కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/రాజశేఖరచరిత్రము-పదునొకండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునొకండవ ప్రకరణము

సుబ్రమ్మణ్యము పిఠాపురము బ్రవేశించుట - ఒక మిత్రుఁడు కనఁ
బడి యింటికిఁ గొనిపోయి యాదరించుట - నీలాద్రిరాజుచర్య -
రాజుగారి ధనము పోవుట - అంజనము వేయుట - పోయిధనము
నీలాద్రిరాజు దొడెలో మఱికొంత సొమ్ముతోఁ గూఁడ దొరకుట.

తల్లి దండ్రులను వీడ్కొని బయలుదేఱినాఁడు సుబ్రహ్మణ్యము త్రోవదప్పి యెచ్చటికిపోయి తుద కపలసంజవేళ పిఠాపురముచేరెను. అప్పుడు కొందఱు దుష్టాత్ము లొకచోటఁ గూరుచుండి యాతని వాలకమును జూ తమలోఁ దామలోచించుకొని "యీతఁడు పల్లెటూరి వాఁడుగా గనఁబడు చున్నాడు. ఈతని బెదిరించి మన మేమయిన పుచ్చుకొందము" అని నిశ్చయము చేసికొనిరి. వెంటనే యాగుంపులో నుండి రాజభటుఁ డొకఁడు పైకి వచ్చి ముందుకు నడిచి సుబ్రహ్మణ్యము వచ్చు మార్గమున కడ్డముగా నిలిచి గంభీరధ్వనితో " ఆవచ్చెడువారెవరు ? " అని అడిగెదను.

సుబ్ర-నెను బ్రాహ్మణుఁడను. భీమవరమునుండి వచ్చుచున్నాను.

భటు-ఇంత చీఁకటి పడిన తరువాత వచ్చుటకు కారణమేమి ?

సుబ్ర-తిన్నగా బయలుదేఱినది మొదలుకొని నడచివచ్చిన యెడల ప్రొద్దుండగానే యూరు చేరియుందును గాని, దారితప్ప పెడదారినపడి వచ్చినందున నింత యాలస్య మయినది.

భటు-ఈగ్రామములో నీకు బంధువు లెవరున్నారు ?

సుబ్ర-ఎవ్వరు బ్ంధువులు లేరు. రాజుగారి నాశ్రయించి పని సంపాదించుకో వలె నని వచ్చినాను.

భటు-నీ భుజము మీఁది మూట ఎవరిది ?

<poem>సుబ్ర-నాదే. మఱియొకరిమూట నాయొద్దకెందుకువచ్చును ?

భటు-నీది కాదు. నీవనుమానవు మనుష్యుడవుగాఁ గనఁబడుచున్నవు. నిన్న నే నిప్పుడు వదలిపెట్టను. తిన్నగా ఠాణాకునడువు.

సుబ్ర-నేను దొంగనుకాను. చిన్నప్పటినుండియు నింతప్రతిష్టతో బ్రతికినవాడను. నన్ను విడిచి పెట్టు.

భటు-చీకటి పడ్డతరువాత గ్రామమునకు వచ్చిన వారిని విడిచిపెట్టకూడదని మారాజుగారి యాఙ్ఞ. విడిచిపెట్టెడు పక్షమున నా కేమిచ్చెదవు ?

సుబ్ర-నాలు గణా లిచ్చెదను నన్ను విడిచిపెట్టు.

భటు-నాలుగురూపాయలకు తక్కువవల్లపడదు.నీవుచూడఁబోయిన దొంగవుగాఁ గనఁ బడుచున్నావు. మూట నక్కడ పెట్టు. పెట్టకపోయిన ని న్నేమి చేసెదనో చూడు.

ఆవరకు బాహ్యభూమికివెళ్ళి తిరిగివచ్చుచున్న యొకపుషుడింతలో నామార్గముననే యింటికిఁ బోవుచు, ఆసందడి విని యచటనిలుచుండి "ఏమా మనుష్యుని నట్లుతొందరపెట్టుచున్నారు ?" అని యడిగెను.

సుబ్ర-చూచినారా యీమష్యుడు నాలుగురూపాయలిచ్చినంగాని నన్ను పోనియ్యనని నిర్భందపెట్టుచున్నడు.

పురు-సుబ్రహ్మణ్యమా ? నీవా! కంఠస్వరమునుబట్టి యానవాలు పట్టినాను. ఇక్కడి కొక్కడవును రాత్రివేళ నెందుకు వచ్చినావు ? ఇంటికడనుండి చెప్పకుండ పాఱిపోయి రాలేదు గదా ? ఇంటికి రా పోదము ?

