదనుక
నది యథార్థీకరించి నీయలరుబోడిఁ, గదిసి పిలుతువుగాని కొంకెదవుసుమ్మి.

398


క.

అని నగుచు మగువలందఱు, పనినెపమున నొక్కరొకరె పఱచిన లజ్జా
వనతాస్య యగుచు నంగన, మనమున నునుసిగ్గుదేరి మారాకెత్తన్.

399


ఉ.

ఉవ్విళులూఱుచు న్వికసితోత్పలలోచన చూచు వల్లభున్
దవ్వులజూచుభర్త దను నర్మిలిని జూచినఁ జూడ దంతలో
బువ్విలు వంచిఁ బాణ మరి బోసి రయంబున డాపి శింజినిం
జివ్వునఁ బాసి యేసె వలచిత్తజుఁ డిద్దఱ సవ్యసాచియై.

400


క.

అత్తఱి రాజకుమారుం, డెత్తినతమకమున ననునయోక్తుల సరసా
యత్తవిచేష్టలఁ గన్నియ, చిత్తము గరఁగించి సజ్జజేరఁగఁ దెచ్చెన్.

401


సీ.

మగువ నీకంకణమణుల నర్ఘ్యము లని పరికించునెపమునఁ గరముఁ బట్టె
నెత్తమ్మితావు లీనెడునీమొగం బని మూర్కొనువిధమున ముద్దుఁ బెట్టె
లేమ నీకంఠమాలిక దొడ్డసొ మ్మని తడవులాగున ఘనస్తనము లంటె
బిఱుచుట్టుబిగువున విఱుగదేనడు మని సడలించుగతి జీరముడి వదల్చె


తే.

నాఁతి నీఱొమ్ము నాఱొమ్మునకు సమాన, మయ్యెడినో కాదొ యౌఁ గాము లరయవలయు
నని మహాకైతవంబున నధిపపుత్రుఁ, డంబుజాననపరిరంభ మాచరించె.

402


ఉ.

వేడుక లంకురింపఁ బృథివీవరుగౌఁగిలి మందు సోఁకి సి
గ్గూడనిబాడిన న్నగుఁ బ్రియుండు హసించినఁ బిల్వ మాఱుమా
టాడుమొగంబునం దెలివి యచ్చుపడం దఱితోడ నిమ్మనన్
వీడియ మిచ్చుఁ గన్నులకు విందగుచుం గలకంఠి వేమఱున్.

403


ఉ.

జీనువముక్కుతోడఁ బ్రతిసేయఁగ వచ్చిన గోరఁదీరుగా
నీనియ లొల్చి చుట్టి తనకిచ్చిననాగరఖండ ముర్వరా
జానిసగంబు వోఁ గొఱికి చానరదంబుల కందియియ్య నా
లో నవి నొప్పె వజ్రములలోఁ దళుకొత్తెడుకుందనం బనన్.

404


ఉ.

చాతురిమీఱ మస్తకము సందిట బిగ్గరఁ గ్రుచ్చిపట్టి యా
నాఁతిసుధాధరంబు రదనంబున నొక్కినఁ దాళలేక ధీ

రాతిశయత్వ మేది బొమలార్చుచు క న్నరమూసి వల్లభుం
జేతులఁ ద్రోచి రాజముఖి సీత్కరణం బొనరించెఁ బల్మఱున్.

405


ఉ.

అంగజసాంపరాయము సమాప్తి వహించిన నిర్భరత్రపా
లింగితచి్తతయై యబల లేచి కటిన్మృదులాంబరాచలం
బుం గదియించి హేమమణిపుత్రిక చాబున కేగుచోఁ బున
స్సంగమవాంఛ పుట్టె నృపజన్మున కిష్టవిలోకనాయతిన్.

406


వ.

ఇ ట్లిచ్ఛానురూపవిలాసంబులం బొదలి సుఖించి రద్దంపతులు మఱియును.

407


సీ.

సురభిపుష్పామోదఁ జొక్కించె నారామసీమ నారాజన్యచిత్తజుండు
కలహంసగమనఁ దెప్పల దేల్చెఁ గాసారతటముల నానృపోత్తమసుతుండు
కంఠీరవపలగ్నఁ గరఁగించెఁ గృతకాద్రిగుహల నద్ధాత్రీశకుంజరుండు
కలకంఠి కనురాగ మొయించెఁ జివురుఁజప్పరముల నవ్వైరిభంజనుండు


తే.

గారుడాశ్మచ్ఛటాచ్ఛన్నకనకసౌధ, పాళికల నావితీర్ణవిభ్రాజితుండు
రతులఁ బొలయించె నాశరద్రాజవదన, నతిశయప్రీతిలతిక మాఱాకులిడఁగ.

408


క.

మహిళారత్నంబును న, మ్మహిరమణసుతుండు భోగమహనీయకళా
వహలీల నుండి రని యల, బహుమానుఁడు క్రకచుఁ జూచి పలికె న్మఱియున్.

409


క.

దొరికినవిశ్వధరిత్రీ, వరకన్యక విడిచె వెఱ్ఱివాఁడై యడవిన్
మరణమయి మనినమందుఁడు, పురుడింకఁగ నీకు దోడుఁ బోవఁడె క్రకచా.

410


ఆ.

తనకుఁ దెవులు మూఁడె నని భార్య సెప్పిన, నీవు దానిమాట నిజము సేసి
నెయ్యుఁ డనక నన్ను నిర్జింపఁజూచితి, చెడుఁగ నిన్ను విశ్వసింప నగునె.

411


క.

వెడమాయలపుట్టి ల్లగు, చెడుగుం గళ్ళాలు పాపశేషంబునఁ జే
పడినకతంబునఁ గాఁపుం, గొడు కొక్కఁడు రాజబాధ గుందఁడె తొల్తన్.

412


క.

నావిని జలచరరమణుం, డావానరవిభుని కనియె నదియెట్లు ధరా
దేవస్తుత యాకథఁ జెపు, మా వినియెద ననిన నతని కతఁ డిట్లనియెన్.

413


సీ.

ఆరసాతలగభీరాపారజలఖేయ మానాకరమ్యసాలాభిరామ
మాచంద్రమండలవ్యాయామమణిసౌధ మాబ్రహ్మశుద్ధవిప్రాన్వవాయ
మాప్రాణపవనశౌర్యరూఢనక్షత్ర మాఫలోద్యమసముద్యమకిరాట
మాదార్ఢ్యధర్మకార్యారంభచరణజం బాచక్రవాళశైలాశుతురగ


తే.

మాంబరప్రాంశుదానధారాఢ్యనాగ, మాధ్రువస్థానపథశతాంగాతిశయము
బ్రహ్మకైనకు బ్రస్తుతింపఁగఁదరంబె, భూపదురునూపురంబు కాంచీపురంబు.

414


క.

అలకాంచితమయి తనరిన, యలకాంచివిహారభద్రుఁ డనుపేర మహా

హలికుఁ డొకఁ డుండు నలుది, క్కులబారుం గలిమిచట్టుకొడు కితఁ డనఁగన్.

415


సీ.

అలగుంపులు గొఱియలదొడ్లు లేఁబూరియెనుములమునిమంద లెడ్లకదుపు
లులుగరంబులు వాఱుపొలమువాకిటఁ బదికట్టుబండ్లింటికిఁ జుట్టుమగులు
తలుపుదూలము కొట్టములు సోగరాగాడిమచ్చు ముంగిట రెండు రచ్చమాకు
లీనుగోడిగెవేగురింటిబిడ్డలు మాళ్లతార్పులు నూటపాఁతఱలఁ గొలుచు


తే.

కలుపుకలిలేరుదండయుఁ గమ్మతీగ, పాగడము పూసెనె నానెట్టె బవిరపడిగె
చుక్కబొట్టును జిటిపాటిసొమ్ము గలిగి, కాపురము సేయు నవ్వీటఁ గాఁపుకొడుకు.

416


క.

వానికి నిచ్ఛావతి యనఁ, గా నొకయిల్లాలు గలదు కమనీయవయో
నూనవనంబున నది జా, రానందలతాలవాలయై వర్తిల్లున్.

417


వ.

అది యొక్కనాఁడు.

418


చ.

