కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/సత్యరాజా పూర్వదేశ యాత్రలు-ద్వితీయభాగము-మొదటి ప్రకరణము

వికీసోర్స్ నుండి
కందుకూరి వీరేశలింగం కృతులు

సత్యరాజా పూర్వదేశ యాత్రలు.


ద్వితీయ భాగము

లంకాద్వీపము.


మొదటి ప్రకరణము.

ఆఁడుమళయాళములో నాకు సిద్ధుఁ డనుగ్రహింహిచిన పనరు యొక్క మహిమచేత నడవవలసిన ప్రయాసములేక మనోవేగమున గగన మార్గమునఁ బోయి క్షణకాలములో నేను లంకాద్వీపమున వాలితినని చెప్పియున్నానుగదా! హనుమద్దేవుని తరువాత నీకలికాలములో మన పెద్దలెవ్వరును పురాణములలోఁ దక్క దర్శింపనోచుకోని లంకా ద్వీపమును వాయుపధమునఁ బోయి చేరఁ గలుగుటకు మన భరతఖండవాసులలోనేల్ల నేనే ప్రధముఁడ నగుటచేత,ఇంతటి ఘనకార్యమును నిర్వహించిన యాయుత్తమోత్తమ దినమును మహాపుణ్య దినమునుగా భావించి యేటేల మీ రుత్సవముచేసికొనక మానరన్న దృఢవిశ్వాసమునుబట్టి నేనక్కడ నడుగిడినదినమును మీకు సరిగా తృటిలవలతో చెప్పుచున్నాను. సావధానచిత్తులరై గ్రహింపుడు.నే నాదేశములో కుడికాలు మోపిన పుణ్యకాలము హూణశకము ౧౮౮౩ వ సంవత్సరము మార్చి నెల ౨౩ వ తేదీ మధ్యాహ్నము మూఁడుగంటల రెండుమినిట్ల నాలుగు సెకన్లు ముప్పాతిక మీఁద మోఁడువీసములకాలము. నేనాదేశమునందు వాలెడునప్పుడు సహితము మనదేశమందలి కాలజ్నులు తప్పుపట్టులు కవకాశములేకుండ సత్యరాజాపూర్వదేశయాత్రలు

త్రోవలోనే యెడమకాలు ముడుచుకొని కుడికాలొక్కటియే భూమి మీఁదఁ బెట్టినాను. హూణపంచాంగములు లేని యాదేశములో సంవత్సరమును మాసమును తిధియు సరిగా నెట్లు తెలిసికోఁగలిగితి వని సూక్ష్మబుద్ధి లేనివారు కొంద రడుగవచ్చును. ఆఁడుమళయాళ దేశములో మూఁడుసంవత్సరముల రెండుమాసములు పందోమ్మిది దినము లుండుటచేత దానిని బట్టి లెక్క వేసి చూడఁగా, నేనక్కడ ప్రవేశించిన దినము సరిగా నేనిప్పుడు చెప్పినదే యయినట్లు దేలినది. అంతేకాక లంకానగరము నందు జ్యోతిశ్శాస్త్ర విద్వాంసు లనేకు లున్నందన వారి నాశ్రయించి తరువాత కొంత కాలమునకు వారిచేత చేయించిన లెక్కను బట్టికూడ ర్వ్ండుమూడుదనము లెక్కువ తక్కువగా నేను జెప్పిన తిధిసరియైనట్టుసిద్ధాంతమయినది. ఆ రెండు మూడు దినములు వ్యత్యాసమును లంకాద్వీపమునకు మనదేశమునకుగల కాల వ్యత్యాసము లనను జ్యోతిశ్శాస్త్ర సిద్ధాంత భేదముల వలనను వచ్చినదగుట చేత మీ రాయల్ప భేదమును పాటింపక కర్మానష్ఠానమునకు నేను చెప్పిన దనమే సిద్ధాంతము చేసికొనుఁడు. శలివాహనశకాది హిందూశకమును న్నింటిని విడిచిపెట్టి హూణశకప్రకారముగా సంవత్సరపరిగణన మేలచేసితివని కొందఱుబిద్ధిమంతులు శంక చేయవచ్చును. దానికిని సమాదానము వినుఁడు. ఇప్పుడు మన భరత ఖండమునం దంతటను వ్యాపించియున్న యిగ్లీ షు పాఠశాలల మహత్త్వము వలన ముఖ్య పట్టణములయం దెల్లవారును తెలుఁగు సంవత్సరములును తెలుఁగుతిధులుగు మఱచి యున్నారనియు, ఇప్పు డించు మించుగా కలినిషిద్దముగానంగికరింపబడుచున్నసంధ్యావందనమును జేయుచాందసు లక్కడక్కడ ఁగొందఱన్నను వారుసహితము "అస్మిన్ వత్తమాన వ్యావహారిక హూణమానేన ౧౮౮౩ సంవత్సరే, మార్చిమాసే ౨౩తిధౌ"అని సంధ్యావందనములో నింగ్లీషు తిధు లంకాద్వీపము

