కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/144వ మజిలీ

వికీసోర్స్ నుండి

ఈపాతక మాభూపతింజెందదా? అన్నన్నా ! చేతఁ గరవాలము లేక పోయెగదా? పండితప్రవరా ! పరోపకారపారీణు నిన్నావంచకుండు కుక్కచేఁ గరపించెనా? ఏదీ ! నీవ్రణము. అయ్యో ! దానికోఱలు లోతుగానేదిగినవి. గాయమింకను బచ్చిగనే యున్నది. వాఁడెం దేగెనో నాకు జూపుము. అని పలుకుచుండ ఘోటకముఖుఁడు ఓహో ! ఈతండెవ్వఁడో గొప్పవాఁడు. తేజశ్శాలి. పరాక్రమసంపన్నుండు. శ్రీరాముండువలె భార్య నడవికనిపి పిమ్మటఁ బశ్చాత్తాపము జెంది యయ్యిందువదనను వెదకుచున్నవాఁడు. నిక్కము దెలిసినది. ఆచిన్నది వీనిభార్య. పాపము ఆమెను వాఁడు చెరఁబట్టఁబోవ బలవన్మరణము నొందకమానదు. ఈదంపతులకిఁక కలయికదుర్ఘటమే. ఈతనివెంటఁ బోయి కులశీలనామంబులం దెలిసికొనెదంగాకయని తలంచుచు నతండానృపతికిట్లనియె.

అయ్యా ! నేను వారినిమిత్తము పెద్దదూరము తిరిగి వెదకితిని. ఎందునుగనంబడలేదు. ఆక్రూరునినొసటఁ బెద్దకుంకుమబొట్టున్నది. గడ్డముపెంచెను. జడలుముడివేయుఁబడియున్నవి. వాఁడీపాటికి జనపదంబులకుఁ బోవఁగలఁడు. నేను వాని గురుతుపట్టఁగలను. మనమీయడవి విడిచి గ్రామములమీదుగాఁబోయి వెదుకుదము. కనంబడక యెందు బోగలఁడు. అనియుపదేశించిన సంతసించుచు నాఱేఁడు ఘోటకముఖునితోఁ గూడ వానివెదకుచు దేశసంచారము గావించెను.

అని యెఱిగించి మణిసిద్ధుండు తదనంతరోదంతం బిట్లుచెప్పఁ దొడంగెను.

148 వ మజిలీ.

-◆ రుక్మిణికధ. ◆-

భోజరాజునకుఁ గంధర్వపుత్రికయగు కమలయను భార్యయందు జీత్రసేనుఁడను కుమారుఁడును రుక్మిణియను కుమార్తెయునుదయించిరి. గంధర్వదౌహిత్రియగు నారాజపుత్రికసౌందర్యం బనన్యసామాన్యంబై యున్నదని వేరె వర్ణింపనవసరములేదు. ఆమె విహరించుటకై యాపట్టణంబును జేర్చియే గొప్పయుద్యానవనమొకటి నిర్మింపఁబడినది. ఆ తోటలోఁగల పుష్పజాతులు నందనవనములోఁ గూడ లేవని చెప్పవచ్చును. వాని చుట్టును గొప్పబ్రహరి గట్టఁబడియున్నది. సంతతము ఆరుక్మిణి యాయుద్యానవనమునందె విహరించుచుండును. ఆనిష్కు టములోనికిఁ బురుషు లెవ్వరుం బోరాదు. పోయినచో శిక్షింపఁబడుదురు. రుక్మిణికి యౌవనోదయమగుచున్నది. ఆతోటలోనే యాబోటి యాటపాటలు ఘోటకవిహారములులోనగు క్రీడలు గావింపుచుండును రేవతియను చెలికత్తియ యత్తన్వికి హృదయస్థానమై యున్నది. ఒక నాఁడారుక్మిణి యుద్యానవనములో సఖులతో నాడియాడి సాయంకాలమున స్వారివెడల వేడుకపడి రేవంతింజీరి సఖీ ! పరిచారిక గుఱ్ఱమును దీసికొనివచ్చినది కాదేమి? నేఁడు వాహ్యాళి లేదనుకొనినదాయేమి ? అనియడిగిన రేవతీదేవీ ! పరిచారిక యధాకాలమునకే తత్తడినాయత్తముజేసి తీసికొనివచ్చినదఁట. అది యకారణముగ బెదరి కళ్ళెము బట్టుకొని యెంతలాగినను నిలువక రెక్కలుగలదానివలె నెగిరి కళ్ళేము ద్రెంచుకొని యెక్కడికో పారిపోయినదఁట. దానికొఱకై పెక్కండ్రు రాజభటులు పరుగిడిపోయిరి. దాని జాడ యేమియుం దెలియలేదు. ఆమాట చెప్పుటకే నీదాపునకువచ్చితిని. నీవేదియో పుస్తకము జదివి కొనుచు నా దెసజూచితివికావు. ఇక వాహ్యాళికిఁ బ్రొద్దులేదు. రేపు గావింపవచ్చును. మిగుల దీక్షగాఁజూచుచున్న యాపొత్తములోని చిత్రములేమని యడిగిన రాజపుత్రిక రేవతికిట్లనియె.

ఈపుస్తకములో మిక్కిలి చమత్కారములగు విషయము లున్నవి. ఇది రహస్యగ్రంథము. దీనిపేరు చెప్పకూడదు. ఇవి స్పష్టముగా నర్ధము గాకున్నది. చూడుమని యాపుస్తకము రేవతికి నందిచ్చినది. రేవతి యాపుస్తకము విప్పి పేరుచదివి చిఱునగవుతోఁ దలయూచుచు నందందు బరిశీలించి వయస్యా ! నీవిప్పుడు దీనిఁజదువవలసినదే. వ్యాఖ్యానమున్నను గూఢముగానున్నది. దీనిం గురుముఖముగాఁ జదివి కొమ్ము. అని పలికిన రుక్మిణి యిట్లనియె.

