దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర/చరిత్ర

వికీసోర్స్ నుండి

ప్రభుత్వం నియమించి వారి దగ్గరికి పంపుతుంది. ప్రభుత్వమే అక్కడ రైతులకు సహకరించుటకు వ్యవసాయ కేంద్రాల్ని నడుపుతుంది. రైతులకు మంచి పశువుల్ని, మంచి విత్తనాల్ని అందజేస్తుంది. కొద్ది ఖర్చుతో పాతాళ బావులు త్రవ్విస్తుంది వాయిదా పద్ధతిన అందుకైన వ్యయం చెల్లించుటకు వెసులు బాటు రైతులకు కల్పిస్తుంది. పొలాల చుట్టూ ఇసుప కంచెల్ని సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతుల్ని ఆదుకుంటుంది

దక్షిణాఫ్రికా భూమధ్యరేఖకు దక్షిణాన వున్నది. భారతదేశం ఆరేఖకు ఉత్తరాన వున్నది. అందువల్ల వాతావరణం, శీతోష్ణస్థితి రెండు దేశాల్లో వేరువేరుగా వుంటుంది. అంతా తలక్రిందుల వ్యవహారమే ఋతువులూ అంతే. ఉదాహరణకు మనదేశంలో వేసవికాలం ప్రారంభమైతే, దక్షిణాఫ్రికాలో శీతాకాలం ప్రారంభమవుతుంది. వర్షాకాలానికి నిశ్చితసమయమంటూ అక్కడ వుండచు ఏసమయంలోనైనా అక్కడ వర్షాలు కురవచ్చు. సామాన్యంగా 20 అంగుళాల కంటే మించి అక్కడ వర్షపాతం వుండదు



చరిత్ర

ఆఫ్రికా యొక్క భూగోళాన్ని వివరిస్తూ గతప్రకరణంలో నేను క్లుప్తంగా వర్ణించిన భూగోళ విశేషాలు ప్రాచీన కాలం నుంచి అక్కడ అమలులో వున్నాయని పాటకులు భావించకూడదు అతిప్రాచీన కాలంనుంచి దక్షిణాఫ్రికాలో ఎవరు నివసిస్తూ వుండేవారో యింతవరకు తేలలేదు యూరపియన్లు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ హబ్షీవాళ్లు వున్నారు అమెరికాలో బానిసత్వం తాండవం చేస్తున్నప్పుడు అమెరికా నుంచి పారిపోయి కొద్దిమంది హబ్షీలు దక్షిణాఫ్రికా వచ్చి వుండిపోయారని కొందరి అభిప్రాయం వాళ్లలో జూలూలు, స్వాజీలు బసూటోలు, బెక్వానాలు మొదలుగాగల వేరువేరు తెగల వాళ్లు వుండేవారు. యీ హబ్షీలే దక్షిణాఫ్రికా మూలనివాసులని చాలా మంది అంటున్నారు. అయితే దక్షిణాఫ్రికా చాలా విశాలమైన దేశం. అక్కడ నివసిస్తున్న హబ్షీల జనాభా తక్కువేనని చెప్పవచ్చు. అంతకంటే 20 లేక 30 రెట్ల మంది జనం వచ్చి వుండుటకు వీలైన విశాలమైన దేశం దక్షిణాఫ్రికా రైలు మీద డర్బన్ నుంచి కేఫ్‌టౌను వెళ్లుటకు సుమారు 1800 మైళ్ల దూరం ప్రయాణం చేయవలసి వస్తుంది

సముద్రమార్గాన వెళ్లితే 1000 మైళ్ల దూరం వుంటుంది. మొదటి ప్రకరణంలో పేర్కొన్న నాలుగు అధినివేశ రాజ్యాల వైశాల్యం 473000 చదరపు మైళ్ళు

ఇంతపెద్ద భూభాగం మీద 1914లో హబ్షీల జనాభా 50 లక్షలు వుంటే తెల్లవారి జనసంఖ్య 13లక్షలు వున్నది. జూలూజాతి హబ్షీలు బలంగాను, అందంగాను వుంటారు. అందం అను విశేషణాన్ని హబ్షీల విషయంలో కావాలనే ప్రయోగించాను ఎర్రగావున్న చర్మాన్ని, కొటేరు ముక్కును అందానికి లక్షణాలని భావిస్తాం యిది ఆంధ విశ్వాసమే దాన్ని మరిచిపోతే జూలూజాతి వారిని సృష్టించునప్పుడు బ్రహ్మఏమీలోటు చేయలేదని చెప్పవచ్చు స్త్రీలు పురుషులు బాగా ఎత్తుగా వుంటారు. విశాలమైన ఛాతీ కలిగి వుంటారు వారి శరీరమందలి కండరాలు తీర్చిదిద్దినట్లు వుంటాయి బలంగా వుంటారు వారి పిక్కలు, బుజాలు మాంసపు కండలతో నిర్మించినట్లు వుంటాయి ఒక్కస్త్రీ గాని, పురుషుడుగాని, వంగి నడవరు. గూనితో నడవరు వారి పెదవులు మాత్రం పెద్దవిగాను, లావుగాను వుంటాయి. అయితే అవి మిగతా శరీరపరిమాణానికి అనువుగానే వుంటాయి. అందువల్ల వాళ్ల ఒడ్డుపొడవును నేను సమర్థిస్తాను వాళ్లకండ్లు గుండ్రంగా తేజస్సుతో నిండి వుంటాయి చప్పిడిముక్కు పెద్ద ముఖానికి సరిపోయేలా వుంటుంది. ఉంగరాల జుట్టు అవి వాళ్ళనిగనిగలాడే నల్లని శరీరం మీద అందంగా అమరివుంటుంది జూలూ తెగవారిని పలకరించి ఏమండీ మీ దక్షిణాఫ్రికాలో వుండే జాతులహరిలో అందమైన వారెవరని అడిగితే, వాళ్లు వెంటనే మేము అని సమాధానం చెబుతారు. వాళ్ల మాటను నేను కాదనలేను యిప్పుడు మనం ప్రపంచంలో ఎంతోమంది శాండోలను చూస్తున్నాం అనేకమంది వస్తాదులను చూస్తున్నాం, వాళ్లు తమ శిష్యుల శరీరనిర్మాణానికై ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వుంటారు. అలాంటి ప్రయత్నాలేమీ చేయకుండానే జూలూ జాతివారికి బలిష్టమైన అవయవాలు, సౌష్టవమైన శరీరం సహజంగానే లభించాయని చెప్పవచ్చు. భూమధ్య రేఖకు సమీపంలో వుండే వారి శరీరం నల్లగా వుంటుంది. యిది ప్రకృతినియమం ప్రకృతి తీర్చిదిచ్చిన శరీరాలు. ఆకారాలు అన్నీ సహజంగా అందమైనవేనని మనం అంగీకారానికి వస్తే, సౌందర్యాన్ని గురించి మనం భావించే భావాలనుంచి విముక్తులమవుతాం అంతేగాక భారత దేశంలో నివసిస్తున్నమన శరీరంకొద్దిగా నల్లగా వుంటే సిగ్గుతో క్రుంగిపోతూ వుంటాం అసహ్యించుకుంటూ వుంటాం యిట్టి భావాలనుంచి కూడా మనం బయటపడతాం