లనే వాడుచున్నారనియు, నేనక్కడి జ్యోతిష్కుల వలననే యెఱిఁగిన వాఁడ నగుటచేత మీకు నుబోధమగుటకయి యింగ్లీషు తిధులను వాడితినేకాని నాకు తెలియకకాదు. ఈకలి కాలిము నందు సహితము జ్యోతిష మిట్లు ప్రత్యక్ష నిదర్శనముగా నున్నదికదా! లంకాద్వీపము నందు జ్యోతిశ్శాస్త్రమే ప్రబలియుండని పక్షమున ద్వీపాంతరమునం దేకాకినయియున్న నేను దూరదేశము నందలి మీస్ధితిగతుల నెఱుఁగక తిధి మాస సంవత్సరాదులను మీకు దురవహమగునట్లు బార్హస్పత్యమాన ప్రకారముగా తెలిపియుందును. నాకింతటిది దివ్యఙ్ఞనము ప్రసాదించిన యో జ్యోతిశ్శాస్త్రరాజమా : నీకు పదివేల నమస్కారములు పశ్చిమ ఖండమునుండి హూణులు తెచ్చి విడుచుటచేత నిప్పుడుభరఖండమునం దెల్ల యెడలను పిశాచములవలె సంచరించుచున్న ప్రకృతిశాస్త్రములను భయపడక నిఅన మాదేశము నెప్పుడును విడువక మావారి హృదయపీఠముల సధిష్ఠించి రాజ్యము చేయుచుండుము. సంధ్యావందన విసర్జనకధనముచేత శాస్త్రొల్లంఘనము చేసినట్లు పామరులు భావింతురన్న భీతిచేత జ్యోతిశ్శాస్త్రమునుబట్టి నేనెఱిఁగిన ఈసత్యమును గ్రహించి జ్యోతిషమును మునుపటికంటె నెక్కువగా గౌరవింతురని నమ్ముచున్నాను.

నేను లంకాద్వీపమును జేరినతరువాత సనెటు పోదునాదునాయని యాలోచించుచు క్షణకాల మొక మఱిచెట్టు నీడను గూర్చున్నాను. మఱి చెట్టుని చెప్పఁగానే యది మనదేశపు మఱిచెట్టు వంటిదేనని మీరనుకో వచ్చును. కాని అది ఆకారమునందుమన మఱ్ఱిచెట్లనే పోలినను పరిమాణమునందు మాత్రము శతగుణము లధికమైనదిగా నున్నది. దాని యాకులు మనదేశమునందలి తామరాకు లంత లేసి యున్నవి. దాని పండ్లు పెద్దతాటికాయలంతలేసి యున్నవి; చిన్న సత్యరాజాపూర్వదేశ యాత్రలు

