తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 308

వికీసోర్స్ నుండి

రేకు: 0308-01 లలిత సం: 04-043 శరణాగతి

పల్లవి:

హీనాధికము లింక నేడ నున్నవో కాని
ఆనిన దాస్యము పొత్తు అందరికి నొకటే

చ. 1:

నానావర్ణములవారు నరహరిఁ దలఁచేటి-
ఆనామమంత్రజప మది యొకటే
పూని యాతనిఁ గొలిచి భువి నేజాతైనాను
మోనమునఁ బొందేటిమోక్షమూ నొకటే

చ. 2:

వెనకకు ముందరికి విష్ణుకింకరులకెల్ల
పనివడి కైకొనేటి భక్తి యొక్కటే
వునికి నాదేవుఁడు వొకఁడే అంతర్యామి
మనెడి వైష్ణవకుల మతమెల్లా నొకటే

చ. 3:

భేదాభేదము లేదు పెక్కు మరఁగులు లేవు
ఆదినంత్యములను ముక్తాత్మ లొక్కటే
శ్రీదేవుఁడై నట్టి శ్రీవేంకటేశ్వరుని-
యాదరానఁ బొందు శరణాగతియు నొకటే

రేకు: 0308-02 గౌళ సం: 04-044 శరణాగతి

పల్లవి:

హరి నీవాఁడనే కానా ఆదికాలమున నేను
గరిమ నీమాయలోనే కలగంటిఁగాక

చ. 1:

యీమేనే కాదా హేయమెల్లా మోచినది
ఆమీఁదఁ బుణ్యతీర్థము లాడీఁగాక
కామించి యీరెంటి సంగాతంబు నేఁజేసి
గామిడినై యెందువాఁడాఁ గానైతిఁగాక

చ. 2:

చిత్తమిదే కాదా చింతించెఁ బాపాలు దొల్లి
పొత్తుల పుణ్యాలు దలపోసీఁగాక
రిత్తకు రిత్తయి యీరెంటి నడుమను జిక్కి
కత్తరపు రొంపి లోని కంబ మైతిఁగాక

చ. 3:

యీ నాలుకే కాదా యిందరినిఁ బొగడేది
తానకపు వేదములు తడవీఁగాక
వూనిన శ్రీవేంకటేశ వొంటి నీకు శరణని
తోనే యా రెండుఁ గడచి తుద కెక్కేఁగాక

రేకు: 0308-03 వరాళి సం: 04-045 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

యజ్ఞమూర్తి యజ్ఞకర్త యజ్ఞభోక్త విన్నిటాను
యజ్ఞాదిఫలరూప మిటు నీవై వుండవే

చ. 1:

పరికించ జీవులకు ప్రాణమవైన నీకు
నిరతిఁ బ్రాణప్రతిష్ఠ నేము సేసేమా
మరిగి మా పూజలంది మమ్ముఁగాచెడికొరకు
హరి నీమూర్తి ప్రాణ మావహించవే

చ. 2:

జగతికి నీపాదజలమే సంప్రోక్షణ
జిగి నీకు సంప్రోక్షణ సేయువారమా
పగటున నన్ను నేఁడు పావనము సేయుటకు
అగు పుణ్యతీర్థముల అభిషేకమందవే

చ. 3:

వేదములు దెచ్చిన శ్రీవేంకటేశ నేము నీకు
వేదమంత్రముల పూజావిధి సేసేమా
యీదెస నీదాసులమయిన మమ్ముఁ గాచుటకు
వేదమూర్తివై యిందే విచ్చేసి వుండవే

రేకు: 0308-04 సౌరాష్ట్రం సం: 04-046 విష్ణు కీర్తనం
పల్లవి: నేము సేసేయందు మారు నీవే చేకొంటివి
నేమపు నాపూజలెల్లా నీకు నెక్కెనయ్యా
చ. 1: పాలజలనిధిలోనఁ బవ్వళించినది యేపో
వాలిన నీకు జలాధివాసము
కోలు ముందై బ్రహ్మయజ్ఞ కుండములాహుతి గొని
వోలినుండే అది నీకు హోమము
చ. 2: ఆడన `నాపోనారామణుఁడ` వయిన నీకు
ఆదియపో మంత్రకలశాభిషేకము
మొదల నంతర్యామిమూర్తివయిన నీకు
పదవిమీర నదియే ప్రాణప్రతిష్ఠ
చ. 3: అక్కున శ్రీవేంకటాద్రి నలమేలుమంగఁ గూడి
వొక్కటై వుండినదే నిత్యోత్సవము
లెక్కలేని వరములు లీలతో మా కిచ్చితివి
యిక్కడ నేపొద్దు మాయింట నుండవయ్య

అంత్యప్రాస

రేకు: 0308-05 శ్రీరాగం సం: 04-047

పల్లవి:
ఎందుఁ గాఁపురము సేతు నేది నిజ మేది గల్ల
ముందర నొక్కదినమే మూఁడు గాలములు

చ.1:
తనుభోగముల నివే తగ నొక లోకము
మనసులో తలపోఁత మరి యొక్క లోకము
యెనసిన కలలోని దిది యొక్క లోకము
మునుపు వెనకలివే మూఁడు లోకములు

చ.2:
పంచభూతముల చేతిబంధ మొక్క దేహము
యెంచఁగ నూరుపుగాలి యిది యొక్క దేహము
కొంచక త్రిగుణములగురి సూక్ష్మ దేహము
ముంచె నిదె వొకటీలో మూఁడు దేహములు

చ.3:
జీవునిలోపలివాఁడు శ్రీవేంకటేశుఁడు
తావై వెలినున్నవాఁడు తా నొక్కఁడే
శ్రీవేంకటాద్రిమీదఁ జెలఁగినాతఁ డీతడే
మూవంకల మముఁ గాచే మొక్కితి మాతనికి

రేక:

0308-06

లలిత

పలల్లవ:

బ్రహత్మిదలక నిదే పరచితత

సత:

04-048

బ్రహత్మియిఁ గనన్న తతడ్రియైన పరమాతత్మి చితత చ. 1:

మూయిఁడు లోకమలకెలాల్ల మొదలి చితత మేడెపుయిఁ గరత్మిమలక మయిఁది చితత తోడ జనితచిననాట తొలిల్లట చితత వోడక మాకయిఁ గలిగె నొకక్కటే చితత

చ. 2:

అతగమలోవెదకేట యానతద చితత నితగివలెయిఁ బొడచూపే నిరత్మిల చితత కతగట భోగమలకయిఁ గొనచితత వతగిటయిఁగలిగె మాక నోహో యచితత

చ. 3:

కితద మయిఁద నేకమైన కేవలచితత సతద లేక నిజమైన సహజ చితత కతదవ శ్రీవతకటేశయిఁ గనన్నచితత యతదనే మాకయిఁ గలిగ నితయిఁడే చితత

అతతతప్రాస