ఈ హబ్షీలు మట్టితోను. గడ్డితోను నిర్మించిన గుండ్రని గుడిసెల్లో వుంటారు. ప్రతిగుడిసెకు మట్టిగోడ గుండ్రంగా నిర్మించబడుతుంది. దాని పైభాగం గడ్డితో కప్పబడుతుంది మధ్యలో నిలబెట్టబడిన స్తంభంపై పైకప్పు ఆధారపడి వుంటుంది. ఒక చిన్న ద్వారం అమర్చి వుంటుంది. వంగి జనంలోనికి వెళ్ళి వస్తూ వుంటారు. యీ ద్వారమే గాలియొక్క రాక పోకలకు సాధనం యిందు కిటికీలు వుండపు మనవాళ్ల మాదిరిగానే హబ్షీలు కూడా మట్టిగోడల్ని పేడతోను మట్టితోను అలుకుతారు. వాళ్లు నాలుగు పలకల వస్తువు నిర్మించలేరని, అందువల్లనే గుండ్రని వస్తువులు నిర్మిస్తారని బోధపడుతుంది. అటువంటి శిక్షణయే వారికి లభించిందన్నమాట ప్రకృతిబడిలో పెరిగిన యీ నిర్దోషులగు మనుజుల జ్ఞానం, ప్రకృతిరీత్యా తమకు కలిగిన అనుభవం మీద ఆధారపడివుంటుంది

ఇట్టి మట్టి మేడలో సామాను కూడా అందుకు తగినట్లే వుంటుంది పాశ్చాత్య సభ్యత యిప్పుడు దక్షిణాఫ్రికాలో వ్యాప్తమై పోయింది. అంతకు పూర్వం హబ్షీవాళ్లు చర్మం దుస్తులు ధరించేవారు. పదుకోడానికి కూడా చర్మాల్నే ఉపయోగించేవారు. కుర్చీలు, టేబుళ్లు, పెట్టెలు వగైరాలు వారి గుడిసెల్లో వుండేవి కావు యిప్పుడు కూడా చాలా వరకు యిదే స్థితి యిండ్లలో యిప్పుడు కంబళ్లను వాడుతున్నారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలనకు పూర్వం హబ్షీజాతి స్త్రీ పురుషులు దరిదాపుగా నగ్నంగా తిరుగుతూ వుండేవారు యిప్పటికీ గ్రామాల్లో జనం ఆలాగేవున్నారు. వాళ్ళుతమ మర్మస్థలాల్ని చర్మంతో కప్పుకుంటారు. కొందరైతే ఆపని కూడా చేయరు అంతమాత్రాన వాళ్లకు తమ ఇంద్రియాలపై అదుపు వుండదని భావించకూడదు ఒక తెగవాళ్ళ అలవాటు ఒక విధంగా వుండి, మరో తెగవాళ్ళ అలవాటు అలా వుండకపోతే, మొదటి తెగవాళ్లు తమ అలవాటు మానుకోరు. ఒకరి నొకరు చూచుకొనుటకు కూడా వీళ్ళకు సమయం దొరకదు. ఒకనాడు శుకుడు నగ్నంగాస్నానం చేస్తున్న స్త్రీల మధ్యగా వెళ్లవలసి వచ్చింది. అయినా ఆయన మనస్సు గాని, ఆస్త్రీల మనస్సుగాని వికారానికి లోను కాలేదు అని భాగపతకారుడు వ్రాశాడు యిది నాకు అతిశయోక్తి యని అనిపించలేదు భారతదేశంలోయిలా జరిగితే యిప్పుడు జనం పూరుకుంటారా? వికారాలకు లోనుకాకుండా వుండగలరా అని ఎవరైనా అడిగితే అది మన పతనావస్థకు తార్కాణమని చెబుతాను మనం మనదృష్టితో హబ్షీవాళ్లు అడివిజాతి ప్రజలని భావిస్తుంటాం. నిజానికి వాళ్లు అట్టిస్థితిలో లేరు

హబ్షీస్త్రీలు పట్టణాలకు వస్తే కంఠం దగ్గరనుంచి మోకాళ్ళవరకు వస్త్రం ధరించి తీరాలని నియమంవున్నది ఆ స్త్రీలకు యిష్టం లేకపోయినా బట్టలు ధరించక తప్పదు. అందువల్ల దక్షిణాఫ్రికాలో యీ రకం దుస్తులకు గిరాకీ హెచ్చింది. యూరపు నుంచి అట్టి దుస్తులు విపరీతంగా అక్కడికి దిగుమతి అవుతున్నాయి. పురుషులు నడుంనుంచి మోకాళ్ల వరకు దుస్తులు ధరించి తీరాలి యూరపు నుంచి దిగే బట్టలు వాళ్లు ధరిస్తున్నారు. అవికట్టని వాళ్లు డ్రాయరు లాంటి బట్ట ధరిస్తారు. దక్షిణాఫ్రికా ప్రజలు వుపయోగించే బట్టంతా యూరపు నుంచే దిగుమతి అవుతున్నది