తలఁ బెనుగుండఁ దాల్చి వితతస్తనభారమున న్వలగ్న మా
కులత వహింపఁ గాఁప వలిగుబ్బెత పట్టపగ ల్జలాశ ని
ల్వెలువడి మన్మథాస్త్రపటలీనిశితాక్షకటాక్షమాలికల్
గెలఁకులఁ బర్వ వేగవతికిం జని తత్తటినీతటంబునన్.

419


ఉ.

కోమలధూళిధూసరితకుంతలు నాతపరక్తరక్తదృ
క్తామరసుంగటీరపరిధాననిబద్ధకరాసిఁ బాదర
క్షామిళదంఘ్రిమద్విముఖసంస్తరణేతరచిత్తు గాఢచిం
తామయు శూగ్రు నధ్వజనితశ్రమపీడితుఁ గాంచె నొక్కనిన్.

420


క.

కాంచి దృగంచలశోభా, చంచచ్చంద్రాతపమున కాంతశ్రముఁ గా
వించి యలవిందునకు మదిఁ, గొంచించక హలికలికుచకుచ యిట్లనియెన్.

421


మ.

నిలువం జోటులు లేవె నీకుఁ జెపుమా నీరాటి కీ వేల హ
తెలిసెం బాంథగతాగతైతదిభపృథ్వీధృత్పురస్త్రీకళా
కలితాస్యద్విజరాజబింబకృతసాక్షాత్కారసంభావనా
కలనన్ దూరపథప్రయాణజనితగ్లానిం ద్యజింపం జుమీ.

422


క.

కలదుగదా యని మోవిన్, బలుమించులు సందడింపఁ బలికినఁ జింతా
కులహృదయుఁ డగుట వాఁ డ, చ్చెలిమాటలు వినక సరకుసేయకయుండెన్.

423


వ.

అ ట్లదత్తప్రతివచనుండై యుండ నమ్మిండత వెండియుఁ దెరువరి నీక్షించి.

424


శా.

అంపంజాలము చింత నీమనసు చీకాకౌట నామాట లా
లింపంగూడదు నేఁడు క్రొమ్మెఱుఁగుదూలె న్మేను వీక్షించినన్
సొం పొక్కింతయు గానరా దెఱుఁగవచ్చుం జెల్లఁబో చుట్టమా
కొంపం బో రుదయించి రావుగద నాకుం జెప్పుమా నీకథల్.

425

క.

అని సరిదాఁకం బలికిన, విని కొండొకమనసు పల్లవించిన దానిం
గనుఁగొని యతఁ డనుచా, డ్పునఁ దెలిసితి వింటఁబోరు పుట్టుట తరుణీ.

426


ఉ.

నేర మొకింతలేమియును నిర్దయ యైనను గన్నతల్లి దు
ష్క్రూరత కోర్చి రాయుఁ దనకోడలి రేలు పగళ్లు కంట న
గ్గోరము జూడలేక మదిఁ గుందుచు ని ల్దిగనాడి పోయితిన్
వారణలేక రాజుఁ గొలువం జిరకాలము దండుఁజేసితిన్.

427


ఉ.

నా కవనీశుఁ డిచ్చె నదనం గదనంబున నస్మదీయబా
హాకరవాలధారభయదారులు గూలినఁ జూచి మెచ్చి కో
రాకృతకృత్యయంచు సవరాలు వరాలు సరాలు రూకలుం
గోకులు మానికంపుఁదళుకుల్ మృగనాభిజవాదికప్రముల్.

428


ఉ.

ఆకమనీయవస్తుతతు లన్నియుఁ దెచ్చి నమస్కరించి యు
త్సేకరసం బెలర్పఁ దనచేతికి నిచ్చిన వాని నన్నియున్
గైకొని జల్లి బాష్పకలికాతరళీకృతలోచనాంతయై
కాకుతనంబు సేసె గొడుకా యిఁక నేమన నేర్తుఁ గోడలిన్.

429


ఉ.

తిట్టినఁ దిట్టు బెట్టుఁ జిఱిదిండికిఁ గొల్చిన కొల్చు సాగ ది
చ్చిట్టక మన్న మూతులకుఁ జేతులు సాఁచు నొకప్పుడేని యి
ల్పట్టదు సంతకూటములఁ బాయదు చేయదు చెప్పినట్టు నీ
ఱట్టడిజంత యిల్సెఱిచె రాతనయా యనయానుషంగతిన్.

430


క.

కావరమున వెండియు నది, గావించినపనులు పెక్కు గల వవి నా కే
లా వినుపింపఁగఁ బిమ్మట, నీవె యెఱింగెదవు డాఁగునే యపకీర్తుల్.

431


క.

నీవఁట యదియఁట వలసిన, త్రోవం జనుఁ డింక మమ్ము దూరఁగఁబనిలే
దీవఱదను కారోఁతల, దేవళ్లంబడితి విసివితం గోడలిచేన్.

432


చ.

కొలపగ గాక యత్తకును గోడలికిం బరికింప నెయ్యముల్
గలవె పలానిమచ్చరముఁ గైకొని యీ ముదిముండ చెప్పెడున్
బలుమఱు నండ్రు దానిగుణభంగు లెఱుంగనివారు సర్వమున్
దెలిసెడుఁ గాదె చేయగలితే మఱి దాఁగునె పుణ్యపాపముల్.

433


క.

పూవకపూచెం గడపట, కావకయు న్గాచె ననుచుఁ గడగన్నులఁ గెం
పావాహిలఁ దల్లి సెప్పిన, యావాక్యము లనృతమయములని యవ్వేళన్.

434


తే.

తల్లి పలుకులు గాదనఁ దాల్మి లేక, యుత్తమాంగనఁ గులకాంత నొండుననక
బ్రతుకుభాగ్యము విడిచి నిర్భరవిరక్తి, నరుగుదెంచితి ననిన నయ్యంబుజాక్షి.

435

ఉ.

ఆతనిఁ జూచి యిట్లనియె నట్టిద తప్పదు నాఁతి నీతితో
జాతి దలంచి సిగ్గులకుఁ జచ్చుచునుండిన నుండెగాక కా
మాతురతాతిరేకమున నాఱడిపోకలఁ బోవఁజూచినన్
వేతరవుండి పట్టుకొన నీరజగర్భునకైన శక్యమే.

436


క.

కులసతి యుత్తమురాలని, తెలిసియు నీతల్లి మనసు దెలిసియు దగదీ
యలుక మఱివెఱ్ఱి దెలిసెన్, దల ఱోకలి చుట్టు మనువిధం బిదిగాదే.

437


క.

నావిని యతఁ డిట్లనుఁ జెడు, త్రోవలఁ బోకుండ మదవతుల నెప్పటికిన్
గానఁగరాదా పతులకు, నీ వనియెదొ యెల్లవా రనిరొ యిబ్భంగిన్.

438


క.

మిన్నులపైఁ బోవదుగద, యిన్నేలనెకద మృగాక్షి యిటు లెవ్వరికిన్
గన్నూఁదకున్నె చెపు మన, నన్నెలతుక నవ్వి వాని కపు డిట్లనియెన్.

439


క.

పరసతి నని చని యనుఁగుం, బురుషునితోఁ గూడి నిలయమున వాఁ డొసఁగన్
సురతసుఖశుల్కమును గొని, యిరవందగ నీకు విత్త మిత్తుం బుత్తున్.

440


క.

ననుఁ జూడఁగలవె తొల్లిటి, ఘనజఘనలకైతవంబు కతలుం గితలున్
వినిపింప నేటి కన్నియుఁ గనుఁగొనియెదుగాక నేఁ డఖండప్రీతిన్.

441


ఉ.

ఇచ్చట నుండ నేల తొలియిర్లుపడం బసిబిడ్డతల్లితో
వచ్చితి నేఁ బ్రవాసి నిలువవ్వలెఁ బ్రొ ద్దుదయించుదాఁకనం
చచ్చుపడంగఁ బల్కు తమయాతనితోఁ దలసాల నిల్చి యో
ముచ్చటకాపయేనయట ముందటికార్యము లాచరించెదన్.

442


క.

అని వేగవతీజలములఁ, గొని యామణిమంతుఁ దోడుకొని మృదుగతులన్
జనియె నొరు లెఱుఁగకుండం, దనయిలు రెడిసాని యపు డతని కెఱిఁగించెన్.