సుబ్ర-ఉమాపతిగారా ? మీ రిక్కడ నున్నారేమి ? మీ<poem>

రింకొక నిమిషము రాకపోయినయెడల, వాడు బెదిరించి నాయొద్ద నేమైన గాజేయునుజుండీ.

ఉమా-ఏడీ నిన్ను తొందరపఱిచినవాడెవ్వడు ?

సుబ్ర-మనము మాటలాడుచుండుట చూచి మెల్లమెల్లగా జాఱి దూరమునుండి పారిపోవుచున్నాడు.

ఉమా-పోనీ. వానిసంగతి రేపు విచారించి కనుగొందుము. అని మాటలాడుకొనుచు వారిద్దఱును గలిపి యింటివంక నడచిరి. ఇల్లు చేరులోపల సుబ్రహ్మణ్యము తనతండ్రికిని కుటుంబమునకును నాఁటివఱకు స్ంభవించిన విపత్తులును ప్రస్తుతపు స్దితియు తానక్కడకు వచ్చిన కారణము చెప్పెను. అది విని యుమాపతిగారు మిక్కిలి వ్యసనపడి తాను చిన్నతనములో రాజశేఖరుఁడుగారి వద్దఁజదువుకొన్నప్పు డున్న యైశ్వర్యమంతయు బోయి యింతలో నింత బీదతనము సంభవించి నందున కాశ్చర్యపడి తనకు విద్యాదానముచేసిన గురువు విషయమై శక్తి వంచన లేక ప్రయత్నముచేసి చేతనయిన యుపకారమును పలువిధముల నాదరించి, తాను పిఠాపురపు రాజుగారియొద్ద నిరువదిరూపాయల యుద్యోగములోనున్న సంగతినిజెప్పి, అతనికింత యనుకూలమైనపని చేయించుటకై రాజుగారియొద్దఁ బ్రయత్నము చేసెదననియు పనియైనదాక తనయింటనే యుండవలసినదనియుఁ జెప్పెను. ఆప్రకారముగా ప్రతిదినమును సుబ్రహ్మణ్యము భోజనముచేసి యుమాపతిగారితోడఁ గూడ రాజసభకుఁ బోవుచుండెను. పీఠికాపురాధీశ్వరుఁడయిన విజయరామరాజుగా రొకనాఁ డాతనిజూచి, యీయన యెవ్వరని యుమాపతిగారి నడుగగా, ఆయన వారిస్ధితిగతులను మొదట నుండియుఁ జెప్పి యాస్తానములో నేదియయిన నొక యుద్యోగ మీతని కిప్పింపవలయు ' నని మనవిచేసెను.

ఉమాపతిగారి యింటనుండి రాజుగారికోటకు బోవుమార్గములో నొకగొప్ప మేడయుండెను. ఆమేడ ంద్దెకు బుచ్చుకొని నెలదినముల నుండి యందులో నొకరాజుగారు తన సేవకులతో గూడ కాపురముండి రెండుమూడు దినముల క్రిందట బ్రాహ్మణసంకర్పణ మొకటి చేసెన.సొమ్ములేకుండ వచ్చినప్పుడు పుష్కలముగా భుజించుట యెల్లవారికిని సహజగుణమే కాబట్టి, ఆయూరి బ్రాహ్మణోత్తములును నిత్యము నింటికడ ఘృతము నభిఘరించుకొనువారే యయ్యును నాడుమాత్రము చేరల కొలఁది నేయిత్రాగిరి. ఆసంతర్పణమువలన రాజుగారికీర్తి గ్రామమంతటను వ్యాపించెను. కాబట్టి ప్రతిదినము పలువురనిచ్చి యాయనను నాశ్రయించి పోవుచుండిరి. ఆయనపేరు నీలాద్రిరాజుగారు ఒక నాడు నీలాద్రిరాజుగారు భోజనముచేసి వీధి యరుగుమీద పచారుచేయుచు నిలువబడి, ఆత్రోవను రాజసభకు బోవుచున్న సుబ్రహ్మణ్యమును దూరమునుండిచూచి 'మాట' యని చేసైగజేసి పిలిచెను.

నీలా-పూర్వము మిమ్మెక్కడనో చూచినట్టున్నది. మీకావురపుగ్రామ మేది ?

సుబ్ర-నాజన్మభూమి ధవళేశ్వము,మాయింటిపేరు గోటేటివారు; నా పేరు సుబ్రహ్మణ్యము.

