కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/సత్యరాజా పూర్వదేశ యాత్రలు-ద్వితీయభాగము-ఏడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

లంకాద్వీపము

చేయవలెనో తెలియకున్నది; ఈపెట్టెలోనుండి ముందుగా నీవలనఁబడినఁగదా తరువాత ప్రతిక్రియమాట యాలోచింపవలెను? నాశత్రువు లెవ్వ రేరూపమును ధరించివచ్చి నా కేయవాయమును సేయు దురోయని వాయుల్లము తల్లడిల్లుచున్నది. హా: దైవమా: ఏమిచేయుదును? కామరూపమునుపొందు శక్తిని మాభరతఖండవాసుల కెప్పుడును ప్రసాదింపకుము. ఈకామరూపధారణము దుష్టులకు మాయవేషములు వేసుకొనివచ్చి సాధువులకు హానిచేయుట కొఱకేకాని మంచివారి కేసత్కార్యములు చేయుటకొఱకును నావశ్యకమైనది కాదని నాకిప్పుడనుభవము వలనఁ దెలియుచున్నది.

ఏడవ ప్రకరణము.

ఆ పెట్టెలోనే నొకబట్టమడతమీఁద గూరుచుండి పైని చెప్పినట్లు నాలోనే నాలోచించుకొనుచుండఁగా నేదో తేల్లుకుట్టినట్టు నావడ్డిమీఁద నొకపోటుపొడినది. ఆపోటుతో నాధ్యానమంతయు చెడినందున నిప్పుతొక్కిన క్రోఁతివలె నొక్క యెగిరెగిరి యులికిపడి లేచి నాలుగుమూలలను గంతులువైచుచునిది యాదుస్స్వప్న ఫలమని భయపడుచు ముందుకు తిరిగిచూచునప్పటికి నాకన్నులయెదుట మన మూవకమంత జంతువొకటి మహాభయంకరముగా కానఁబడెను. అది యెలుకవలెనున్నను దానికి తోఁకగాని వెనుకవైపున కాళ్ళుగాని యేమియులేవు, అవయవరహితమై తోలుకప్పిన యెముకలులేని నల్లని మాంసపుమద్దవలె నున్న యాచరమకాయమే దానిశరీరములో నాలుగింట మూఁడువంతులున్నది: ద్రాక్షసారాయము పోసిన తోలుతిత్తివలె
సత్యరాజా పూర్వదేశయాత్రలు


నుబ్బి మెత్తగానున్న, యాచరమకాయమునకంటి దానిలో చతురాంశమంతయున్న పూర్వకాయమున్నది; ఆ పూర్వకాయమునకు ప్రక్కకు మూఁడేసి చొప్పున రావణాసురుని భుజమువలె నారుకాళ్ళున్నవి; దక్ష ప్రజాపతిమెడ కతికించిన మేషశిరస్సువలె చిన్నదిగా నున్న దాని శిరస్సున కిరుపాశ్శ్వములయందును పట్టుకారువలె రెండుడెక్కలున్నవి; దాని దేహచ్చాయ యమవాహనమైన మహిషచ్చాయను బోలి నామనస్సున కప్పు డంధకాసురుని స్మరణకు తెచ్చినది. నాకన్నులయెదుట నట్లు నిర్భయముగా నిలువఁబడిన యాజంతువు పయికి మత్కుణమువలె కానబడినను అది కామరూపప్రభావముచేత నట్టి రూపమును వహించిన ఘోరరాక్షసుఁడయినందుకు సందేహము లేదు. విద్వన్మహాసభలో నేనట్లు ప్రతిపక్షుల నోడించి జ్యోతిశాస్త్రము నాచంద్రార్కముగా నిలువబెట్టిన నాటినుండియు పరాజితులయిన క్రూరరాక్షసులు నామీద పగపట్టి నానావిధమాయవేషములు చేత నాకాపయముచేయ జూచుచున్నారు. ఆ దేశమందలి జ్యోతి శ్శాస్త్రమహిమచేత నేటిరాత్రి నేనీపెట్టెలోనుందునని ముందుగాఁ దెలుసుకొని నాకు హానిచేయవలెనన్న ద్రోహబుద్ధితో వచ్చి యవ్వడో యొక రాక్షసుడు నాకంటె ముందుగానే పెట్టెచొచ్చి దాఁగియున్నాఁడు. అట్లు కానియెడల తాళమువేసిన పెట్టెలోని కాజంతు వెట్లు వచ్చును?వచ్చినను మత్కుణరూపము నేల ధరించును? ధరించినను నేనువచ్చినదాఁక దాఁగియుండి దొంగవలె నేమరుపాటున మీదబడి నన్నేల కరుచును?ఇన్ని హేతువులనుబట్టి యాజంతువు రాక్షసుఁడగుట నిశ్చయము. అయినను నాకిప్పుడీరాక్షసునిపేరు తెలియనందున నిజమైనపేరు బయలఁబడువరకును మనకధాంశము నిమ్మితము నేనాతని మత్కుణాసురుఁడని పిలిచెదను. నేను భూదేవుఁడ నన్నయంశము మీకు తెలిసినదే కదా. దేవతలు రాక్షసులను తారసిల్లినప్పుడు