యూడలు నాకౌఁగిటి కడగినవికాపు: కొమ్మలారంభమైన మ్రానిప్రకాండముయొక్క యెత్తన్నూఱడుగుల కంటె హెచ్చుగానున్నది; మ్రానియొక్క కైవారము సరిగా కొలవలేదుగాని నూఱడుగులకంటె నెక్కునగానేయున్నట్టు తోఁచినది: కొమ్మలు రెండూమూఁడు యోజనముల దూరము వ్యాపించియున్నవి. చెట్టెంతయెత్తుండనోయని యాకాశము వంకఁజూచితిని గాని నాదృష్టి వ్యాపించి నంతవఱకుఁ కొన కనఁబడలేదు. పయివంక జూచుచుందఁగా నొక కాకి కొమ్మలలొఁ గూరుచుండి కావుమని కూసినది. ఉరుమువులెనున్న దానికూత వినఁబడఁ గానే నాగుండెలు పగిలొపోయినవి; దాని రూపమను జూచినను నాభయము తక్కూవకలేదు. అది రూపమునందు గేదెదూడంత యున్నది. దానినిజూచి యేపక్షీనన్నెగ నెత్తుకొనిపోవునోయని భయపడి ప్రాణరక్షణార్ధమయి యొక యూడచాటునకుఁ బోయితిని. ఆవంక చూడఁగానే యూడమీఁదఁబ్రాఁకుచు రెండు కండచీమలు నాకంటఁబడినవి. అవి మనదేశమునందలి ఎలుకలంతలేసి యున్నవి. అవి కుట్టిన పక్షమున యేనుఁగు వంటిదృధకాయుఁడు సహితము నిమిషము లో పీనుఁగగు టకు సందేహముండదు. శివ నాఙ్ఞ లేనిది చీమ కుట్టదన్న లోకో క్తి యధార్ధముగా నేను సమీపమునకుఁబోయినను నన్నోక చీమయు కుట్టలేదు. అయినను వానిదర్శనమువలన నైనభీతిచేతనే నా దేహమంతయు గాలిలోపెట్టిన దీపమువలె కంపింప మొదలు పెట్టినది. అప్పటి నాదురవస్ధ నేమని చెప్పుకోను! దుత్తూరపర్ణి పసరు కొంచె మక్కడ దొరకినపక్షమున మరల కాలికి రాచుకొని శీఘ్రముగా స్వదేశముచేరి ప్రాణరక్షణము చేసికోనలెనన్న బుద్ధి పుట్టినది. నే నేవైపునఁ జూడ్కినిగిడ్చినను దుత్తూరపర్ణి యొక్క మొక్కయి నను చుట్టుపట్ల నెక్కడను చూపు మేర దూరములో నాదృష్టికి గోచ రముగా లేదు. అప్పుడు మనపూర్వులు మహబుద్ధిమంతులయి దూర

లంకా ద్వీపము
దేశయాత్రలు నిషేధించిన దూరదృష్టి యొక్క మహిమ నామనస్సునకు బోధపడి వారిసర్వజ్నత స్పష్టపడినది. ఆహా ! మన పూర్వులను బోలిన ధీమంతు లిప్పుడున్న వారిలోను ముందు పుట్టఁబోవువారిలోను కూడ నుండరు. అప్పుడు మనపెద్దలబుద్ధిని మెచ్చుకొనుచు వారి యందు పూజ్యతాబుద్ధి కలవాఁడనయి నాభాగ్యమింతే యని యెంచుకొని పెద్దలు నిషేధించిన ద్వీపాంతరయానమునకు పూనినపాపఫల మనుభవింపక తీఱదని నిశ్చయము చేసుకొని, వడవడ వడఁకుచు ప్రాణములమీది యాశ వదలుకొని ఈశ్వరనామస్మరణము చేసికొనుచు చెట్టుక్రింద నిలువుఁబడి యుంటిని. ఇట్లుండగా గాలిచేత మఱిపండొకటి నాకాలిసమీపమున రాలి కుండపగిలినట్లు బళ్ళున పగిలినది. ఈశ్వర కటాక్షముచేత పండు కొంచెము దూరముగా పడినదికాని నానెత్తిమీఁదనే పడినపక్షమున తల రెండు ప్రక్కలయి మీకీవృత్తాంతమును చెప్పువారులేక నేనీపాటికి స్వర్గలోకమున ప్రాతకాపునయి యుండి యుందును. ఈనాయాపదల కన్నీటికిని హూణులు చేసిన భూగోళశాస్త్రాము మూలము. వారి శాస్త్రాములను వేనిని నమ్మినవాఁడనయినను వారు దేశములను తిరిగి చూచివచ్చి సత్యము వ్రాసినారన్న విశ్వాసము చేత లంక యనఁగా నాకుచెప్పినట్లు సింహళ ద్వీపమనియు, అక్కడ మనవంటి మనుష్యులే యున్నారనియు, వారు వ్రాసిన వ్రాఁతలు నమ్మి భ్రమపడి మోసపోయి యీయాపదలను తెచ్చుకున్నాను. కాని సత్యమునకు లంకయనఁగా సింహళద్వీపము కాదు సుండీ. అదివాఱు ; ఇదివేఱు. ఈరెంటికిని గలభేధమును గూర్చి మీకు ముందు ప్రకరణమునందుఁ దెలిపెను. మహారణ్యమధ్యమున నేనిట్లు భయభ్రాంతుఁడనయి యున్న సమయములో గోరుచుట్టుమీఁద రోకటి పోటు పడ్డట్టు మఱియొకవిత్తుకూడ సంప్రాప్తమైనది. దిగ్ర్భమనొంది నేను దిక్కులు చూచుచుండగా నిరువదిముప్పది యడుగుల యెత్తు సత్యరాజాపూర్వదేశ యాత్రలు

