గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (రెండవ భాగము)/తుర్లపాడు

వికీసోర్స్ నుండి

95

తుల౯పాడు

కయిఫియ్యతు మౌజేతుల౯పాడు, ముఠేవేలూరు, సంతునాదేండ్ల,

సర్కారు మృతు౯జాంన్నగరు తాలూకే చింత్తపల్లి, యీలాకే

రాజావాశిరెడ్డి వెంక్కటాద్రినాయుడు బహద్దరు మన్నెసుల్తాను.

ఈ గ్రామాన్కు పూర్వంనుంచ్చింన్ని తుల పాడు అనే పేరు వుంన్నది. గజపతి సింహ్వసనస్తుడయ్ని గణపతి మహారాజులుంగారు ప్రభుత్వం చేశేటప్పుడు యీ గ్రామాన్కు సదరహి గణపతిరాజుగారి మహాప్రధానులయ్ని గోపరాజు రామన్నగారు శా ౧౦౭౭ శక (1155 AD) మందు సమస్తమయిన నియ్యోగులకు గ్రామకరణీకపు మిరాశీలు నిన౯ యించే యడల యీ గ్రామాన్కు వెలనాడు సంప్రతులు ౨కి భారద్వాజ గోత్బలయిన తుల౯పాటివారి సంప్రతి కౌండస్యస గోత్బలయ్ని వెళ్లూరివారి సంప్రతి వెరశి రెండు సంప్రతులవారికి గ్రామకరణీకపు మిరాశీలు నిన౯యించినారు. తదాది మొదలుకొని ఆయొక్క వంశీకులు కరణీకములు అనుభవిస్తూ వున్నారు.

శా ౧౧౬౦ శకం (1238 A. D.) మొదలు కాకతీయ్య రుద్రదేవ మహారాజులుంగారు ప్రభుత్వం చేస్తూవుండి యీ గ్రామమంద్దు శివస్థలం కట్టించ్చి శ్రీ పాండులింగ్గేశ్వరుడనే లింగమూర్తిని ప్రతిష్ట చేశి మరింన్ని యీ గ్రామమంద్దు విష్ణుస్థలం కట్టించ్చి చన్నకేశవ స్వామివారిని ప్రతిష్ఠ చేసి వుభయ దేవస్థానముల్కు విశేషములుగానే వుత్సవాదులు నిత్య నైవేద్య దీపారాధనలు జరుగగలండ్లుకు వృత్తి స్వాస్యములు జరిగించినారు. వడ్డే రెడ్డి కన్నా౯టకముయొక్క ప్రభుత్వములు. శా ౧౫౦౦ శకం (1578 AD) వర్కు జరిగిన తరువాతను తుర్కాణ్యం పబ్రల మాయ గన్కు కొండవీటిశీమ సముతు బందీలు చేశే టప్పుడు యీ గ్రామం నాదెండ్ల సముతులో దాఖలు చేసి సముతు అమలు చౌదరు, దేశ పాండ్యాల పరంగ్గా మల్కి విభురాం పాదుశహావారి ఆములు లగాయతు, అలంగ్లీరు పాదుశహా వారి అములు వర్కు అమాని మామలియ్యతు జరిగించ్చినారు - స్న ౧౧౨౨ ఫసలీలో (1712 AD) సుభావారు కొండవీటిసీమ జమీన్దారులు అయిన మాసూరి వెంక్కంన్న పంతులు గారి వంట్టులో వచ్చి చిల్కలూరిపాటి తాలూకాలో దాఖలు అయ్నినది గన్కు వెంక్కంన్న పంతులుగారు ప్రభుత్వంచేస్తూ అధి౯ తోందరను గురించి యీ గ్రామం యేలూరు సముతు తొమ్మిది గ్రామాదులు ముఠాచేసి యేలూరు ముఠా అని పేరు పెట్టి చింతపల్లి తాలూకా జమీదారులయిన వాసిరెడ్డి పద్మనాభునిగారు, చంద్రమౌళిగారు. రామలింగన్నగారు. నరసన్నగారు, సూరన్నగారు, చిననరసన్నగారు, చినరామలింగన్నగారు, జగయ్యగారు, రామన్నగారు ప్రభుత్సములు జరిగిన తర్వాతను పయిని వాశ్ని జగయ్యగారి కొమారులయిన రాజా వెంకటాద్రి నాయుడుగారు ప్రభుత్వం వహించి స్న ౧౨౨౨ ఫసలీ (1812 AD) వర్కు ప్రభుత్వం చేస్తూవున్నారు. పయిన వాన్ని దేవస్థానములు స్న ౧౮౬౦ (1238 AD) ఫసలీ లగాయతు ఫరాంసువారు ప్రభుత్వం చేశే దినములలో రాజోపద్రవము చేతను అచ౯నాదులు జరగక ఖిలపడ్డది గన్కు తిరిగి స్న ౧౨౦౫ ఫసలీ (1795 AD) సంవత్సరములో గ్రామస్థులు దేవా లయములు మరామతు చేయించ్చి శ్రీ పాండులింగేశ్వరస్వామివారికి శ్రీ చెన్న కేశవస్వామివారికి పునఃప్రతిష్టలు చేసినారు గన్కు యీ స్వామివారి యొక్క నిత్యనై వేద్య దీపారాధనలు జరుగ గలంద్లుకు రాజా వెంకటాద్రినాయుడుగారు చేస్ని భూస్వాస్థ్యం-