443


ఉ.

అంతట వేఁడివేలు పపరాద్రిం దిరోహితుఁ డయ్యె వాసరాం
తాంతరుచు ల్సెలంగెఁ గలయం దొలిచీకటి పర్వె సీరిసీ
మంతినిమాటమీఁద మణిమంతుఁడు చీరముసుం గొనర్చి యొ
క్కింతభయంబులేక వడి నేగెఁ గృషీవలునిల్లు చేరఁగన్.

444


వ.

ఏగి యఖండోత్కలికుం డగుహలికున కిట్లనియె.

445


ఉ.

నాపడుబాటు కే వగవ నా కనుకూలగతిం జరించు నీ
పాపనితల్లి కీవికచపంకజలోచనకై దురంతసం
తాపముఁ బొందెదం దగినతా విది గావున వచ్చినాఁడ నేఁ
డీపసిగాడిదండ వసియించి ప్రభాతమునందుఁ బోయెదన్.

446


క.

ఉండుదునా యన నాయన, మండుచు నిట్లనియె మంచిమాటే యిది మా

యిండులు విడుదులె పురి గుడి, గుండంబులు లేవె పండుకొను మచ్చోటన్.

447


క.

పొసఁగ దీని ముక్కు దుస్సిన, పసరముగతి రేఁగి రెడ్డి పలికిన నాలోఁ
బసిబిడ్డ నెత్తుకొని సం, తసమున రెడిసాని వచ్చి తనపతి కనియెన్.

448


ఉ.

చెప్పు మదేమి యేల రొదసేసెదు వాకిట వార లెవ్వ రం
చప్పలుగాకి తా నెఱుఁగన ట్లడుగం బ్రియఁ జూచి వాఁ డనున్
గప్పినమబ్బులో నితఁ డొకం డిదె వాకిట నిల్చి చోటుకై
ఱొప్పెడు నెన్నఁడేనియు నెఱుంగుదునో ననుఁ దా నెఱుంగునో.

449


ఉ.

ఆలఁట చంటిపాఁపడఁట యంగడిలేదె పచారముల్ గృహం
బేల ప్రవాసి గాఁడె తన కెక్కడనైనఁ బరుండరాదె యీ
నేలయెగాని నిల్వఁ బెఱనేల మనోజ్ఞము గాదె యంకచం
డాలము గాదె యిట్లునికి నా నది రెడ్డినిఁ జూచి యిట్లనున్.

450


ఉ.

ఆలఁట చంటిపాపడఁట యాయన యెంతటివాఁడొ యేరికిన్
జాలిది గాదె యిల్వెడలఁజాలనివారు బయళ్ళనుందురే
వేలుపులైనఁ దక్కొరుల వేఁడరె యక్కఱపాటునం జలం
బేల పరుండనిమ్ము మన కిప్పని పుణ్యము గాదె వల్లభా.

451


క.

పసిబిడ్డతల్లితోఁ గ, క్కస మొండొకదెసకు నరుగఁగా నితనికి ని
వ్వసుధఁ దలఁ గట్టుకొనియెదె, కసరకు నేఁ డెల్ల నుండుఁ గా కిచ్చోటన్.

452


క.

చాలుఁ బిసాళింపకు మని, యాలరి రెడిసాని మగని నదలించి సుతుం
డాలును నీవును నిచ్చోఁ, దాలిమి వసియింపు మని యతని లాలించెన్.

453


వ.

ఇ ట్లుపలాలితుండై మణిమంతుం డయ్యింటిపసులకొట్టంబున నుండె నంత.

454


సీ.

కలదండి పసిఁ బిండి కాఁచి చేమిరిఁ బెట్టి యొఱగకుండఁగఁబట్టి యుట్టి నొట్టి
కోళ్ళసంకటితోడఁ గూడునీ ళ్ళిడి జాగు నెరపక బంటుబానిసలఁ బనిచి
తనివెచ్చకలినీటఁ దా నమర్చి యెనుంగునిసువు జోవలఁ బాడి నిద్రఁబుచ్చి
యోతువు గొనిపోవకుండఁ గూయిడ దెచ్చి కోడితండంబులఁ గూండ్లగమ్మి


తే.

దాలిఁ గాఁగిన నీరాడి నీలికమ్మి, మడుఁగుఁ బైఁ గప్పుకొని కాళ్ళు ముడిచిపట్టి
మంచమునఁ గూలి నిదురించుమగని లేపి, కూరయును వెన్నఁ బడవైచి కూ డొసంగి.

455


తే.

సన్నజూఁదపునేఁతమంచంబుమీఁద, దుద్దుగంబడిఁ బఱచి నిద్దురకుఁ దూలు
మగనిఁ గూర్కకు మనుచు నమ్మాయలాఁడి, వెడద గంగాళమునఁ గూడు గుడిచి లేచి.

456


క.

గుడుసుంబోఁకలు బ్రద్ద, ల్పడ ఱోఁకటఁ గుమ్మి తెచ్చి పతి కిడి సున్నం
బిడక యొకకొన్ని సున్నం, బిడి యొండొకకొన్ని మడుపు లిచ్చుచుఁ బలికెన్.

457

క.

మగవాఁ డనఁగాఁ దుమ్మెద, పొగరుంబ్రాయమునఁ గన్నపూవులనెల్లన్
దగిలి రమియించుఁ గలదే, మగవానికి నెందు సరిసమానము జగతిన్.

458


ఉ.

వారణలేక హస్తిగిరివల్లభుసేవకు వచ్చిపోవుచి
న్నారిమిటారు లీపురమునం గల రచ్చివురాకుబోండ్లతోఁ
దారసమైనతీరుగలదాని నొకానొకబోటి నెన్నఁడై
నా రతిఁ దేల్పవే కడువినం బ్రియమయ్యెడు నాకు నింతయున్.

459


చ.

పలుచనిమేను నిబ్బరపుఁబ్రాయమువాఁడపు కంచి కెప్పుడుం
గలిగినరెడ్డివిం గొనఁగఁ గర్తవు కాఁపుర మెచ్చునిన్ను నే
వెలయెలనాగ పిల్వ దది వేడుకఁబోలిన నీకుఁ జిత్త మే
పొలఁతుకమీఁద నుండు నిది బొంకక నా కెఱుఁగంగఁ జెప్పుమా.

460


క.

తడవులనుండియు నిది ని, న్నడిగెద నని యుందు మఱతు ననుటయుఁ గాఁపుం
గొడుకు విడియంపుసొంపుం, జడుపుం బెనఁగొనఁగ నప్పిసాళికి ననియెన్.

461


ఉ.

ధీరత మంచిదానిపగిదిన్ మృదురీతుల వేఁడిమాట లే
తీరుననైనఁ బీల్చుకొని తిట్టుదుఁ గొట్టుదు నంచుఁ జూచెదే
యూరకయున్న జాల్వెఱతు నుండు నెఱుంగుదు నిన్నుఁ బోల ది
క్కేరడ మిట్టిగోల కెఱిఁగింపక యెవ్వరితోడఁ జెప్పుదున్.

462


క.

నావిని వెండియు నలయి, చ్ఛావతి పతిఁ జూచి పలికె సరసత నేనై
కావలెనని వేఁడుదునఁట, నావలనం గనలుపుట్టునా యింతైనన్.

463


క.

వేడుక పుట్టెడు విన నా, తోడుసుమీ చెప్పకున్న దోషము లేదే
చేఁడియఁ బోయితి వనఁ జలి, వీడి కృషీవలుఁడు నవ్వి వెలఁదికి ననియెన్.

464


ఉ.

ఒట్టవు సత్య మే నెఱుఁగ నొండొకబోగముదానిఁ గాంచికా
పట్టణమందుఁ గూడి గడపై మనవాకట నాడి పద్యముం
గట్టినవీటింజ గుఱిగాఁ దిరుగాడ నెఱుంగవేమొ నా
చుట్టఱికంబునం బ్రియమును మ్మిఁక మాటలు వేయు నేటికిన్.

465


ఉ.

నావిని గోరగింప నయనంబులు విస్ఫురితాధరోష్ఠయై
యావెడమాయలాఁడి యను నాతని కోరి మెఱుంగుబోఁడు లే
కైవడినైన వేఁడుదురు గాదె మెఱుంగు లెఱుంగఁగోరువా
రై వినరానిమాట లకటా మగవానికిఁ జెప్పవచ్చునే.