నీలా-అవును జ్ఞప్తికి వచ్చినది. మీరు రాజశేఖరుడుగారి కొమాళ్ళుకారా ? ఇప్పుడయన యెక్కడ నున్నారు ?

సుబ్ర-ఇక్కడనే భీమవరములో నున్నారు. మీరాయననెక్కడ నెఱుగుదురు ?

నీలా-ధవళేశ్వరములోనే చూచినాము. మేము సంవత్సము క్రిందట యాత్రార్ధమై బయలుదేఱి పదిదినములు ధవళేశ్వరములో నుండి గౌతమీస్నానమును చేసికొని, కోటిఫలి మొదలగు పుణ్యక్షేత్రములను

సేవించుకొని, మాసము క్రిందట పాదగయను దర్సించుటకయి వచ్చి యప్పటినుండియు నిక్కడనే యున్నాము. మీతండ్రిగారికి మాయెడల గురుభావము. మేమక్కడున్న దినములలో మీతండ్రిగా రెప్పుడును మాయొద్దనే యుండెడివారు.

సుబ్ర-సంవత్సరము క్రిందట మిమ్ము జూచినట్లు నాకు జ్ఞాపకములేదు. మీరెక్కడ బనచేసినారు ?\

నీలా-మీకు జ్ఞాపకము లేదుగాని మాకు చక్కగా జ్ఞాపకమున్నది. మీకిద్దఱు చెల్లెం డ్రుండవలెను వారు బాగున్నారా?
                                     
సుబ్ర-పెద్ద చెల్లెలు రుక్మిణి చనిపోయినది. చిన్న చెల్లెలు బాగున్నది.

నీలా-మీరు నాసంగతి బాగుగా నెఱుగరు. విజయనగరపు రాజుగారు మా మేనమామకుమాళ్లు మొగలితుఱ్రురాజుగారి కిచ్చినది మాసవతి మేనకోడలు.

సుబ్ర-నేనిప్పుడు సభకుబోవుచున్నాను. మఱియొకప్పుడు సావకాశముగా దర్శనముచేసుకొని మాటాడెదను ఇప్పటికి సెలవిచ్చెదరా ?

అని సెలవుపుచ్చుకొని సుబ్రహ్మణ్యము రాజుగారి కోసం కూటమునకు బోయెను. అతడు ప్రతి దినమును తప్పక సభకు బోవుచు, ఉద్యోగస్ధులలో నెల్ల స్నేహముచేసి, అన్నివిధముల పనులను నేర్చుకొనెను. అక్కడి కొలువుడు కాండ్రందఱును ఏకాగితము వ్రాయవలసి వచ్చినను సుబ్రహ్మణ్యమునే పిలిచి వ్రాయించు చుందురు. ఏలెక్క కట్టవలసివచ్చినను సుబ్రహ్మణ్యము కట్టించుచుందురు. అందుచేత నతనికిజీతమేమియు లేకపోయినను జీతగాండ్ర కంటెపనిమాత్ర మెక్కువ గలిగి యుండెను. ఈప్రకారముగా నంద

రాజశేఖర చరిత్రము

దయవచ్చునట్లుగా నెవ్వరేవని చెప్పినను జేయుచు వచ్చినందున వారందఱును గలసి 'యీచిన్నవాడు బహు కాలమునుండి యాశ్రయించి సంస్థానము కనిపెట్టియున్నాడ'ని రాజు గారితో మనవి చేసిరి. దానిమీద రాజుగారు సమయము వచ్చినప్పుడును యుండవలసిన దనియు సెలవిచ్చిరి. ఈలోపల సుబ్రహ్మణ్యమొకనాడు వెళ్ళి మరల శీలాద్రిరాజు గారి దర్శనము చేసెను.