                            లంకాద్వీపము 407
  మహాయుద్ధము సంభవించుననియు మిరెఱుఁగునురు. మనుష్యాశనుఁడగుటచేత నన్ను మింగవలెనని యారాక్షసుఁడే మొట్టమొదట నామిఁడఁడెనో దుష్టశిక్షణము చేయవలెనని నేనే మొట్టమొదట రాక్షస సంహారమునకు పూనితినో వీరావేశపరశుఁడ నయి యుండుటచేత నేను నిశ్చయముగాఁ జెప్పులేనుగాని మాయిరవురకును జరిగిన యుద్ధము దేవాసురయుద్ధమును మించినదనిమాత్రము దృఢముగాఁజెప్పుఁగలను ఆరంభదశలో కొంతసేపు మాయిరువురకును బాహాబాహిని సఖానఖిని దంతాదంతిని ఘేరయుద్ధము జరగినది. నాకుమారుని మిదికి దుముకు గరుత్మంతునవని నే నారాక్షసునిమిఁదకి కుప్పించి యుఱికి నారెండు బాహువులతోను వానిబాహు వొకటి యొడిసిపట్టి శ్రీకృష్టులవారు గోవధనగిరి యెతినట్టు పయికేత్తి గిరగిర త్రిపి నేల మిఁదవేసి కోట్టఁఅబోయితిని. కాని యారాక్షసుఁడు క్రిందఁబడక మాయచేసి తనబాహులతో నాచేయి గట్టగాపట్టుకోని వదలక కత్తుల వంటి తన డెక్కతో నాకత్తుక కత్తిరించి వలెననియె యమపాశ ములవంటి తనబాహుపాశముల నాఱింటిని నామెడకోక్కసారిగా చుట్టి బిగించి యూపిరివెడలనీయక ప్రాణములు గోనవలెననియె దక్షిణ భుజముమిఁదుగా నాకంటసమిపమునకు ప్రాకఁ జొచ్చెను గాని నేనింతలోమెలఁవకపడి మెచేతివద్దికి పరుత్తునప్పుటికి యెడమచేతితో నేరాక్షసుని కాలుపట్టుకొని నేలమిఁదమెఁపి సింహనాదము చేసితిని. నాసింహనాదముయొక్క దారుణధ్వనిచేత దిగ్గజముల చెవులకు చెవుడు పట్టియుండును.ఆకాశమునుండి గవ్వలవలె నక్షత్రములన్నియు నేలమిఁద రాలియుండును.నేనప్పుడాపెట్టెలో నిర్భంధింపఁబఁడి యుండుటచేత పయికివచ్చి చూడలేకపోయితినిగాని లేని యెడల క్రిందరాలిన నక్షత్రములను కొన్నిటి నేఱిమూటకట్టి తెచ్చి నామటకు నిదర్శనముగాను నాపౌరుష ప్రకటన మగునట్లుగాను మి