466


క.

దాపురము లేక యీక్రియ, గాపురములు సేయుచున్నగరితలతో నీ
తీపురములు వాగ్రుత్తురె, క్యాపుల నినువంటివారిం గానవె తులువా.

467

క.

అని కెలసి పులుకుపులుకునఁ, దనుజూడం జూడఁబట్టి తన్నెం గొట్టెన్
దనివిసనఁ దిట్టె ననలుం, గొనలుగ రొద మగని దెగనికొండాటమునన్.

468


ఉ.

కావర మెత్తి యిట్లు తనుఁ గాఱియఁబెట్టుచునున్నదాని ని
చ్ఛావతిఁ జూచి లేచి రభసంబున రెడ్డన పల్కె నోసి నీ
చేవ యెఱింగికాదె మును జెప్పక గుంజిలిపెట్టియున్కి నీ
వే వలదన్న వేఁడుకొనవే మఱి యేనయి చెప్పినాఁడనే.

469


క.

నాతోడని న న్నడుగుట, యీతెగుదెంపునకు ముగిసె నిఁక నేమనుచున్
రాతికొడు కతఁడు హలసం, జాతకిణాశ్మాతకఠినశయమునఁ జఱిచెన్.

470


వ.

ఇట్లు వ్రేటుపడి దండతాడితభుజంగియుంబోలె నమ్మోహనాంగి నింగిముట్టినయలు
కం బట్టిన సికవీడి నిలువంబడి యిలు వెలువడి.

471


క.

ఆడికలం బడితినొ ఱం, కాడితినో యిల్లు ముంగిలననో తఱితోఁ
గూడననొ నీళ్లనననో, కూడునె యిల్లాలి నన్నుఁ గొట్టం దిట్టన్.

472


క.

విరసమునఁ గొట్టుపడి నా, సరిగరితలలోన బ్రతుక సైఁతుని మఱి నే
సురెఁ బోదు త్రాటఁబోదున్, ధరియింతునె సైఁపు మింతడడ విచ్చోటన్.

473


క.

ననుఁ గన్నతల్లి ప్రజలకు వినిపించినపిదప ననుచు వెసఁ బుట్టిల్లం
దునికి యటకేగు కైతవ, మున నుపవల్లభునినికటమున కది పోయెన్.

474


క.

ఏతెంచి నిర్ణిరుద్ధ, ప్రీతి న్మణిమంతుఁ గ్రుచ్చి బిగికౌఁగిట హృ
జ్జాతపృథుప్రథనంబున, శాతోదరి పెనఁగె రెండుజా లవ్వేళన్.

475


క.

విసువక చనునెమకెడున,ప్పసిపాఁపఁడు తల్లి దాఁపుఁ బాయుటఁ గడువె
(క్కసమున నాఁకలి గొని తా,) నసురుసురై చెవులు గీండ్రు మన వాపోయెన్.

476


వ.

అయ్యేడ్పు విని యుపపతికి నయ్యువతి యిట్లనియె.

477


చ.

అడలెడుఁ జంటిపాఁపఁ డదె యాకొని వానికి నేను జన్నుబా
లిడి చనుదెంతు నింటిమగఁ డింత యెఱుంగకయుండ నీవు నా
యెడన వసించి యేమినిసు వేడ్చెడు రెడ్డన నాకుఁ దెల్పుమం
చడుగు మతండు చంటికొఱకై యని నిక్కువ మొప్పఁ జెప్పెడున్.

478


ఉ.

చెప్పినఁ దల్లి యెందరిగెఁ జిన్నికుమారుని డించి సర్వముం
జెప్పఁగదయ్య యివ్విధము చిత్రము నాకని వేఁడు మాతఁ డి
ట్లొప్పనిమోముతో నను దురుక్తులఁ బల్కుచు మంకుబుద్ధి యే
తప్పునులేమి నిల్వెడలి తల్లిగృహంబున కేగె నంతగన్.

479


క.

నావిని మాయాతనితో, నీవను సుతు విడిచిపోయెనే యకటా నీ
దేవియుఁ బుట్టింటికి న, య్యో వలదని మాన్ప కెట్టులుండితి విచటన్.

480

ఉ.

ఐన నిఁకేమిసేయఁగల మాకట నేడ్చుకుమారుఁ బట్టు టె
ట్లీనిశి యోసరించి నిలు మోపు మదీయవధూటి వచ్చి నీ
కానకకన్నపట్టి కిడుఁగాని ఘనస్తనదుగ్ధ మంచు స
న్మాన మెలర్ప నాడు మనుమానము లే కతఁ డోసరించినన్.

481


వ.

పంతంబు చెల్లించుకొనుదాన నని చెప్పిన మణిమంతుం డమ్మాటలు కాఁపుకొడుకున
కెఱింగించె నెఱింగించిన.

482


ఉ.

ఉండెదఁ జెప్పినట్లు నిలుపోపనియాఁకట నేడ్చి యేడ్చి య
క్కెండినచంటిపాఁపఁ డిపు డేమగునో మఱి లేరు బిడ్డ లొ
క్కం డిదె వీఁడు నాకొడుకు గాఁడు భవత్తనయుండు సత్కృపా
మండన వీనిఁ బ్రోచికొనుమా యాని హాలికుఁ డోసరించినన్.

483


క.

అప్పలువచెలువ జారుని, దుప్పటిముసు కలవరింవి తోరపుమురిపం
బుప్పతిలఁ గులుకునడలం, జొ ప్పేర్పడకుండ దనశిశువుకడ కరిగిన్.

484


తే.

అరిగి పెరిగినయాఁకట నఱిచి యఱిచి, యేడ్పు విడువనితనపట్టి నెత్తిపట్టి
కులికి చన్నిచ్చి పొత్తిపొత్తుల నమర్చి, మగనికెంగేలఁ జెనకి యమ్మగువ వెడలె.

485


క.

ఆలరితనమున లీలం, గేలం దనుఁ జెనకి చనినగిరికుచ తనయి
ల్లాలని తెలియక పరుని, ల్లాలని యారెడ్డిబిడ్డ డడరు విరాళిన్.

486


శా.

రావే నల్లనిగుమ్మ నీ వనుచు నారాటంబునన్ రెడ్డి నా
నావిభ్రాంతులఁ గుబ్బతిల్లునెడ దోన న్మీనకేతుండు కీ
ళ్ళావైచెం గొఱకచ్చులం బొడిచెఁ గాలం గేల మర్దించె నా
పోవ న్సమ్మెటఁ గొట్టెఁ దిట్టెఁ జిఱునిపిపు ల్రాల్చె నేత్రంబులన్.

487


క.

చేసెడువలరాయనికై, కాసములకుఁ గాక జడిసెఁ గాపుంగొడు కా
లో సుదతిఁ దెచ్చుటకు ని. ద్రాసక్తుని మీఁటెఁ జన్ను ద్రావెడుకొడుకున్.

488


క.

మీటుటయు మిట్టిపడి య, చ్చోట న్రుధిరంబు గ్రమ్మ స్రుక్కుచు నొడ లా
రాటపడఁ జంటిపాపఁడు, కాటుకకన్నీరు దొరుగఁ గావున నేడ్చెన్.

489


వ.

అయ్యేడ్పు విని యిచ్ఛావతి యుపపతి కిట్లనియె.

490


క.

కొడుకులగుఱ్ఱకుఁ జను బా, లిడి నీతో రతులఁ బెనఁగ నేతెంచుచు నా
కడకేలం దాఁకించితి, కడుదెర్లిక పుట్టి పొఱలఁగా మారెడ్డిన్.

491


చ.

తమకమువుట్టి నేఁ నదికతంబున రెడ్డన నిద్రఁబోవులేఁ
గొమరుని నేడిపించె నదిగో తిరగంబడి చ న్నొసంగి ర
మ్ము మరల నంచు నన్నటకుఁ బొమ్మని నీవనుపం దృఢానురా
గమునఁ బ్రియంబుఁ జెప్పి నను గౌఁగిటఁ జేర్చి సుఖించుదానికిన్.

492

శా.