హబ్షీల ప్రధాన ఆహారం మొక్కజొన్న దొరికితే వాళ్లు మాంసం కూడా తింటారు. కారం మసాలాలంటే వాళ్లకు తెలియదు. అది అదృష్టమే మిర్చిమసాలాల వాసనగాని, పసుపురంగుగాని ఆహారంలో కనబడితే హబ్షీలు తినడానికి యిష్టపడరు. అడివిజాతి వారైతే అసలు అట్టి ఆహారాన్ని ముట్టరు ఉడకబెట్టిన మొక్క జొన్నలో కొద్దిగా పుప్పుకలిపి ఒక పౌండు మొక్కజొన్న ఆహారం తింటారు. ప్రతిజూలుజాతివాడి పనియిదే కొందరు మొక్కజొన్న పిండిగా విసిరి, దాన్ని నీటిలో ఉడకబెట్టి సంకటి తయారుచేసి దాన్ని భుజిస్తారు. ఎప్పుడైనా మాంసం దొరికితే, పచ్చిదాన్నో లేక వండినదాన్నో, ఉప్పువేసుకొని తింటారు. నిప్పుల మీద వేయించి కూడా తింటారు. ఏ మాంసాన్నైనా సరే తింటారు. ఏమాత్రం సంకోచించరు. వాళ్ల భాషల పేర్లు వాళ్ల జాతులపేరట వుంటాయి. తెల్ల వాళ్లు వచ్చిన తరువాతనే వ్రాత వ్యవహారం అక్కడ ప్రారంభమైంది. హబ్షీలకు అక్షరక్రమం అ, ఆ, క, ఖ, గ రూపంలో లేదు. హబ్షీల కోసం బైబిలు రోమన్ లిపిలో ప్రచురించారు జూలూ భాష మధురంగా వుంటుంది. వారి శబ్దాలకు అర్థం కావ్యత్వం రెండూ వుంటాయని చదివాను విన్నాను నేను నేర్చిన కొన్ని హాబ్షీ శబ్దాలవల్ల వారి భాషను గురించి పై నిర్ణయానికి వచ్చాను. పట్టణాల్లోను, అధినిదేశ రాజ్యాల్లోను వాడిన యూరోపియన్ పేర్లన్నింటికి మధురమైన హబ్షీ పేర్లు వున్నాయి. అవి జ్ఞాపకం లేనందున యిక్కడ వ్రాయలేదు. క్రైస్తవ పాదరీలు అభిప్రాయం ప్రకారం హబ్షీలకు మతమంటూ ఏమీ లేదు ఆధ్యాత్మికంగా ఆలోచించితే హబ్షీలు ఏవో ఒక అర్ధం కాని అలౌకికశక్తిని అంగీకరిస్తారని, దాన్ని పూజిస్తారని తేలుతుంది. ఆశక్తికి వాళ్లు భయపడతారు. శరీరం నాశనమైన తరువాత మనిషి పూర్తిగా నాశనం కాడని వాళ్ల విశ్వాసం నీతికి కట్టుబడి వుంటారు. కనుక వారిని ధార్మిక పురుషులుగా భావించవచ్చు నిజమేదో, అబద్ధమేదో వాళ్ళకు బాగా తెలుసు సామాన్యంగా హబ్షీలు సత్యాన్ని పాలిస్తూ వుంటారు పాశ్చాత్యులతో బాటు మనం కూడా ఆవిధంగా పాలిస్తున్నామనడం సందేహాస్పదమే వాళ్లకు దేవాలయాలుగాని, అటువంటి స్థలాలు గాని లేవు యితర జాతుల వారి వలెనే వారిలో కూడా అనేక మూఢనమ్మకాలు ప్రచలితమై వున్నాయి ఆశ్చర్యకరమైన విషయం ప్రపంచంలో ఏ జాతి వారికీ తీసిపోని యీ హబ్షీజాతి వారు పిరికిపందలు ఇంగ్లీషు పిల్లవాణ్ణి చూచినా భయపడిపోతారు. ఎవరైనా పిస్తోలు ఎక్కుబెట్టి చూపిస్తే చాలు హబ్షీ వాడు పారిపోతాడు. పారిపోలేకపోతే మూర్ఖునివలె నీరసపడి పోతాడు. దీనికి ఒక కారణం వున్నది. ఇంగ్లీషు వాళ్లు బహుకొద్ది మందే అట్టి కొద్దిమంది ఆంగ్లేయులు వచ్చి పెద్ద సంఖ్యలో వున్న తామందరినీ వశం చేసుకున్నారంటే, వారిలో ఏదో గొప్ప శక్తి నిండి యున్నదని వాళ్ళభావం వాళ్ళకు విలువిద్య బాగా తెలుసు కాని ఇంగ్లీషు వాళ్లు వాళ్లధనస్సుల్ని, బాణాల్ని లాగివేశారు. తుపాకీని వాళ్లు ఎరుగరు. ఎన్నడూ ప్రయోగించ లేదు తుపాకీ ఎలా పని చేస్తుందో వాళ్లకు తెలియదు. అగ్గిపుల్ల అయినా వెలిగించనవసరం లేకుండా కేవలం వేలితో నొక్కగానే, అది ప్రేలడం, ఎదురుగా వున్న వారికి గుండు దెబ్బ తగలడం, వాడు నేల కూలటం అంత విచిత్రంగా వాళ్లకు తోస్తుంది. అందువల్ల తుపాకీని చూచినా, తుపాకీ పట్టుకున్న వాణ్ణి చూచినా హబ్షీలకు విపరీతమైన భయం వాళ్లు, వాళ్ల పూర్వీకులు తుపాకుల బీభత్సాన్ని చూచారు. ఎంతో మంది తమ వారిని తుపాకులు పొట్టనపెట్టు కున్నాయని వాళ్లకు తెలుసు. అయితే చాలామందికి దానివివరం తెలియదు

ఈ జాతిలో మెల్లమెల్లగా సభ్యత వ్యాప్తమవుతూ వున్నది. పాదరీలు ఏసుక్రీస్తు సందేశాన్ని వారికి బోధిస్తున్నారు. వాళ్లకోసం స్కూళ్లు తెరిచారు అక్షరాలు నేర్పుతున్నారు. వారి కృషివల్ల మంచి నడతగల హబ్షీలు తయారైనారు. వారితో బాటు అక్షరజ్ఞానం పొందని, సభ్యత అంటే ఏమిటో తెలియని కొందరు హబ్షీలు మోసగాళ్లు గాను, ప్రమాదకారులు గాను కూడా తయారైనారు. సభ్యత నేర్చిన హబ్షీలంతా త్రాగుడుకు అలవాటు పడ్డారు వారి శక్తివంతమైన శరీరంలోకి మద్యం ప్రవేశించగానే యిక వాళ్లు పిచ్చివాళ్లైపోయి ఏంచేస్తారో వారికే తెలియదు రెండు రెండు కలిపితే నాలుగు అవడం ఎంత నిజమో, సభ్యత పొందినవారి అవసరాలు పెరగడం కూడా అంతనిజమే హబ్షీల అవసరాలను పెంచడానికని, కష్టం విలువవారికి అర్థమయ్యేలా చేయడానికని. హబ్షీల మీద తలపన్ను, గుడిసెపన్ను వేశారు యిట్టి పన్నుల్ని వేయకపోతే హబ్షీలు తమ తమ పొలాల్లోనే పడుకుంటారు బంగారు గనుల్ని వజ్రపు గనుల్ని త్రవ్వడానికి ముందుకు రారు. వాళ్లు వచ్చి గనులు త్రవ్వకపోతే బంగారం, వజ్రాలు భూమిలోపలే పడి వుంటాయి యిట్టి పన్నులు విధించకపోతే పాశ్చాత్యులకి చాకిరీ చేయుటకు బానిసలు దొరకరు. ఆంగ్లేయుల యీ పాచిక అక్కడ బాగా పారింది. వేలసంఖ్యలో హబ్షీలు చాకిరీకి దొరికారు గనుల్లో పని చేయడం వల్ల వాళ్లను క్షయరోగం పట్టుకుంది. ఆజబ్బును అక్కడ మైనర్స్‌థైసిస్ అని అంటారు. యిది ప్రాణానికి ముప్పు తెచ్చే జబ్బు ఇట్టి జబ్బు గలవాళ్లు గనుల దగ్గర కుటుంబాలతో సహా వుంటారు. అక్కడ యీజాడ్యంతోబాటు యింకా ఎన్ని రోగాలు వ్యాప్తమయ్యాయో ఊహించలేము అరోగాలకు వాళ్లే బలిఆయిపోతూ వుండేవారు. దక్షిణాఫ్రికాలో వుంటున్న ఇంగ్లీషు వాళ్లుకూడా యీ గంభీరమైన సమస్యను పట్టించుకొని పరిష్కారానికై కృషి ప్రారంభించారు. చివరికి ఒక్క విషయం అందరికీ అర్ధమైందని భావిస్తున్నాను పాశ్చాత్య సభ్యతా ప్రభావం వల్ల ఉపయోగంకంటే హబ్షీలకు అపకారమే అత్యధికంగా జరిగిందనే విషయం సత్యం యిది కావాలంటే ప్రతివారూ చూడవచ్చు