రేవతీ ! దీనిం బురుషులయొద్దఁ జదువరాదుగదా ? శాస్త్ర పాండిత్యముగల స్త్రీలు మనకెక్కడ దొరకెదరు? తెలిసినంత మనమే గ్రహింపవలెను. నీవుగూడ విమర్శించి చూచుమనుటయు నది బాగు బాగు నీకంటె నాకెక్కువ పాండిత్యముగలదా ? తిన్నగాఁ జూచిన నీకేయర్ధమగును. లేనిచో బండితులనడిగి తెలిసికొనివచ్చెదనని పలికిన రుక్మిణి చాలుచాలు! మాటవరుసకంటి నీమాట యెన్వరికైనం జెప్పెదవుసుమీ? సిగ్గు సిగ్గు అని యాపుస్తకము పుచ్చుకొని యింటికిబోవుదము బండికట్టింపుము. అని యాజ్ఞాపించినది. అశ్వశకటము సన్నద్ధమైనదని విని రాజపుత్రిక రేవతికైదండ గొని మేడదిగివచ్చి బండియెక్కఁబోవుసమయంబున సశ్వరక్షకురాలు వచ్చి నమస్కరించుటయు రుక్మిణి, నేఁడు నీకతంబున వాహ్యళి చెడిపోయినది. గుఱ్ఱమేమిటికి బెదరినది ? మచ్చికచేయుటలేదా యేమి ? అని యడిగిన యాపరిచారిక అమ్మా! ఆబాడబమిట్టి యాగడమెన్నడును జేయలేదు. ఊరక బెదరి యెవరో లాగికొని పోవునట్లు పారిపోయినది. నిలుప నాశక్యమైనది కాదని చెప్పుచుండఁగనే యదిగో భర్తృదారికగుఱ్ఱము వచ్చుచున్నదని వనపాలికలు కేకలుబెట్టిరి. ఆమాటలు విని యందఱు నా మార్గము దెసకు దృష్టులు వ్యాపింపజేసిరి. అంతలో నొక చక్కని ఎవరాలు జీనుపైఁ గూర్చుండి కళ్ళెము లాగుచుండ నాహయం బతిరయంబున బరుగెత్తికొనివచ్చి రుక్మిణి యెక్కుచున్నబండి ప్రక్క నిలువంబడినది. రుక్మిణి యక్కలికిం జూచి యక్కజమందుచు జవ్వనీ ! నీ వెవ్వతెవు? యివ్వారువ మెక్కడ గసంబడినది ? దీనిందెచ్చి' మాకి చ్చితివికావున నెచ్చెలివైతివి. రమ్ము రమ్ము. నీవృత్తాంతము చెప్పుము. అని పలికిన నక్కలికి యతిలాఘవంబున నాగుఱ్ఱమును దిగినది.

రాచపట్టి యామెచెట్టఁబట్టుకొని యందున్న రచ్చపైఁ గూర్చుండఁ బెట్టినది. అప్పుడా చిన్నది, రాచకన్యతో రమణీమణీ ! నాపేరు చారుమతియండ్రు. నేనొక వేశ్యాపుత్రి కను. కన్నవారు చిన్నఁనాడే గతించిరి. బంధువులచేఁ బోషింపఁబడి విద్యాభ్యాసలాలసనై కాశీపురంబున కరిగి యందు బహువిద్య లభ్యసించితిని దేశవిశేషంబులం జూడ వేడుకబడి తిరుగుచుంటి. నేఁడు నేనీ వీటికి వచ్చుచుండ నా కెదురుగా నీతురగము పరుగిడివచ్చుచుండెను. అడవిమెకమని వెఱచి దిట్టెక్కితిని. ఆచెట్టుక్రిందికే వచ్చి యిది నిలువంబడినది. ఉత్తమాశ్వమని గ్రహించి దీనిపై కెక్కి, లగాములో కాలుపెట్టితినో లేదో యొక్క పరుగున నిక్కడికిఁ దీసికొనివచ్చినది. దీనిపై నెట్లు నిలువబడితినో తెలియదు. ఆ వేగమునకు మేను వివశమైపోయినది. ఇదియే నావృత్తాంతము. నిన్నుఁజూడ రాజపుత్రికవలెఁ గనంబడుచుంటివి. నీపేరేమి ? ఏమహారాజు గూఁతురవు? ఈనగర మెయ్యది ? నీయుదంత మెఱింగించి శ్రోత్రానందము గావింపుము. అనుటయు రాజపుత్రిక సఖురాలు రేవతి యిట్లనియె.

ఈమె సకలనృపకిరీట మణిఘృణీనీరాజిత చరణసరోజుఁడగు భోజభూభుజుని కూఁతురు. ఈమెపేరు రుక్మిణి. ఇది ధారానగరము. ఇది యీమె విహరించు నుద్యానవనము, అని యెఱింగించినది. చారుమతి యామాటవిని వెఱగుపాటుతో నోహోహో ! 'నేఁడింత సుదినము నే నెంతధన్యురాలను నాయభీష్టము దీర్ప నీయశ్వము సర్వేశ్వరుని యనుమతినే నన్నిక్కడికిఁ దీసికొనివచ్చినది. సకలకల్పభూజుండగు భోజమహారాజుయశము కాశీదేశమంతయు వ్యాపించియున్నది. అట్టి రాపట్టితో నాకు మైత్రిగలిగినది. నావంటిధన్యురా లున్నదియా! అని పొగడుకొనుచుండ వారించుచు రుక్మిణి యిట్లనియె.

చారుమతీ! నీమాటలచేత నే నీవఖండపాండిత్యధురంధరురాలనని తెలియఁబడుచున్నది. నీవంటి యాప్తురాలు దొరకుట చర్ఘటము. ఈవాఱువము నిన్ను నాచేరువకుఁ దీసికొనివచ్చుట నాభాగ్యముగాని నీభాగ్యమా! నీవు నాయొద్దఁ గొంతకాలము వసింపవలయును. నిన్ను నాహృదయంబునం బెట్టికొని కాపాడెదను. నన్ను శిష్యురాలిగాభావించి నీకువచ్చిన విద్యయంతయు నాకునేర్పుము. సంతతము నాయంతఃపురమునందే వసింపుము. నాభాగ్యమే నీభాగ్యము. నాభోగమే నీభోగము అనిపలుకుచు నేస్తమభిలషించిన విని చారుమతి యిట్లనియె.

రాజపుత్రీ! నీవు నాకుఁ బ్రియురాలవై మెలంగెదననిన సంతసింపనా? నీయిష్టమెట్లో యట్లేకావించెద. మఱియొకటివినుము నేను గణికనైనను కులవృత్తినివిడిచితిని. మీవారెవ్వరైన నన్ను విటకత్తెనుగా భావింతురేమో. అందుల కంగీకరించుదానఁగాను అనుటయు రుక్మిణి నవ్వుచు పువ్వుఁబోడీ! నాయంతఃపురమునకుఁ బురుషులువత్తురా? నాకెట్టియవరోధమో నీకు నట్టియవరోథమే. సంశయింపకుము. రమ్ము, అని చేతిలోచెయ్యివైచి బండియెక్కించుకొని తసప్రక్కను గూర్చుండ బెట్టుకొనినది. రేవతియెదురుగాఁ గూర్చుండినది.

