కాశీమజిలీకథలు/ఏడవ భాగము/134వ మజిలీ

వికీసోర్స్ నుండి

ఆమాటవిని ఛండవేగుఁడు చెవులు మూసికొని ప్రేయసీ! అట్టిమాట పలుక వచ్చునా? నీ రక్తంబున శరీరము నిలుపుకొని పిమ్మట నేనేమిచేయుదును? ఎవ్వరిఁ జూచి సంతోషింతును? ఇట్టిమాటయెన్నడును బలుకకుము. ఒక రేయికే తాళలేమా యేమి? అని చెప్పుటయు నాభూతకాంత పోనీ! యీయడవిఫలములు చాలగలవు తీసి కొని వత్తునా? అనుటయు నతఁడు సీ! మునులవలె ఫలములుతినమా! అవి జీర్ణము కావు వాని దినిన నాకు నమనము వచ్చును వలదు వలదు. విశ్రమింపుము నీయాకలిమాట యేమి? అందులకు వగచుచున్నాను గదా రెండు దినములెట్లొ దాళుము నరమాంన రక్తసముద్రము పొంగిరాఁగలదు. అప్పుడు కడవలతో రక్తము ద్రావవచ్చును. అని నొడివిన విని యాభూతవనిత యిట్లనియె.

మనోహరా! అట్టి సంతర్పణము మనకెట్లు కలిగెడిది? పుడమి జనక్షయకరమగు నుత్పాత మేదియైనఁ బొడమఁగలదాయేమి అని యడిగిన నతండు కాదు కాదు. ఒక తరుణి మూలముగా నిరువురు మహారాజులు సంగరమున కాయత్త పడు చున్నారు. ఉభయసైన్యములు వ్యూహములఁబన్నియున్నవి. ఎల్లి శుభముహూర్తంబునం గలియఁ బడఁగలవు వేనవేలు జనులు చత్తురు మనకుఁ గావలసినంత రక్తమాంసమేదస్సంచ యము దొరకగలదు! అని నోరూరఁ గంతులువై చుచుఁ జెప్పుటయు భూతకాంత మగనిహస్తములు గైకొని సంతోషముతో వింతగా నాట్యము చేయఁదొడంగినది. ఇరువురు కొంతతడవు గంతులువైచి కూర్చుండిరి.

అప్పుడు భార్య భర్తతో మనోహరా! ఆహారములు లేకపోవుటచే నేఁడు మన కేమియుఁ బనిలేదుగదా ఒక యువతి మూలమున రాజులు పోట్లాడుచున్నారని చెప్పి తిరి. అకాంత యెవ్వతె? ఏమిటికిఁ బోట్లాడవలసివచ్చినది? ఆరాజులెవ్వరు? వివర ముము నాకథ యెఱింగింపుడు సావధానముగా నాకర్ణించెద నుబుసుబోకున్నదని యడిగిన అతఁడు బోఁటీ? ఇది కడుచిత్రమైనకథవినవలసినదే చెప్పెద వినుము. అని చెప్పఁదొడంగెను.


134 వ మజిలీ కథ

సురసకథ

దేవయజసమను అగ్రహారమున అగ్నివర్మయను బ్రాహ్మణుఁడు గలడు. అతండు వేదవేదాంగములం జదివి విధిక్రమంబున అనేక యాగములుజేసి శ్రోత్రి యులలో నుత్తముఁడని పేరుపొందెను. అతనికి లేకలేక సురసయను కూఁతురొక్క రితి వార్థక్యంబున నుదయించినది ఆ చిన్నది మిక్కిలి చక్కనిదగుట దగిన వరుని కొఱకు అగ్నివర్మ అధిక ప్రయత్నము జేసిజేసి విద్యారూప యౌవనధన సంప న్నుఁడైన ప్రవరుఁడను విప్రకుమారునికిచ్చి వివాహముగావించి యల్లునిఁ దన యింటనే యుంచుకొనియెను.