గల నల్లని దిగంబర పురుషవిగ్రఁహ మొకటి నాపంక నడిచి రానారం భించెను. ఆఘోరరూపము నాకంటఁబడఁగనే పురాణములలో వర్ణింపబడిన రాక్షసుల రూపములును కధలును స్మరణకువచ్చి యది తప్పక రాక్షస దేశమని ఆక్రూర రాక్షసుని నాఁటిసాయం కాల భోజనమునకు నేనే ప్రధమ కళము నగుదుననియు తోఁచి నామనస్సులో నానా విధములైన యూహలుత్పన్నములు కానారంభించినని. నేను కన్నులెత్తియా వికృతవిగ్రహమువంకఁజూచునప్పటికి ముందుగా పెద్దగొడుగంతయున్న యాభీకం ముఖమునందు నిప్పుబంతులవలెనున్న తెల్లని వ్రేలెడేసిముని పండ్లు భయంకరముగా గానఁబడి నాదృష్టిని మిఱుమిట్లు కొల్పిననవి.అంతట నే నాఘొరాకారమును జూడలేక కన్నులు మూసికొన్నాను. కాటుక కొండవలె నడిచివచ్చు యావి గ్రహము నమీపింపఁగానే నాదేహము పిలుపునచెమర్చి కంపమెత్తి నది; నాలుకతడఁబడి నోట మాట రాకపోయినది; భయపడి ప్రాణములెక్కడకు లేచిపోయినవోకాని దేహస్మృతి సహితము తప్పిపోయినది. ఆక్షణమున నేను మూర్చలోమునిఁగి శవమువలెనయి మొదలునఱికిన వృక్షమువలె క్రిందపడిపోయినను. అటుపొమ్మట నక్కడ నేమిజరగినదోనాకు తెలియదు. నా ప్రాణములెంత సేపటికి మరల వచ్చి నాబొందిలో చేరుకొన్నవోనేను నిశ్చయముగాచెప్పిలేనుగాని యని చేరినపిమ్మట నేను కన్నులు విచ్చివ్హూవ్హునప్పఋఇకి నేను మునుపున్నచోట లేక భూమి కిరు పదియడుగుల యెత్తున చెట్టుక్రింద నాకగపడిన రాక్షసునియొక్క రెండవ చేతి వ్రేళ్ళు రెండు నానడుమును చుట్టుకొని యు న్నవి.నాతొడలకంటె నెక్కువలావుగా