అప్పుడు కొందఱుపరిచారికలువచ్చి దేవీ! రాజభటులు ద్వార దేశమునఁ గోలాహలము సేయుచున్నారు. నీగుఱ్ఱమెక్కి యెవ్వఁడో పురుషుఁడు లోపలికివచ్చెనట వానింబట్టికొని దండింతురఁట. ఈవలకుఁ దింపుమనుచున్నారు. సెలవేమి? అనవుడు రుక్మిణి చాలుఁ జాలు వాండ్రవిమర్శనము జక్కగానున్నది. గుఱ్ఱమెక్కి వచ్చినది యాఁడుదో మగవాఁడో తెలియకున్నారు. పోపొమ్మనుము. అనిగద్దించి బండి తోలించుకొని తనయంతఃపురమునకరిగినది. ఆరాత్రి రుక్మిణి జూరుమతితో నిష్టగోష్ఠీవినోదముతోఁ దృతిగా వెల్లించినది. మఱునాఁటియుదయంబున భోజకుమారుఁడు చిత్రసేనుఁడను వాఁడు రుక్మిణి యంతఃపురమునకు వచ్చి యొక్కచోఁ గూర్చుండి చెలియలింబిలిచి సహోదరీ! నిన్నసాయంకాలమున నీగుఱ్ఱమెక్కడికో పారిపోయినదనియు దానినెక్కి క్రొత్తవాఁడొకఁడు నీయుద్యానవనమునకు వచ్చెననియు వానిని బండిలో నెక్కించుకొని రాజభటులను గద్దించి నీవంతఃపురమునకుఁ దీసికొనివచ్చితివనియు నందున్న కావలి వారలు సెప్పుచున్నారు. మంత్రులావిషయము నీవలనం దెలిసికొని రమ్మని నన్నునియమించిరి. అందలియధార్థమేమనియడిగిన రుక్మిణి భయమభినయించుచు అన్నా ! కాశీపురనివాసిని చారుమతియను వేశ్యారత్నము మనయూరునకువచ్చుచు దారిలోనెదురుపడిన నాగుఱ్ఱ మెక్కినది. అది యెందునుబోక నాయుద్యానవనమునకుం దీసికొనివచ్చినది. అచిన్నది మిక్కిలి చదివినదఁట. ఆమెవలనఁ గొన్నివిద్యాసాంప్రదాయములఁ దెలిసికొనఁదలంచి నాశుద్దాంతమునకుఁ దీసికొనివచ్చితిని కావలివారలామెను మగవాఁడని బొంకుచున్నారు. కావలసిన నామె నిందుదీసికొనివచ్చి చూపెదఁ జూడుమనిపలుకుచు లోనికిఁబోయి చారుమతిపాణిఁ బాణింగీలించి ముచ్చటలాడుచు నచ్చటికిఁదీసికొనివచ్చి యీమెయే చారుమతి. ఈమెయేనిన్న నాగుఱ్ఱమెక్కి నాయుద్యాన వనములోనికి వచ్చినమచ్చెకంటియని యెఱింగించెను.

అప్పుడారాజకుమారుఁ డాజవరాలి మేనుజాళువామేనితళ్కు కన్నులకుమిఱుమిట్లుగొల్ప ముకుళితనయనుండై మోహావేశవివశుండై యొక్కింతతడవు ధ్యానించి మదినుదుటుగుదురుపడఁ జేసికొని తదీయ సౌందర్యాతిశయం బాపోవకచూచుచుండెను. రుక్మిణి చారుమతి సఖీ! ఈతఁడు నాసోదరుఁడు చిత్రసేనుఁడు; విద్వత్ప్రియుండు కొంత చదివినవాఁడు. కొదవవిద్యలు నీయొద్ద నేర్చుకొనఁగలఁడు. మఱియు మాయుద్యానవనరక్షకులు నీవు మగవాఁడవని నివేదించిరఁట. అందలి నిజము దెలిసికొనవచ్చెనని యెఱింగించుటయుఁ జారుమతి యారాజ సుతునకు నమస్కరించి యోరగానిలువంబడినది.

చిత్ర -- క॥ నారీ ! నీపేరేమది?

చారు -- చారుమతి యటండ్రు

చిత్ర - నీదు జననం బెచటో?

చారు - వారాణసి.

చిత్ర - కులమెయ్యది?

చారు -- వారాంగన నేను.

చిత్ర - కన్యవా?

చారు - అవు దేవా!

చిత్ర – గీ॥ విద్యలే మభ్యసించితివి?

చారు — నరనాథపుత్ర : శ్రీకాళిదాసాదిభూరికవిశిఖామణుల చేత విఖ్యాతిఁగనిన మీకడను జదివితిననుచుఁ జెప్పికొనఁగవశమె?

[క॥ నారీ నీపేరేమది?
      చారుమతియటండ్రు నీదుజననం బెచటో
      నా వారాణసి కులమెయ్యెది ?
      వారాంగననేను కన్యవా ? అవు దేవా.

గీ॥ విద్య లేమభ్యసించితివి నరనాధ
     పుత్ర కాళిదాసాదిభూరికవిశి
     ఖామణులచేత విఖ్యాతిగనిన మీక
     డను జదివితిననుచు జెప్పుకొనఁగ వశమె.]

చిత్ర. - క॥ లలనావతంసమా! నీకులవృత్తిని నేవగించుకొంటివి మేల్ పెండిలియాడెదవా!

చారు - యేమో ! తెలియదు. విధిపంపులకు విధేయులము గదా? రాజకుమారునిచిత్తము తదాయత్తమగుటఁ జిత్తభవునిసాయక ప్రవేశమున కవకాశమిచ్చినది. తదీయసంభాషణామృతము గోలుట. మేను వివశమైపోయినది. మోహమగ్గలమగుటయు నొడ లెఱుంగక సాత్వికవికారములతో వచ్చినపనియేమియో మఱచి యారాజకుమారుఁడు వికారముగా మాటలాడుచుండుటఁ దెలిసికొని రుక్మిణి అన్నా ! ఇఁక నీవిందుమసలరాదు. వేగఁబొమ్ము. చారుమతీ! లోపలికిఁబోవుదము రమ్మని యామెనంతర్భవమునకుఁ దీసికొనిపోయినది.

అప్పుడా నృపనందనుం డేమిచేయుటకుం దోచక రుక్మిణిపలికిన మాటలవడువున నందునిలువక చిత్తచాంచల్యముతో నిజనివాసమునకుంబోయెను.