పోరం జొచ్చెఁగదయ్య యాఁకటికి నీపుత్రుం డయో యింటి కిం
కారాదా రెడిసాని యి ట్లలమఱం గాఁబట్టఁగా వచ్చు నే
దూరక్షోణి వసింపు చ న్నొసఁగఁబుత్తుం గూర్మినిల్లాల నీ
తూరిన్ లోపలికంచుఁ బల్కు మతఁ డుండుం గొంది నంచాడినన్.

493


క.

కలితనమునఁ జని యలనా, పలుకుం బంతంబు చెల్లుబడిగా రెడ్డిన్
గలసి యొకముడుపుఁ గైకొని, పిలిచిన నీకిత్తు నేరపెట్టుదు మగనిన్.

494


వ.

అని యప్పు డప్పిసాళి మణిమంతుం దఱిమిన నతం డది పలుకుమన్నట్లు పలికె
నమ్మాటలు విని కర్షకుం డుత్కర్షింపుచు నిట్లనియె.

495


క.

ఎడగలుగ నుండెఁ దనమే, న్వడకెడు మఱి పసులవంటివారము చనుబా
లిడుఁగాని పుణ్యమయ్యెడు, విడనాడక యిటకుఁ బనుపవే యిల్లాలిన్.

496


క.

నావానిమాటలకు లో, లో వెడవెడ నగుచు నింటిలోపలి కలయి
చ్ఛావతి పోయెం బోయినఁ, గోవరపుంబ్రేమఁ గాఁపుకొడు కవ్వేళన్.

497


ఉ.

కే లగలించిపట్టి రతికిం బిఱుబీకులు సేయ లోనుగా
కాలరిజంత నేఁ జెడితి నమ్మక సిగ్గులవాఁడ వౌదు నీ
యాలనె వింతదాన మగనాల నయో తెకతేఱ నన్నుఁ బ్రా
ల్మాలుపఁ జూచెదో తెగరె మామగవార లెఱింగిరేనియున్.

498


ఉ.

మేనికిఁ జేటుగాదె పులిమీసల నుయ్యెలలూఁగ మాను నేఁ
గానటువంటిదానఁ గొఱగానిపను ల్దలమీఁద వచ్చు నే
రా నిఁకఁ జాలుఁ జే విడువరా యని సూక్ష్మరవంబున న్సరో
జానన పల్కినన్ హలికుఁ డాజగఱాఁగకుఁ బ్రీతి నిట్లనెన్.

499


క.

ఇటువంటిదాన వేలా, చిటిపొటికేంగేల నన్నుఁ జెనకితి నిను బా
యుట ప్రాణంబులఁ బాయుట, కుటిలాలక కరుణలేదకో యిట్లాడన్.

500


క.

అని బాఁతిఁబాఁతిపెట్టిన, పెనుబ్రాతవరాలసోలఁ బెకలించి ఘన
స్తన కిచ్చి క్రుచ్చి కౌఁగిట, నెనయించెం బంచబాణుఁ డెసకొల్పంగన్.

501


క.

అది యత్తెఱఁగున నతినిన్, గరియంబడనిచ్చి వెఱపుగలదానిగతిన్
గుదులుకొను నేలబుసకొ, ట్చెద వను నే నెట్లు చేపడితి నను నడలున్.

502


క.

పోవలె వడిగా వడిగా, లేవయ్యా ప్రక్కలోన లేకుంటే నేఁ
గావఁడు మగఁడని యలయి, చ్ఛావతి కర్షకునిఁ ద్రోచెఁ జదికిలబడఁగన్.

503


వ.

కరాపాతంబుకంటె మున్నుగా లేచి యప్పలువచెలువ కన్నులసొం పామతింపఁ
జని విత్త మిచ్చి పంతంబు చెల్లెఁగదా యని జారుని నిజకరంబునం జఱిచి చక్కిలి

గింత పెట్టె నప్పుడు చతుర్ఘటికావిశేషంబుగా రాత్రి చనియె దిక్కులు ప్రకాశ
ప్రతతిం బొందెఁ బిచ్చుకలు పిచపిచ మనియఁ గాకంబులు గూకలిడియె దధిమ
థనఘుమఘుమధ్వానంబులు నెరసె గోవత్సకోలాహలంబులు విననయ్యె నయ్యెడ
గృహంబు వెడలి పెరడు చొచ్చి వచ్చుటకు విహారభద్రుండు పోయినఁ గనువేచు
కునియుండి.

504


క.

అపు డిచ్ఛావతి యచ్చో, నుపపల్లభు నిలువఁబనిచి యోడక యిలుసొ
చ్చి పొడవుగల మచ్చుపయిం, గపటవ్యాపార మమరఁగాఁ గూర్చుండెన్.

505


క.

హలికుం డాలోపల లో, పలికిం జనుదెంచి మచ్చుపైఁ దనయిల్లాల్
నిలిచిన తెఱఁ గెఱుఁగక యపు, డిలువెడలినబుద్ధి నిశ్చయించి కనలుతోన్.

506


ఉ.

ఈలువు వంగడంబు గల దీజవరాలని యోలి రొక్కరొ
క్కాలిడి యెట్టిఱంకుతడక న్వరియించితి దీని నక్కటా
చాలు సహింప దీచెనఁటిసంగతి యొండొకమాయ పన్నియో
యాలరిజంతఁ జంపి సుఖినై యొకదిక్కునఁ బెండ్లియాడెదన్.

507


వ.

అని హుమ్మని యౌడుగఱిచి మీసంబులు దీటుచుండ నయ్యండజయాన మచ్చు
డిగ్గ నుఱికి యెదుర నిలువంబడి యిట్లనియె.

508


ఉ.

ఈలువు వంగడంబు గలదే ముముబోంట్లకు నీకుఁ గాక రొ
క్కాలిడి యిట్టిఱంకుతడక న్వరియించుట రోఁత గాదె నీ
కేల సహింతు నన్ను మడియింపు మొకానొకచోటఁ బెండ్లిఁ గ
మ్మాలసె నీకు నేఁ దగుదునా చను నీ కిటులాడ నిచ్చలున్.

509


ఉ.

నిక్కము రెడ్డిబిడ్డవని నిన్మది నమ్మి గృహంబుఁ జేరి యీ
దిక్కున నున్నశూద్రసుదతి న్ముడుపిచ్చి రమించినాఁడ వి
త్తెక్కలిఱంకు నాకుఁ గలదే యని ముందలఁ బట్టి యీడ్చి యా
రక్కెస దన్నె ముక్కు చెదరం జరణంబున వాని నెవ్వడిన్.

510


ఉ.

తన్నిన వాఁడు తచ్చరణతామరసంబుల వ్రాలి నిన్ను నే
మన్నది లేదు నావలన నన్నియు నేరము లోర్చుకొమ్ము
పిన్నతనం బొకళ్లచెవిఁ బెట్టకు పెట్టిన సిగ్గువోవు నా
నన్నియసన్నమౌ నగరివారికి దండుగఁ బెట్ట ని మ్మగున్.

511


క.

చెఱుపకుము కాఁపురంబని, పఱిపరి యగుతాల్మి నట్లు ప్రార్థింపంగాఁ
గుఱఁగట నేగుచుఁ దలవరు, లరిమురి కర్షకునిమాట లాలించి తగన్.

512


క.

గిలుకలు వైచిన గుదియలు, ఘలుఘల్లున నూఁదికొనుచుఁ గదియం జని యా
హలికునిఁ గొని చని ధరణీ, తలవల్లభుమ్రోల నిలుపఁ దప్పేర్సడఁగన్.

513

క.

నరపతి దండుగఁ గొని య, ప్పురి వెడలం గొట్టె నపుడు భువనచరాదు
శ్చరియాలగు నీకు నుదా, హరణం బిది యనుచు వానరాగ్రణి జెప్పెన్.

514


వ.

చెప్పి వెండియు బహుమానుండు.

515


క.

తులువా నీయిల్లా ల, య్యలివేణికిఁ దోడుబోయినది దానిమృషో
క్తులకుఁ దెగఁజూచితివి నీ, తలద్రెవ్వను బొలిసిపోయెదవు తరువాతన్.

516


క.

