జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 3

వికీసోర్స్ నుండి

ఆధ్యాయము .3

ప్రాథమిక విద్య.

ప్రాథమిక విద్యకున్ను, ఉన్నత విద్యకున్ను భేదము కాల్పనికమే కాని వాస్తవము కాదని క్రిందటి అధ్యాయములో తెలుప బడ్డది. ఈ ఆద్యాయము నిమిత్తము ప్రాథమిక విద్యాలయాలంటే ఆబడులలో జరిగే తుది పరీక్ష విశ్వవిద్యాలయాలోనికి ప్రవేశము కల్పించ నటువంటివి అని నిర్వచనము చేయ వచ్చును.

ప్రాథమిక విద్య "గెమిండె " "స్టాడ్ ట్ "అనే స్థానికిక పరిపాలనము వారి చేతులలోనే ఉన్నదని మొదటి ఆధ్యాయములో చెప్పబడ్డది. ఈ ప్రాధమిక విద్యాలయాలకు సాథారణముగా డబ్బంతా మూల ప్రభుత్వము వారె ఇస్తారు. ఆ విద్యాలయాలకు గ్రాంటులు, ఆయాబడులలోని ఉపాద్యాయుల సంఖ్యను బట్టిన్ని, విద్యార్థుల సంఖ్యను బట్టిని ఉంటుంది. ఉపాధ్యాయల సంఖ్యను బట్టి మాత్రమే గ్రాంటు లిస్తే ప్రతి బడిలోను కావలసినంత మంది కంటె ఎక్కువ మంది ఉపాధ్యా


17

యులు చేరుతారు. ఒక్క విద్యార్థుల సంఖ్యను బట్టి మాత్రమే గ్రాంటులిస్తే, బాలుర సంఖ్య ఎక్కువ అయి, ఉపాద్యాయుల సంఖ్య తగ్గిపోతుంది. అందు చేత ఈ యిద్దరి సంఖ్యను బట్టిన్ని గ్రాంటు లివ్వడము వల్ల హెచ్చు తక్కువలు రావు.

(1) కిండిర్ గార్టెన్ బడులు (Kindergaarten school).

(2)గ్రుంట్ షూలె (GrunD schule) లేక సాధారణ బడులు. వీటికి "ఐన్ హేట్ షూలే (Einheit Schule) అని కూడ పేరు.

(3) ఫోక్ షూలె (Volk shule) ఇవే బోర్డు పాఠశాలలు. వీటిలో పిల్లలు జీతము చెల్లించ నక్కర లేదు.

(4) మిట్టెల్ షూలె (Mittal shule) అనగా మాధ్ద్యమిక పాఠశాలలు (ఇవి ఫ్రాం సు దేశాములోని "ఇకోలె ప్రైమేర్ సుపీరియార్" (Ecoles primaries superioures) అనే బడులకు సరిపోతవి. కాని వీటిలోని "గ్రుంట్ షూలె "లోని పిల్లలు మాత్రమే చేరవలెను. "ఫోక్ షూలె"

18

లోని వారికి ప్రవేశము లేదు.

పైరీతిగా ప్రాథమిక విద్యాలయాలు నాలుగు విధములుగా వున్నవి.

ఈ బడులన్నిటిలోని ఆడపిల్లలు, మగ పిల్లలు కూడ కలిసి చదువుకొంటారు. పట్టణాలలో పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న బడులలో ఆడ పిల్లలనందరినీ ఒక భాగములోను, మగ పిల్లలనందరినీ మరి ఒక భాగములోను ఉంచుతారు. కొన్ని స్థలాలలో, ఆడపిల్లల బడులున్ను, మగ పిల్లల బడులున్ను, వేర్వేరుగా ఉంటవి.

మొత్తము మీద, ఆడపిల్లలకున్ను, మగ పిల్లలకున్ను నేర్పే విద్య ఒక్కటే. కాని, మగ వారికి వడ్రంగము, కమ్మరము, పదార్థ విగ్నా శాస్త్రము ఎక్కువగా నేర్పుతారు. ఆడపిల్లలకు వంట , కుట్టుపని, వృక్షశాస్త్రము ఎక్కువగా నేర్పుతారు. వేసే ప్రశ్నలలోను, చూపే బొమ్మలలోను కూడ మగ బడులకున్ను, ఆడ బడులకున్ను భేదమున్నది. ఆడ పిల్లల బడులలో సాథారణముగా ఆడవాళ్ళే ఉపాద్యాయులుగా ఉంటారు.


19

గ్రామ బడులకున్ను, పట్టణపు బడులకున్ను చెప్పే విషయముల సంఖ్య ఒక్కటే గాని, బోధన చేసే తీరు మాత్రము వేరుగా ఉంతుంది. రెండువిధాల బడులలోను లెక్కలు చెప్పుతారు గాని, ఇచ్చే ప్రశ్నలు మాత్రము వేర్వేరుగా ఉంటవి. ఒకరీతి బడికి పనికి వచ్చే పుస్తకము, రెండో రీతిబడికి పనికి రాక పోవచ్చును.

ఆధ్యాయము 4.

"కింటర్ గార్టెన్ "బడులు

"కింటర్ గార్టెన్ "అంటే జర్మను భాషలో "పిల్లల తోట" అని ఆర్థము. ఫ్రోబెల్ అనే గొప్ప ఉపాద్యాయుడు పిల్లలకు పుస్తకాల ద్వార విద్య నేర్పకూడనిన్నీ, ఆటలు, సరదాలు మూలముగా నేర్ప వలసినదనిన్నీ, చెప్పి. ఇరవై ఆటలను కల్పించి నాడు. వీటికి "ప్రోబెల్ బహుమానములు" అని పేరు. పిల్లలు ఈ ఆటలలో ఉత్సాహము చూపేటట్లు అతడు చేసినాడు. వాటి మూలముగా

20