అంతఃపురమునఁ జారుమతి రుక్మిణితో పట్టీ ! నీయన్న యెట్టి ప్రశ్నలు వైచెనో చూచితివా? ఎట్టివికారములఁ బ్రకటించెనో పరికించితివా? యౌవనవిలాసములు కడు విపరీతములుగదా ? అనుటయు రుక్మిణి సఖీ! పోనిమ్ము వానిగణింపకుము. అతండు నీవ్రతం బెఱుఁగకపోవచ్చును. నీరూపమందంత మహిమయున్నదని యామెమనసు చిన్నవోకుండ సవరించి మాటాడినది. పిమ్మట నాదినమందే మంచి సమయ ముపలక్షించి చారుమతి రుక్మిణీ! నీవిప్పుడు నావలనఁ దెలిసి కొనవలసినవిద్య లేమియో పేర్కొనుము. ఇప్పుడే ప్రారంభింతమని యడిగిన నమ్మగువ యేదియో యాలోచించుచుండెను. అప్పుడు రేవతి చెలీ! మఱచితివా ? నిన్న నుద్యానవనములో జూచుచున్న

పుస్తకము పాఠము జెప్పించుకొనుము. అందలి విషయములు మనకు స్పష్టముగాఁ దెలియలేదు. అని జ్ఞాపకము సేయుటయు స్మృతి నభిన యించుచు నాయించుఁబోఁడి యాపుస్తకము దెప్పించి యాయొప్పులకుప్పకుఁ జూపుచు దీని నాకు సాంతముగాఁ బాఠము జెప్పుమని కోరినది. చారుమతియు నుపన్యాసపూర్వకముగా నిట్లు చెప్పఁదొడంగెను.

శ్లో॥ పక్వాన్నమివ రాజేంద్ర సర్వసాధారణా స్త్రియః
     తస్మా త్తాసు న కుప్యేత న రజ్యేత రమేత చ॥
     మద్యపానా న్నివృత్తిశ్చ బ్రాహ్మణానాం గురోస్సుతాం
     పరస్త్రీభ్యశ్చ లోకానా మృషే రౌద్దాలకే రపి॥
     తతః పితు రనుజ్ఞాతా ద్గమ్యాగమ్యవ్యవస్థయా
     శ్వేతకేతు స్తపోనిష్ఠ స్సుఖం శాస్త్రం నిబద్ధవాన్ ॥

పూర్వకాలంబునఁ బరస్త్రీగమనము నిషేధముకాదు. స్త్రీలు పక్వాన్నమువంటివారు. అందరును సమానముగా ననుభవింపఁదగిన వారు. ఇది గమ్య ఇది యగమ్యయని విథినిషేధములులేవు. మఱియు బ్రాహ్మణులు మద్యమాంసములు దినువారు. గురుపుత్రికం బెండ్లియాడువారు. అట్టి దురాచారములన్నియు నిషేధించి పరమతపోనిష్టుండగు నుద్దాలకమహర్షి కుమారుఁడు శ్వేతకీతుండనువాఁడు తండ్రి యనుజ్ఞ చే (నపరదారాంగచ్చేత్) పరస్త్రీగమనము నిషేధించుచు సహస్రాధ్యాయములతో నొప్పుచున్న యొకశాస్త్రమును రచించెను. నాఁటినుండియు నాదురాచారము లన్నియు నశించినవి.

మఱియు నాగ్రంధవిషయంబులే క్లుప్తపరచి బభ్రుపుత్రుఁడగు పాంచాలుండను పండితుండు నూరధ్యాయములుగా సాధారణ సాంప్రయోగిక కన్యాసంప్రయుక్త భార్యాధికారిక పారదారిక వైశికోపనిషాదికములను సప్తాధికరణములుగల యీగ్రంధమును రచించెను. ఇందలి విషయంబులు సర్వజనానుష్ఠేయంబులని యెఱింగించి మఱియు,

ఇందు సూ - శతాయుర్వై పురుషో విభజ్య కాల మన్యోన్యానుబద్ధం పరస్పరస్య అనుపఘాతుకం త్రివర్గం సేవేత॥

పురుషుఁడు తన యాయువును విభజించుకొని ధర్మార్ధకామముల నొకదానివలన నొకదానికి బాధకములేకుండ ననుభవింపవలసినదని చెప్పఁబడియున్నది. చూచితివా

రాజపుత్రి - సఖీ! పురుషుఁడు తనయాయువునెట్లు పంచుకొనవలయునో చెప్పుము. చా - వినుము. బాల్యము, యౌవనము కౌమారము వార్ధక్యము, నాలుగు భాగములుగాఁ జేసికొని

సూ॥ బాల్యె విద్యాగ్రహణా దీనర్ధాన్॥

బాల్యంబున విద్యాగ్రహణాదికమగు నర్ధముల సంపాదింప వలయును.

రాజ – బాల్యమన నెన్నియేండ్లవఱకు?

చారు – ఆషోడశాద్భ వేద్బాలః అనియున్నది. పదియారేఁడుల వఱకు బాలుఁడనఁబడును.

రాజ - తరువాత

చారు -- సూ॥ కామంచ యౌవనె॥ యౌవనమునఁ గామ మనుభవింపవలయును.

రాజ - తరువాత,

చా - సూ॥ స్థావిరే ధర్మం మోక్షంచ! ముసలితనమున ధర్మమునుగుఱించి యత్నింపవలయును.

రాజ - సఖీ! నాకిందొక సందియము గలుగుచున్నది. మౌనసమునందుఁ గామమేకాని యర్ధధర్మముల నార్జింపఁగూడదా?

చారు - నవ్వుచు నీ సందియ మీగ్రంధకర్తయేతీర్చె నాకర్ణింపుము. సూ॥ అనిత్యత్వాదాయుషో యథోపపాదం సేవేత! అనఁగా జీవిత మస్థిరమగుట నెప్పుడేది సిద్ధమగునో యప్పుడు ధర్మార్ధముల సంపాదింపవలయునని శాస్త్రకారులే చెప్పియున్నారు.

రాజ -సూ॥ తిర్యోగ్యోనిష్వపి స్వయంప్రవృత్తత్వాత్ కామస్యనిత్య త్వ్యాచ్చ న శాస్త్రకృత్య మస్త్రీత్యాచార్యాః॥

శ్లో॥ వినోపదేశంసిద్ధోహి కామోనాఖ్యాత శిక్షితః।
      స్వకాంతా రమణోపాయె కో గురుర్మృగపక్షిణాం॥

చారుమతీ! నిన్నేను గొన్నియెఁఱిగియు నెఱుంగని శంకలు చేయుచుంటి పరిహసింపకేమి. త్రివర్గములో ధర్మార్థములకు శాస్త్ర మావశ్యకముగాని కామమునకు శాస్త్రపాఠమేల? కామము జంతువులకు నిత్యమైనదికాదా? పశుపక్ష్యాదికములకు స్వకాంతారమనో పాయ మెవ్వఁ డుపదేశింపుచున్నాఁడు ?