నీలా-ఏమయ్యా?సుబ్రహ్మణ్యముగారూ! గ్రామములో విశేషము లేమి?
సుబ్ర-వింతలేమియు లేవు. ఉద్యోగమున కయి రాజుగారి ననుసరించుచున్నాను. ఇంకను పని కలిసి రాలేదు.
నీలా-మికింత యనుసరించుట యెందుకు? దూరదేశమునకు వెళ్ళగలరా? నిమిషములో విజయనగరపు మహారాజుగారివద్ద గొప్పపని చెప్పించెదము.ఆయన మాకు బినతల్లి కొమారుడు.
ఈ కడపటి వాక్యము పూర్వము మేనమామ కొమారుడని చెప్పిన దానికి విరుద్ధముగా నున్నందున,ఆతడబద్ధ మాడుచున్నాడనిననులో ననుకొనియు చెప్పినమాట మంచిదిగనుక కొంచెము నంతోవాని సుబ్రహ్మణ్యము మారువలుక కూరకుండెను.
నీలా-అనుమానించుచున్నారేమి? మితోడు మికుతప్పక గొప్పయుద్యోగము నిప్పించెదము.కాళహస్తి రాజుగారయిన రామవర్మగారికి మాకును సత్యంతమైత్రి;చిన్నప్పుడు వారును మేమును నొక్కబండిలో నెక్కినాము.ఈ సంగతి పరమరహస్యము. ఎవ్వరితోను జెప్పవద్దు.
సుబ్ర-చిత్తము ఇక్కడ పని కలిసిరానియెడల నవశ్యముగా వెళ్ళెదను.

నీలా-మీకింకొక రహస్యము చెప్పెదను. బాల్యములో మేమును గాళహస్తిరాజుగారుకలిసి జూదమాడెడివారము. ఆయన సంగతి మనకెందుకుఁగాని, అప్పుడాయన బోగముదాని నుంచుకొన్నాడుసుమ్మా.

సుబ్ర-తమరు ప్రొద్దుననే యక్షతలు ధరించినారు. పార్ధివము చేయుచున్నారా?

నీలా-పూర్వము పార్ధివము చేయుచుంటిమి కాని యిప్పుడు తనపూజమాత్రము చేయుచున్నాము. మీరాజుగారుకూడ శివపూజా దురంధరులట కాదా? అందుచేతనే వారికి విశేషైశ్వర్యము కలిగి యున్నదని విన్నాము.

సుబ్ర-పదిలక్షలకు తక్కువ లేదని వాడుక.

నీలా-అది యంతయు గోటలోనేగదా యుండును?

సుబ్ర-కోటలోనే యుండును.అక్కడ జిరకాలము నుండి నమ్మకముగా బని చేయుచున్న ముసలిబంట్లు కావలియుందురు.

నీలా-విజయనగరపు మహారాజుగారు క్రొత్తగా నొక కోటను గట్టదలచి, మేము చూచిన పట్టణములలో నున్న కోటల పటలములను వ్రాయించి తీసికొని రండని మఱిమఱి చెప్పినారు. మొన్ననే పెద్దాపురపు రకోట పటమును దెప్పించినాము. మీరీ కోటపటమును కూడా వ్రాసి యియ్యగలరా?

సుబ్ర-చిత్తము కాగితము కలమును దెప్పింపుఁడు; ఇప్పుడే వ్రాసి యిచ్చెదను.

రాజశేఖర చరిత్రము
అని, కాగితమును కలమును సిరాబుడ్డియు తెప్పించిన మీదట తాను జూచిన దంతయు జ్ఞాపకమును బట్టి పటమును వ్రాసి నీలాద్రి రాజు గారి చేతి కిచ్చెను. ఆయన దానిని జూచుకొని యాయాస్థలముల యుపయోగములను గుఱించియు పనియొక్క గట్టితనమును గూర్చియు ప్రశ్నలు వేయజొచ్చెను. సుబ్రహ్మణ్యమును దనకు చెలిసినంత వఱకు సదుత్తరములను జెప్పుచు వచ్చెను.
నీలా-ఉత్తరవువై వునవీధిప్రక్క నున్న దేకాదా ధనాగారము?
సుబ్ర-అవును.
నీలా-అంతయు బాగుగనున్నది కాని కోటగోడ యెత్తెంత పెట్టినారు?
సుబ్ర-సుమారు పండ్రెండడుగు లుండవచ్చును.
నీలా-మన మీతోటపటము వ్రాసికొన్న సంగతి యెవ్వరికిని దెలియనీయక రహస్యముగా నుంచవలెను. రాజులకు తమ కోటవంటిది మఱియొకటి యుండుట కిష్టముండదు.
అని చెప్పి లోపలనుండి తమలపాకులును పోకచెక్కలును పళ్ళెముతో దెప్పించి తాంబూల మిచ్చి, కోట కట్టించునప్పుడీ పటము వ్రాసియిచ్చినది మీరే యని రాజుగారితో జెప్పెదము నుండీ యని పంపివేసెను. సుబ్రహ్మణ్యమామాటలకు సంతోషించి సెలవు వుచ్చుకొని,తన కొక వేళ గొప్పయుద్యోగ మగునేమోయను నాశతో పరిపరి విధముల నాలోచించుకొనుచు మెల్లగా నింటికి వచ్చెను.
తరువాత నాలుగు దినముల కొకనాడు ప్రభారసమయముననే రాజుగారియింట దొంగలుపడి ధనాలయము లోని నగలును రొక్కమును దోచుకొని పోయినారని యూరనొక కింపదంతి కలిగెను.పిమ్మట
పదుకొండవ ప్రకరణము