చేపడినసొమ్ము దూరం, బై పోయె న్మోసమయ్యె నని యంతస్సం
తాపమునఁ బొక్కి పొఱలకు, మీపాటిం బొమ్ము చాలు నింటికిఁ గ్రకచా.

517


క.

క్రించామూఢుని నిను ద, క్కించుట యన నెంత సింధుకీలాలమునన్
వంచింపఁబడదె ము న్నొక, పంచక మభిజాతకమఠవల్లభుచేతన్.

518


క.

నావిని కాననచరగో, త్రావరు నీక్షించి పలికెఁ గ్రకచుఁడు నయవి
ద్యావైభవగుణసుభగం, భావుక వివరింపు మాయుపాఖ్యానంబున్.

519


ఆ.

కుటిలుఁ డప్రయోజకుఁడు వీఁడు వీనితో, నేటిజోలి నన్నుబోఁటి కనక
వివరపుట్టఁ జెప్పవే నిష్కళంకస్వ, భావ నావుఁ డలరి ప్లవగవిభుఁడు.

520


వ.

క్రకచునకు నక్కథఁ జెప్పందొణంగె.

521


సీ.

కలిగొట్టు మోఁదుగు కానుఁగు గలుగువావిలి మేడి నేరేడు సెలసు బలుసు
మఱ్ఱి మంకెన మద్ది మారేడు బూరుగు గోరంట లొద్దుగు క్రోవి రావి
జువ్వి మామిడి జీడి సురుగుడు మొలుగుపాపట చండ్ర పసిరిక పాల రేల
పొన్న బొట్టుగు పోఁక పొగడ దాడిమ మిప్ప గుముడందు గురువింద గోను రేను


తే.

చిల్ల చింత మొగలి చీకిరే ణూడుగ, నిమ్మ తమ్మ తుమకి నెమ్మి జమ్మి
వేగి వేము మొదలుగాఁ గలమ్రాకుల, కాన నగుచు నొక్కకాన మెఱయు.

522


చ.

కరపుటికాంతరాళచుళుకక్రమణాయితసింధుసర్వతః
పరివృతకృత్పయోదములు వాసిన దద్ఘటజావ్యపాణిజ
ర్ఝరితములై నభోగతికిఁ జాలక పల్వలము ల్భజించె నాఁ
గర మలరు న్సమగ్రబలకాయము లవ్వనికాలులాయముల్.

523


ఉ.

ఆహృతజంతుభీషణబలాభ్యుదయాప్తి గుహానురక్తి గో
త్రాహితవృత్తి వజ్రకఠినాతిశయాకృతి శౌర్యగర్వరే
ఖాహమికం బ్రసిద్ధరుచిరమృతపారణజంభదానవో
త్సాహవిఘాతిచందమునఁ దద్గహనంబునఁ గ్రాలు బెబ్బులుల్.

524


మ.

చరణప్రాంతచరిష్ణువు ల్నిరుపమోచ్చస్థానసంక్రీడన
స్ఫురణం జన్నఘనత్వ మంద నరుదెంచుం గీడు మీ కంచు మ

త్సరబుద్ధిం బలెఁ జించుమేఘముల దంతత్రోటికోటిం జలా
హరణారంభణజృంభణంబులు దదీయవ్యాళశుండాలముల్.

525


మ.

తనరస్ముల్కవిసంభవాండభువనధ్వాంతచ్ఛిదాచంచువు
ల్వినఁ జెప్ప న్వెఱఁ గీమహాతిమిరపాళి న్విచ్చిపోఁ దోలలే
వని రథ్యోత్థరజోదరస్తిమితదీక్షాభోగుఁడై హేళిగ
న్గొన నగ్ఘోరతరటరాటవి న్మనునెలుంగు ల్గుంపులై వేసవిన్.

526


శా.

పై పైఁ బ్రాణివధప్రధానగుణ మొప్పం గౌరగౌరద్యుతుల్
దీపింప న్విషమాంబకభ్రమిఁ బ్రభీతిం జేయ నత్యుత్కటా
టోపం బుగ్రగజాహృతివ్యసనకండూలంబుగా నుండుగుం
పై పంచాస్యము లయ్యరణ్యయినఁ బంచాస్యప్రకారంబునన్.

527


శా.

క్రందై వెల్వడు ఘుర్ఘురధ్వనిమృదంగస్థాయిగాఁ దాలుని
ష్యందస్థూలవిశాలలాలసవరంబై యొప్పుశృంగోద్ధతిం
జిందుల్ ద్రొక్కఁ గుడుంగరంగముల నిస్సీమత్వరాతిభ్రమిం
బందుల్ దిఙ్మృగయుచ్ఛిదాగుణపరిస్పందుల్ దదుగ్రాటవిన్.

528


క.

అలఘుతరవారిధారా, దళితప్రతికూలసకలధరణీభృత్సం
కులమై యొకసెలయే ఱ, ప్పొలమున జగదేకవీరుపోలిక నమరున్.

529


వ.

అది రామలక్ష్మణాలంకృతంబై పంచవటస్థానంబును సత్వసంపన్నంబై సమీర
ణంబును గజగవయవిహారయోగ్యంబై కిష్కింధానగరంబును నుపాసితపరమ
హంసంబై వేదాంతశాస్త్రంబును నఖండశబ్దక్రియానిరూపణంబై వ్యాకరణం
బును ప్రబోధితనిగమజాలంబై ధర్మంబును ఘనరసప్రధానంబై విద్వత్ప్ర
బంధంబు ననుకరించిన యమ్మహాప్రవాహంబున.

530


క.

నీతికళానిధిగలఁ డభి, జాతుం డనుకమఠవిభుఁడు సంతతపంక
స్థాతృత నొందియు నద్భుత, మాతం డేవంకఁ బంక మంటక తిరుగున్.

531


శా.

ఆతాఁబే లొకనాఁటిరేయి ధరణీవ్యాపారలిప్సాపరం
బై తానంబులఁ బాసి తీరశరతృణ్యావీథుల న్నిల్వ భూ
జాతచ్ఛాయలశీతలానిలకృతాంచద్వాలుకాలేఖికా
వ్రాతాభ్యగ్రముల న్విశృంఖలగతి న్వర్తించె వర్తింపఁగన్.

532


చ.

అఱిముఱి చిచ్చు నాఁ బొగులు నాఁకట బ్రుంగుడునంగుడై యొడల్
సుఱసుఱ స్రుక్క నయ్యడవిలో నొకనక్క తటస్ఫుటంబులన్
బొఱియలఁ దోఁకఁ జొన్పి వెలిభూమికిఁ దార్చిన యెండ్రితండముల్
గఱుకుచు వచ్చి వచ్చి యలకూర్మముఁ గాంచి ప్రహృష్టచిత్తమై.

533

క.

ఘనరభసంబునఁ గదియం, జనునపు డక్కమఠవిభుఁడు స్వగతంబున ని
ట్లని తలఁచె నిష్ప్రమాదుఁడ, ననియుండుదు నేఁటితుదకు నది బొంకయ్యెన్.

534


ఆ.

సకలదుష్టజంతుసంక్రాంతజలదుర్గ, సీమమందు వెట్టచెట్టలేక
చెడుగుఁబాము గాముచేఁ బెద్దమీనుచే, నీరుకుక్కచేత నెగడుచేత.

535


ఆ.

రొయ్యపుర్వు గ్రొవ్వి రోధోవసుంధర, కెగసి తెగినపగిది నిట్టులేల
జలతలంబు విడివి చనుదెంచి నాబుద్ధి, పుర్వు మేయఁ జెట్ట బొందఁ గంటి.

536


క.

కాలంబు దాఁట నెవ్వరు, చాలుదు రని వగచి నిరవసాదవిషాద
జ్వాలం దూలి కబంధచ, రాలంకరణంబు వపురుపాహితకంబై.

537


క.

రాతింబలె నతినిశ్చల, రీతి న్నిలుచుటయుఁ గని గరీయఃక్షుద్భా
ధాతురకృశంబు జంబుక, మాతాతదంష్ట్రికలఁ గచ్ఛపాగ్రణిఁ బట్టెన్.

538


క.

పొదివి తెకతేఱఁ గలిగెం, గద నాకీకమ్మతేనెకరుఁడని దానిన్
దుదకోఱలు కోరలుపోఁ, గొదలే కటునిటుఁ బొరల్చి కొఱుకుచు నుండెన్.