చారు - తరుణీ! వినుము. సూ॥ సంప్రయోగపరాధీనత్వాత్ సచ స్త్రీ పురుష యోనుపాయ మపేక్షతె॥ కామము సంప్రయోగపరాధీన మైనదగుట నుపాయ మపేక్షించుచున్నది. అయ్యుపాయంబు శాస్త్రపఠనంబునంగాని లభింపదు. పశుపక్ష్యాదు లావరణశూన్యములగుట ఋతుకాలమందె సంయోగాపేక్షగలవగుట వానికి శాస్త్రావశ్యకము కాన్పింపదు. మనుష్యులకు గమ్యాగమ్య వివక్షయు సంతోషావసాన ప్రతీకారములు గలుగుటంబట్టి శాస్త్రమావశ్యకంబై యున్నది.

రాజపుత్రి --- సూ॥ నకామాన్ చరేత్ ॥ పాండురాజు రావణుఁడు మొదలగు కాముకులు విశేషకామంబునఁ జెడిపోయిరికాదే. సామాన్య కామంబునఁదృప్తి బొందక విశేష కామంబునకేల ప్రయత్నింపవలయును?

చారు - రావణాదు లధర్మకామంబునంజెడిపోయిరి. ధర్మార్ధహాని కాకుండఁ గామమును బ్రవర్తింప జేయవలయునని శాస్త్రము ఘోషింపుచున్నది. ఇందులకే శాస్త్రపాఠము. మఱియొక విశేషము వినుము.

సూ॥ శరీరస్థితిహెతుత్వా దాహారసధమాన్ ణొహికామాః అజీణన్‌దిరోగ జనకంబైనను నాహారము శరీరస్థితికి హేతువగునట్లు కామముగూడ హేతువేయగుచున్నది. మఱియు,

సూ॥ ఫలభూతాశ్చ ధర్మార్థయోః॥ ధర్మార్ధములయొక్క సేవ సుఖముకొఱకే కదా అట్టిసుఖము కామమే.

రాజపుత్రి) – (నవ్వుచు) ధర్మార్థములయొక్క సేవ కామము నిమిత్తమా ఈమాటకుఁ బ్రాజ్ఞులు సమ్మతింతురా

చారు - సందియమేలా వినుము.

శ్లో॥ ధర్మమూలస్మృత స్వగన్‌స్తత్రాపి పరమాస్త్రియః।
     గృహస్థ ధర్మో దుర్వారో నరాణాందైవ యత్నజః॥
     హితాశ్చా పత్యసంతానై స్త్రియస్త్స్విహ పరత్రచ
     పరం సంప్రత్యయో భోగః ప్రకషాన్‌ర్ధాయ వై స్త్రియః॥

స్వగన్‌ము ధర్మమూలకమైనది. అందుఁగూడ స్త్రీలే ముఖ్యులుగాఁ జెప్పబడిరి. ధర్మయత్నజనితంబగు గృహస్థధర్మము దుర్వారమైనది సంతాన లాభమువలన స్త్రీలు ఇహపరసుఖముల నొసంగుచున్నారు కావున స్త్రీభోగము ప్రకర్షార్ధమునకు గారణమగుచున్న ది.

రాజపుత్రి ! స్త్రీ దోషప్రశంస మీమాటలకు బ్రతికూలమగు నేమో

చా - అబ్బో నీవు చాల చదివితివిగదా. పశువులు మేయునని చేలు జల్లుకొనుట మానుదురా ? బిక్షుకులు వత్తురని పాత్రలు పంసా దింపకుందురా ? స్త్రీదోషముల వివరించి స్త్రీలఁబరిగ్రహింపకుండుట దూష్యముకాదా?

రాజ -- (నవ్వుచు) చారుమతీ ! “నాపరదారా గచ్ఛేత్ ” అని శాస్త్రములు ఘోషింపుచున్నవిగదా? ఈ గ్రంథకర్త పారదారక ప్రకరణమెందులకు వ్రాయవలెను.

చారు - మంచిశంకయే చేసితివి వినుము. ఇది పాపకృత్యమని యెఱింగియు లోకప్రవృత్తి యిట్లుండునని తెలుపుటకై యిందువ్రాసిరి. మఱియుఁ బారదారికప్రకరణ మెఱింగినవాఁడుగాని స్వదారను రక్షించుకొనఁజాలఁడు. అని గ్రంథకర్తలేవ్రాసికొని యున్నారు. చూడుము.

శ్లో॥ భార్యాధికారికమిదం కథితం సమాసాడ్
     వక్ష్యామి సంప్రతిపరప్రమదాభియోగం।
     ఆయుర్యశోరిపు రధర్మ సుహృ త్స చాయం
     కార్యో దశావిషయ హేతువశా న్న కామాత్॥

పార దారిక ప్రకరణము తప్పకచేయఁదగినదని విధించలేదు. ఇది పాపకృత్యమని తెలుపుచు లోకప్రవృత్తి యిట్లుండునని దశాప్రకరణపద్ధతి ననుసరించి చెప్పితిని. కాని విధియని కాదని యాచార్యులే

వ్రాసికొనిరి చూచితివా?

రాజపుత్రి – సూ॥ తదంగ విద్యాః పురుపోధీయేత॥ దీని బురుషులే చదువవలయునని విధిగనంబడుచున్నదే? స్త్రీలుచదువవచ్చునా?

చారు — సూ॥ ప్రాగ్యౌవనాత్ స్త్రీ యౌవనోనయము కాక మున్ను చదువవలయునని చెప్పఁబడినది.

రాజ - ఇసిరో యౌవనము రాకమున్న యీగ్రంథము జదివిన నీ కేమి తెలియును? శుకపాఠమేయగును.

చారు — ప్రత్తాచ పత్యురభిప్రయాత్.

పెండ్లియైన తరువాత స్త్రీ పతియనుమతి వడసి చదువవచ్చునని యాచార్యులే వ్రాసియున్నారు.

రాజ — సూ॥ యోషితాంశాస్త్రగ్రహణస్యా భావాదనర్ధక మిహశాస్త్రేం స్త్రీశాసనమిత్యాచార్యాః స్త్రీలు శాస్త్రగ్రహణ విహీనలగుట నిందుఁజెప్పబడిన విషయంబులు గ్రహింపజాలరు. అప్పు డీ శాస్త్రమువలనఁ బ్రయోజన మేమియున్నది ?