సత్యరాజా పూర్వదేసశయాత్రలు

కుఁజూపి మికద్భుతము కలిగించియుందును. నేను విసరివైచినప్పు డారాక్షనుఁడు పర్వతమువలె నేలఁగూలియు చావక బట్టమడత మీదపడి మరల లేచి మహావేగముతో నావంక పరుగెత్తుకొని రాఁజొచ్చెను. నేను నెదురుగాఁబోయి కుంజరము మిఁదికి కుప్పించు సింహమువలె రాక్షసుని మిఁదికి లంఘీంచి కొలఁదిని నొక్కతన్ను తన్నితిని. ఆతన్ను తగిలియున్నయెడల వాఁడుపొట్ట పగిలి చావవలసినవాఁడే కాని యారక్షసుఁడు తన మాయబలము చేత నపాదఘాతమును తప్పించుకొని ప్రక్కకు తొలఁగెను. ఆపదతలాఘాతమ చేతపెట్టెయంతయు నదిరిపర్వత గుహవలెమాఱుమోసెరు. నాకాలి తాకుఁన పెట్టెక్రిందకి దిగిపెట్టెతోగూడ భూమి పాతాళమంటక్రుంగుటచేత నాడుశేషుని తలలకెంతోనొప్పి కలిగియుండును. అతడాదుర్భర వేదనచేత శిరసుకదల్చి నప్పుడు భూకంపము కలుగకమానదు. ఓభరతఖండవాసులారా! హూణశకము ౧౮౮౬ వ సంవత్సరముమార్చి నెలయేడవ తేదిని గాని దానికి కొన్నిదినములీవలావలను గాని భూకంపము కలిగినదేమో స్మరణకుఁదెచ్చు కొనుడు. ఆకాలము నందెక్కడనైనను భూకంపము కలిగినట్లు మీకుజ్ఞప్తికివచ్చినను వార్తాపత్రికల యందు చదివినను పెద్దల వలనవినినను స్వప్నముల యందుజూచినను, అదినాపాద తాడనముచేతనే యైదనిగ్రహింపుడు. ఎన్నివిధముల చేత విచారించినను మీ కాభూకంప వాతా౯గోచరముకాని పక్షమున మీరు మన పంచాంగ్ములను జదివి వాని యందైనను జూచి జ్యోతిష శాస్త్రమహిమకు సంతోషింపుడు. ప్రక్కకు తొలగిన యా రాక్షసుడు బట్ట మడత చివర వరకూ పరుగెత్తి యక్కడ నుండి మరలి మరల నావంకకు నడివ నారభింపగా నేను వెనుకకు బోయి పార్శ్వ భాగమునకు వచ్చి యెక్క కాలొడిసిపట్టి ద్వంద్వ యుద్ధము కారంభించితిని. భీమ దుర్యోదనులకు జరిగిన ద్వంద్వ యుద్దము వలె మాపోరాట

<poem>లంకాద్వీపము ము మహాఘోరముకాగాఁ రాక్షసుఁడు ధర్మయుద్ధమున నన్ను గెలువలేక యధర్మయుద్ధమున కారంభించి కాటు శీయవకోయెను . నేనాకాటునకం భయపడక ధైర్యము వంక పట్టుబట్టి వదలక నట్టిల గదలక విష్ణుమూర్తి యొక్క శంచాయముఖము వంటి ఇఖములతోఁ జీల్చి వానివజ్రకాయమును చేదింపలేక తుదకువాఁడుపదేశించిన మార్గముననే యవలంబించి దంతము లుపయోగించి త్వరిడాభూలిమ భీముఁడు సుయోధనుని చొడలువిరుగగొట్టునట్లు కఱుక్కున కొశికి నామునిపండ్లతో వానికాలొక్కటి నొడవఱకు రెండు ఖండములు చేసితిని . ఈప్రకారముగ యుద్ధమునంతను వర్ణించిన పక్షమున భారత రామాయణములంత గ్రంథము పెరుగునని భయపడి యాపనిని వురాణకత౯లకు విడిచి నేనిక్కడ మాసమరపర్యవసానము మాత్రము చెప్పెదను . శ్రీరాములవారు రావణాసురుని వింశతిబాహువులను నఱికినట్టును శ్రీకృఘలవరు బాణాసురుని సహస్రబాహులను నఱీకినట్టును నేనామత్కుణాసురుని యాఱుబాహులను దంతాదంతిని సఖానఖని యుద్దముచిసి నఱికి నాయసహయ శూరత్వ్ను
సత్యరాజా పూర్వదేశయాత్రలు