గొంత సేపటికి రాజభటులు సందడి చేయుచు నూర నలుప్రక్కలను దిరిగి, తమకు విరోధులుగా నున్నవారి నందఱిని పట్టుకొని ఠాణా కీడ్చుకొనిపోవ మొదలు పెట్టిరి; అక్కడ నున్నవారు వాండ్రను కొట్లలోఁ బెట్టి నేరము నొప్పుకొండని పలువిధములఁగొట్టి బాధింపఁ జొచ్చిరి; కాని వారు నిరపరాధుల నెందఱిని పట్టుకొని బాధ పెట్టినను, నిజమయిన దొంగలను మాత్రము కనిపెట్టలేకపోయిరి. ఉత్తరపు దిక్కున కోటగోడకు నిచ్చెన వేసికొని దొంగలు లోపల బ్రవేశించినట్లు అడుగుల జాడ కనపడు చుండెను; గచ్చుతో కట్టిన ధనమున్న గదియొక్క రాతిగోడ చిన్నతలుపెత్తుటకు తగినంత పాణిద్వారమొకటి కొట్టఁబడియుండెను. ఆద్వారమును తవుటకు బలమయిన పనివాండ్రు ముగ్గురు పూనుకున్నచో నధమపక్షము రెండు జాములు సేపయినా పట్టును. రాత్రి యంతసేపు పనిచేయుటకు దొంగలనిద్ర యేమయిపోయినదా యని విచారింప వలసిన యక్కఱలేదు. వారినిద్ర యంతయు వచ్చి కావలివాండ్ర వాశ్రయించినది. కొట్టులోపల రూపాయలసంచులు చప్పుడైనప్పుడు ధనలక్ష్మి మూలుగుచున్నదని జడిసికొని కావలియున్నవారు భద్రమైన దూఱి తలుపు వేసికొని ప్రాణములు కాపాడుకొనిరనియు గ్రామములో నొక ప్రవాదము పుట్టినది. ఇదంతనిజమో యీశ్వరునకుఁ దెలియును. ఏది యెట్లయినను ధనలక్ష్మి మాత్రము మారాత్రి నరవాహ వారూధురాలయి నూతన ద్వారమున కోటవిడిచి వెళ్ళిపోయిన మాటమాత్రము వాస్తవము. ఎన్నివిధముల ప్రయత్నముచేసినను రాజకీయభటులకు దొంగలజాడ యెక్కడను గానరానందున,విసిగి తుదకు వారు తమ నాయకుని కడకువచ్చి తాముపడ్డ ప్రయాసమునంతను జెప్పుకొనిరి. అందుమీద నాతడు చేయవలసిన వనియేమియు తోచక కొంతసేపాలోచించి, దొంగ

రాజశేఖర చరిత్రము

లను పట్టుకొని పోయిన సొమ్ము తెప్పింపలేక పోయినయెడల రాజుగారి వలన మాటవచ్చును గాఁబట్టి రాజకీయ యోగులలో నొకరిమీద పెట్టనిశ్చయించి, వేఱువేఱ పేర్కొని యెవరిమీఁదబెట్టిన నెవరికి కోపమువచ్చునోయని జడిసి, వారిలో లోకువ యైనవారి మీదకి త్రోయనెంచి, ఆపని తానుచేయుట యుచితమి కాదని యింటికిపోయి మాటాడి యంజనము వేయువారి నొకనిని పిలుచుకొని జాములోపల మరల వచ్చెను.

నాయ-మోయి భీమన్న! రాత్రి రాజుగారింట ధనము పోయినది. నీవాధన మపహరించిన వానిని చెప్పఁగలిగిన యెడల, నీకు గొప్ప బహుమతి దొరకగలదు.


భీమ-అదెంతసేపు? సొమ్ము తెప్పించుకోగలిగిన యెడల, అంజనము వేసి నిమిషములో పేరు చెప్పించెదను.

వాయ-అంజన మిప్పుడు నీయెద్ద సిద్ధముగా నున్నదా?