చారు - సూ॥ ప్రయోగగ్రహణంత్వాసం ప్రయోగస్యచ శాస్త్రపూర్వకత్వాదితి వాత్స్యాయనః॥

స్త్రీలకు శాస్త్రగ్రహణము లేకపోవుగాక సంప్రయోగము శాస్త్రపూర్వకమగుట స్త్రీల కుపదేశింపఁదగియున్నది. కావున నిది నిరర్ధకము కానేరదు. శాస్త్రమే లేనిచో విధి యెట్లుతెలియఁబడును. ఎట్లుపదేశింతురు.

రాజపుత్రి - సరే. శాస్త్ర మావశ్యకమని యొప్పుకొనియెదను ఎక్కడనోకాని శాస్త్రజ్ఞులు లేరుగదా ? సంప్రయోగము సర్వజన విషయమైనది. ఈరెంటికి సామరస్య మెట్లుకలిగెడిని ?

చారు — శాస్త్రజ్ఞుఁడు దూరమందున్నను పారంపర్యముగా వ్యాపింపక మానదు.

మఱియు సూ॥ సంత్యపిఖలు శాస్త్రప్రహత బుద్ధయో గణికా రాజదుహిత్ర్యో మహామాత్రదుహితరశ్చ.

వేశ్యాంగనలు రాజపుత్రికలు సామంతుల కూఁతుండ్రు ఈ శాస్త్రమెఱింగినవారుందురు. వారివలనఁ జదివికొనవచ్చును.

రాజ -- అట్టివాండ్రు దొరకుట దుర్షటముగాదా. నేఁడు మా పూర్వపుణ్యమువలన నీవు లభించితివి కావున నింతవిస్రబ్ధముగా నడుగు చుంటిని. వీని నెట్టివారివలన గ్రహింపఁదగినది.

చారు - విశ్వాసముగల స్త్రీవలన నీసాంప్రదాయరహస్యములతో నభ్యాసమువలనఁ బ్రయోగింపఁదగిన చతుషష్టికళను దెలిసికొనవలయును.

రాజ — విశ్వసింపఁదగిన వారెట్టివారో చెప్పుము.

చారు - ప్రవృత్తపురుషసంపర్కముగల తనతోఁ బెరిగినదాసీ పుత్రిక సఖురాలు. పినతల్లి. వృద్ధదాసి. బిక్షుకురాలు అక్క. యిట్టి వారు విశ్వసింపఁదగినవారు.

రాజపుత్రిక -- చారుమతీ. చతుష్షష్టికళలు పలువిధంబులనొప్పు చుండునని చెప్పుదురు. వానిభేదంబుల వివరింతువే. అనుటయుఁ జారుమతి పుస్తకమువిప్పి యిట్లుచెప్పుచున్నది.

శాస్త్రాంతరమున నరువదినాల్గు మూలకళలని చెప్పఁబడి యున్నవి. అందుఁ గమాన్‌శ్రయము లిరువదినాలుగు గీతము నృత్యము, వాద్యము, కౌశలలిపిజ్ఞానము, ఉదారవచనము, చిత్రవిధి, పుస్తకమన్, పత్రచ్ఛేద్యము, మాల్యవిధి, గంధయుక్త్యాస్వాద్యవిధానము. రత్న పరీక్ష, సీవనము, రంగపరిజ్ఞానము, ఉపకరణక్రియ, మానవిధి, అజీవజ్ఞానము, తిర్యగ్యోనిచికిత్సితము, మాయాకృతపాషండ సమయజ్ఞానము, క్రీడాకౌశలము, లోకజ్ఞానము, వై చక్షణ్యము, సంవాహనము, శరీరసంస్కారము, విశేషకౌశలము. 24,

ద్యూతాశ్రయములు 20.

ఆయుఃప్రాప్తి , అక్షవిధానము, రూపసంఖ్య, క్రియామాగన్‌ణము, బీజగ్రహణము, నయిజ్ఞానము, కరణాదానము, చిత్రాచిత్రవిధి, గూఢరాశి, తుల్యాభిహారము, క్షిప్రగ్రహణము, అనుప్రాప్తి లేఖస్శృతి, అగ్నిక్రమము, ఛలవ్యామోహనము, గ్రహదానము, ఉపస్థానవిధి, యుద్ధము, రుతము, గతము, నృత్తము ఇవి యిరువది.

శయనోపచారికములు 16.

పురుషభావగ్రహణము, స్వ రాగప్రకాశనము, ప్రత్యంగదానము, నఖదంతవిచారము, నీవీస్రంసనము, సంస్పశన్‌నానులోమ్యము, పరమార్ధకౌశలము, హషన్‌ణము, సమానార్థాతాకృతార్ధత, అను ప్రోత్సాహనము, మృదుక్రోధప్రవర్తనము, సమ్యక్రోధనివర్తనము, క్రుద్ధప్రసాదనము, సుప్త పరిత్యాగము, చరమస్వాపవిధి, గుహ్యగూహనము.

ఉతరకళలు 4.

అశ్రుపాతముతో రమణునికి శాపమిచ్చుట, స్వశపధక్రియ, ప్రస్థితానుగమనము తిరిగితిరిగి చూచుట, ఇవి మూలకళ లనఁబడును.

చతుష్షష్టికళలను బలువురు పలువిధంబులం జెప్పుచుందురు వాత్స్యాయనోక్తములు పాంచాలోక్తములు శాకపాకములు సేయుటకు నలంకరించుకొనుటకుఁ జాలభాగ ముపచరించును. కవిత్వము

అవధానములు ఇంద్రజాలములులోనగు విషయములు వర్ణింపబడియున్నవి పాంచాలోక్తములు కేవలము క్రీడాయోగ్యములు. శాస్త్ర ప్రశంస, శస్త్రాస్త్రనైపుణ్యము అశ్వగజాదిశిక్షణములు ప్రకటింపఁబడినవి. పెక్కేల వానినెఱింగినవారి కెందుఁబోయినను విజయమే కలుగును.

అరువదినాల్గువిద్యలు.

1 గీతం॥ స్వరగము, పతగము, లయగము, చేతోవధానగమని గానము, నాలుగువిధములు.

2 వాద్యం॥ ఘన వితత సుషిర కాంస్య తంత్రీప్రభుతుల వలనంగలుగునది.

3 నృత్యం॥ విభావానుభావాదుల వలన వ్యక్తమగునది.

4 ఆలేఖ్యం॥ రూపప్రమాణవర్ణికా సాదృశ్యాది షడంగములతో విగ్రహములు వ్రాయుట.

