దివ్యదేశ వైభవ ప్రకాశికా/శిరుపులియూర్

వికీసోర్స్ నుండి

11. శిరుపులియూర్

శ్లో. దివ్యే సంత సర స్సుమానస బిసి స్యత్యద్బుతే సంస్థితం
   రాజంతం పులియూర్ పదే పురవరే యామ్యాస్య భోగేశయమ్‌ |
   నాయక్యా తిరుమామగళ్ పదయుజా వ్యాసర్షి నేత్రాతిధిం
   సేవేహం త్వరుమాకడల్ విభు మహం శార్జ్గాంశ యోగిస్తుతమ్‌ ||

శ్లో. నంద వర్దన వైమాన మధిష్టాయ జగత్పతి:|
   తిరుమామగళాఖ్యాక నాయక్యా సహ రాజతే ||

వివరణ: అరుళ్ మాకడల్ పెరుమాళ్-తిరుమామకళ్ నాచ్చియార్-అనంత సరస్సు-మానసపుష్కరిణి-నంద వర్దన విమానము-దక్షిణ ముఖము-భుజంగ శయనము-వ్యాఘ్ర పాదమునికి, వ్యాసమునికిని ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశేషములు: ఇచట పెరుమాళ్లు శయనించిన బాలుని వలె సేవ సాదింతురు.

మార్గము: మాయవరం నుండి టౌను బస్‌లో కొల్లు మాంగుడి చేరి అక్కడకు 2కి.మీ దూరమున గల సన్నిధిని సేవింప వచ్చును. ఏవిధమైన వసతులు లేవు. మాయవరంలోనే బసచేయవలెను. సన్నిధిలో ప్రసాదము లభించును.

   కరుమా ముగిలురవా కనలురవా పునలురువా;
   పెరుమాల్వరై యురువా పిఱవురువా నినదురువా;
   తిరుమామకళ్ మరువులమ్‌ శిఱుపులియూర్ చ్చల శయనత్తు;
   అరుమా కడలముదే యునదడియే శరణామే
             తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 7-9-9


భగవంతుని గుణాష్టకము

1. అపహత పాప్మత్వము. 2. విజరత్వము. 3. విమృత్యత్వము. 4. విశోకత్వము. 5. విజిఘత్సత్వము. 6. అపిపాసత్వము. 7. సత్య కామత్వము. 8. సత్య సంకల్పము.

12. తిరుచ్చేరై (కుంభకోణం 12 కి.మీ)

(సార క్షేత్రము)

శ్లో. శ్రీ సారాఖ్య సరోజనీ కృతరుచౌ సారాభిధానే పురే
   సారాఖ్యాయుత నాయకీ ప్రియ వపు స్సారాఖ్య వైమానగ:|
   ప్రాగ్వక్త్రాంబుజ సంస్థితి ర్విజయతే శ్రీ సారనాథో విభు:
   కావేరి నయనా తిథి: కలిరిపు స్తుత్య శ్శ్రితాభీష్టద||

వివరణ: సారనాథ పెరుమాళ్-సారనాయకి-సార పుష్కరణి-సార విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-కావేరికి ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశేషములు: పుష్కరిణి తీరమున కావేరి అమ్మన్ సన్నిధి కలదు. మకరమాసములో జరుగు రధోత్సవమున పెరుమాళ్లు శ్రీదేవి, భూదేవి, నీళాదేవి, సారనాయకి మహాలక్ష్మి వీరితో కలసి వేంచేయుదురు.

మార్గము: కుంభఘోణము నుండి కూడవాశల్ పోవు టౌన్‌బస్‌లో 12 కి.మీ. దూరమున గలదు. సత్రములు హోటళ్లు గలవు. ఉప్పిలియప్పన్(తిరువిణ్ణగర్) సన్నిధి నుండి ,నాచ్చియార్ కోయిల్ నుండియు కూడ పోవచ్చును. ఈ క్షేత్రమునకు 5 కి.మీ నాచ్చియార్ కోయిల్.

   కణ్‌శోర వెజ్గురుది వన్దిழிయ వెన్దழల్‌పోల్ క్కున్దలాళై
   మణ్‌శేర ములై యుణ్డ మామదలాయ్ వానవర్ తజ్కోవే యెన్ఱు
   విణ్ శేరు మిళన్దిజ్గళగడురిఇజ మణిమాడమల్‌గు; శెల్వ
   త్తణ్ శేఱైయెమ్బెరుమాన్ తాళ్ తొழுవార్ కాణ్మినెన్ఱలై మేలారే !
           తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొழி 7-4-1


అష్టవిధ పుష్పములు

భగవంతుని ప్రాకృత పుష్పములతో పాటు ఈ పుష్పముల తోడను పూజింపవలెను.

1. అహింసా. 2. ఇంద్రియ నిగ్రహము. 3. సర్వ భూత దయ. 4. క్షమా. 5. జ్ఞానము. 6. తపస్సు. 7. ధ్యానము. 8. సత్యము.

ఈ ఎనిమిది విష్ణువునకు ప్రీతికరమైన పుష్పములు.

శ్లో. అహింసా ప్రధమం పుష్పమ్‌-పుష్ప మింద్రియ నిగ్రహ:
   సర్వభూతదయా పుష్పం-క్షమా పుష్పం-విశేషత:
   జ్ఞానం పుష్పం-తప: పుష్పం-ధ్యానం పుష్పం తదైవ చ
   సత్య మష్ట విధం పుష్పం విష్ణో:ప్రీతి కరం భవేత్||