నాగర సర్వస్వం/నిశ్శబ్ద చుంబనములు

వికీసోర్స్ నుండి

నిశ్శబ్ద చుంబనములు

1. నిపీడితచుంబనము :- భార్యాస్తనద్వంద్వాన్ని నాభీదేశాన్ని కొలదిగా నొక్కుతూ ఉన్నవాడై భర్త ఆమెయొక్క పెదవులపై పెదవులు ఉంచితే అది "నిపీడితచుంబనము" అనబడుతుంది. ఇందు భర్తయొక్క గాఢస్పర్శ నాభీదేశమున, స్తనముల యందు అనుభవించుటయేకాక అతని ముఖగంధములతోబాటు ఆతని పెదవులు తనపెదవులపై వచ్చినిలచుటతో భార్యయొక్క నాడీమండలము రతికి అభిముఖమైన ఆవేశముతో ఒక్కసారిగా కదలిక పొందుతుంది. 'నిపీడితము' అనగా పీడింపబడినది. నాభి స్తనములు పీడింపబడిన మీదట జరిగే చుంబనం అయినందున దీనికీపేరువచ్చినది.

2. భ్రామిత చుంబనము :- భ్రామితము అనగా త్రిప్పబడినది. ప్రియురాలు ఏదోపనిచేయుచుండగా భర్త ఆమెకు వెనుకగా వచ్చి చేతులతో ఆమె ముఖమును వెనుకకుత్రిప్పి ఆమె నొసటి యందు లేదా పెదవులయందు ముద్దుపెట్టుకొనుట జరిగితే అది "భ్రామితచుంబనము" అనబడుతుంది. సహజంగా తాను అభిముఖంగా నిలచివునప్పుడుకాక, ఏదోపని చేసుకొంటూ ఉండగా ఆకస్మికంగా వెనుకకువచ్చి ఆవేశంతో కొంత బలాత్కారంగా భర్త తనను చుంబించినపుడు ఆప్రియురాలి మనస్సులో, శరీరములో ఒక వింతకదలిక మెరపువలె మెరుస్తుంది. ఇట్టి యీచుంబనమునకే భ్రామిత చుంబనము అనిపేరు.

3. ఉన్నమిత చుంబనము :- ఉన్నమితము అనగా ఎత్తబడినది. ప్రియురాలు తలవంచుకొని ఉండగా ప్రియుడామెను సమీపించి ఒకచేతితో గడ్డమును, ఒకచేతితో శిరస్సును పట్టుకొని ఆమె ముఖమును పై కెత్తి-ఆమెయొక్క నేత్రములయందు (కనురెప్పలమీద) బుగ్గలమీద చుంబించుట జరిగినచో అది ఉన్నమిత చుంబనం అనబడుతుంది. భర్త ఆచరించిన ఇట్టి చుంబనమువలన అంత వరకు రతిక్రీడా విషయమున ఉదాసీనురాలైనప్పటికి ఆ భార్యయందు తీవ్రమైన ఉత్కంఠ ఏర్పడుతుంది.

4. స్ఫురిత చుంబనము :- అంతవరకు తనయౌవనమును ఎక్కడను కొల్లబెట్టనివాడైన పురుషుడు నిష్కరిచుకము, నిశ్చేలము (రవికలేనిది, చీరలేనిది) అయిన భార్యశరీరాన్ని తొట్ట తొలిసారి చూచినపుడు విభ్రాంతుడవుతాడు. అతని శరీరంలో ఆవేశము పట్టరానిదిగా ఉంటుంది. ఆ ఆవేశములో అతని సర్వశరీరము కంపిస్తుంది. అనగా అదురుతుంది. ఈ కంపలక్షణము అతని చేతివ్రేళ్ళ కొనలయందు, పెదవులయందు స్ఫుటంగాకనిపిస్తుంది.