ఇట్టి నిర్దోషులైన జాతివారిపై 400 సంవత్సరాలకు పూర్వం డచ్ వారికన్ను పడింది. దానితో అక్కడికి ప్రవేశంచి వాళ్లు డేరా వేశారు. కొంత మంది డచ్‌వారు తమ అధినివేశరాజ్యంగా వున్న జావానుంచి మలైజుతి బానిసల్ని తీసుకొని దక్షిణాఫ్రికా యందలి కేప్‌కాలనీ అనుచోటుకు వచ్చారు. మలైజాతి ప్రజలు మహమ్మదీయులు వారిలో డచ్‌వారి రక్తంతో పాటు, వారి గుణాలు కూడా కొన్ని చొరబడ్డాయి. వేరు వేరు ప్రదేశాలకు ప్రాకినా వారి ప్రధాన కేంద్రం కేప్‌టౌన్ నాత్రమే కొంతమంది మలై వాళ్లు తెల్లవాళ్ల దగ్గర చాకిరీ చేస్తున్నారు. కొందరు స్వతంత్ర వృత్తుల్ని చేపట్టారు. మలై స్త్రీలు బాగా శ్రమ పడతారు. తెలివిగలవాళ్లు కూడా వాళ్ల నడవడి శుభ్రంగా వుంటుంది మలై స్త్రీలు చాకలి పని, కుట్టుపని బాగాచేస్తారు. పురుషులు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు. చాలామంది జట్కాలు, టాంగాలు తోలిసంపాదిస్తూ వుంటారు. కొంతమంది ఆంగ్లంలో ఉన్నత విద్య కూడా అభ్యసించారు వారిలో ఒకరు డా॥ అబ్దుల్ రహమాన్ వారు కేప్ టౌనులో సుప్రసిద్ధులు వారు కేప్‌టౌన్ అసెంబ్లీలో కూడా మెంబరు అయ్యారు. తరువాత క్రొత్త మార్పులు తెచ్చి ముఖ్య అసెంబ్లీకి వెళ్లకుండా యిట్టి వారిని ప్రభుత్వం ఆపివేసింది

డచ్ వాళ్లను గురించి చెబుతూ వుండగా మధ్యన మలై వారిని గురించిన విషయం వచ్చింది. అసలు డచ్‌వాళ్లు ఎలా ముందుకు సాగారో చూద్దాం డచ్‌వాళ్లు పరాక్రమం గల యోధులు తెలివిగలరైతులు యిప్పటికీ వారి పరిస్థితియిదే తమ సమీపంలో నున్న దేశమందలి భూమి సారవంతమైనదని గ్రహించారు. అక్కడి ప్రజలు ఏడాది పొడవునా పనిచేయకుండా కొద్ది రోజులు కష్టపడి. అసంపాదనతో హాయిగా జీవితం గడుపుకుంటున్నారని తెలుసుకున్నారు

తమ దగ్గర తుపాకీ వున్నది తెలివి వున్నది. శక్తి వున్నది. యిక వీళ్లను లొంగదీసుకొని వీళ్ల చేత శ్రమ ఎందుకు చేయించకూడదు అనుభావం వారికి కలిగింది. పశుపక్ష్యాదుల మాదిరిగా యితర జనాన్ని కూడా లొంగదీసుకోగలమనే నిర్ణయానికి వాళ్లు వచ్చారు. యీ పనికి మతం అడ్డురాదనే నిర్ణయానికి కూడా వచ్చి దక్షిణాఫ్రికాకు చెందిన హబ్షీవాళ్ల చేత వ్యవసాయం చేయించడం మొదలు పెట్టారు.

డచ్ వాళ్లు ప్రపంచమందలి మంచి ప్రదేశాల కోసం వెతకడం ప్రారంభించినట్లే, ఇంగ్లీషు వాళ్లు కూడా అట్టి ప్రయత్నం ప్రారంభించారు మెల్లమెల్లగా ఇంగ్లీషువాళ్లుకూడా దక్షిణాఫ్రికాలో ప్రవేశించారు. డచ్‌వాళ్లు. ఇంగ్లీషువాళ్లు యిద్దరూ పెద్దతండ్రి పినతండ్రి కొడుకులే యిద్దరి స్వార్ధం ఒకటే, యిద్దరి స్వభావం ఒకటే ఒకే కుమ్మరి వాడు తయారుచేసిన కుండలు ఒక చోట చేరితే కొన్ని ఒక దానికింకొటి తగిలిపగిలి పోవడం సహజమే కజ డచ్‌వాళ్లు, ఇంగ్లీషు వాళ్లు మెల్లి మెల్లిగా దక్షిణాఫ్రికాలో కాళ్లు చాచడం ప్రారంభించి హబ్షీవాళ్లపై పాలన సాగిస్తూ ముందుకు సాగిసాగి ఒకరినొకరు ఢీకొన్నారు. యుద్ధాలు జరిగాయి మజూబా పర్వతం మీద ఇంగ్లీషు వాళ్లు ఓడిపోయారు కూడా యీ ఓటమి ఇంగ్లీషు వాళ్ల శరీరంపై పెద్ద పుండు అయిపోయి చివరికి 1899 నుంచి 1902 వరకు ప్రపంచ ప్రసిద్ధ బోయర్ యుద్భం రూపందాల్చి ముమ్మరంగా సాగింది జనరల్ క్రోవ్జేని, లార్డ్ రాబర్ట్స్ ఓడించి, వెంటనే విక్టోరియా మహారాణికి మజూబా పగతీర్చుకున్నాం అని తంతి పంపించాడు. వీరిరువురికి యుద్ధం ప్రారంభం కాకపూర్వం డచ్ వాళ్లు ఇంగ్లీషువాళ్ల పొడను సైతం అంగీకరించలేదు. వాళ్లు దక్షిణాఫ్రికా యందలి లోపలి భాగాలకు వెళ్లిపోయారు. దానితో ట్రాన్స్‌వాల్, ఆరెంజ్ రెండూ ఫ్రీ ప్రీస్టేట్లు అయ్యాయి. ఈ డచ్ వాళ్లనే దక్షిణాఫ్రికాలో బోయర్లు అని అంటారు పసిపిల్ల వాడు తల్లిని కరుచుకున్నట్లు డచ్‌వాళ్లు కూడా తమ భాషను కరుచుక్కూర్చుంటారు దేశస్వాతంత్ర్యానికి, భాషకు అవినాభావ సంబంధం ఉన్నదని ఉంటుందని డచ్‌వారి మనస్సుల్లో గాఢంగా నాటుకున్నది. దానితో వారి భాష అక్కడి వారందరికీ అందుబాటులోకి వచ్చింది. బోయర్లు హాలెండు ప్రజలతో దగ్గరి సంబంధం పెట్టుకోలేకపోయారు. అందువల్ల డచ్ వాళ్లు సంస్కృత భాషనుంచి వెలువడిన ప్రాకృత భాషల వలె, డచ్‌నుంచి వెలువడిన అపభ్రంశ డచ్ భాష మాట్లాడటం ప్రారంభించారు. వాళ్లు తమ పిల్లల మీద మరొభాషాభారం మోపడం యిష్టంలేక ఆ డచ్ అపభ్రంశ భాషకే స్థిర రూపం కల్పించారు ఆ భాషను 'టాల్' అని అంటారు ఆ భాషలోనే పుస్తకాలు వ్రాశారు పిల్లలకు ఆ భాషలోనే విద్య నేర్పుతున్నారు. అసెంబ్లీలో కూడా బోయర్లు ఆ భాషలోనే మాట్లాడుతారు. యూనియన్‌గా రూపొందిన తరువాత దక్షిణాఫ్రికా యందంతట రెండు భాషలు అనగా టాల్ లేక డచ్ మరియు ఇంగ్లీషు భాష సమాన హోదా అనుభవిస్తున్నాయి. అక్కడి ప్రభుత్వ గెజెట్‌ను, అసెంబ్లీ వ్యవహారమంతటిని రెండు భాషల్లో ముద్రిస్తున్నారు

