గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (రెండవ భాగము)/కోవెలమూడి

వికీసోర్స్ నుండి

11

కోవెలమూడి

కయిఫియ్యత్తు మౌజే కోవెలమూడి సంతు చేబ్రోలు,

సర్కారు ముతు౯జాంన్నగరు, తాలూకే చింత్తపల్లి, రాజావాసి

రెడ్డి వెంకటాద్రి నాయుడు బహద్దరు మన్నెసుల్తాను-

స్న౧౨౨౨ఫసలీ (1812 A.D.) అంగ్గిరసనామ సంవ్వత్సర

ఆశ్విజ బ౧౦శుక్రవారం ది౨౮ అక్టోబరు ఆస౧౮౧౨ సంవ్వత్సరం


యీ గ్రామానకు పూర్వం నుంచ్చింన్ని కోవెలమూడి అనే పేరు వుంన్నది. గజపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతి మహారాజులుంగారు శా ౧౦౫౬ శకం (1134 AD) లగాయతు రాజ్యం చేసేటప్పుడు వీరిదగ్గిర మహాప్రధానులయ్ని గోపరాజు రామంన్నగారు ప్రభువుదగ్గిర దానంపట్టి సమస్తమయిన నియ్యోగులకు శా ౧౦౬౭ (1145 AD) అగు నేటి రక్తాక్షినామ సంవ్వత్సర భాద్రపద బ ౩౦ ఆంగ్గార్కవారం సూర్యగ్రహణ కాలమంద్దు గ్రామకరిణీకపు మిరాశి సన్నదులు వ్రాసియిచ్చె యడల యీ కోవెలమూడికి శుక్ల యజుశ్శాఖా ధ్యయనులయ్ని చంన్నా ప్రగడ చంన్నంరాజుకు ఏకభోగంగా మిరాశి యిచ్చినారు.

వడ్డెరెడ్డి కనా౯టక ప్రభుత్వములు శా ౧౫౦౦ (1578 AD) శకంవర్కు జరిగిన తర్వాతను మొగలాయి ప్రభుత్వం వచ్చెగన్కు బారాముత సద్ది హోదాలు యేప౯రచి సర్కారు సముతు బంద్దీలు చేసేయడల యీ గ్రామం చేబ్రోలు సముతులో దాఖలు చేసి సముతు అమీలు, చౌదరు, దేశపాండ్యాల పరంగ్గా బహుదినములు అమాని మామలియ్యతు జరిగించ్చినారు.

స్న ౧౧౨౨ ఫసలీ (1712 AD) కొండవీటి సీమ జమీందారులకు మూడు వంట్లు చేసి పంచ్చిపెట్టే యడల యీగ్రామం వాశిరెడ్డి పద్మ నాభుని గారి వంత్తువచ్ని చేబ్రోలు సముతు ౨౨ గ్రామాదులలో కలిసి చింత్తపల్లి తాలూకాలో దాఖలు అయినది గన్కు పద్మ నాభునిం గారు, చంద్రమవుళిగారు, పెదరామలింగ్గన్నగారు, నరసంన్నగారు, సూరంన్నగారు, చ్నిసూరంన్నగారు, చ్నిరామలింగంన్నగారు, జగ్గయ్యగారు, రామంన్నగారు, ప్రభుత్వములు చేశ్ని తరువాతను రాజా వెంక్కటాద్రి నాయుడు గారు ప్రభుత్వం చేస్తూవుంన్నారు.

రిమాకు గ్రామం గుడికట్టు కుచ్చళ్లు అలా కి మ్నిహాలు – కు. 4 గ్రామ కంఠం మాలపాడు చెరువులు 33 ౦౪౦ పూరచెర్వు పూర్వం కొంచ్చం వుండగా మజ్కూరి కరణమయ్ని చంన్నా పగడ అక్కిరాజు తవ్వించింది. A I ౦ నల్ల కుంట్ట పూర్వం పుండ్లబడ్డది తరువాత కొమనెం ఆచ్చంన్న C 12 గ్రామకై ఫియత్తులు ౦౦ గారకుంట్ట పూర్వం వుంన్నది, తరువాత నూకవరపు వెంక్కంన్న తవ్వించింది. యినాములు. 04 చేబ్రోలులో వుంన్న నాగేశ్వరస్వామివారికి. పూర్వం నుంచ్చివుండ్డుకున్నది, చేబ్రోలు జలగ్గంమరస్తుడయిన శంభుడి వరకు పూర్వం నుంచ్చి వుండుకున్న యినాము --- తత్తింమా యినాములు మజ్కూరి కరణమయిన చంన్నా ప్రగడ అక్కిరాజుకు పూర్వం వాని మేన త సుమ్మడయిన్న యిన్ని యినాము అతని కొడుకు వెంక్కటరాయుడు అనుభవిస్తూవుంన్నాడు. గ్రామ చర్వు నల్ల కుంట--- మజ్కూరి కరణమయ్ని చన్నా ప్రగడ అక్కిరాజు వేయించి వనం తోట---- డొంక్కలు కి గ్కా త తిండ ~~-3 శేరి-3 ౪౯ సావరం ఆ కయిఫియ్యతు మొతుఁజా తారీఖు సదరు రవానా అంగ్లిరసనామ సంవత్సర మాగకాశిర శు 3 ఆదివారం ది ౬ డిశంబ్బరు ఆన ౧౮౧౨ సంవత్సరం - మైక్రోఫిల్ము రోలునెంబరు 3 మెకంజీ వాల్యూము : 22 ఫోలియో: 40 B41 A.