అట్టిసమయమునందు పురుషుడు తన అదరుతూఉన్న పెదవులను భార్యయొక్క బుగ్గలమీద స్తనములమీద ఉంచుటజరిగితే భార్య యొక్క సర్వశరీరము పులకిస్తుంది. ఇట్టిదైన చుంబనమునకు స్ఫురిత చుంబనము అని పేరు. స్ఫురణము (అదరుట) తోడి యీ చుంబనము, నవదంపతులయందేకాక దీర్ఘకాలవియోగాన్ని అనుభవించి కలసికొన్న దంపతులమధ్యకూడ ఏర్పడుతుంది. రతిరహస్యమునందే చుంబనము భిన్నముగా చెప్పబడినది. "మహామునీనాం మతయోపి బిన్నాః". చూ రతిరహస్యం.

5. సంహతోష్ఠము :- భార్యయొక్క హృదయభాగమున, మొలయందు, తొడలయందు స్ఫురిత చుంబనమునందువలెనే పెదవులను రెంటిని దగ్గరగాచేర్చి కొంత గాఢముగ చేయబడిన చుంబనము 'సంహతోష్ణము' అనబడుతుంది. స్ఫురిత చుంబనమునందు అదురుచున్న పెదవులు రెండును దగ్గరగా చేర్చబడవు. మరియు దానియందు మిక్కిలి అల్పమైన స్పర్శ ఏర్పడుతూంది. ఈ చుంబనమునందట్లుకాక, పెదవులు రెండును సంక్లిష్టములై ప్రవర్తించుట, గాఢత అనే రెండు లక్షణాలు ఉంటాయి. దగ్గరగాచేర్చబడిన పెదవులతో చేయబడిన చుంబనమైనందున ఈ చుంబనమునకు సంహతోష్ఠము అని పేరు. 6. వైకృతికము  : ప్రియురాలు తనయొక్క పార్శ్వ భాగమున కూర్చుండి యుండగా ఆమెను తనయొడిలోనికి అడ్దముగా వంచి ఆమెయొక్క బుగ్గలను, కంఠమును, కుచములను చుంబించుట వైకృతిక చుంబనము అనబడుతుంది, "వైకృతము" అనగా వ్యతిరేకముగా చేయబడినది. భార్యాభర్తలు ఒకరికొకరు ఎదురు ఎదురుగా నున్నపుడు జరుగు చుంబనము సహజము. ఆట్లు కాక భార్య అడ్డముగా పురుషుడు నిలువుగా ఉన్నప్పుడు చేయబడు చుంబనమైనందున దీనికి "వైకృతిక" మని పేరేర్పడును.

7. నతగండచుంబనము :- భర్త శయనించిన శయ్య యొక్క పార్శ్వభాగమునకు భార్యవచ్చి నిలచు ఉండగా-శయనించినవాడై యున్న ఆభర్త ఆమెయొక్క ముఖమును బాగుగా వంచి ఆమె బుగ్గలను చుంబించినచో అది 'నతగండము' అనబడుతుంది. నతము-అనగా వంచబడినది. 'గండము' అనగా బుగ్గ. ఈ చుంబనమునకు బుగ్గలే ప్రధానస్థానమైనను భార్యయొక్క సర్వశరీరము ఈ చుంబనమునకు తగినదే అని శాస్త్రకర్తల అభిప్రాయము. అయినను ప్రధానస్థానము బుగ్గలగుటచే దీనికి 'నతగండము' అను పేరు వచ్చినది.

ఇంతవరకు చెప్పబడిన యీ ఏడు చుంబనములు నిశ్శబ్దచుంబనములు అనబడతాయి. వీనియందు ధ్వని ఉండదు. ఉన్నను అది మివుల అల్పంగా ఉంటుంది. సశబ్దచుంబనములు ధ్వని ప్రధానంగా సాగుతాయి. అవికూడ సంఖ్యచే ఏడుగానే ఉన్నాయి.

సశబ్ద చుంబనములు

1. సూచీచుంబనము : సూచి అనగా సూది. ప్రియుడు తన నాలుక చివరను సన్నగా నుండుంట్లొనరించి ప్రియురాలి పెదవుల గుండా ఆమె నోటిలో సూదిదూర్చినట్లు దూర్చుట జరిగినచో అది