కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/324వ మజిలీ

వికీసోర్స్ నుండి

మహారాజున కర్పించిన నుత్తమముగా నుండునని దలంచుచు చూచుచుండగనే య వ్విహంగ మా చైత్య శిఖరముననుండి కింద వ్రాలి యందలి మూలమణిపీఠ కుట్టి మమున నిటునటు తిరుగాడ దొడంగెను. అప్పుడు నేను దానిని పట్టుకొనగలుగుదునను నాసతో నవనమితగాత్రుండై యలక్షితపదప్రచారుడనై దాని సన్నిధికేగి చేతితో పట్టు కొన నుంకించినంత నాకు చిక్కక పైకెగిరిపోయి కొంతదూరమందున్న యొక వట వృక్షశాఖపై వ్రాలెను. ఆ యద్భుత శకుంతలము నెట్లయినను పట్టుకొని మహారాజున కర్పించుటకు కృతనిశ్చయుడనై నేను దాని వెంటాడుచు నా పక్షితో నొక చెట్టునుండి మరొక చెట్టునకు తిరుగుచుంటిని. అదియును నొకచో భూమికి దిగుచు నేను సమీ పించిన వేంటనే పై కెగయుచు నిముసమాత్రమాగుచు మరియొకచో నేలపై వ్రాలి వెంటనే పైకెగురచు నింకొకచో చేతికి చిక్కినట్లె యుండి పారిపోవుచు నిట్లా దిన మంతయు గడ పెను. నేనును మార్గామార్గము లెరుంగక దానివెంట బరువెత్తుచుంటిని. ఇట్లు క్రమక్రమమున నన్నా శకుంతము దురంతారణ్యమధ్యమునకు గొనిపోయి వన తరుశిఖర శాఖాశతాంతరమున నదృశ్యమైనది.


324 వ మజిలీ

పామరునికథ

అప్పుడు నేను దానికొఱకై విచారించుచు నందందు వెదుకఁజొచ్చితిని. అందుఁ గనంబడిన యరుణకుసుమకళితంగని యా చిలుక చంచువని భ్రమజెందుచు, హరితఫలగుళికంగాంచి దానిమౌళియని దలంచుచు, ప్రచలిత వినీలతరుదళములఁజూచి దాని పక్షకాండములని మోసపడుచు, వికటార్క ఫలకోశము దిలకించి దాని యంగ యష్టియని సంశయించుచు, పై నెగురుచున్న యన్యశకునిపక్షపుటపుటారావము విని యా చిలుకయే యెగురుచున్నదని శంకించుచు యావిపినముంతయు బరిభ్రమించితిని. పిదప నావిపినాంతమును ఖండితాశుఁడనై చేరి చేయునది‌ లేక విచారించుచున్న సమ యమున సమీపమున నవిరళతరుసరళ కాంతారమునుండి యనేక విహంగారవకోలా హలము వినిపించెను. అంతట నాశుకము లభించునను నాశ మనమునఁ దిరుగఁజనింప యాపక్షుల పిండున్నదశ కేగితిని. అందు ముందతినిర్మల జలప్రవాహ ప్రశోభితంబై యుష్టాంశుని తనయయని వినుతి కెక్కిన తాపియను నదిద్వరము నేత్రపర్వం బొన రంచెను.


గీ. ఆమహాధునీముఖ్య ముష్ణాంశునాత్మ
    జాతయైయున్నఁగాని తజ్జలము మిగుల


    సామ్యతను గాంచె శీతాంగు శైత్యతా వి
    శేషమున కందు మదికి నచ్చెరువు గొలువ

ఆ నిర్మలతరింగిణీ సందర్శనంబొనర్చి ఆహా ! నందాటపురము నుండి యెంతదూర మేతెంచితిని ! ఇచ్చట కప్పురము పదియోజనముల దూరములో నున్న దందురని తలంచుచు నానది యుభయతటములఁగల వృక్షశాఖల విమర్శించుచు దిరుగు చుండ భువనైకచక్షుండగు నాదిత్యభగవానుఁ డపరదిక్కున కేగెను. అప్పుడు నేను వృధా శ్రమపడి యింతదూరము వచ్చినందులకు విషాదము జెందుచు మదీయ విమృళ్య కారిత్వమునకు పశ్చాత్తాపము నొందుచు నిట్లు వితర్కించుకొంటిని. ఔరా! పక్షి కొరకు నేనెంత మూఢుఁడనైతిని. సాధ్యా సాధ్యములు విచారింపక దిరుగువారు నా వలెనే యిట్లు విఫలమనోరధు లగుచుందురు. పక్షులకుఖేచరగమనముండుటనేనెరుంగనా? నేను ఖేచరుండను కానుకదా! దానినెట్లనుసరించి పోగలను? పాశబంధాది సదుపాయముల పక్షులఁబట్టుట దగుగానివానితో నెగిరిపట్టుట మానవునకెట్లు సాధ్యమగును? ఇచ్చటజేరువ నెద్దియును బల్లెయైననున్నట్లు కనుపింపదు. నిముషములోనే యీ దినాంతమగుచున్నది. రాత్రి చీకటిలో నేకాకినై మార్గవిబాగం బెరుంగఁజాలక యంతములేని యీవిపినప్రయాణ మొనర్చి నేనెట్లు తిరిగిపోఁగలను ? అని యిట్లు డోలాయమాన మానసుండనై మంద గమనమున నాసరిత్తీరమున నెదురఁ గనంబడిన మార్గమున నడచుచుండగా ముందొక పొలములో వరికళ్ళము సమీపమున నొక కుటీరముగాంచి యతిహర్షమున దానిం జేరితిని. అందెవ్వరును లేరు. అందొకచో గడ్డి పడకయును, పచనపాత్రలును, ప్రొయ్యియు నుండుటఁ దిలకించి యందెవ్వరో నివసించి యుండునట్లు నిశ్చయించి వారి రాకకై నిరీక్షించి తద్వార బహిఃప్రదేశమున నుపవిస్టుడనై యుంటిని. ఇంతలో స్థూల దేహముగలిగి దర్భవలితమగు త్రాటితో బిగింపఁబడిన పరిధానము వహించి చినిగిన ప్రాతకంబళి మూపున ధరించి చేతియందొక యూతకోలఁ బట్టుకొని తలపైఁ నతిభారమగు గడ్డిమోపు బెట్టుకొని యొక మోటుమానిసి నన్ను సమీపించెను. మరియు వాని వామకరమున మోదుగునారచే చరణములు గట్టుబడియున్న యా శుకశ్రేష్టము నాకు నేత్ర పర్వంబొనర్చెను. దానిం గాంచి మృతోజ్జీవితుఁగన్నరీతి నే నత్యంతానంద మందితిని. ఇంతలో నా పామరుండు తలపైనున్న గడ్డిమోపును గుటీరద్వారప్రదేశ మునఁ బడవైచి దానిని లోనికిఁజేర్చి యా స‌మీపముననే యా చిలుకను బంధించి బైట కేతెంచి మూపుపైనున్న కంబళీఖండమును నేలమీఁద బరచికొని నా సమీపమునఁ గూర్చుండి పళ్ళుబిగించి రెండు చేతులతోఁ దల గోకికొనుచు సోదరా! యే గ్రామము నుండి నేడిచ్చటి కేతెంచితినని నన్నడిగియు నంతలోఁదల గోకికొనుటవలనఁ గలిగిన సుఖమున సీత్కార మొనరించుచుఁ జేరువ పొలములోఁబడిన పక్షుల నదలించునెపమున హక్కారముజేయుచు నడిగిన మాటలే మఱల నడుగుచుఁ దనగ్రామేయక స్వభావమున నా మనమునకు మిగుల విసువుపుట్టించెను. అప్పుడు నేను వాని యవినయమును సహించుకొని స్వకార్య నిర్వహణ తత్పరుండనై యిట్లని తలంచితిని గ్రామ్యజనుల సహజముగా బొగడికలకు వశ్యు లగుదురు వీనిని మంచిమాటలచేత లోఁబరచుకొని యీ రాత్రియందుఁ సుఖముగాఁ గడపెదను. మరియు నిందుండి యీ శకుంతము నీతఁడేమిచేయునో చూచెదను. ఈ చిలుక వీని కెట్లు లభించెనో తెలిసికొందును. ఏ యుపాయముననైన నీవికిరపరమును వీనివలన సంగ్రహించెదగాక యని నెమ్మనమునఁ గృతనిశ్చయుండనై యందులకుఁ దగినరీతి మాటలాడుచు వాని కానందమొనగూర్చితిని.

ఆ యమాయకుఁడు నాయందుఁ బ్రసన్నుఁడై రాసభాశ్రయోచితమగు నౌచిత్యిమును బ్రదర్శించుచు నందొకమూల గడ్డి చుట్టపై నున్న యన్న పుకుండను గొనివచ్చి యందున్న జొన్నన్నమును పుచ్చకాయకూరతోఁ బెట్టి యుచితరీతిని నా కాతిథ్యగౌరవం బొసంగెను. నాటియుదయమునుండియు నాహారము లేకుండుటచే మిగుల నాకలిగొనియున్న నేనాగోపాలహాలికుండొసగిన భోజనము నమృతమయాహార మట్లు మిగుల నాప్యాయముగ భుజించి వాని యనుమతమునఁ జేరువనున్న నవకలమ పలాలమృదుతల్పమున విశ్రమించితిని. పామరుండును నావలెనే భుజించి నా సమీప మందలి వేఱొక గడ్డిపరుపుమీదనుపవిష్టుఁడై చిలుకకు పంజరము గట్ట నారంభించెను. అప్పుడు నేను సమయము దొరికినదని‌ యుబ్బుచు నుచితవచనముల వాని కిట్లంటిని.