                                 లంకాద్వీపము

మన్న యావ్రేళ్ళనడుమ నడకొత్తులోని పోకలాగున నిఱుకుకొని బాధపడిచు పయిపంకఁ జూచునప్పటికి వాని ముఖమప్పుడు సమీప మున నాకు మఱింత స్పష్టముగాఁ గానఁబడినది. తెఱచియున్న వాని నోరు వర్వతగుహవలె నున్నది; నాలుక గుహలోనుండి పయికీవెడలు చున్న కొండచిలువ వలెనున్నది; దంతము లా కొండ చిలువను పట్టుకొ నుటకయి చాలువుగావచ్చి ముక్కులుచాచిక్రిందను మీఁడను గుహా ముఖమున నిలుచున్న గరుడ పక్షులవలె నున్నవి. ఆస్ధితిచూచి నప్పు డా రాక్షసుఁడు గుటుక్కున మింగుటయి నోర వేసికొనఁ భోవు చున్నాడని భావించి, ఆక్రూర కృత్యమును చూడలేక మొగము వెనుక ప్రక్కకు త్రిప్పుకొన్నాను. అట్లు మొగము త్రిప్పు కొనఁగానే ముల్లువుచ్చి కొఱ్ఱడచినట్లు వొంటికంటెను గోరంతమైన వికృతరూప మొకటి నాకన్నులను వెఱపుగొలువుచు నావెనుకతట్టున నిలువఁగానే యున్నది. మొదటి రాక్షసవిగ్రహ మీనూతన రాక్షస విగ్రహము బెట్టుకొనియున్న యారాక్షసవిగ్రహము దానిముందు కేవలశిశుప్రాయ మయినది. మొదటి రాక్షసవిగ్రహ మీనూతన రాక్షసవిగ్రహము మొలవద్దకయినను రాలేదు. మొదటి విగ్రహముకంటె మూఁడంత లున్న యీవిగ్రహ మెంతపెద్దదిగా నుండునో దీనిని చదివెడివారే యూహించుకోవచ్చును. నమస్తాపయనములును మొదటి గ్రహమున కున్న దానికంటె మూఁడేసిరెట్లున్నవి. ఆవిగ్రహముయొక్క మొగము చూడవలెనని నేను తలయె త్తితినిగాని దేవాలయములోని గాలిగోవురము యొక్క శిఖరమువలె నున్నయాతనిశిరస్సు తిన్నగా కంటికి కనఁబ డినదిగాదు. అడవిపంది యొక్క వెన్నుమీఁది నిడుదనెండ్రుకలవలె నున్న యాతని కడుపుమీఁద నూగారు నడుమ నాదృష్టి కడ్డమునచ్చి బెదరింపఁగా క్షణకాలము తొలఁగిపోయిన భయదేవత మరలవచ్చి నాహృదయములోఁ బ్రవేశించి నాకన్నులను మూఁతవేసినది; అంగ

                      సత్యరాజా పూర్వదేశయాత్రలు

ముల నల్లలనాడించినది ; మొగమును వెలవెలఁబాఱించినది; ప్రాణము లను బాఱఁదోలి శరీరము నంతను మరల వివశముచేసినది. ఇట్లు కొంతసేపు మరలమూర్చపోయి రెండవసారి తెలివి తెచ్చుగొని కన్నులు విచ్చి చూచునప్పటికి నేను మొదల ననుకొన్నట్లుగా పయికి పిన్న రాక్షసుని నోటిలోనికిఁబొక క్రిందికి భూమీఁదికి వచ్చి యున్నాను. అప్పుడు భూమిమీఁదనున్న నన్నాయిరువురు రాక్షసులును మాళ్ళ మీఁద గూరుచుండి వంగి నాయవయవములను శోధీంచి చూచుచు న్నారు. ఆసమయమునందు నేను కదలి భూమిమీఁద నడువనారంభిం పఁగా వారు సంతోషించి తమలోతామేమో చెప్పుకొనినన్ను మరల చేతులతోఁబట్టి మనదేశము నందు పిల్లలు పక్షిపెల్లలను బట్టలలోఁ బెట్టుకొని తీసికొని పోవునట్టు నన్ను తమ బట్టలలోఁ బెట్టుకొని మఱి యొక యింటికిఁ గొనిపొయి వాకిట బల్లమీదఁ గూరుచుండి చదువు కొనుచున్న మఱియొక రాక్షసుని జూచి నమస్కరించి యాతనితో నేమేమోచెప్పి మెల్లగా నన్నాతని బల్లమీఁదఁ బెట్టిరి. ఆతఁదును నన్ను మొట్టమొదట తన చేతిలోనున్న పుస్తకముతో మెల్లగా కద ల్చిచూచి, కొంతసేపు నామొగమువంకను చేతులవంకను వంగిచూచి యాశ్చర్యపడి, పురుగును కఱిచిపోవునేమోయని భయపడి మనము నేర్పుతో పట్టుకొనునట్లు మెల్లగా తనచేయి నానడుము పట్టుకొని సాహసించి చటుక్కున ముందఱి వ్రేళ్ళతో నానడుము పట్టుకొని పయికెత్తి, వెల్లవెలికిలఁబట్టి మొగము చేరువను బట్టుకొని కొంత సేవునన్ను నిదానించిచూచి చిఱునవ్వునవ్వి, నన్ను మెల్లగా మరల బల్లమీఁదఁ బెట్టెను. కఱుతునో కుట్టుదునోయన్న భయమొ చేత నన్నతఁడు గట్టిగా పట్టుకొన్నందున వ్రేళ్ళయొత్తుడుచేత నానడుము నలిగి తరువాత మూఁడు దినములవఱకును నా నడుమునొప్పి పోయి నదికాదు.