539


క.

విఱుగుట గానక నెరయం, దఱతఱకలువాఱఁ గొంతదడ వది గొఱికెన్
గొఱికిన నొగులదు పగులదు, చిఱుమొఱకలుపోయెఁ బుల్లసిలె దంతంబుల్.

540


వ.

ఇట్లు మృగధూర్తదశనదంశననిర్విశకలితమర్మంబై యక్కూర్మంబు తనలో
నిట్లని వితర్కించె.

541


చ.

జరుగదు రోసి షో విడువఁజాలదు వేసటలేక కోఱలం
గొఱికెడు దీని కేమితుద గోరము వాటిలె నాయుపాయ మం
దఱుఁ గొనియాఢ నిచ్చెనఁటినక్క దటాలునఁ డక్కుఁబెట్టి యే
మఱక ననశ్వరం బయినమన్గడఁ గాంచెద నీరు సొచ్చెదన్.

542


క.

అని నిశ్చయించి ధీర, త్వనిరూఢుం డగుచుఁ గమఠవరుఁ డానక్కన్
గనుఁగొని యిట్లను నేలా, తను వలయన్ మల్లి పోయెదవు పిసవెఱ్ఱిన్.

543


క.

మఱవక యేఁడులుపూఁడులు, గొఱికిన నాయొడలు మృదువగునె నీ కేలా
వెరవిడిచందము పుట్టెన్, దరిదీనికి వెరవుఁ జెప్పెద న్విను మర్థిన్.

544


క.

నానక మృదుమార్గమునకు, రాజేరదు మేన నీచరణ మనఘా నా
పై నునిచి యేతదంబు, స్థానములోఁ బెట్టు కొంతదడ వట్లయినన్.

545


క.

చెన్నార నపుడు చేసిన, వెన్నవలె న్మెత్తనగుదు విపులవసాసం
పన్నము సుమీ తను వాఁ, కొన్న మహాత్మునకు నీకు గుడువఁగవచ్చున్.

546


క.

తనివిసనఁ దినకపోవని, మనమునఁ దలపోసి రోసి మనుగడపై నీ
కనువైనవెరవుఁ జెప్పితి, నని కూర్మప్రవరుఁ డాడె నట్లాడుటయున్.

547

వ.

అప్పలుకులు సిద్ధాంతీకరించి యవ్వంచకం బట్ల చేసెఁ జేసి ముహూర్తమాత్ర మూర
కుండ యయ్యభిజాతున కిట్లనియె.

548


క.

తడవయ్యె నీటిలో ని, న్నిడి మే నేమైన నానెనే తనివిసనన్
గుడువవలె నిజముఁ జెపుమా, జడియక నీ వనిన వారిసత్వము తనలోన్.

549


క.

ఈవంచకంబు నామా, యావాగురఁ జిక్కె దక్కె నసుపంచకమం
చావిర్భూతోత్కళికా, ప్రావృతమై యపుడు కచ్ఛపం బిట్లనియెన్.

550


క.

అసమోదక మంటఁగ నా, నె సమృద్ధము లంగకములు నీపాదముక్రిం
దిసుమంత నాన దెవ్విధి, మెసవెదు నీపంటి కెట్లు మృదువైయుండున్.

551


క.

మెత్తనగుఁగాని శీఘ్రము, గుత్తముగా వెన్ను ద్రొక్కు కొనియున్నపదం
బెత్తుము నీవంటఁగవలెఁ, జిత్తము సుఖపారణావశీకరమైనన్.

552


క.

పోఁగుఁగఁబో యీ వాఁకట, జాగేమిటికంచుఁ బలుక సంక్షుద్బాధా
జాగరణబుద్ధి జంబుక, మాగోచరుమాట నిశ్చయము పొ మ్మనుచున్.

553


క.

పై దారుణముగ నూఁదిన, పాదము దివియుటయు గచ్ఛపము సంతోష
ప్రాదుర్భావప్రాప్తమ, హోదంచద్వేగ ముగుచు నురువడిఁ బఱచెన్.

554


క.

క్రకచా యీచాడ్పున న, క్కకు మోసము గల్గియుండఁగా మఱి నినుబోఁ
టికిఁ దగులు టెంత యని కీ, శకులాగ్రణి చెప్పి మఱియుఁ జలచరుఁ బలికెన్.

555


క.

వెడమాయనక్కమాటల, కడవికిఁ జని తిరిగి వచ్చి యప్పటియుం దా
నడవిఁ బడి బడుగుహరిచేఁ, గడతేఱినగర్దభమ్ము గాఁ జుమ్ము శఠా.

556


క.

అనిన విని శింశుమారుఁడు, వనచరు నీక్షించి యింతవాఁడవు గాకుం
డిన ముదిసి ముప్పుదనుకా, మనుదే యిది తెలియఁబలుకుమా వినవిలతున్.

557


వ.

అని యడిగిన బహుమానుండు.

558


సీ.

కల దొకదుర్దాంతకాంతార మరవిందబంధుఘృణ్యంతర్థిపాదపంబు
దీర్ఘదంష్ట్రాభిఖ్యఁ దేజరిల్లుమహోగ్రసింహ మచ్చో నివసించియుండు
దానికి ఘటకాభిధానజంబుక మొకం డహరహం బాప్తకృత్యము లొనర్చు
నట్లు కొండొకకాల మరిగినఁ గర్మానుకూలత నసదృక్షకుక్షిరోగ


తే.

మసృణతరవేదనాకంపమాన మగుచు, వెగ్గలంబైనధృతి జారి యగ్గజారి
పొఱలు వాపోవు నలమరుఁ బొక్కు స్రుక్కు, బోరగిలఁబడు నిట్టూరుపులు నిగుడ్చు.

559


క.

ఈరీతిఁ గడుపునొప్పిం, గూరాకై యుడికి గోఁడు గుడుచుచు శుండా
లారి యొకనాఁడు నిజర, క్షారససంఘటకు ఘటకుఁ గనుఁగొని పలికెన్.

560


చ.

తనదెసఁ జూచినాఁడవకదా ఘటకా కటకాంతభూమికిం
జని యతిగోపనం బమరఁ జంపి శరీరము వ్రచ్చి లోపలం

గనుఁగొననైన గర్దభముకందనగాయ గ్రహించి తెచ్చి యి
చ్చి నిలుపుపాసిపోఁ జలిదిఁ జేకొని యుండెడు జీవితంబులన్.

561


చ.

తడసినఁ జత్తుఁ బొమ్మనినఁ దచ్చరణంబులు సమ్మదంబునం
బడివడి లేచి యప్పనికిఁ బాల్పడి జంబుక మేగి యొక్కచో
గడుకృశమైనదాని నొకగర్దభముం గాని చేరి యిట్లనున్
బడలితి వేల రాసభ శుభంబగు నా కెఱిఁగింపవే యనన్.

562


వ.

గర్దభంబు జంబుకంబున కిట్లనియె.

563


క.

చాకలవాని కధీనమ, నై కోకలు మోసి రైతు నాపణవీథి
వ్యాకీర్ణవ్రీహీతుష, స్వీకృతి మేన్ బ్రోతు నెట్లు చిక్కకయుందున్.

564


క.

కొనఁ గననిపాపకర్ముఁడు, తను నాహారాధివిధులఁ దనుపఁడు మేయన్
జననీఁడు కాలుగట్టు, న్మనుటయుఁ జచ్చుటయుఁ గాదు మద్విధ మనఘా.

565


ఉత్సాహ.

మేను పొందు గాదు లేదు మేయ సౌఖ్య మక్కటా
జైనవానిచేతిపేను చందమైతి నంచు న
మ్రాననంబుతోడనున్న నాత్మ లేనినెయ్యమున్
గానరాఁ జెనంటిజంబుకంబు దాని కిట్లనెన్.

566


మత్తకోకిల.

కాలఁ గుంటివి గావు బీఁకువు గావు గర్దభముఖ్య నీ
కేల యివ్విధి నెవ్వచేఁ గృశియింపఁబోదము రమ్ము మ
త్కేళికాననశాడ్వలంబులఁ గ్రీడసల్పఁగ మర్త్యసే
వాలఘుత్వము చాలు నీకు నవారివారితృణావళుల్.