ఓహో ! కృషీవలకులతిలకా ? మీరు నివసించుగ్రామ మెయ్యది ? తమ నామధేయమేమి ? ఈ చిలుక మీ కెచ్చట యెట్లుదొరకెను. దీనినెందులకు సంగ్ర హించితిరి. దీని నెవఁడైన శ్రీమంతున కుపాయనముగ నొసంగదలంచితిరాయేమి ? అయ్యా ! మీకు కోపము గలుగదేని యొకమాట వచించెదను. ఈ చిలుకను నా కొసంగుఁడు. దీనిని మహారాజునకు సమర్పించి మీకు గొప్పయుపకారము జేయించె దను. మీకనల్పమగు భాగ్యమబ్బగలదు. సమానులలో మీకత్యధికమగు గౌరవము గలుగ గలదని వచించితిని. పంజర నిర్మాణము నందే దృష్టి నిల్పియున్న యాపామరుండు నావంకఁ దిలకింపకుండగనే యిట్లు ప్రత్యుత్తరం బొసంగెను.

ధాన్యపారమనుపుర మీ సమీపమునఁ గలదని మీరు వినియే యుందురు. అందు గోపతియను కుటుంబీకుడుగలఁడు. వానికి నేనాత్మజుండను. సంవరకుండను వాడను. కృషీవలుండనగు నేనీపొలములో వరిచేనునూర్చుటకుఁ గళ్ళముచేసి యిందు నివసించుచుంటిని. నేఁడిచ్చటి కనతిదూరముననున్న పొలమునందు సగముగోసి కట్టఁ బడియున్న వరిమోపుల నీకళ్ళమునకు జేర్చబోతిని. అందొకవరికంకెమీద వ్రాలి యున్న యీచిలుకం దిలకించి సహర్షమున దానిసన్నిధికేగి వరిగింజ లొలిచి తిను చుండుటచే నారాక గ్రహింపని దీనింబట్టి తెచ్చితి. దీని నీకొసంగఁజాలను. ప్రాణముల కన్న నెక్కుడుగ నేను బ్రేమించుచున్న నాభార్య ప్రధమగర్భమున నంతర్వత్నియై పురుడు బోసికొనుటకు బుట్టినింటికి మేఖరికయను పురమున కరిగియున్నది. శుకా మిషమున నామెం దృప్తిపరుపనెంచి దీనిం గైకొంటిని. ప్రియురాలి యభీష్టము దీర్చుట యందు ద్రిలోకరాజ్యమైనను దృణప్రాయముగదా ? కావున నీవీచిలుక నడుగుట యుడుగుమని వచించుచు యా పంజరమల్లుట ముగించి యందా చిలుకను బద్రముగా బెట్టి తన్ను గృతార్థునిగా దలంచుచు దానిని దనుసెజ్జపజ్జ నుంచికొనెను.


325 వ మజిలీ

శుకలాభము

వాని నిశ్చయంబెరిగి నే నతిచింతాకుల స్వాంతుండనై ఆహా ! ఈ చిలుకను బడయుటకు నేనేమి యపాయము బన్నుదును. వీని నింకేమని యాచింతును. హఠా త్తుగా దీనింగై కొని పారిపోదునా ! లేక యర్దరాత్రమున వీఁడు నిద్రాముద్రితుఁడై యున్నతరి దీనిందస్కరించుకొని పోదునా ? అని విచారించుచున్న సమయమున నా చిలుక యట్టహాసముగ నవ్వి ప్రస్తుతార్థమును సూచించుచు నిట్లు పద్యద్వయమును పఠించెను.


గీ. ఒకనికన్నులఁబడియుఁ జిక్కకయె పారి
    వచ్చితిని నింకొకనిచేత పట్టుబడి మ
    ఱొక్కవ్యక్తివాతిఁబడగనుంటి నహహ !
    దైవ యోగంబు మీర దుస్తరముగాదె ?

గీ. ఆరయ దేహిక నియామానుసరణినొప్ప
    జీవితాంతంబునందునఁ జావుగూర్చి
    మృత్యుముఖమున జీవితమెసఁగఁజేయు
    విధికి విశ్రాంతిలేదెంచు విశ్వమందు

ఆ మాటలాలించు పామరుండు భయోద్రేకమున మేను గగుర్పొడువఁ ద్రుళ్ళిపడి లేచి కాలికొలది బరువెత్తదొడంగెను. వాని పిరికితనమునకు నేను గడుపుబ్బ నవ్వుచు భయపడకుము భయపడకుమని వానిననుసరించి పోయి పట్టుకొంటిని. అందు లకు వాడు తొట్రుపడుచు నన్ను వదలిపెట్టు వదలిపెట్టుమని పెద్ద యెలుంగున నఱ చుచు మఱియు నిట్లనియె. తమ్ముడా ! నేను పుట్టినది మొదలు నేటి‌ దనుక నెందును మనుజునివలె నవ్వుచు మాటలాడు చిలుకను గనివిని యెరుగను. ఇది పిట్టగాదు. పెను