                                       లంకాద్వీపము

నన్ను మొట్టమొదట మఱ్ఱిచెట్టు క్రింద చూచిన వాఁడు నాలుగేండ్ల ప్రాయముగల బాలుఁడు. బాలుఁడైన హేతువుచేతనే యాపిల్లవాఁడు దిగంబరుఁడుగా నున్నాఁడు గాని యాలంకలోని కాపులందఱును దెస మొలవారు కారు. అక్కడ పెద్దవాండ్రందఱును మనవలెనే తమకు తగిన నస్త్రములనను ధరించుకొందురు. ఆచాలుఁ డాడుకొనుటకయి యూరి వెలుపలనున్న మఱ్ఱిచెట్టునద్దకువచ్చి నన్నుచూచి మూర్చపోయియున్నప్పుడు పసివాఁగుటచేత నన్ను నిర్భయముగా పిల్లికూనవలెతన యింటికిఁ బట్టుకినిపోయి నేను మూర్చతేఱునప్పటికి నన్ను తనతండ్రికి చూపుచుండెను. అతఁడును నన్నాశ్చర్యపడిచూచి మనుష్యరూపమున నంతచిన్న జంతువున్నవార్త యెప్పుడును విననందున,ఇటునంటి యద్భుతవస్తువును జూచి వింతపడి, అంతచిన్నదిగాకిచ్చుట యుక్తమనిభావించి తక్షణమేకొనిపోయి యాతనికి సమర్పించెను. అతఁడును నారూపమును జూచివింతపడి, అంతచిన్నదిగానున్నను మనుష్యరూపమగుటకు సందేహములేదని నిశ్చయించిఅయినను లంకా ద్వీపము జ్యౌతిష భూమియగుట చేత జ్యోతిఝ్యల నిమిత్తము సేవకులను బంపెను. ముహూర్త గ్రథములను జాతకగ్రంథములను, సాముద్రిక గ్రంధములను చేతఁబట్టుకొని కొంచేము సేపటికి నలుగురు సిద్దాంతు లక్కడకువచ్చిరి. అప్పు డతఁడు నన్నా కాలజ్ఞుకుచూపఁగా వారు నేనేజాతి జంతువునో నిర్ధారణము చేయుటకై గ్రహగతులను విచారించియు శ్వాసలు పరీక్షీంచియు శకునములను జూచియు గణనవేయుట కారం భించిరి. ఆజ్యోతిఝ్కలలో నిద్దఱు మంచి పురాణవేత్తలు. మనదేశము నందువలెనే యాదేశమునందును పురాణములున్నవి. వారిలో నొకపురాణ వేత్తకొంచెముసేపాలోచించి యొకచోట కలియుగములో నేల ము

                         సత్యరాజా పూర్వదేశయాత్రలు

లగచెట్లకు నిచ్చెనలు వేయు నంతటి హ్రస్వాంగులు పుట్టుదురని చెప్పియు న్నందున నట్టివారిలో నేను ప్రథముఁడనని చెప్పెను, ఇంకొక పురాణ వేత్త తనవ్రేలితో నన్ను కొలిచి వాలఖిల్యాదు లని యొగతెగ మహర్ష లంగుష్ఠమాత్రశరీరు లుందురని పురాణములలోఁ జెప్పియున్నం దున నేను వాలఖిల్యాదులసంతతివాఁడ నని చెప్పెను. ఆట్లు పురాణ మార్గమున మాత్రమేకాక తరువార నలుగురు సిద్దాంతులును జ్యౌతిష మార్గమునకూడ నాలోచించి నేను మనుఝ్యఁడనని యేకవాక్యముగాఁ బలికిరి. క్రొత్తగాఁ బోయినవానికి నీకునారిసిద్దాంతములన్నియు నెట్లు తెలిసినవని కొందఱు