కాలక్రమంబున సురస మేనయౌవనము పొడసూపినది. నాళీకశరుండు ప్రతీ కంబులం బ్రవేశించి వింతకాంతి గలుగఁజేసెను కుచవేణీభర౦బునఁ బూర్వకాయంబు గ్రుంనం బొడిముముడతలోయన వళిత్రయంబు చిత్రగతిం బ్రకాశించెను. స్తనజఘనం బులు ఘనంబులై విజృంభింప మధ్యంభితరాభివృద్ధి జూచి యోర్వక స్రుక్కెనోయన దృశ్యాదృశ్యంబై యొప్పె. నెప్పుడు నితరులజూచి యోర్వనివారు క్షీణింపకుందురా? సర్వావయవసుందరయగు అమ్మగున తొలి జవ్వనంబునఁ బూవిల్లుని ములికెవోలె సర్వజన మోహనంపై విరాజిల్లెను.

సురస మనోహరుండగు ప్రవరుండు రసిక ప్రవరుండగుట నిజవధూప్రతీక మదనప్రవేశం బరసి‌ యాసరసిజాననం గూడ దొందరపడుచుండెను. అగ్నివర్మ యుఁ బుత్రికాగత్ర వికాసఁ తెలిసికొని విధిక్రమంబున శుభముహూర్తమునఁ బ్రధమ క్రియామహోత్సవంబు గావించెను.

నాఁటిఱేయి సురసను గనత్కనకమణి భూషాంబర విశేషంబుల నలంకరించి సఖీజనంబు శోభనగృహంబున కనిపి పూసెజ్జం బతి పజ్జం గూర్చుండఁబెట్టి గంధ ములు పూయించుటయుఁ మాలికలు వై పించుటయు అత్తరు రాయించుటయుఁ బన్నీరు జల్లించుటయుఁ దాంబూలముల నిప్పించుటయు లోనగు శృంగారలీలల గావింపఁజేసి తలయొక నెపంబున అవ్వలికిఁబోయి తలుపు బిగించిరి.

సురసయుఁ దటాలున శయ్యనుఱికి తలుపుమూల దాగినది. తోడనవచ్చి ప్రవ రుం డచ్చిగురుఁబోణింకౌఁగిటఁ గ్రుచ్చి తల్పంబునంజేర్చి చిట్టకంబులంగావింప నిట్టట్టు కొనుచుఁ గన్నీరు గారవెక్కి వెక్కి యేడ్చుచు సురస విరసత్వంబు జూపిన అలిగి అతండు విడుచుటయునప్పుడతిఁబుడమిబండుకొనియేడ్చుచుండెనింతలోఁ దెల్లవారినది.

చెలులు మూగికొని కసరుచుఁ జాలుచాలు నీయల్లరియంతయుం దెల్లమైనది నీయాగడము తల్లికి౦ జెప్పెదముసుమీ?


చ. చదివితి వెంతయేని నెఱజాణవు పెద్దరికంబుమీర నొ
    ప్పిదముగ మాటలాడి వెరపించెద వొండ్లను దప్పుజూపి తె
    ల్పెదవు పతివ్రతా సుగుణవృత్తుల నింతకుఁ బూర్వ మిప్పుడో
    మదవతి యెందుదాచితివి మాకడఁజెప్పెడు నీతులన్నియున్‌

క. చెలినీవు నిన్నరాతిరి
   చెలువునికడఁ జేసినట్టి చేష్టలనెల్లన్‌


   వెలినుండి చూచితిమి యే
   పొలతుఁక యిటువంటి రట్టుబొందిరొ చెపుమా.

చ. రసికుఁడుగాడొ సద్గుణ నిరాజితుఁడై తగఁడో కశాసము
    ల్లసితుఁడుకాడొ యౌవనవిలాస నిహీనుఁడొ కామశాస్త్ర లా
    లసమతికాడొ నీపతి విలాసవతీ! మఱిరాత్రి నేమిటన్‌
    గుసుమశరాసనక్రియలఁ గూడక యొంటిఁ బరుంటి వుర్విపై.

క. ఇల్లరికముండె మగఁడని
   యెల్లిదముగఁజూచితేమొ యెఱుఁగము భళిరే
   వాల్లభ్యము మేల్‌ సరసపు
   టిల్గాలవు దొరికితివిగదే యాతనికిన్‌.

గీ. సిగ్గుపెంపున నేనిటు చేసినందు
   వేని యది హద్దుమీరిపోయినది ఎందు
   తెగినదాకచే ముడివెట్టి తిగియఁదగునె
   విఱిగినమనంబు గూర్ప నెవ్వఱితరంబు.