5 విశేషకచ్ఛేద్యం॥ భూర్జాదిపత్రములు ఛేదించి తిలకముగ గర్ణ పత్రములుగ రచించుట.

6 తండులకుసుమబలివికారాః॥ నానావిధంబులగు తండులములచే గామ దేవాది భవనమునం దలంకరించుట పుష్పములతోఁ గూర్చి శివలింగాదుల నర్చించుట.

7 పుష్పాస్తరణం॥ శయనగృహాదులయందుఁ బూవులచే శయ్యాదుల గల్పించుట

8 దశనవసనాంగరాగః॥ కుంకుమాదిరంజకములచే నోష్టాదులు రంగులు వైచికొనుట.

9 మణిభూమికాకర్మ॥ గ్రీష్మకాలంబునఁ జల్లదనంబునకై మరకతాది మణులచే వేదికలు గల్పించుట.

10 శయనరచనం॥ రక్తవిరక్త మధ్యస్థాభిప్రాయముల ననుసరించి యాహారపరిమితంబట్టియు శయ్యలరచించుట.

11 ఉదకవాద్యం॥ నీటియందు మురజాదులవలె వాయించుట.

12 ఉదకాఘాతః॥ హస్త యంత్రములవల్ల నుదకముల విరజిమ్మి కొట్టుట ఈరెండును జలక్రాడాంగములు.

13 చిత్రాశ్చయోగాః॥ ఇంద్రియపలితీకరణాదులైన చిత్రయోగములు ఇవి యితరుల వంచించుటకు నుపయుక్తములు. 14 మాల్యగ్రధన వికల్ఫాః॥ విచిత్రములుగా దండలు గట్టుట.

16 శేఖరకాపీడనయోజనం॥ అనేక రూపములుగా శిఖలముడుచుట, వానియందు మాలికలు గూర్చుట, ఇవిరెండును నేపధ్యాంగములు.

16 నేపధ్యప్రయోగాః॥ దేశకాలానుగుణ్యముగా వస్త్ర మాల్యాభరణాదులచే శోభకొరకు శరీరమలకరించుట.

17 కర్ణపత్రభంగాః॥ దంత శంఖాదులచేఁ గర్ణ పత్రములు జేసి యలంకరించుట.

18 గంధయుక్తిః॥| స్వశాస్త్ర విహితప్రపఞ్చా, ప్రతీతప్రయోజనైవ।

ఆశాస్త్రమందు విధింపబడిన రీతిగలది. (పరిమళవస్తునిర్మాణము) దీనిప్రయోజనము సర్వప్రసిద్ధము.

19 భూషణయోజనం॥ మణిముక్తాప్రవాళాదులచే పేరులు కట్టుట, కటకకుండలాదులుచేయుట ఇవి నేపధ్యాంగములు వస్తురచన కాని శరీర మలంకరించుటగాదు.

20 ఇంద్రజాలాః॥ ఇంద్రజాలశాస్త్రప్రభవమలగు యోగములు సై న్యదేవాలయాదులఁ జూపించుట ఇవి పరమోహనార్ధములు.

21 కౌచుమారాశ్చయోగాః॥ కుచుమారునిచేఁ జెప్పబడిన సుభగంకరణాద్యుపాయ యోగములు.

22 హస్తలాఘవం॥ సర్వకర్మలయందు లఘువాస్తత్వము.

23 విచిత్రశాఖ యూషభక్ష్యవికారక్రియాః॥ భక్ష్యభోజ్యశాకాదులరుచు లుప్పతిల్లునట్లు వండుట.

24 పానక రస రా గాంసవ యోజనం॥ గుడతింత్రిణీకాదులచేఁ బానకమును ద్రాక్షామోచాఫలాదులచే మద్యమును మధురముగా వండుట

25 సూచీవానకమాన్‌ణి॥ సూదితో జేయఁదగినపనులు బంతులు తివాసులులోనగునవి యల్లుట. 26 సూత్రక్రీడా॥ దారము త్రెంపికలుపుట రంగులుగాజూపుటలోనగు వినోదము లెఱుంగుట.

27 వీణాడమరుక వాద్యాని॥వీణాడమరుకాదులు మనోహరముగా వాయించుట.

28 ప్రహేలిక॥ ఇది కావ్యప్రసిద్ధము పరవ్యామోహనము నిమిత్తముపయోగము. గూఢముగానుంచబడిన అర్ధముగల కావ్య విశేషము

29 ప్రతిమాలా॥ శ్లోకముల యంత్యమాక్షరములు జదివిన శ్లోకమగుట

30 దుర్వాచకయోగాః॥ శబార్థములచేఁ దెలియబడక చదువ శక్యముగాని యక్షరోపశ్లేషములుగల శ్లోకములు రచించుటయుఁ జదువుటయు

31 పుస్తచకవాచసం॥ శ్లోకములఁ బదములుగాను బదములశ్లోకములుగాను సంగీతముగాఁ జదువుట.

32 నాటకాఖ్యాయికాదశన్‌నం॥ నాటకములు పదివిధములు శ్లో॥ నాటక మంకో, వీధీ, ప్రకరణ, మీహామృగో, ఢిమో, భాణః॥ వ్యాయోగ సమవాకారో, ప్రసనమితి. ఈదశ విధనాటకములు రచించుట.

33 కావ్యసమస్యాపూరణం॥ శ్లోకసమస్యపూర్తి చేయుట.

34 పట్టికావేత్రాసన వికల్పాః॥ పేముచే మంచములును పీఠములు లోనగు నుపకరణములు రచించుట.

35 తలకర్మాణి॥ అపద్రవ్యార్ధములైన కుందకర్మలు,

36 తక్షణం॥ శయనాసనాద్యర్ధములగు వకిర్ధ కర్మలు.

37 వాస్తు॥ విద్యాగృహకల్మర కుపయోగించువిద్య.

38 రూప్యరత్న పరీక్షా॥ దీనారముల యొక్కయు నవరత్నముల యొక్కయు గుణదోషముల నెరుంగుట. ఇవి వ్యవహారాంశములు.

39 ధాతువాదః॥ మృత్ విప్రస్తరరత్న ధాతువులయొక్క సాత్యన శోధన మేళనాదుల నెఱుంగుట. 40 మణిరాగాకరజ్ఞానం॥ స్పటికాదిమణులకు రంగులు గలుగఁజేయు విధం బెరుంగుట. పద్మరాగాదిమణులు పుట్టుచోటు దెలియుట,

41 వృక్షాయుర్వేదయోగాః॥ వృక్షలతాదుల దోహదముల నెఱుంగుట.