భీమ-ఉన్నది. అది పిల్లికన్నులవానికే గాని పాఱదు. అటు వంటివాని నెవ్వని నైనను పిలిపించవలెను.

నాయకుడాఁ మాటలు విని యొక భటుని బిలిచి, "నీవు పోయి చాకలి సామిగానిని తీసుకొనిరా. వానివి పిల్లి కన్నులు" అని నియమించెను. వాఁడు వెంటనేపోయి రెండుగడియలసేపునకు సామిగానిని వెంటఁబెట్టుకొని వచ్చెను. ఈలోపల సంజనము వేయువాడు దాసిగాని చేత గది నొకదానిని సలికించి, అందొకమూలను నూనెతో గొప్ప దీపమును వెలిఁగించి తాను స్నానముచేసి వచ్చి దీపము ముందట పిండింముగ్గుతో నొకపట్టు పెట్టి అం దాంజనేయ విగ్రహమును కాటుక కరాటకమును ఉంచి పూజ చేయుచుండెను. చాకలివాడు వచ్చినతోడనే యాతడు తనపూజను చాలించి, పట్టులో వానిని గూరుచుండఁ బెట్టి

పదునొకండవ ప్రకరణము

బరిణిలోని కాటుకను వాని కుడిచేతిలో రాచి దానిని నిదానించి చూచి దానిలో నేమికనఁబడునో దాని నెల్ల తనకుఁ జెప్పుచుండుమని యుత్తరువు చేసెను.

భీమ-చేయి దీపము దగ్గఱగాఁబెట్టి దానికేసి ఱెప్పవాల్పకచూడు. నీకిప్పు డేమియినఁ గనబడుచున్నదా?

సామి-లేదు. కాటుక మాత్రము కనఁబడుచున్నది.

భీమ-చూపు చెదరనీయకు. ఇప్పుడే మయినఁ గనఁబడు చున్నదా?

సామి-కనఁబడుచున్నది. పెద్ద బంగారపురేకువలేనున్నది.

భీమ-ఆ రేకునడుమనేమయినా నున్నదా?

సామి-అవిసిచెట్టున్నది.

భీమ-అవిసిచెట్టు కాదశోకవృక్షము. ఆ చెట్టుకొమ్మలలో నెవరున్నారోచూడు.

సామి-పెద్ద కోతియున్నది.

భీమ-కోతి యనబోకు. ఆంజనేయుల వారను. నీమనసులో నమస్కారము చేసి యేమిచెప్పునో తెలిసికో.

సామి-ఏమో పెదవులు కదల్చుచున్నాఁడు ఆమాటలు నాకుఁ దెలియవు. భీమ-రాజుగారి సొమెవ్వరెత్తుకొని పోయినారో యడుగు.

సామి-రాజుగారివద్ద కొలువున్నవారిలోనే యొకరు తీసినారను చున్నాఁడు.

భీమ-వారియింటిపే రడుగు

సామి-గోటివారు.

భీమ-పేరుకూడ చెప్పమను.

సామి-సుబ్బమ్మ. <biశ్g>రాజశేఖర చరిత్రము

భీమ-సుబ్రహ్మణ్యమా?గోటేటిసుబ్రహ్మణ్యము.

"సామి-ఇందాకనీవాలాగునఁజెప్పలేదు.

"భీమ--నీవాంజనేయుల వారితో నామాటాడుచున్నావు? ఆంజనేయు లిందాకనాలాగునఁజెప్పలేదనుచున్నావా? ఆయన యాలాగున నేచెప్పినాడు. నీవేపేరు నోటబఁట్టలేకత ప్పు పలికినావు చాలుఈ
పాటికిలే. ఇంకమాటాడకు.

 అనియాతడు సామిగానిని తనవెనుకకుఁ దీసికొని, సొమ్ము తీసినవాని పేరుబయలఁబడ్డదని కేకలువేసి చెప్పనారంభించెను. భటుల నాయకుడుఁను ఈదొంగతనము మఱియొకఱివలన జరిగినదికాదని యీప్రక్కనుండి యాప్రక్కకుఁదిరుగసాగెను. సభలోని యుద్యోగస్థులందఱును వీండ్రిద్దఱును గలసియా మాటచాకలి వానికినేర్పిపెట్టిరి కాని యిందుసత్యమేమియిలేదని తలఁచిరి. సాధారణజను లందఱును నిజముగా దొంగతన మాతడుచేయకపోయిన యెడలచాకలి వానికాపేరెట్లు తెలిసినదనియు, గట్టిగా సుబ్రహ్మణ్యము యాపనిచేసేనని యుఁజెప్పుకొను చుండిరి. ఊరనెక్కడఁ జూచినను సుబ్రహ్మణ్యము సొమ్మునుతస్కరించినట్టు "అంజనము వేయగా బయలు పడ్డదని మూకలు గట్టిమాటాడు కొనఁజొచ్చిరి; రాజుగారా మాటల నెంతమాత్రము విశ్వసించలేదు.