బోయర్లు ఆమాయకులు ధర్మ పరాయణులు వాళ్లు తమ విశాలమైన పొలాల్లో వుంటారు. అక్కడి పొలాల వైశాల్యాన్ని మనం ఊహించలేము మన రైతుల దగ్గర రెండు లేక మూడు ఎకరాలోలేక అంతకంటే తక్కువొ పొలం వుంటుంది కాని అక్కడి రైతుల దగ్గర వంద, రెండు వందల ఎకరాల విస్తీర్ణం గలపొలం వుంటుంది. యింత పెద్దపొలాన్ని వెంటనే దున్ని పంటపండించాలని డచ్ రైతులు భావించరు. ఎవరైనా యిదేమిటి అని ఆడిగితే “పడివుండనీయండి లోటు ఏమిటి? మేము కాకపోతే మా బిడ్డలు వ్యవసాయం చేస్తారు" అని అంటారు

పోరాట పటిమ మాత్రం ప్రతి బోయర్ యందు కనబడుతుంది. డచ్ వాళ్లు పరస్పరం కీచులాడుకుంటారు కాని పరాయివాడు దాడిచేస్తే మాత్రం తమదేశ స్వాతంత్ర్యం కోసం అంతా కలిసి ఐక్యంగా వుండి నిలబడి పోరాటం చేస్తారు. యుద్ధ శిక్షణ ప్రత్యేకించి వాళ్లకు యివ్వవలసిన అవసరం వుండదు ప్రతిబోయర్‌లోను స్వతస్సిద్ధంగా యోధుని గుణాలు నిండివుంటాయి జనరల్ స్మట్స్, జనరల్ డెవెట్. జనరల్ హర్జోగ్ ముగ్గురూ పెద్దవకీళ్లు ముగ్గురు పెద్దరైతులు ముగురూ అంత పెద్దయోధులే జనరల్ బోధాదగ్గర 9000 ఎకరాల పొలం వుండేది. వ్యవసాయానికి సంబంధించిన పేచీ వ్యవహరాలన్నీ ఆయనకు క్షుణ్ణంగా తెలుసు సంధివార్తల్లో పాల్గొనుటకు ఆయన యూరప్ వెళ్లాడు. గొర్రెల విషయంలో బోధా అమిత నిపుణుడు అంతటి గొర్రెల నిపుణుడు యూరప్‌లో మరొకడు లేడు అని జనం అనుకునేవారు. ఆ జనరల్ బోధాయే కీ||శే|| ప్రెసిడెంట్ క్రూగర్ గద్దెను అధిష్టించాడు. ఆయన యొక్క ఆంగ్ల జ్ఞానం అమోఘం అయినా ఇంగ్లాండు వెళ్లి జార్జి చక్రవర్తి అక్కడి మంత్రి మండలికి సభ్యుల్ని కలిసినప్పుడు ఇంగ్లీషులో మాట్లాడలేదు. తన మాతృభాషయగు డచ్‌లోనే మాట్లాడాడు అదీ తమ మాతృ భాషపై గల వారి మక్కువ తమ భావాల్ని ప్రకటించుటకు ఇంగ్లీషు మాట్లాడి తప్పు చేయడం వారికి యిష్టం వుండదు. సరియైన శబ్దం కోసం భావాల్ని కుంచించుకోవడం వారికి యిష్టం వుండదు. బ్రిటిష్ మంత్రి మండలి తెలియని ఇంగ్లీషు ఇడియము (వాక్యాంశం) ను వాడటం. దాని అర్ధం తెలుసుకొనుటకు ప్రయత్నించి మరో సమాధానం చెప్పుడం దానితో గాబరా పడటం. అసలు పనికి ఆటంకం కలగడం వారికి యిష్టం వుండదు అటువంటి పొరపాట్లు వాళ్లు చెయ్యరు

బోయర్ పురుషుల వలెనే స్త్రీలు కూడా నిరాడంబరంగా వుంటారు వారికి శౌర్య ప్రతాపాలు ఎక్కువ బోయర్ యుద్ధంలో పురుషులు వీరోచితంగా పోరాడారు. అందుకు కారణం వారి స్త్రీలే బోయర్ స్త్రీలు వైధవ్యానికి భయపడలేదు. తమ భవిష్యత్తును గురించి కూడా వారు భయపడలేదు