గీ. చిన్నదానవొ నీకంటెఁ జిన్నవార
   లెంతలెంతలు గావించి రిట్టివేళ
   ముచ్చటయ్యెడుగాదె యేమూలవై
   తంగభవశాస్త్ర వేతృత్వభంగియెల్ల.

అని మందలించిన సఖురాండ్రనదలించి ప్రత్యుత్తరమీయక యాకుటిలాలక చీకటి సదనంబునం బండుకొనినది. నాఁటి రాత్రి సఖురాండ్రు చక్కగా నలంకరించి బుద్ధులుగఱపి యంపిరి కాని యాజవరాఁలు తొలిరేయింబోలె వల్ల భునిఁజూడక యతని చేష్టల నంగీకరింప విరసత్వంబు జూపిన గోపించి ప్రవరుండు పలుకరింపడయ్యెఁ జెలికత్తి యలత్తెరం గరసి యెత్తెరవఁ బలుతెరంగుల మందలించి తల్లికెరింగింప నామెయు నేకతముగాఁ బుజ్జగించియు లాలించియుఁ గినిసియుంజెప్పి ప్రతివచనంబు బడయనేరక యలిగి మూఁడవరాత్రి నల్లునికిం జెప్పవలసిన మాటలంజెప్పి ప్రక్క కనిపినది. ప్రవరుండు తన విద్యాపాటవం బంతయు నాబోటియెడఁ జూపెనుంగాని నించుకయుఁ బతిచెయ్యుల మన్నించినదికాదు.


శ్లో॥ సహసావాప్యు ప్రకాంతా కన్యాచిత్తమ విందతా
     భయంత్రానం సముద్వేగం సద్యోద్వేషంగచ్చతి.

సురసతల్లి కూఁతురు విరధిత్వంబు పతికెరింగించుటయు నతండు అల్లున కొక శ్లోకమువ్రాసి యంపెను. ఆతండా శ్లోకము జదివికొని మామగారి యభిప్రా యము గ్రహించి మఱియు నీక్రింది శ్లోకము వ్రాసియంపెను.


శ్లో. ప్రధమ పరిగతాయాం బాలికాయాంచ చేష్టాం
    తమశిరహసిబాహుః సంస్తుతాయాంతరుణ్యాం
    క్షణమిహపరిరభ్యం పూర్వకాయేన కుర్యాత్‌
    ముఖమభివదనేన స్వేసతాంబూలదానం.

ఆశ్లోకము జదివికొని యగ్నివర్మ ప్రపరుండు కన్యావిస్రంభణ ప్రకరణ మెఱింగినవాఁడు వానిలోపములేదు. సురసచిత్తంబునఁగామ ప్రవృత్తి గలిగినదికాదు. కొన్నిదినముల దనుక దానికి భర్తృసంపర్కము మానిపింపవలయును.


క. వలరసము సతికిఁ బుట్టకఁ
   బలిమిని బురుషుండు కడఁగిపై కొనుటెల్ల న్‌
   మలయజము సానమీఁదను
   జలముంచక తీసినట్టి చందము సుమతీ.

అని భార్యకు జెప్పుటయు నామెయుఁ గొన్నిదినంబులు నిరీక్షించి నడుమ నడుమఁ బుత్రికకు బోధించియు సదుత్తరంబు బడయజాలక నొకనాఁడు భర్తతో నిట్లనియె.

మనోహరా! మన సురసకుఁ బదునెనిమిదేఁడులు దాటవచ్చినవి అవయవ స్ఫూర్తి బూర్తిగా గలిగినది. పురుషాపేక్షయించుకయుఁ బొడమునట్లు తోచదు. అల్లుఁడు చాలమంచివాఁడు. ఎన్నిదినములు పేక్షించి యుండును. ఆతఁడు వేరొకతెం బెండ్లి యాడునని నయమున భయమునంజెప్పితిని. అనురక్తియేమియుం గలుగలేదు. ఇంక గలుగునట్లును దోచదు. అల్లునిం దెచ్చి యింటఁ బెట్టుకొంటిమి. దౌహిత్రలాభ మాకాశకుసుమ మైనది. కూఁతునెట్లు మందలించుకొందురో చూచుకొనుఁడు. అని పలికిన విని శ్రోత్రియుఁడు ఇంచుక ధ్యానించి యిట్లనియె.