కు ౧ శ్రీ పాండులింగేశ్వమివార్కి
కు ౨ శ్రీ చెన్న కేశ్వరస్వామివార్కి

రెండు కుచ్చెళ్లు యినాములు పూర్వపుస్వాస్థ్యములు పునరాధారంగా యిప్పించి యిది వర్కు జరిగిస్తూ వున్నారు.

రిమార్కు: గ్రామంగుడి కట్టుకుచ్చెళ్లు ౭0 కి మినహాలు
౨ ౺ ౦ గ్రామకంఠం మాలపాడు సమేతు
౧ ౺ ఽ వనములు తోటలు ౬ కి
౦ ౺ ౦ వెళ్లూరివారు అన్నమిహారాజుల వారు వేయించ్ని తోటలు ౨ కి
౦ ౹ ౦ గ్రామాన్కి తూపు౯పాశ్వ౯ మందున
౦ ౹ ౦ దక్షిణం పాశ్వ౯ మందు
———————
౦ ౹ ౦ ఈ గ్రామాన్కు యీశాన్యభాగమంద్ను తుల౯పాటి మాదిరాజు వేయించినది
౦ ౹ ౦ రావిల అయ్యవారు గ్రామాన్కు దక్షిణ పాశ్వ౯మందున
6 ౦ మంగల మల్లయ వేయించ్నిది గ్రామాన్కు పడమటి పాశ్వ౯ం
6 ౦ చింతల పెదమాతినీడు వేయించ్నిది గ్రామాన్కు వుత్తర భాగమున
——————
- ౺ ౦ అయ్ని
౦ 6 ౦ వడ్ల వీరాబత్తుడు గ్రామాన్కు వాయువ్య భాగమంద్ను వేయించ్నిది.
౺ ౦ చెరువులు 3 కి-
౦ ౹ ౦ మాగల మల్లయ్య చెరువు ——
౦ ఽ గుర్రం అయ్యవారి చెరువు——
౦ ౪ ఽ రావిల అయ్యవారి చెరువు——
౮ ౺ ౦ డొంక్కలు ౫ కి——
౨ కొండవీటి డొంక ౧ కి——
౨ అనపత్తి౯ డొంకకు
౧ ౺ ౦ కొప్పత్తి౯నుంచి అన్నవరం పొయ్యెడొంక——
౧ ౺ ౦ నందిపూడి డొంక——
౧ ౺ ౦ జాలాది డొంక——

తులపాడు 3 ๆ iccc ๆ ౨ 6 o O 6. 010 ౭ ౬ యినాములు శ్రీ శ్రీ స్వాములవాలుకు పాండులింగేశ్వరస్వామివార్కి కేశవస్వామివార్కి జూలూరి తిమ్మాజీకి సముతు గుమాస్తా మాన్యం గ్రామ పౌరోహితులు మంగ్నల నరసంబొట్లు, జంగంబొట్లు వెంకయ్య పానకాలు శాస్తులుకా 6 పన్నాల శేషావధానులు C 01 2 on 2 వాగులు ౨ కి నక్కవాగు వాగేరు ౧౭ 6 ౭ గాక తతిమ్మ తెరి 3 పన్నాల వెంకట్రామశాస్త్రులు గొడుగుల వెంకటేశం గ్రామ చెరువుమాన్యం వంకల పేరాయకు. వడ్లమ్మలకు మడుగుల నీళ్లు నిలిచేవి - ౪ 87 రాజుగారి సావరం - కయిఫియత్తు మొత౯జా - అంగీరస నామ సంవత్సర పుష్య బహుళ ౧౩ శిరవారం దినం ౨౮ జనవరి ఆన ౧౮౧౩ (1818 A. D.) సంవత్సరము. (12)