567


క.

అని చెలువు గులుకుపలుకుల, మన మూఱించుటయుఁ దేఱి మనుజునధీనం
బున నున్కి కష్ట మని ఖర, మనయంబై నక్క బడి మహాటవి కరిగెన్.

568


క.

అరిగినఁ బరిచితపటసం, భరమున్ ఖరము న్విముక్తబలగర్దభశే
ఖరముం గురవము ఖరమున్, హరిపాలం బెట్టె నక్క యక్కటికమునన్.

569


క.

నెఱిసరిగ దానిపైఁ బడి, కఱవన్ లాఘవములేమి గాళ్ళీడ్చుచు న
డ్విఱువం గదిసిన నత్తెఱఁ, గెఱిఁగి ఖరం బదరి తిరిగి యేగుచు నుండెన్.

570


క.

గునుకెత్తుచున్న గాడిదె, గనుఁగొని సింహంబు వలికె ఘటకునితో నీ
చనుఖరము దరిమికొన నా, తనువున వడిలేదు తెమ్ము దగ్గఱఁజేరన్.

571


చ.

చనుమన నట్లకాక యని జంబుక మప్పుడు గర్దభంబుఁ జే
ర నరిగి యేల పోయె దకటా వసనంబుల మోవ బస్తులన్
వనరఁగ వేడ్క యయ్యెడినొ వ ల్దిటువంటికుబుద్ధు లివ్వనం
బునఁ గొన మేఁపు నీళ్లు గఱవో పతిమన్నన నీకుఁ జాలదో.

572


వ.

రమ్మనిన గర్దభంబు జంబుకంబున కిట్లనియె.

573

క.

కేసరివధ కుద్యోగముఁ జేసిన నగ్గమక మెఱిఁగి చెలికాఁడా సం
త్రాసమునఁ దలఁగి వచ్చితి, గాసిలి ప్రాణములు తీఁపుగా యెవ్వరికిన్.

574


క.

నావిని ఘటకుం డనుఁ దగ, వా వెరవఁగ నధిపుఁ డట్టివాఁడా నిను సం
భావించుట కి ట్లొరయం, గా వచ్చుట యిందుకేల గళవళ మందన్.

575


చ.

ఠవఠవ గ్రొత్తక్రొత్త యగుటం జనియించెను నీకు నేఁడు రే
పవుటయు మమ్ము మీరఁ జనువంతయు నీయది కొంక నేల ర
మ్మవసర మిప్పు డంచుఁ జను నాఖరము న్మరలించి తెచ్చి గౌ
రవగుణ మెక్క నక్క మృగరాణ్నికటంబున బెట్టెఁ బెట్టినన్.

576


తే.

కఱుకుకఱుకునఁ గుత్తుకఁ గఱిచి విఱిచి, నక్క నక్కఱఁ జీరి శుండాలవైరి
గర్దభము కుక్షి భేదించి కర్ణహృదయ, ముదయ దాహ్లాదమున దివ్వు మోపననక.

577


వ.

ఏను సెలయేటిజలంబు లానివచ్చెద నని చెప్పి యడు గామడగా నరిగిన.

578


సీ.

ఖరశరీరము విప్పుగా గొప్పలగుదంతకుంతసంఘంబులఁ గ్రుచ్చి క్రుచ్చి
మృగధూర్త మాకర్ణహృదయంబు భేదించి యది యనర్ఘ్యం బగు టెఱిఁగి కాదె
యతులరంహము సింహ మాశించె భక్షింప నత్యాజ్య మివ్వస్తు వనుచుఁ దాన
భక్షించి పరిశుద్ధుపగిది నూరకయుండె నపుడు కంఠీరవ మరుగుదెంచి


తే.

కొనవలయు నౌషధంబు దెమ్మనినఁ గొంకు, కొసకులే కది పలికె నోకుంభివైరి
గర్దభాకారమున లేదు కర్ణహృదయ, మరియు కలిగిన నిన్నేల కదియవచ్చు.

579


సీ.

అని నక్క తక్క కిట్లాడుమాటలు యథార్థీకరించి యదల్పఁ దెరువులేమి
నుడిగెఁ గేసరి యూరకుండె న ట్లావంచకము మహాకపటవాక్యములు నమ్మి
గహనమండలి సొచ్చి క్రమ్మఱ మఱియు నేతెంచి దుర్వ్యాధిశద్విరదవైరిఁ
జేరి తద్దంష్ట్రలదోరినఖరముగాఁ దలఁపకు నన్నని బలిముఖుండు


తే.

పలుక నేమియు ననక యజ్జలచరుండు, లబ్ధనాశవ్యధాజాతలఘుగుణేత
రావిలసిపాస దీఱ నీ రానిచనియె, నద్భుతత్వరతోడ నిల్లాలిఁ జూడ.

580


క.

అని విష్ణుశర్ముఁ డాదర, మునఁ జెప్పిన రాజసుతులు ముదమున గురునిన్
గనుఁగొని పంచమతంత్రం, బనఘా మాతోడఁ జెప్పుమని యడుగుటయున్.

581


మ.

అతి హృద్బోద్ధ్రపమోహ భక్తినతదివ్యవ్యూహ విధ్యూర్జిత
క్రతుపుంజార్చితపాద వర్ధితపటుప్రహ్లాద పుణ్యవ్రతా
యతనాధ్వన్య జగత్రయీభరణవిద్యాధన్య త్రయ్యంతకీ
ర్తితపీతాంబర కృత్తిధారణశుగాధివ్యాధినిర్వారణా.

582

క.

ఆదృతశుకముక్తిమహా, పాదపకిసలాయమానపదయుగనానా
వేదశిరఃప్రసవప్రా, సాదవ్యాపారదీనజనమందారా.

583


మాలిని.

హరిముఖసురమౌళిన్యస్తపాదాంబుజాతా
పరహితరతధామప్రాంతయుక్పారిజాతా
పరుషతరవిలోకప్రాంశుధూతారిజాతా
చరణశరణరక్షాజాగరూకైకచేతా.

584


గద్య.

ఇది శ్రీవేంకటనాథకరుణాలబ్ధసరససాహిత్యనిత్యకవితావిలాస సకలసుకవిస్తు
తిభాషణోల్లాస రాజకులపారావారపర్వశర్వరీరమణ నీతిశాస్త్రమార్గపరిశ్రమణ
ధైర్యపర్యాయధిక్కృతనీహారపర్వతరాజకుమార నిస్సహాయప్రబంధనిర్మాణ భోజ
భూదార సుధామధుర భారతీసనాథ వేంకటనాథప్రణీతం బైన పంచతంత్రంబున
లబ్ధనాశం బన్నది చతుర్థాశ్వాసము.

  1. ఉ .మూలకుఁ దార్చి సందుసుడిమూతులు నాకెడుగిండిదాని న
        వ్వేళకు నొద్దఁబెట్టి యిదె వే విడె మిచ్చెదఁ గాని చూచెదం
        గోలతనంబు పెండ్లికొడుకుం దలవాకిట నంచు వెళ్ళనీఁ
        జాలనిభర్తఁ దేర్చి యొకచంద్రనిభానన వచ్చె వీథికిన్.
    ఇది ప్రక్షిప్తమని తోఁచెడు.
  2. ఈస్థలంబున నుపమానోపమావాచకంబులు సాధారణధర్మవాక్యంబులకు ముందు
    కొన్నిప్రతులందుఁ గానంబడియెడిని. ఐన నీకవి యింతకుము న్నీగ్రంథముననే
    యిట్టిఘట్టంబుల రచియించినరచనం బట్టియుఁ గొన్నిప్రతులయం దుండుటం
    బట్టియు నిట్లు సంస్కరింపంబడియె.
  3. శా.రాకాచంద్రనిభాస్య నెచ్చెలులు దేరం బ్రీతి నత్యూర్జిత
         శ్రీకిం బట్టగుమంగళాయతనముం జేరంగ నేతెంచుచోఁ
         గాకల్పారసమత్తకోకిలలజోక న్సూరెలం డాసి ల
         క్ష్మీకల్యాణముఁ బాడి రంతఁ బురహంసీయాన లుప్పొంగుచున్.
    ఈపద్యము గొన్నిప్రతులలోఁ గానఁబడదయ్యెడు.