బోయర్లు ధర్మ పరాయణులని పైన వ్రాశాను వారు క్రైస్తవులు అయితే ఏసుక్రీస్తు యొక్క న్యూటెస్టామెంటు యెడ వారికి విశ్వాసమని చెప్పుటకు వీలు లేదు. నిజానికి యూరపు అంతా న్యూటైస్టామెంటసు విశ్వసిస్తున్నదా " విశ్వసిస్తున్నామని అంతా అంటారు కాని ఏసుక్రీస్తు బోధించిన శాంతి ధర్మాన్ని సరిగా పాటించే వారు క్రైస్తవుల్లో తక్కువే బోయర్లకు న్యూటెస్టామెంటు పేరు మాత్రం తెలుసు ఓల్డ్ టెస్టామెంటు మీద వారికి విశ్వాసం ఎక్కువ అందు ముద్రించబడిన యుద్ధాలను వారుశ్రద్ధాభక్తులతో చదువుతారు. ఆ యుద్ధ వర్ణనలను బటిటి వేస్తారు. మూసా ప్రవక్త చెప్పిన కంటికి కన్ను, పంటికి పన్ను ఆను బోధను పూర్తిగా అంగీకరిస్తారు. వాళ్ల వ్యవహార సరళికూడా అలాగే వుంటుంది

తమ మతబోధ ప్రకారం స్వాతంత్ర్య సముపార్జన కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా వుండాలని బోయర్ స్త్రీల నిర్ణయం కనుకనేవారు సంతోషంతో. ధైర్యంతో కష్టాలనన్నింటిని సహించారు. బోయర్ స్త్రీలను లొంగదీయాలని, వాళ్ల ఆవేశం మీదనీళ్లు చల్లాలని లార్డ్‌కిచనర్ ఎంతో ప్రయత్నం చేశాడు. వాళ్లను వేరువేరు క్యాంపుల్లో బంధించి వుంచాడు అక్కడ వాళ్లు అష్టకష్టాలు పడ్డారు. తిండికి నీటికి కూడా శ్రమ పెట్టారు అపరిమిత చలిని, అపరిమితమైన ఎండను భరించారు. చిత్తుగా తాగి మైమరిచిన సైనికులు, కామంతో కళ్ళు మూసుకుపోయిన జవాన్లు ఆ అనాధలపై క్రూరంగా దూకేవారు పలురకాల ఉపద్రవాలు యీ కాంపుల్లో జరుగుతూ వుండేవి. అటునా బోయర్‌స్త్రీల ధైర్యం చెదరలేదు. వాళ్లు ఎవ్వరికీ లొంగలేదు యీ వ్యవహారమంతా తెలుసుకొని ఎడ్వర్డు చక్రవర్తి లార్డ్‌కిచనర్‌కు "నేను దీన్ని సహించలేకపోతున్నాను బోయర్లను వశం చేసుకునేందుకు యిదొక్కటే మార్గం అని అనుకుంటే అది సరికాదు వాళ్లతో ఏవిధమైన రాజీకైనా నేను సిద్ధంగా వున్నాను" అని స్పష్టంగా జాబు వ్రాశారు

ఈ కష్టాలగాధ ఇంగ్లాండు ప్రజలకు తెలిసే సరికి వారంతా ఎంతో బాధపడ్డారు. బోయర్ల ప్రతాపాన్ని తెలుసుకొని ఆంగ్ల ప్రజలు ఆశ్చర్యపడిపోయారు. జన సంఖ్యలో తక్కువగా వున్నబోయర్ ప్రజలు ప్రపంచమందంతట తమ సామ్రాజ్యాన్ని వ్యాప్తం చేసిన బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి నిలిచారే అను బాధ మాత్రం ఆంగ్ల ప్రజలకు కలిగింది. అయితే బోయర్ స్త్రీల కష్టగాధలకు సంబంధించిన సమాచారం ఉదార హృదయులగు కొందరు ఇంగ్లీషు మేధావుల ద్వారా ఇంగ్లాండుకు అందేసరికి అక్కడి జనం విచారసాగరంలో మునిగి పోయూరు యీ సమాచారం బోయర్ పురుషుల ద్వారా ఇంగ్లాండు చేరలేదు. వారంతా యుద్ధరంగాల్లో పోరాటం సాగిస్తున్నారు కాంపుల్లో అష్టకష్టాలు సహిస్తున్న బోయర్ స్త్రీల ద్వారా కూడా యీ సమాచారం ఇంగ్లాండు చేరలేదు ఆంగ్ల ప్రజల హృదయావేదనను తెలుసుకొని కీ. శే. సర్‌హెనరీ కాంప్‌బెల్ బైనర్‌మెన్ బోయర్ యుద్దానికి వ్యతిరేకంగా గర్జించారు. కీ. శే. స్టెడ్ అను వారు బహిరంగంగా బోయర్ యుద్ధంలో ఇంగ్లీషు ప్రభుత్వం ఓడిపోవాలని దేవుని ప్రార్థించడమేగాక ప్రజలందరినీ ఆ విధంగా ప్రార్థనలు చేయమని ప్రోత్సహించారు. దానితో గొప్ప చమత్కారం జరిగిపోయింది. సాహసంతో కష్టాల్ని సహించే శక్తిని చూచి రాళ్లైనా కరిగిపోతాయని అది తపస్సు యొక్క మహిమయని, అదే సత్యాగ్రహశక్తి అని స్పష్టంగా తేలిపోయింది