తెలివి తెచ్చుకొని మరల శత్రువువంకఁజూచితిని. శత్రునప్పటికిని జావక లన నాడించుచుండెను. అగ్ని శేషమును ఋణశేషమును శత్రు శేషమును నుండుఁకూడదని రాజనీతివేత్తలు చెప్పుట స్మరణకుఁ దెచ్చె కొని నేనప్పుడు నారెండు చేతులతోను రాక్షసుని రెండు డెక్కలను బట్టుకొని శ్రీకృష్ణులవారు బకాసురుని చీల్చినట్టు నిలువినఁ జీఱఁజూచి నేగాని యీలోపలనే నాభుజబలాతిశయముచేత వానిడెక్కలు నడి మికి విఱిగిపోయినవి. అంతట రాక్షసుఁడువిగతాసుఁడుయినాఁడు. అప్పుడు దేవతలు నామీఁద పుష్పవష౯ము కురిసియుందురుగాని పెట్టె లోనుండుటచే దానిని జూచి యనుభవించు బాగ్యము నాకన్నులకు కలిగినదికాదు. మహాపుణ్యప్రదమైన యీమత్కుణాసురనిజయకథను శ్రద్ధతోఁ జదివినవారును భక్తితో విన్నవారును పద్యకావ్వమునుగా రచించి లోకమున ప్రసిద్ధపఱిచినవారును మూఁడులోకములయందును మత్కుణబాధనుండి విముక్తులగుదురు.

శ్ల్లో. మవర్ణాది మకారాంతిం సతం కువణ౯ సంయుతం అదంతణకారోవేతాం ఏతన్మంత్రం విదుర్బుధాః.

పరమ గోప్యమైన యీమత్కుణ మంత్రమును పరమవిశ్వా సముతో నిత్యమును జపించువారికి సమస్తవబధలును తొలఁగును.

మత్కుణాసురవధానంతర మారాక్షసునిదేహమునుండి యొక విధమయినదుగ౯ంధము బయలువెడలి నాఘ్రాణేంద్రియమునకుడుసాన మెట్లాయని నాలో నేనాలోచించు చుండఁగా నింతలో మారణకోలాహ లముచేత మెలఁకువవచ్చియో పెట్టెలోని బట్టను దేనినైనతీసికొనవలసి వచ్చియో మఱి యేహేతువుచేతనో త్రిజట మంచము దిగివచ్చి పెట్టె

