గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (రెండవ భాగము)/చింత్తపల్లిపాడు

వికీసోర్స్ నుండి

91

చింత్తపల్లిపాడు

కయిఫియ్యతు మనంజే చింత్తపల్లి పాడు సంతు గుంట్టూరు

సర్కారు మృతు౯జాంన్నగరు తాలూకే చిల్క లూరుపాడు.

యీగ్రామానకు పూర్వంనుంచ్చింన్ని చింతపల్లి పాడు అనెవాడిక వుంన్నది. గజపతి శిహ్వాసనస్తుడయ్ని గజపతి మహారాజు ప్రభుత్వం చేశేటప్పుడు వీరిప్రధానులయ్ని గోపరాజు రామంన్నగారు శాలివాహనం ౧౦౬౭ శకమంద్దు (1145 A.D) సమస్తమయ్ని నియ్యోగులకు గ్రామకరిణీకపు మిరాశీలు నిన౯ యించ్చేయడల యీ చింతపల్లిపాడుకి ఆత్రేయ గోత్బలయ్ని చల్లపల్లి కోదండరాముడనే ఆరువేల నియోగికి యేకభోగంగా మిరాశీ యిచ్చినారు గనుక తదారఖ్యా అనుభవిస్తూ వున్నారు.

తదనంత్తరం కోట గణపమదేవంమ్మగారు పృధివీ సామ్రాజ్యము చేయుచునుండి యనమదలలో తమ తండ్రి గణపద్దేవ మహారాజునకు నభివృద్ధిగాను గణపతేశ్వరుడనే లింగ్గమూతి౯ని ప్రతిష్ఠ చేసి ఆదేవర అంగ్గరంగ్గ భోగాధ౯ముగా యీచింత్తపల్లిపాడు అగ్రహారం యిచ్చిరి గన్కు బహుదినములు జరిగెను. యీ అగ్రహారం యిచ్చినది శాలివాహనం ౧౧౭౦ శకం (1248 A D)

వడ్డెరెడ్డి కనా౯టక ప్రభుత్వములు జరిగిన తరువాతను మొగలాయిలో సంతు బంద్దీలు చేశేటప్పడు యీగ్రామం గుంట్టూరు సముతులో దాఖలు చేశినారు. జమీదాల౯కు కొండవీటి శీమ మూడువంట్లుచేశి పంచ్చిపెట్టే యడల యీ గ్రామసర్కారు మజుందారులయ్ని మానూరి వెంక్కంన్న పంత్తులుగారి వంట్టులో వచ్చి చిల్కలూరుపాడు తాలూకాలో దాఖలు అయ్నిది గన్కు వెంక్కంన్న పంత్తులుగారు అప్పాజీ పంత్తులుగారు, వెంక్కటాయునింగారు, వెంక్కట కృష్ణునింగారు ప్రభుత్వముచేశ్ని తరువాతను వీరి కొమారులయ్ని నరసంన్నగారు ప్రభుత్వం చేశ్ని తర్వాతను యీన తమ్ముడి కొమారుడయ్ని వెంక్కట కృష్ణునింగారు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు.

రిమాకు౯ గ్రామం గుడికట్టు కుచ్చళ్ళు -౨౧ కి
మినహాలు
౦ ౺ ౦ గ్రామకంఠం
౨ చెరువులు
౦ ౺ ౦ గ్రామ చెరుపు
౦ ౺ ౦ లింగాలు కుంట్ట
౦ ౹ ౦ చేబ్రోలు నారాయుడికుంట్ట
౦ ౹ ౦ అమ్మి సిరికుంట్ట
౦ ౹ ౦ యడ్లవాడి కుంట్ట
౦ ౹ ౦ వాగుమాలు

గ్కాతతింమ్మా - ౧౭౪౦ యినాములు I

౦ ౺ ౦ డొంక్కలు
౦ ౹ ౦ మాలవాడు
——————
౩ ౺ ౦
గ్కాతతింమ్మా - ౧౭౺౦ యినాములు
౧ నోరి వెంక్కటేశ్వర సోమయాజులుంగార్కి మానూరి వెంక్కట కృష్ణునింగారు యిచ్నిది.
౦ ౹ ౦ మానూరి కృష్ణయ్యగారికి
——————
౧ ౹
గ్కాతతింమ్మా - ౧ ౬ కి
రాజామానూరి వెంక్కట కృష్ణునింగారి సావరం - 3
గ్కా తతింమ్మా —— ౧౩
కయిఫియ్యతు ముతు౯జా -
దినం ౨౮ నవ్వంబరు ఆన. ౧౮౧౨ సంవత్సరం అంగ్గిరసనామ సంవత్సరం కాతీ౯క బహుళ శనివారం.