దానితో ఫ్రీనిఖన్ ఒడంబడిక జరిగింది. తద్వారా దక్షిణాఫ్రికా యందలి నాలుగు అధినివేశ రాజ్యాలు ఒక యూనియన్ క్రిందికి వచ్చాయి. పత్రికలు చదివే భారతీయులకు ఆ సంధి విపరాలు తెలిసియే యుంటాయి అయినా రెండు మూడు విశేషాలు చెప్పడం అవసరు ఫ్రినిఖన్ సంధి జరగగానే నాలుగు రాజ్యాలు వెంటనే ఏకంకాలేదు ప్రతి అధినివేశ రాజ్యానికి ఒక అసెంబ్లీ ఏర్పడింది. అక్కడి మంత్రి మండలి మాత్రం ఆ అసెంబ్లీకి పూర్తిగా జవాబుదారీ వహించదు. ట్రాన్సవాల్ మరియు ఫ్రీస్టేట్ యొక్క పరిపాలనా పద్ధతి. క్రౌస్ కాలనీ యొక్క పరిపాలనా పద్దతి వలె వున్నది. యిలాంటి సంకుచిత అధికారం జనరల్ బోధాకు గాని, లేక జనరల్ స్మట్సుకు గాని సంతృప్తికలిగించలేదు. అయినా లార్డ్ మిల్నర్ వరుడు మినహా కన్యాదానం పద్ధతిని అనుసరించడం మంచిదని భావించాడు. జనరల్ బోధా. జనరల్ స్మట్సు యిద్దరూ అసెంబ్లీకి దూరంగా వుండిపోయారు వారు సహకరించలేదు అట్టి ప్రభుత్వంతో ఏ విధమైన సంబంధం పెట్టుకోడానికి వారు నిరాకరించారు లార్డ్ మిల్నర్ కటువైన ప్రసంగం చేశాడు. లార్డ్ జనరల్ బోధా మొత్తు బాధ్యతంతా తనదేననీ, లేక తన మీదే ఉన్నదనీ భావించకూడదనీ, బోధా లేక పోయినా రాజ్యకార్యాలు జరుగుతాయని మిల్నర్ ప్రసంగ సారాంశం నేను సంకోచించకుండా బోయర్ల ప్రతాపాన్ని. వాళ్ల స్వాతంత్రేచ్చను, వాళ్ల ఆత్మత్యాగాన్ని గురించి వివరించాను. అయితే కష్టకాలంలో సైతం వాళ్లలొ వాళ్లకు అభిప్రాయభేదాలు కలుగలేదని గాని, వారిలో బలహీనమనస్కులు లేరని చెప్పుడం గాని నా ఉద్దేశ్యం కాదు లార్డ్ మిల్నర్ బోయర్ల నుంచి తేలికగా తృప్తి పడే ఒక వర్గాన్ని తయారు చేసినిలబెట్టాడు వాళ్ల సహాయంతో అసెంబ్లీ వ్యవహారం చక్కబెట్టగలనని ఆయన భావించాడు ఎంత గొప్ప నాటక రచయిత అయినా. ప్రధాన పాత్ర లేకుండా నాటకాన్ని ఆడించి రక్తికట్టించలేడు. అలాంటిది యీ కఠిన కఠోర ప్రపంచంలో రాచకార్యాలు చక్కదిద్దేరాజపురుషుడు ముఖ్యపాత్రని మరిచి అంతా తానే చేయగలనని అనుకుంటే పిచ్చితనం కాక మరేమవుతుంది? యిదే స్థితి లార్డ్ మిల్నర్‌కి పట్టింది. లార్డ్‌మిల్నర్ తీవ్ర పదజాలంతో జనరల్ బోధాను తిరస్కరించాడే, కాని ఫ్రీస్టేట్ పరిపాలన జనరల్ బోధా సహకారం లేనిదే జరగడం సాధ్యం కాదని తేలేసరికి లార్డ్‌మిల్నర్ తనతోటలో కాలుగాలిన పిల్లిలా తిరిగేవాడని చెబుతారు. జనరల్ బోధా తన అభిప్రాయాల్ని స్పష్టంగా ప్రకటించాడు. ఫ్రీనిఖస్ సంధి వల్ల బోయర్ ప్రజలకు తమ పరిపాలన చేసుకొను పూర్తి హక్కు అధికారం వెంటనే లభిస్తుందని విశ్వసించారు లేకపోతే నేను ఆసంధ పత్రం మీద సంతకం చేసి యుండేవాణ్ణికాను అని స్పష్టంగా ప్రకటించేసరికి, లార్డ్ కిచనర్ అందుకు సమాధానం చెబుతూ నేను జనరల్ బోధాకు ఆవిధంగా చెప్పలేదు. బోయర్ ప్రజలు విశ్వాసపాత్రులని ఋజూ అయిన కొద్దీ వారికి స్వతంత్రం లభిస్తూ వుంటుంది అని మాత్రమేచెప్పాను అని ప్రకటించాడు. వీరిద్దరి మధ్య న్యాయం చెప్పేది ఎవరు? మధ్యవర్తి ద్వారా పరిష్కారం చేద్దాం అని అంటే జనరల్ బోధా అంగీకరిస్తాడా? అయితే ఇంగ్లాండులో గల పెద్ద ప్రభుత్వం మాత్రం చేసిన న్యాయ నిర్ణయం దాని గౌరవప్రతిష్టల్ని ఎంతో పెంచిందని చెప్పవచ్చు. ఆ ప్రభుత్వ నిర్ణయ ప్రకారం బలవత్తరంగా వున్న పక్షాన్ని మినహాయించి, బలహీనంగా వున్న పక్షం చెప్పిన దాన్ని అంగీకరించి తీరాలి

న్యాయము, సత్యము రెంటి దృష్ట్యా వారు చెప్పిందే న్యాయ సమ్మతం నేను వ్రాసిన విషయంపై నా అభిప్రాయం ఎలా వున్నప్పటికీ చదివిసవాడి మనస్సు మీద, విన్నవాడి మనస్సు మీద ఏ ప్రభావం పడుతుందో, ఆ విధంగానే వ్రాశానని, లేక నా అభిప్రాయం వెల్లడించానని భావించాలి పలుసార్లు మనం బంగారం వంటి పైసూత్రాన్ని పాటించం అందువల్లనే కలహాలు. కార్పణ్యాలు ఏర్పడుతూ వుంటాయి సత్యం పేరట ముప్పావు అసత్యాన్ని పాటిస్తూ వుంటాము

ఈ విధంగా జనరల్ బోధాకు అనగా సత్యానికి సంపూర్తిగావిజయం లభించింది. అప్పుడు అతడు పరిపాలనా బాధ్యతను స్వీకరించాడు. తత్ఫలితంగా నాలుగు ఆధినివేశ రాజ్యాలు ఏకమయ్యాయి. దక్షిణాఫ్రికాకు స్వాతంత్ర్యం లభించింది. యూనియన్ జాక్ ఆదేశం పతాక ఆుంది. మ్యాపుల్లో ఆ దేశం రంగు ఎరుపుగా చిత్రించారు. ఏది ఏమైనా దక్షిణాఫ్రికా పూర్తిగా స్వతంత్ర దేశమని అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం అంగీకరించనిదే బ్రిటిష్ సామ్రాజ్యం ఒక్క పైసకూడా దక్షినాఫ్రికా నుంచి తీసుకు వెళ్లడానికి వీల్లేదు.

అంతేగాక దక్షిణాఫ్రికా కోరుకుంటే బ్రిటిష్ వారి పతాకను నిరాకరించవచ్చునని, పేరుకూడా మార్చుకోవచ్చునని కూడా బ్రిటిష్ మంత్రులు ప్రకటించారు. అయినా దక్షిణాఫ్రికాయందలి తెల్లవారు అందుకు పూనుకోలేదు కారణాలు అనేకం వున్నాయి బోయర్ నేతలు చాలా తెలివిగల వారు నిపుణులు తమకు నష్టం కలుగకుండా వుంటే, బ్రిటిష్ సామ్రాజ్యంతో సంబంధం పెట్టుకోవడానికి వారికి ఏమీ యిబ్బంది వుండదు. మరో ముఖ్య కారణంకూడా వున్నది. నేటాలులో ఇంగ్లీషు వారి సంఖ్య ఎక్కువ అయితే బోయర్ల కంటే తక్కువ జోహన్స్‌బర్గ్‌లో ఇంగ్లీషువాళ్లే ఎక్కువ అట్టిస్థితిలో బోయర్లు దక్షిణాఫ్రికాలో తమ సొంత రాజ్యాన్ని స్థాపించదలుచుకుంటే అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం వున్నది. అందువల్లనే దక్షిణాఫ్రికా యిప్పటికీ బ్రిటిష్ సామ్రాజ్యానికి డొమినియన్‌గా వున్నది