ఇఁక మనమెన్ని జెప్పినను దానికిఁ గామగుణము గలుగదు. రూపమా మోహ జనకము. ప్రాయమా మొదటిది. బుద్ధియా కడుచురుకు విద్యయా అనపథ్యము. ఇట్టి యువతి మగఁడనిన బెగడందుచుండ నేమనుకొనవలయును.

ఆది స్వయంప్రభవలె బ్రహ్మచారిణియై యుండును. ఎఱుఁగక పెండ్లి చేసి తిమి. ప్రవరునిం బ్రతిమాలికొనియెదను. మఱికొన్ని దినంబులుపేక్షించి చూడఁ గలడు. మనమెట్లు చెప్పిన నట్లు చేయువాఁడే సురసను మందలింపవలదని చెప్పిన నామె యిట్లనియె. కేవలము విరక్తురాలనిన నేనొప్పుకొనను. మగఁడుతక్క నన్నిటియందు నాసక్తురాలే. దానికిఁ తెలియనిపనిలేదు గ్రంధములన్నియు నన్వయించును. పురాణ గాధలు జక్కగా బోధించును. ఒరులకుఁ బతివ్రతాధర్మములు జెప్పును. ఈపురుష ద్వేషత్వము మనప్రారబ్దము గాఁబోలునని చింతించిన నాబ్రాహ్మణుఁడు పోనిమ్ము దానినేమియుననవలదు. నాకది యారవప్రాణము. అని యుగ్గడించెను. ఆప్రథ గ్రామమ౦తయు వ్యాపించినది. సురసకుఁ బురుషవాంఛ లేదని యాఁడు వాండ్రం దఱు నిశ్చయపరచిరి.

ప్రవరుఁడు అత్తమామల యాదరము తలంచియు సురససౌందర్యము దలం చియు నాయూరు విడువనేరక యెప్పటికై నను దానికి బుద్ధి తిరుగునేమోయను నాసతో సురస వెనువెనుక దిఱుగుచుఁగాలక్షేపము చేయుచుండె.

అని యెఱింగించి.

135‌ వ మజిలీ

అల్పునికథ

అగ్నివర్మయొకనాఁడు తన వీధిచావడిలోఁ గూర్చుండి కొందరుశోత్రులు చుట్టు నుం బరివేష్టింప భారతము శాంతిపర్వము చదువుచు నర్థము చెప్పుచుండెను. అట్టి తరి బదియారేఁడుల ప్రాయముగలిగి సర్వావయవసుందరుండగు నొక యువకుండు ప్రచ్ఛన్నముగా భూసంచారము చేయుచున్న మదనుండో అన నొప్పుచు ధూళిదూ సరిత శరీరుండై నను నులినాంబరధరుడై నను దేజము తొలంగక అచ్చటికివచ్చి అం దొకచోటం గూర్చుండి శ్రద్ధాభక్తులతోఁ బురాణము వినుచుండెను. అందు,


శ్లో॥ గార్హస్థస్యచ థర్మస్య యోగథర్మస్యచోభయో?
     అదూరసంప్రస్థితయోః కింస్విచ్చేయః పితామహః॥

గృహస్థుని ధర్మమునకును యోగిధర్మమునకుఁ జాల వ్యత్యాసము గలిగి యున్నది. ఒండొంటికిఁ జాలదూరము. వానిలో మోక్షమునకు ముఖ్యమైన మార్గ మేది. పురుషుఁడు దేనినాచరించి శ్రేయస్సునుబొందునో చెప్పుమని ధర్మరాజు భీష్ము నడుగుటయు నతండిట్టు చెప్పెను.


శ్లో॥ ఉభౌ ధర్మౌ మహాభాగా వుభౌపరమ దుశ్చరౌ
     ఉభౌ మహాఫలౌతౌతు సద్భిరాచరితావుభౌః॥
     అత్రతేవర్తయిష్యామి ప్రామాణ్య ముభయోస్తయోః

ధర్మరాజా! గార్హస్థ్యము యోగధర్మముగూడఁ బరమోత్తమములైన ధర్మములు