అప్పుడు సభామందిరము నుండిఁబోవు నపుడు త్రోవపొడుగునను ప్రజలెల్ల'ఈతడేకన్నమువేయించినాఁడ' నిసుబ్రహ్మణ్యమును వ్రేలుపెట్టిచూపనారంభించిరి. అందుచేత వాతడువట్టి నిరాపనింద వచ్చెగదా యనిసిగ్గుపడి రాత్రిభోజనమయిన తరువాత నొక్కడును బరుండి తనలోఁదానిట్లుచింతింప మొదలుపెట్టెను. ఆగోడకుకన్నము వేసిన వాఁడెవ్వఁడయియుండును? ఒకఁడంత

పదుకొండవ ప్రకరణము

సాహసపు బనిని చేయఁజాలడు. అటువంటి బలమైన రాతిగోడకు కన్నము వేసినవా రిద్దఱు ముగ్గురుండక తప్పదు. ఆముగ్గురు నెవ్వరైయుందురు? కోటసంగతి గుర్తెఱిగినవారే కాని మఱియొకరు కారు. నాలుగుదిందినముల క్రిందట నీలాద్రిరాజు చేత కోటపటమును వ్రాయించుకున్నప్పుడు ధానాగారమును గూర్చి రెండుమూడు సారులడిగెను. అతడట్లడుగుటకుఁ గారణమేమి? ఈదొంగ తనములో నతనికేదో సంబంధము గలిగియుండ వలెను. అతడు గోడయెత్తు కూడనడిగెను. దొంగతనములో సంబంధమే లేనియెడల గోడయెత్తుతో ఇతనికేమి ప్రయోజనము? అంతియ కాక యీసంగతి గ్రామములో పొక్కక మునుపే వేకువ జామున బహిర్బూమికి వెళ్ళుచుండగా నన్ను బిలిచి యతడు రాజుగారి లోపల దొంగలు పడ్డారఁట యని యడిగినాడు: అతడు దొంగలలో జేరియుండని పక్షమున, అంత పెందలకడ నాతని కాసంగతి యెట్లు తెలియును? నేను సాయంకాల మింటికివచ్చు నప్పుడు వీధిలో నిలుచుండగా నాతని జూచినాను. అప్పుడాతని చర్య వింతగా నున్నది. ఈయన్ని హేతువుల చేతను విచారించి చూడగా ఈతడు దొంగల గురువనుటకు సందేహములేదు. రేపు రాజుగారి నడిగి కొందఱు రాజభటులను బుచ్చుకొని యెవ్వరికిని దెలియకుండ నాతని యింటిమీద పడి పెట్టెలు మొదలగునవి పరిక్షించెదను. అప్పుడు కొంతసొమ్ముయిన దొరకగలదు. అందు మీద నామీద నిందయైనను పోవును. అని యాలోచించి యారాత్రి యెట్లొ వేగించి తెల్లవారినతోడనే రాజుగారి దర్శనముచేసి తనయందు దోషము లేశమయినను లేదనిచెప్పుకొని తనవశమునఁగొందఱు భటులనిచ్చి తన యాజ్ఙ ప్రకారము చేయ నుత్తరువువిచ్చినచో దొంగలను సొత్తుతోఁ గూడఁ పట్టుకొనెదనని దృఢముగాఁజెప్పెను. రాజుగారాతని మాటయందు గౌరముంచి, రాజశేఖర చరిత్రము</big

తక్షణమే పదుగురు భటులను రప్పించి, మీరందఱు నీయన చెప్పినట్లు చేసి పర్యవసానము మాతో మనవి చేయ వలసినదని గట్టి యుత్తరువు చేసిరి. సుబ్రహ్మణ్యము వారినిదీసికొని తిన్నగా నీలాద్రిరాజున్న యింటికిఁ బోయి వీధితుపు వేసియుండగా వారందరిణిని, ఇంటిమట్టును కావలి పెట్టియిద్దఱిని వెంటదీసికొని పాణిద్వారమున దొడ్డిలో ప్రవేశించెను. అప్పుడు నీలాద్రిరాజు పెరటిలో నిలుచుండి క్రొత్తమనుషులు వచ్చుట చూచి తత్తరపడ సాగెను.

నీలా-సుబ్రహ్మణ్యముగారా? ప్రొద్దుననే మీరిక్కడకు వచ్చినారేమి?

సుబ్ర-తమ దర్శనము నిమిత్తమే. దొడ్డిలోనేమిచేయుచున్నారు?

నీలా-విత్తనములు చల్లిం చుటకయి దొడ్డి త్రవ్వించినాను. ఏమిగింజలు చల్లింతునాయని యాలోచించుచున్నాను.

అని యాతొందరలో తన విషయమున భహువచన ప్రయోగమును మఱచిపోయి తన నిజమయిన స్థితి కనుగుణముగా మాటాడెను. సుబ్రహ్మణ్యము మాఱుమాటాడక భటులతో లోపలజొరబడి పెట్టెలన్నియుఁ దీయించి పరీక్షింపఁగా వానిలో మున్ను తమలోపల బైరాగి యెత్తుకుపోయిన వస్తువులను మఱికొన్నివస్తువులను గానడెను.గాని రాజుగారి సొత్తేమియుఁగనబడలేదు.తనసొమ్ము దొరకడంబట్టి నీలాద్రిరాజే దొంగయని నిశ్చయముచేసి వస్తువులు భూమిలో పాతిపెట్టి త్రవ్విన యానవాలు తెలియకుండ, మఱుగు ఱుచుటకయి దొడ్డియంత యుఁద్రవ్వించి విత్తనములు చల్లుటకని మిషపెట్టి బొంకుచున్నాడని యూహచేసి యతడు భటులచేత దొడ్డినంతను త్రవ్వించెను: అందొకచోట రాజుగారి లోపలఁబోయిన సొత్తం పదునుకొండవప్రకరణము

తయు గవ్వయయినఁబోకుండ మొలలోతు భూమిలో గానబడెను. వెంటనే కూలివాండ్రచేత సొమ్మును మోయించుకొని నీలాద్రిరాజును నాతని భృత్యులను బట్టుకొని తీసికొని వచ్చుటకుయి భటుల నియోగించి సుబ్రహ్మణ్యము రాజుగారి యింటికివెళ్ళి నడచిన సర్వవృత్తాంతమును నెవేదించి, కావళ్ళతో సొమ్మును ముందుపెట్టి దొంగల నొప్పగించెను: నీలాద్రిరాజును సేవకులను తమ నేరమున కొప్పుకొని క్షమింప వేడుకొనిరి. అంతట రాజుగారు మిక్కిలి సంతోషించి సుబ్రహ్మణ్యమునకు గొప్ప బహుమానము చేసి,తాను పెద్దాపురము రాజునకు గప్పముగట్టెడి సామంతరాజు గనుక వారిని విమర్శింపఁ దనకధికారము లేదని దొంగలను రాజభటులవశమున నొప్పగొంచి వారికందరకు సుబ్రహ్మణ్యమును నాయకునిగాఁజేసి విచారణ కయి పెద్దాపురము కృష్ణజగపతి మహారాజుగారి కడకుఁ బంపెను. సుబ్రహ్మణ్యమును ఉమాపతిగారి యొద్ద సెలవు పుచ్చుకొని పెద్దాపురమునకు ప్రయాణమయి బయలుదేరి వీధిగుమ్మమువద్దకు వచ్చునాటికి పైనుండి మాలబల్లి యొకటి మీదఁపడెను. అప్పుడు ప్రయాణమాపి గౌళి ఫలముయొక్క ఫలము కనుగొనుటకు పురోహితునకు వర్తమానము పంపగా నతడు తాటాకుల పంచాంగమును పట్టుకొని వచ్చిశిరస్సుమీద పడలేదు గనుక మరణభయము లేదనియు స్నానము జేసి దీపము పెట్టుకొని బ్రాహ్మణునకు కొంచెము సువర్ణదానము చేసిన పక్షమున బల్లి యొక్క దోషము పోవునని యుజెప్పెను. సుబ్రహ్మణ్యము వెంటనే శిరస్నానము చేసివచ్చి రాగిలో సువర్ణ ముండునుగనుక నాలుగుడబ్బులా బ్రాహ్మణుని చేతిలోనేపెట్టి గాయత్రి చేసికొని తరువాత నెంతో యెండ యెక్కినను ఆపూటనే పెద్దాపురమునకు వెళ్ళ బయలుదేఱెను.