తాళముతీసి మూఁతపయి కెతైను. అందువలన పయినున్న వాయుదే

                    లంకాద్వీపము

వుఁడు లోపలికివచ్చి దుర్వాసనను కొంత తొలగించి భక్తుడైన నాక పరిమితసుఖప్రదాయకుఁడయ్యెను. ఇంతలో త్రిజట పెట్టెవద్దఁ నూరుచునుండి లోపల తొంగిచూచి బట్టమడతమీద మడుగు కట్టియున్న రాక్షసుని రక్తప్రవాహమును గని యీయొఱ్ఱమఱక యెట్లయినదని వాసన చూచి యీనల్లి పోతుదని పలుకుచు మత్కుణాసురుని కళేబరము తీసి దూరముగా విసరి వైచెను. ఆమె విగ్రహమును జూచి భయపడి యొక మూల నొదిగియున్న నన్ను చేతితో బట్టుకొని కొంచెము పయికెత్తి "ఓవాలఖల్యా! ఇంతటనైనను నీవు స్తూలరూపమును ధరించి నామనో రథమును సఫలము చేయుము. రాక్షసాంగనా పరిగ్రహము వలన నీకు పాపము లేదు. పూర్వము మీ భూమిలోకములో చంద్రవంశపు రాజయిన యయాతి వ్రుషపర్వుడను రాక్షస రాజ కూతురైన శర్మిష్ఠను వరించి వంశకతయైన పూరుఁడులోనుగాఁగల కొడుకులను గన్న వార్త మిపూరాణముల యందు విన లేదా? మాఱుపలుకవేమి? అని తనవ్రేళ్ళుతో నాప్రక్కలు నొక్కను. నే నాబాధకు తాళలేక యింతకుముందే మత్కుణాసురునితోడి సంగరమునందు నళానళని దంతాదంతిని పోరాడి గడిదేఱియున్న రసికుఁడ నగుటచేత నాకన్య యొక్క పాణిగ్రహణముచేసి యామృదుహస్తముమిఁద నళక్షతి దంతక్షములను జేసితిని. నవోఢయడగుటచే నాసుందరినారసికత్వమును గ్రహింపలేక కెవ్వున కేకవేసి చేతిలోనున్న నన్ను క్రిందవిడిచి పెట్టెను.భాగ్యముచే నేను బట్టమిఁదపడఁబట్టిగాని యంతయెత్తునుండి పెట్టె కొయ్యమిఁదనేపడుట తటస్ధించినపక్షమున నాతల రెండుప్రక్కలయి యుండును.ఆచిన్నది కెవ్వున కేక వేయగానే లోపలనుండి యెవ్వరో"అమ్మాయీ.ఆట్లు కేకవేసితివేమి? అని యడిగిరి. "మఱెమియు లేదు ఎలుక" అనిత్రిజటయుత్తరమిచ్చెను."ఎలుక నిన్ను కఱిచినదాయేమి? ఎలుకకాటువలన విష మెక్కను.ఎక్కడ కఱి

సత్యరాజా పూర్వదేశయాత్రలు

చండి?"అనికలుపుచునొకయంగనలోపలికివచ్చెను.ఆమెవచ్చుటచూచివెంటనేపెట్టెమూఁతవైచితాళమువేసిత్రిజట"అమ్మా! యెలుకనన్ను కఱువలేదు. నాచీర నిమిత్తము పెట్టెమూత తీయఁగా పెట్టెమీఁదనున్న యెలుక నాచేతి మీఁదినుండి ప్రాఁకి యీపెట్టెలోనుఱికినది. నేను భయపడి కేకవేసిపెట్టెమూఁతవేసినాను. "అనిచెప్పెను. "మంచిపనిచేసినావు. ఎలుకల బాధమనయింట విస్తారముగానున్నది. ఎక్కడిదోచూరెలుక యొకటిమంగదిలో ప్రవేశించిదండెము మీఁదిబట్టలన్నియు కొట్టివేయుచున్నది. నేఁటికి దానికాయువు మూడిపెట్టెలోదూఱినది. పాఱిపోవునేమోపెట్టెతలుపుతీయకు పెట్టెనెత్తిమీఁదబెట్టి మనతాటకచేత నావలికిఁబంపెదను. "అనియారెండవనుందరి చెప్పెను. వారి సంభాషణమువలన నేనాకాంతత్రిజటతల్లియని గ్రహించితిని. అప్పుడు తల్లిబిడ్డలకు మఱియు నీక్రిందరీతిని ప్రసంగముజరగెను.

బిడ్డ-అమా!ఈ పెట్టెతాటకచేత పంపరాదు. అదియిందులోని యెలుకను చంపివేయును.
తల్లి-అమ్మాయీ: నీకిష్టములేని యెడల చంపక దీనిని దూరముగాఁగొని పోయి యూరి బైటవవిడిచి రమ్మని నేనుతాటకతోగట్టిగాచెప్పెదనులే.
బిడ్డ-నీవెన్నిచెప్పిననుతాటక దీనినిచంపకమానదు. అదిక్రూరురాలు దానిమాటనేనునమ్మను. నాసఖియైనహిడింబిని కూడవెంటఁబంపి దూరముగా వదలిపెట్టించెదను- ఓహిడింబీ! ఓహిడింబీ! వేగిరమురా.
తల్లి-ఇష్టమున్నయెడిలహిండిబిని కూడఁబంపవచ్చును -ఓతాటకా నీచీపురుగుట్టవిడిచి ఇటురా. వీధి యరుగులు తరువాత తుడువ వచ్చునులే.
లంకాద్వీపము


"అమ్మా! వచ్చుచున్నాను" అని దూరము నుండి యొకధ్వని వినివచ్చినది.

"ముందుగా నీవిటురా. నీపని తరువాత చేసికోవచ్చునులే." అని మరల త్రిజటతల్లి దానిని పిలెచెను. "పని కావచ్చినది. చేసికొని వచ్చెదను". అని దూరమునుండి మరల ధ్వని విననచ్చెను. "అది యెంతసేపటికిని రాకున్నది. నేను పోయి తీసికొనివచ్చెను."అని త్రిజట తల్లి నడిచెను.ఆమె కాలి చప్పుడు వినఁబడఁగానే నాకు భయమదికము కాఁజొచ్చినది.ఇంతలో నెవ్వరో లోపలికి వచ్చునట్లు మరల కాళ్ళ చప్పుడయినది. ఆయనడుగుల చప్పుడు చెవినిబడఁగానే నాపాలిటికి మృతదేవత్యుయైన తాటకయే వచ్చుచున్నదని నాగుండెలు తటతట కొట్టుకొన నారంభించినవి. అది రాక్షసుల కేకాంతమైనను వారి గుసగుసలు సూక్ష్మశబ్దగ్రహణశక్తి గల మనుష్యుల శ్రవణేంద్రియములకు స్పష్టముగా వనఁబడుచునే యుండును. అందుచేత చెవియుగ్గి వారి మాటల నాలకిఁప మొదలుపెట్టితిని.

"ఓహిడింబీ! రాత్రినీవుతెచ్చినవాలఖిలుఁడీపెట్టెలోనున్నాఁడు. అమ్మతో నిందున్నదియెలుకయనినేనుబొంకినాను." "ఇప్పుడు నేనేమి చేయవలెను?"

"ఇతనికపాయముకలుగకుండకాపాడియేలాగుననైననునీవీతనినినాకడమరలఁజేర్పవలెను. నాఁటిరాత్రితెచ్చుటతెచ్చుటగాదు.నేఁటిపగలుతెచ్చి నీప్రాణసఖియైనత్రికటప్రాణములునిలుపవలెను.

"ఓత్రిజటా! నీనిమిత్తముయి నాప్రాణములయిననిచ్చెదను. ఆరాక్షసి ముండకన్నులు గప్పిమరల తెచ్చి నీప్రియవల్లభుని నీకెట్లు సమర్పింపఁ గలుగుదునో నాకుతోఁచకున్నది."

సత్యరాజా పూర్వ దేశయాత్రలు



"అమ్మ తాటకను తాసకొనివచ్చుచున్నది. ఇఁకమాటల కవకాశము లేదు. ఇదిగో పెట్టె తాళము చెవి. ఇది నీవు దానిచేతికియ్యక పదిలముగా నీయొద్దనుంచుకొని యేదో మాయోపాయముచేత దానిని దూరముగా పంపివేసి పెట్టెతీసి యీవాలఖిల్యుని నీయొడిలో వేసికొని తీసికొనిరా.?"

"త్రోవలో నేదో యుపాయము మాలోచించెదను."


లంకాద్వీపము

" ఈ యాలోచన దివ్యముగానున్నది. కాలుచున్న కాష్టములో నుండి యొక కఱ్ఱనుగొని ఇక్కడ నున్నట్టే వచ్చెదను."

ఈ మాటలు చెవినిబడగానే నేనావఱకును పెట్టెకుదుపు వలన ఁగలిగిన గాయముల బాధను మఱచిపోయి ప్రాణభీతి చేత మానసికమైన మరణవేదనను పొంద నారంభించినాను. ఈ మనోవేదన ముందఱ నా శరీర వేదన పర్వతములో పరమాణువంతగానైనను తోచలేదు. ఏమియూ పాలుపోక ఇట్లా రాటపడుచున్న సమయములో హిడింబి పెట్టెమూఁత తీసి నన్ను పైకి తీసినది. ఇంతలో నెవ్వరో దూరమునుండి " హిడింబీ! హిడింబీ!" అని పిలువ జొచ్చిరి. " అయ్యో! ఈ వాలఖల్యుని నా యొడిలోఁ బెట్టుకొని నా బట్ట సవరించుకొనుటకై న నవకాశము లేక పోయినది! కానీ! ఇతని నిప్పటి కీ పొదలో దాచి వారిని సాగనంపి మరల వచ్చి యొడిలో బెట్టుకొని పోయి నా చెలికి సమర్పించెదను. ఈ లో పల తాటక వచ్చి యడిన గినయెడల పెట్టె తీయఁగానే యెలుక పాఱిపోయి యేదో కలుగులోఁ దూరినదని బొంకెదను." అని తాననుకొనుచు నన్ను చేరువ పొదలోఁబెట్టి తానా వచ్చెడివారి కెదురుగాఁ బోయెను. నేను దూర ముగా నున్నను వారి మాటలు నాకు వినఁపడిచునే యుండెను.

ఆ వచ్చినపురుషులలో , నొక్కడు ఓ హిడింబి! రాత్రి వాల ఖల్యనహిషి౯ నెవ్వరో యెత్తుకొనిపోయినారఁట! ఆతనిని వెదకుటకై మహాకాయుడుగారు మమ్ముబంపినారు. ఆతనిజాడ నీకేమియు తెలియలేదుగా?

హిడిం  : తెలియలేదుగాని నేనొక్క మాట విన్నాను. ఎవ్వడో యంగుష్టమాత్ర శరీరుడైన పురుషుఁడొక్కఁడు జ్యోతిశ్శాస్త్ర ప్రతి పక్షులైన నవనాగరికుల సభలో నున్నాఁడని విన్నాను.

పురు : ఆసభయొక్కడనో మాకు కొంచె మానవాలు చెప్పఁ గలవా? సత్యరాజా పూర్వదేశయాత్రలు

 

హిడిం ---- ఇక్కడకు నాలుగుయోజనముల దూరములోనున్న తోఁటలోనున్నది. దారిచూపెదను రండి.

అని వారిని తిఅసికొని హిదించి ప్రక్కపండునకు తిరిగి యదృశ్యయైనది "మీరనుకొన్ని నాలఖిల్యుఁడను నేనే ! నాపేరు సత్యలను పేరులు పెట్టిపిలిచి కొంతుపగులునట్టుగా నఱచితినిగాని నామాట వారు వినిపించుకొన్న వారుకారు. పొదనుండివెడలి వారివంట పరుగెత్తుటకు తాటక కఱ్ఱగొనివచ్చి యెడ్కడచావమోఁదునో యన్నభీతిచేతి నాకు సాహసము లేకపోయినది.

                                                                   ----

ఎనిమిదవ ప్రకరణము.



                                                                    ----
హిడింబి నన్ను పొదలోఁ గూరుచుండఁ బెట్టి పోయినతరువాత మనస్సులో పరిపరిలాగున నాలోచనలు కలుగఁజొచ్చినవి. తాటక కఱ్ఱగొనివచ్చి చావఁగొట్టునేమోయన్న భయము మొట్టమొదట పుట్టినది. గాని యారక్షసిపెట్టెలోనున్నది యెలుక యనుకొని యెలుకను చాపమోఁదునిమిత్తము కఱ్ఱకొఱకు వళ్ళినదన్నమాట స్మరణ్కకు వచ్చినతరువాత భయనివారణమయినది. ఇంతలో హిడిఁబివచ్చి నన్నుపట్టుకొని యేమిచేయునో యన్నభయము మఱియొకటివచ్చి నామనస్సును మఱింత బాధింపఁజొచ్చినది. హిడింబి చేతిలోమరలఁ జిక్కకొన్నపక్షమున నాకు మరణవేదకన్నను క్రూర తరమయిన బాధ సంభవించును, అది నన్నొడిలోఁ బెట్టుకొనిపోయి తనచెలియైన త్రిజటకు మరల సమర్పించినపక్షమున,త్రిజటనన్నేమి బాములఁబెట్టునో!