42 మేషకుక్కుటలావక యుద్ధవిధిః॥| సజీవ ద్యూతాదివిభుల నెఱుంగుట.

43 శుకశారికాప్రలాపనం॥ శుకశారికాదిపక్షులకు మాటలు నేర్చుట. సందేశములు పంపుట లోనగు విషయంబు లెరుంగుట.

44 ఉత్సాదనే సంవాహనే కేశమర్దనే చ కౌశలం॥ తలయంటుటయు, గాళ్ళు పట్టుట లోనగుపనుల యందు నేర్పు. ఇది పరుల నారాధించునిమిత్తము.

45 అక్షరముష్టికాకధనం॥ గూఢాక్షరములతో శ్లోకములు రచించుట. దీనికే యక్షరముద్రయని పేరు.

46 మ్లేచ్ఛితవికల్పాః॥ సాధుశబ్దములతో గూడినదైనను నక్షర వ్యత్యాసంబున నస్పష్టార్ధంబగు పదంబులు మ్లేచ్ఛితకములని చెప్పంబడును. అట్టిశబ్దములతో శ్లోకములు రచించుట.

47 దేశభాషాలిపిజ్ఞానము॥ సకలదేశభాహి లిపివిశేషములం దెలిసికొనుట.

48 పుష్పశకటివా॥ పూవులునిమిత్తముగాఁ జేసికొను శకటిక రచించుట.

49 నిమిత్తజ్ఞానం॥ శుభాశుభశకున మెఱుంగుట.

50 యంత్రమాతృకా॥ విశ్వకర్మ ప్రోక్తములైన సజీవ నిర్జీవ యంత్రములు చేయువిధానము నేర్చుట. బండ్లు నోడలు మొదలగునవి యంత్రములతో జేయుట.

51 ధారణమాతృకా॥ ఏకసంధగ్రాహిత్వము. ఒకసారి వినిన దానిని జదువుట. 52 సంపాఠ్యం॥ కల్పిజదువుట అనగా దా నెప్పుడు జదువనిదాని నొకరు జదువుచుండ వానితో నేకరువు బెట్టుట.

53 మానసి॥ ఒకఁడుమనసులోఁ దలచుకొని వ్యంజనములు మాత్రము పద్మదళాకృతులుగా వ్రాసినంత నతఁడు తలంచికొనిన శ్లోకఛందోగణాదులు తప్పకుండ వ్రాయుట. ఇది కవితాచమత్కృతి విషయము.

54 కావ్య క్రియా॥ సంస్కృత ప్రాకృతాపభ్రంశ కావ్యములు రచించుట.

55 అభిధానకోశః॥ అడిగిన వృత్తములరచించుట.

56 ఛందోజ్ఞానం॥ పింగళాది ప్రణీతములగు ఛందస్సుల నెఱుంగుట.

57 క్రియాకల్పః॥ కావ్యాలంకారముల నెఱుంగుట. ఈమూడును గావ్యాంగములు.

58 ఛలితకయోగాః॥ ఒకరూపమును మఱియొకరూపముగా మార్చి పరుల వ్యామోహపెట్టె యోగములు నెఱుంగుట.

59 వస్త్రగోపనాని॥ చిన్నది పెద్దదిగాను, పెద్దది చిన్నదిగాజేసి వస్త్రములు ధరించుట.

60 ద్యూతవిశేషాః॥ నిర్జీవద్యూతక్రీడల నెఱుంగుట.

61 ఆకర్షక్రీడా॥ పాచికననాడుట ఇదియుద్యూతక్రీడలలోనిదీ.

62 బాలక్రీడనకాని॥ బాలుర కుపయోగించు నాటవస్తువుల రచించుట.

63 వైనయికీనాం జ్ఞానం. గజాదిశిక్షణము.

64 వైజయికీనాం వ్యాయామికీనాంచ విద్యానాం జ్ఞానం విజయాచారశాస్త్రములు విజయ ప్రయోజనములగు శస్త్రవిద్యలు మృగయాప్రయోజనములగు విద్యలు దెలిసికొనుట

ఈయరువదినాల్గువిద్యలు నీశాస్త్రమున కవయవములై యొప్పుచున్నవి. వీనికే యంగవిద్యలనిపేరు.

పాంచాలకధితచతుష్టష్టి కళలు.

1 స్పృష్టక విద్ధక ఉద్ఘృష్టక పీడనక లతావేష్టిత వృక్షాధిరూఢ తిలతండుల క్షీరనీరములు (8)

2 నిమితక స్ఫురితక ఘట్టితక సమ తిర్యక్ ఉద్భ్రాంత పీడిత అవపీడితకములు. (8)

3 ఛురితక అర్ధచంద్రిక మండల లేఖా వ్యాఘ్రనఖ మయూర పదక శశప్లుతక ఉత్పలాపత్రకములు. (8)

4 గూఢక; ఉచ్ఛూనక, బిందు, బిందుమాలా, ప్రవాళమణి, మణిమాలా, ఖండాభ్రక, వరాహచర్వితములు (8)

5 ఉత్ఫుల్లక, జృంభితక, ఇంద్రాణిక, సంపుటక, పీడితక, వేష్టితక, బాడబక, భుగ్నకములు (8)

6 సీత్కృత, హీందృత, స్తనిత, కూజిత, రుదిత, మూత్కృత, ధూత్కృత, ఫూత్కృతములు (8)

7 కీల, కర్తరి, విద్ధ, సందంశికాదిభేదములు. (8)

8 మంధనమాల:- అవమర్దన, పీడితక, నిర్ఘాత వరహఘాత, వృషాఖాత, చటక, విలసిత, సంపుటములు (8)

ఈ యరువదినాల్గుకళలు పాంచాలకధితములై యొప్పుచున్నవి. ఇవియన్నియు బ్రాయికముగ స్త్రీలు(గ్రహింపఁదగియున్నవి వినుము.

శ్లో॥ యోగజ్ఞా రాజపుత్రీచ మహామాత్ర సుతా తథా
      సహస్రాంతః పురమపిన్వవ శెకురుతే పతిం॥

శ్లో॥ కలానాం గ్రహణాదేవ సౌభాగ్యముపజాయ తే
      దేశకాలౌ త్వంవే క్ష్యా సాం ప్రయోగస్సంభవేన్నవా॥

అని చతుష్టష్టి కళాబేధంబుల తెరం గెఱింగించుటయు రాజపుత్రి చారుమతిని మిక్కిలి కొనియాడుచుఁ దల్లక్షణంబు లన్నియు విమర్శించుచుండెను. (అని యెఱింగించి)