దక్షిణాఫ్రికా యూనియస్ రాజ్యాంగాన్ని ఎలా నిర్ధారించారో కూడా తెలుసుకోవడం అవసరం నాలుగు అధినివేశ రాజ్యాల అసెంబ్లీలమెంబర్లంతా కలిసి ఆ రాజ్యాంగాన్ని అంగీకరించారు. బ్రిటిష్ పార్లమెంటు వారు ఆందలి ప్రతి అక్షరాన్ని అంగీకరించక తప్పలేదు. బ్రిటిష్ పార్లమెంటు మెంబరొకడు అందలి వ్యాకరణ సంబంధమైన ఒక తప్పును పేర్కొని ఆ తప్పును సరిచేయవలసిందని, రాజ్యాంగంలో వ్యాకరణ దోషం వుండకూడదని చెప్పగా, క. శే. సర్‌హెసరీ కాంప్‌బెల్ బైనర్‌మెన్ ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ "ఒకరాజ్యపరిపాలన శుద్ధవ్యాకరణ సూత్రాల వల్ల నడవదు. బ్రిటీష్ మంత్రిమండలి మరియు దక్షిణాఫ్రికా ప్రభుత్వమండలి సభ్యుల మధ్య ఎన్నో చర్చలు జరిగిన పిమ్మట వారంతా కలిసి యీ రాజ్యాంగాన్ని నిర్ధారణ చేసి అంగీకరించారు. అందువల్ల వ్యాకరణదోష్యాన్ని సైతం సరిదిద్దు అధికారం బ్రిటిష్ పార్లమెంటుకు లేదు" అని గట్టిగా చెప్పాడు. దానిలో దక్షిణ ఆఫ్రికా" రాజ్యాంగాన్ని యదాతధంగా బ్రిటిష్ పార్లమంటు, లార్డ్స్ సభ రెండూ అంగీకరించాయి. ఇక్కడ గమనించవలసిన మరో మూడో విషయంకూడా ఒకటి వున్నది యూనియన్ రాజ్యాంగమందలి కొన్ని నిబంధనలు తలస్థులకు అనవసరపుని అనిపించాయి. వాటి వల్ల ఖర్చుకూడా పెరిగింది. రాజ్యాంగ నిపుణులు యీ విషయాన్ని గమనించారుకూడా సర్వుల అంగీకారంతో, ఐక్యభావంతో, ఆచరణలో పెట్టుటకు అనువుగా రాజ్యాంగాన్ని రూపొందించడమే వారందరి లక్ష్యం అందువల్లనే యూనియన్‌కు చెందిన నాలుగు రాజ్యాలకు నాలుగు రాజధాని నగరాలు ఏర్పడ్డాయి. ఏ రాజ్యమూ తన రాజధానీ నగరం యొక్క మహత్తును వదులుకొనుటకు సిద్ధపడకపోవడమే అందుకు కారణం నాలుగు అధినివేశరాజ్యాలకు నాలుగు అసెంబ్లీలు ఏర్పాటు చేశారు. నాలుగు రాజ్యాలకు గవర్నర్లు వుండాలి కదా! కనుక గవర్నరువంటి ప్రాంతీయ అధికారులపదవుల్ని కూడా అంగీకరించారు నాలుగు అసెంబ్లీలు, నాలుగు రాజధాని నగరాలు నలుగురు ప్రాంతీయ అధికారులు అనవసరం శుద్ధదండుగ అజాగళస్తనాలు అని చాలా మంది విమర్శించారు. అందుకు దక్షిణాఫ్రికా పరిపాలనకు నడుం బిగించిన రాజకీయ అనుభవజ్ఞులు భయపడలేదు ఆడంబరం పాలు ఎక్కువగా వున్నా, డబ్బు అధికంగా ఖర్చు అయినా, వారు నాలుగు రాజ్యాల సమైక్యతకు ఎక్కువ ప్రాధాన్యం యిచ్చారు. ఆ విధంగా తమకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని దక్షిణాఫ్రికా రాజకీయ అనుభవజ్ఞులు ఏకగ్రీవంగా అంగీకరించడమే గాక బ్రిటిష్ పార్లమెంటు చేత కూడా అంగీకరింపచేసుకున్నారు

దక్షిణాఫ్రికా చరిత్రను అతిక్లుప్తంగా పాఠకులకు తెలియజేయుటకు యిక్కడ ప్రయత్నించాను యీ వివరం తెలుపకపోతే యికముందు జరుగనున్న సత్యాగ్రహ మహాసంగ్రామ రహస్యం తెలియచేయడం కష్టమవుతుంది అసలు విషయానికి వెళ్లక పూర్వం భారతీయులు దక్షిణాఫ్రికాకు ఎలా వచ్చారో, సత్యాగ్రహం ప్రారంభం కావడానికి పూర్వం వాళ్లు ఏఏ కష్టాలు పడ్డారో, మనం తెలుసుకోవడం అవసరం




3

దక్షిణాఫ్రికాకు భారతీయుల రాక

ఆంగ్లేయులు నేటాలు చేరి అక్కడ వారు. జూలూల దగ్గర కొన్ని సదుపాయాలు అధికారాలు పొందారు. నేటాలులో చెరకు, కాఫీ, తేయాకు బాగా పండించవచ్చునని అనుభవం మీద వాళ్లు గ్రహించారు. పెద్దస్థాయిలో వీటిని పండించాలంటే వేలాది మంది కార్మిక జనం అవసరం నూరు నూటయాభై ఇంగ్లీషు కుటుంబాల వాళ్లు యీ పంటలు పండించడం సాధ్యంకాని పని అందువల్ల వాళ్లు హబ్షీలను ప్రోత్సహించారు భయపెట్టారు కూడా అక్కడ బానిస చట్టం రద్దయింది అందువల్ల హబ్షీలపై వత్తిడి తెచ్చి వాళ్లను అంగీకరింపచేయలేక పోయారు హబ్షీలకు ఎక్కువగా కాయకష్టంచేసే ఆలవాటు లేదు ఆరు నెలలు శ్రమపడి, వచ్చిన ఆదాయంతో సంవత్సరమంతా గడుపుతూ వుంటారు. అటువంటి స్థితిలో మరో యజమానులతో ఏండ్ల తరబడి ఒప్పందం చేసుకొని కాయకష్టం చేయుటకు వాళ్లు ఎందుకు సిద్దపడతారు? దానితో వాళ్లపై గల ఆశవదులు కొని మరొకరెవరైనా దొరుకుతారేమోనని ఆంగ్లేయులు యోచించారు. వారి దృష్టి భారతీయుల మీద పడింది. వెంటనే వాళ్లు భారత ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు