కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/రాజశేఖరచరిత్రము-పదమూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదమూడవ ప్రకరణము

శంకరయ్య కాసులపేరుతో వచ్చుట - అతఁడు తన తండ్రివృత్తాంతమును వినిపించుట - వైష్ణవగురువుల యూరేగింపు - నృశింహస్వామియొక్క రాక - అతఁడు తన కథను జెప్పుట.

పైని చెప్పినరీతిగా రుక్మిణియు తల్లిదండ్రులును మాటాడుకొనుచుండఁగానే, పదునాఱుసంవత్సరముల యీడుగల యొక చిన్నవాఁడు వచ్చి బుజముమీఁది మూటను క్రిందఁ బడవైచి రాజశేఖరుఁడుగారి కాళ్ళమీఁద బడి "అయ్యో మామయ్యా" యని యేడువనారంభించెను.

రాజ - ఏమి శంకరయ్యా! ఆఁడుదానివలె నాలాగున నేడ్చుచున్నావు? ఊరుకో.

శంక - మానాయన పదియేను దినములక్రిందట కాలము చేసినాఁడు. నేనప్పుడు గ్రామములోకూడ లేకపోయినాను.

రాజ - ఏమిరోగముచేతపోయినాఁడు? నీవప్పుడు గ్రామములోలేక యెక్కడకు వెళ్ళినావు?

శంక - ఆతఁ డాత్మరోగముచేత పోలేదు; ఇల్లుకాలి పోయినాఁడు. నేనావఱకుపదిదినములక్రిందటనే నాసవతితల్లిని తీసికొని యేలూరు వెళ్ళియుంటిని. నే నక్కడనుండగా నాకీ వర్తమానము తెలిసినది.

రాజ - ఇ ల్లెందుచేత కాలిపోయెనో యాతఁడేల బయటకు రాకుండెనో నా కాసంగతి వివరముగాఁ జెప్పు.

శంక - మీరు గ్రామములో నుండఁగానే మానాయన భూతవైద్యమునందు ప్రబలుఁడుగా నున్నాఁడుగదా? అటుతరువాత చుట్టు 190

రాజశెఖర చరిత్రము

<poem>పక్కల గ్రామమముల అందుకుడ అతని ప్రసిద్ది వ్యాపించినది. ఎవ్వరి యింట నెవ్వరికి కొంచెము జ్వరము వచ్చినను మానాయనను పిలిచి తీర్దము మిప్పించి చుండిరి; ఎవ్వరికి కొంచెము గాలి పొకిందన్నను మానాయననె పిలుచుకొని పోవుచుండిరి;ఎవ్వరు కొంచెము జడిసికొన్నను ,మా నాయన చెతనే విభూతి పెత్తించు చుండిరి.వేయేల చుత్తు పక్కల ఏగ్రామమున ఎవ్వరికి జబ్బు వచ్చినను మా నాయనను పిలువని స్తలము లేదు .ఈ ప్రకరము జరుగు చుందుట చేత నెల్లవరును తమ వస్తువులను మా ఇంటికి దెచ్చి భక్తి పూర్వకముగా సమర్పించుచుండిరి.;ఎవ్వరి ఇంట ఏ శుభకార్యము జరిగినను ముంధు కట్నము మా నాయనది గానే వుండును.

ఈ విదముగా కొంతకాలము జరిగిన పిమ్మట ఒకనాడు.ప్రాతకాలమున మా నాయనవీధిలొ నడుచుచు ,ఒక యీడిగవాని వాకిట కాయల గెలలతో నిండియున్న ఒక కొబ్బరి చెట్టును చుచి ఆయింటి వానిని పిలిచి తనకు నాలుగు లేత బొండములను పంపమని అడిగెను.వాడు కొంచెము పొగరు బోతు కనుక సొమ్ములిచినచొ కాయలు ఇచ్చెదనని అనెను. అందు మీద మా నాయన కోపద్రుస్టితో వానివంక కోపంగజూచి కాయలనియ్యమని గర్దించెను. 'నేనియ్యను నన్నెర్రపారిచూచి యెమిచెసెదవొ చూత 'మని వడును వెనుక తీయక గట్టిగ చెప్పెను.రేపిపటికి నీ చెట్టెమగునొ చూచుకొమ్మని తలయాచుచు మా తండ్రి ఇంతికి పొయెను. దయ్యాలుపెట్టి చంపినప్పటిమాట చూచుకొండమని వానిని వాడును లొపలకి నడచెను. ఆ రత్రి రెండుజముల వేల మాతండ్రి గాడ నిద్రలో వున్న నన్ను లేపి నాయుత్తరీయము చెంగున గిద్దెడు బియ్యము మూటగట్తి కడుగు <poem></ 191

పదమూడవ ప్రకరణము

చెంబు చెతికిచ్చి తనతోగూడ రమ్మని చీకతిలొ నన్ను తిసుకొని పోయెను.నేనును కన్ను కన్ను కనబడనిగాడ అంధకారములొ నిశె సమయమున దారి తడుముకొనుచు మాతండ్రినో నీడిగవాని ఇంటిదగ్గరకు జేరి నిలిచితిని. అప్పడు నన్నక్కడ నిలువ బెట్టి మా నాయన కాలికి బందము వేసుకొని కొబ్బరి చెట్టునకు యగబాకి ,యొక కర్రతొ దాసి మొవ్వును యందు నెను దెచ్చిన బియ్యమును కడుగును భొసి చెట్టు దిగివచ్చి మాయర్దరాత్రమప్పుడు మరల నన్ను దిసుకొని ఇంటికి వచ్చి యా రాత్రి సుఖనిద్రచేసెను.మరునాడుడతడు తన్నుజూడవచ్చినవారితోనెల్ల 'యీడిగవాడు కొబ్బరికాయ లియ్యకపొయి నందున వాని చెట్టుకి ప్రయొగము చెసితినని చాట మొదలుపెట్టెను. అందుకు ద్రుస్టంతముగ నాడు మొదలుకొని మొవ్వువాడి క్రమక్రమముగా ఆకులెందిపొయి నాలుగైదు దినములలొ చెట్టు చచ్చెను.తనకు కొబ్బరి కయలు ఇవ్వకపొవదం వల్ల బాపనవాడు నిస్కారముగా మా కొబ్బరి చెట్టును దయ్యాలు పెట్టి చంపినాడని యూర నెల్లవారితొ జెప్పుకొని యీడివా డేడువనారంబించెను.ఆవార్త శీగ్ర కాలములొనే చేరువ గ్రామమునకు ప్రాకెను.అందు మీద నెల్లవరికిని మా నాయనమీద నొకవిధమయిన అసూయ కలిగెను. ఆ పిమ్మట గ్రామములొ నొకరికి రొగము వచినప్పుడు మా నాయన ప్రయొగం చెసినడెమొ యని కొందరికనుమనము కలిగెను.అంధుచెత గ్రామములొనివారు తన ఇంట రోగదికము వచ్చినప్పుడు మునుపటంత తరచుగ మా నాయన పిలుచుకొని పొవడం మానివెసిరి.కాని యాతనిని పిలవకపొయిన నేమిచేసి పోవునో యని మనస్సులొ భయపదుచుండిరి.ఈరితిలొ నుండగా నొక కోమటివాని పిల్లవానికి రోగము వచినప్పుడు,వానితల్లి యూ రాజశేఖర చరిత్ర మువ్తవము వెళ్ళి పోదె యమగగా పెరంతలగుడివద్ద వున్నమాలది ఆ చిన్నవారికి గ్రమాలలొనివరే ఒకరు ప్రయొగము చెసినారని చెప్పెను.అందుమిద వారిద్దరు నేడ్చుచూ నింటికి వచ్చి యా పత్సమాచారమును మగవండ్రకు వినిపించగా వాండ్ర ప్రయొగము చెసినవారు మా తంద్రి యెయని నిశ్చయించిభూతవైద్యులను పిలిపించి పలువిదములా పాట్లుపడినారని వచ్చినరోగమునకు చికిత్సచెయించనందువల్లన చకపొయినందున జ్వర బాదితుదై వుండగా భూతవైద్యులతనుని పలుమర్లు స్త్ననము చెయించుచు వచ్చినందున వాయువు చెసి యీ పిల్లవాడు కాల దర్మము నొంచెను.అది మొదలుకొని మాతండ్రి ప్రయొగములు చెసి అందరను జంపు చుండన్న నమ్మకమొకటి యూర అంధరకిని కలెగెను.ఆ నమ్మకమునకు తోడు మునుపెప్పుడో గ్రామమున చచ్చినవారు తాము ప్రయోగము చెతనే చచ్చిన వారు తాము ప్రయోగము చెతనే చచ్చినామనియు , మీరు నిజమును కనుగొన లేక రోగమని భ్రమపడి తమ్ము బోగొట్టుకొన్నారనియు చెప్పుకొని యేడ్చు చున్నట్టు గ్రామ్ములోని మూలి ముండలిద్దరు ముగ్గురు రోదనముల కారంబించిరి. ఆ కాలములో కామేశ్వరి యెవరికైన రోగము వచ్చినప్పుడు ప్రయోగ మని యెకటి రెంఉ చోట్ల పలుకుచు వచ్చెను. ఈయన్ని కారణముల చేతను గ్రామములో నెవ్వరి కేవిధమయిన ల్జబ్బు కాలిగినను, అది యంతయు మా నాయన చేసిన ప్రయోగము చేతనే కలిగినదని జనులు భ్రమప చుండిరి. తా నేదోషము నీరుగనని మానాయన ఎన్ని విధముల ప్రమాణము చేసి చెప్పినను, ఎవ్వరు నాతని మాటలను విశ్వసించినవారు కారు. జనుల పిచ్చి యేమందును? గ్రామములో మరణము నొందిన వారందరును మానాయన చేసిన ప్రయోగము చేతనే పోయిరని దృఢముగ నమ్మిరి; వ్యాధి గ్రస్తులైన వారందఱును మా నాయన యొక్క మంత్రశక్తిచేతనే బాధపడుచున్నారని తలంచిరి. కాబట్టి యెల్లవారును కొంతకాలమునకు మానాయనను గ్రామమున కొక మృత్యుదేవతనుగా జూచుకొనుచుండిరి. మా నాయనపొడ గనబడినప్పుడెల్లను గ్రామములోని యూడువారు నెటికలువిఱిచి తిట్టజొచ్చిరి. మగవాండ్రు కొఱకొఱలాడుచు మునుపటివలె మాటాడక యాతడు కనబడినపు డెల్లను తప్పించుకొని పెడదారిని తొలంగిపోవుచుండిరి. ఇరుగుపొరుగునున్నవారు నిప్పుసహితము పెట్టమానివేసిరి; ఏవస్తువు బదులునిమిత్తము వెళ్ళినను లేదనుచుండిరి. పొరుగువారు తమనూతిలో నీళ్ళు తోడుకొన వలనుపడదనిరి. అందుచేత నీప్రకారముగా శత్రుమధ్యమున కాపురముచేయుట మానాయన కెంతో భారముగానుండి, ఇదియంతయు దాను భూతవ్యెద్యుడనని వేషము వేసుకొనుటవలన గలిగిన పాపఫలముగదా యని తెలుసుకొని పశ్చాత్తాపపడిన కార్యములేక స్వయంకృపరాధమునకు నోరెత్తక యనుభవించుచుండెను. ఇట్లున్న సమయములో నొకసారి సవతితల్లికి దేహములో రుగ్ణతవచ్చినది; అప్పుడెందఱిని గాళ్ళుగడుపులు పట్టుకొన్నను ఒక్కరైనను పథ్యపానములుచేసి పెట్టుటకు గాని నిద్రరాకుండ దగ్గఱనుండి మాటలు చెప్పుటకుగాని వచ్చివారుకారు; గ్రామములోనివా రెవ్వరును పథ్యపానమునకయి తమనూతిలోనుండి నీళ్ళుసహితము రెచ్చుకోనిచ్చినవారు కారు; మీరు గ్రామమునుండి లేచివచ్చిన నాలవనాడే మనగ్రామములో వ్యెద్యుడుగా నుండిన నంబి వరదాచార్యులు పోయినాడు. నేతి రామయ్య మనయింట వంటబ్రాహ్మణుడుగా నుండి కంచుచెంబుల జో డెత్తుకొనిపోయి ముండ కిచ్చనందునకయి మిరు పని తిసివేసిన తరువాత వాడు మఱియెంధునకును పనికిరాని వాడౌటచేత చదువులబడి పెట్టుకొని జీవనము చేయుచుండెనుగదా! వరదాచార్యులు పోగానే వైద్యముకూడ నారంభించి వాడిప్పుడు గ్రామములో ఘనవైద్యుడయి యున్నాడు. మొదట వైద్యమారంభించినప్పుడు క్రొత్తగనుక రోగముల నామములను ఔషధనామములను మానాయనచేతనే వ్రాయించుకొని, యెఱ్ఱనివియు నల్లనివియు నయిన కుప్పెలుచేసి తీసికొనివచ్చి యేమం దేరంగుగలదిగా నుండునో మానాయనవలననే తెలిసికొని వానిమీద "పూర్ణచంద్రోదయము" "వాతరాక్షసము" మొదలయిన పేర్లనువ్రాసి యంటించినాడు. జీలకఱ్ఱ, మిరియములు, మొదలయినవస్తువులలో సిందూరమువేసి నిమ్మకాయలరసముతో నూరి మాయింటచే మాత్రలుచేసి తీసికొని వెళ్ళుచుండెను. అతడేయౌషధమునడిగీనను తనయొద్దలేదనక తులమునకు రూపాయమొదలుకొని యిరువది రూపాయలవఱకును వెలగట్టి యిచ్చు చుండెను. ఆరంభదశయందు వచ్చినసొమ్ములో మానాయనకుగూడ భాగమిచ్చెడివాడుగాని తానుపెద్దవైద్యుడని పేరుపొందిన తరువాతను మానాయనకు గ్రామములోనివారితో విరోధమువచ్చిన తరువాతను భాగమిచ్చుట మానివేసినాడు. అట్టివాడు మానాయన స్వయముగా వెళ్ళి తన భార్యకు జబ్బుగా నున్నదని బతిమాలి పిలిచినను ప్రజలకు వెఱచి యొక్కసారి చేయియయినను చూచి పోయినవాడుకాడు. వేయేల? ఊరివారు పెట్టవలసిన నిర్భంధముల నన్నిటిని బెట్టిరి; చీకటిపడినమీదట ఇంటిమీద బెడ్డలువేయ నారంభించిరి. నన్ను భార్యకు గావలిపెట్టి మానాయనయే చెఱువుకుబోయి స్నానముచేసి నీళ్ళుతెచ్చుకొని వంటచేసి పగలు రెండు జాములకు పథ్యముపెట్టుచు, మీరయిన గ్రామములోనున్న దనకింత యిబ్బంది రాదుగదా యని మీరుచేసిన యుపకారములను దలచుకొనుచు బహువిధముల విచారించెను. బహుప్రయాసముమీద కొన్నిదినములకు మాతల్లికి వ్యాధి నిమ్మళించినదిగాని దేహములో బలముమాత్రముచేరినదికాదు. గ్రామములో విరోధమంతకంతకు ప్రబలినది. తెల్లవార లేచి చూచువఱకు, మావీధిగుమ్మమునిండ నశుద్ధపదార్ధములును మనుష్యులపుఱ్ఱెలును పడియుండుచు వచ్చెను. మా తండ్రి వానినన్నిటినిదీసివేసి నిత్యమును రెండుమూడు స్నానములు చేయుచు భార్య కుపచారము తిన్నగా జరగనందున నన్నామెవెంట నిచ్చినవారిమీఁద పుట్టినింటికి హేలాపురము పంపి, తానొక్కఁడు నిల్లు కనిపెట్టుకొని యుండెను.

బయలుదేఱిన మఱునాడురాత్రి నాలుగు గడియలప్రొద్దు పోయినతరువాత మేము సుఖముగాపోయి యేలూరుచేరితిమి. అక్కడ గిన్నాళ్ళున్న మీదట పథ్యము వంటబట్టుట చేతను తల్లి దండ్రుల యాదరణచేతను న సవతితల్లి దేహము స్వస్థపడినది. ఒకనాడు నేనును నాసవతిమేనమామయు నుదయకాలమున దంతధావనము చేసికొని వీధిలో రావిచెట్టుచుట్టును గుండ్రముగా రెండడుగులయెత్తుగావేయబడియున్న యరుగుమీద గూరుచుండి యుంటిమి. నాసవతితల్లి తండ్రి రావిచెట్టునకును వేపచెట్టునకును పెండ్లి చేయించి వానిచుట్టును విశాలమయిన యాయరుగు వేయించినాడు. ఆయరుగుమీద చెట్టునీడను గూరుచుండి గ్రామకరణమెప్పుడును పనిచూచుకొనుచుండును. అప్పుడు ముప్పదిసంవత్సరముల యీడుగల యొకనల్లనిశూద్రుడు తెల్ల బట్టలు కట్టుకొని చంక మూటనుదగిలించుకొని వచ్చి 'మీరేమయిన కాసుల పేరు గొనియెదరా?' యని యడిగెను. మాసవతి మేనమామ 'ఏదీ చూపు' మని యడిగెను. ఆశూద్రు డరుగుమీద గూరుచుండి మూటనువిప్పి కాసులుపేరుతీసి యాతనిచేతి కిచ్చెను. ఆతడు చూచి వెలయడిగి నాచేతికిచ్చి బాగున్న దేమో చూడుమని చెప్పెను. నేను దానిని చేతబట్టుకొని నిదానించిచూచి, కొలికిపూసనుబట్టి యాన ీ::::రాజశేఖర చరిత్రము

వాలుపట్టి రుక్మిణిదని తెలుసుకొని 'నీకీకాసులపేరు నెక్కడనుండివచ్చే'నని వానిని ప్రశ్నలు వేసితిని. వాడు నేను వర్తకుడను కాఁబట్టి మా యూరిలో నొకనిచేత పట్టుతోకట్టించినా నని చెప్పెను. అందుమీఁద నేనాపేరుమాబంధువులదనిచిప్పి, 'యీదొంగసొత్తు నీయొద్దఁగనఁబడి వదిశాఁబట్టి నిన్ను రాజభటుల కొప్పగించెద ' నని బెదరించితిని. వాఁడును జడియక కాసులపేరు మాయొద్దనేదిగవిడిచి, ఠాణాకుఁబోయి మీరు చేసిన యక్రమమును జెప్పి 'మిమ్ములను బట్టుకొని శిక్షించుటకు బంట్రోతులను దీసుకొనివచ్చెద ' నని కేకలు వేయుచుఁబోయి, నేనచట రెండు దినములున్నను మరల రానేలేదు. మూఁడవ నాఁడు ప్రాతఃకాలముననే యొక కూలవాఁడు ధవిళేశ్వరమునుండి వచ్చి నారాయణమూర్తి గారు వ్రాసిన జాబు నొక దానిని నాచేతికి కిచ్చెను. నేను దానిని పుచ్చుకొని విప్పి చూచుకొనునప్పటికి "మీనాయన నేఁడే గృహము తగులపడి కాలముచేసినాఁడు కాబట్టి తక్షణము బయలుదేఱి రావలసినది" అని యందు వ్రాసి యుండెను. పిడుగువంటి యావార్త చూడగానే గుండెలు బద్దలయి లోపలికిఁబోయి యేడ్చుచు నాసవతితల్లి కాదుర్వార్తను వినిపించితిని; ఆ మాట విన్నతోడనే యామె నేలఁబడి కొప్పువిడిపోవ దొర్లుచుఱొమ్ముచరచుకొనుచు నిల్లెగిరిపోవునట్లు రోదనముచేయ నారంభిచెను. ఆ యేడువులను పెడబొబ్బలును కొంచెము చల్లారినతరువాత నామెకు ధైర్యము చెప్పి, ఆకూలివానివెంట నాపూటనే బయలుదేరి కాళ్ళు పొక్కు లెక్కునట్లుగా తెల్లవారినఁదాక నడిచి మరునాఁడు పగలు రెండు జాములవేళకు మాయిల్లు చేరితిని.అప్పుడాయింటికి గోడలుతప్ప మరి యేమియు లేవు. చుట్టుపట్ల నొకయిల్లయిన కాలక వింతగా మాయొక్క యిల్లు మాత్రము పరశురామప్రీతి యయినది. నేనక్కడ విలపించు

పదమూడవ ప్రకరణము

చుండఁగా నిరుగుపొరుగులవారు వచ్చి నన్నోదార్చి, నాలుగుదినముల క్రింద రాత్రి యాకస్మికముగా గృహమునకు నిప్పంటుకొని సాయము వచ్చులోపలనె కాలిపోయినదని చెప్పిరి. నేనంతట నారాయణమూర్తి గారియింటికిఁబోయితిని. అతఁడావఱకే మాతండ్రికి దహనసంస్కారములు చెయించెను. మీరా గ్రామమునుండి వచ్చినప్పటి నుండియు మానాయనయు నారాయణమూర్తిగారును ప్రాణస్నేహము కలవారుగా నుండిరి. మీరు ధవళేశ్వరము విడిచిపెట్టిన నెలదినములకు నారాయణమూర్తిగారి లోపల దొంగలుపడి యొకరాత్రి సర్వస్వము దోఁచుకొనిపోయిరి. అందుచే నతఁడు మరల బీదవాఁడై మాతండ్రి ననుసరింపఁగా భూతవైద్యములో తనకు సహాయునిగా నాతనిని త్రిప్పుచు భోజనమున కేమయిన నిచ్చుచుండెను. మా నాయనకు గ్రామములో నందరును శత్రువులుగా నేర్పడి నప్పుడు,నారాయణమూర్తిగా రొక్కరే పరమమిత్రుడుగా నున్నాడు. మీబావమఱఁదికి గ్రామములోనివారు తనసొత్తును దోచుకొని పోవుదురని భయము తోచినప్పుడు, ఒకనాఁటిరాత్రి రహస్యముగా నన్ను తోడుపట్టు మని నగలును రొక్కము నున్న పెట్టెను నారాయణమూర్తిగారి యింటికిఁ గొనిపోయి అతని పడకగదిలో బెట్టి లక్కతో ముద్రవేసి పైని కప్పతాళమువేసి తాళపుచేవిని తనదగ్గరనే యుంచుకొనెను. నారాయణమూర్తి నన్నుఁజూచి మానాయనను తలఁచుకొని యేడ్చునప్పుడు, 'నా యొద్ద దాఁచుకొన్న నగలపెట్టెనుగూడ మరణ కాలమునకుఁ దీసుకొనిపోతివా ' యని యేడ్చేను. నేను పడకగదిలోనికి వెళ్ళినప్పుడు పెట్టెయచ్చటలేదు; ఆ యింటమరియొకచోటను గనఁబడలేదు. తరువాత మాతండ్రి చావును గురించి యడుగఁగా, నేను హేలాపురమునకు వెళ్ళినది మొదలుకొని వీధిలోనికి వచ్చిన నెవ్వరేమిచేసెదరోయను భీతిచేత మీ

రాజశేఖర చరిత్రము

బావమఱఁది లోపలతలుపు వేసుకొని కూరుచుండుచు వచ్చెననియు, అట్లు రెండుమూడుదినములు జరిగినపిమ్మట దామోదరయ్య లోపల తలుపు వేసుకొని కూరుచుండి యేమో పాతాళహోమము చేయుచున్నాఁడని గ్రామములో నొకవదంతి కలిగినదనియు, ఆవల గ్రామములోని వారందరును నాలోచించి యందరకును కీడుకలుగుటకై మేదోమహామంత్రమును పునశ్చరణ చేయుచున్నాఁడు కాని వేరుకాదని నిశ్చయించి దానికి విఘ్నము కలిగించినఁగాని తమకు బ్రతుకు లేదని గోదవరియొడ్డున సభ చేసినా రనియు, ఆ రాత్రియే యిల్లు కాలుట మొదలుగాఁగలవని యంతయు జరిగిన దనియు, అతఁడు చెప్పెను. నేనును పదిదినములకర్మయు జరిగినదాఁక వారియింటనే యుండి, పదమూఁడవనాఁడు బయలుదేరరాదు గనుక పదునాలగవనాడు కాసుల పేరుతో మీరున్న గ్రామమునకు రావలెనని వచ్చుచుండగా, త్రోవలో సిద్ధాంతి యగపడి రహస్యమని నన్ను దూరముగా దీసుకొనిపోయి మానగలపెట్టెను నారాయణమూర్తి తమయింటి దాఁచుట చెప్పి తనకు నూఱురూపాయలిచ్చెడు పక్షమున పెట్టె నాతనికియ్యక నిలిపి యుంచెద ననియు, మీమామగారిని చూచి వచ్చినతోడనే తగవు పెట్టవలసిన దనియుఁజెప్పెను. నేనును మంచిదని చెప్పి మీకొఱకు వెదకుకొనుచు వచ్చితిని. అని శంకరయ్య తనతండ్రి సంగతి యంతయు ఁజెప్పి మూటను విప్పి కాసులపేరును దీసి రాజశేఖరుఁడుగారిచేతి కిచెను. ఆయన దానిని పుచ్చుకొని మేనల్లుని కౌఁగిలించుకొని యూరార్చుచు, దామోదరయ్య పోయినందుకు గొంతతడువు విచారించెను. అప్పుడింటనున్నా వారందరును దామోదరయ్య నిమిత్త మొకసారి రోదనముచేసి భోజనములు చేసిరి. ఆ మధ్యాహ్నమంతయు లోకవార్తలతో ప్రొద్దు జరిగినది.

పదమూడవ ప్రకరణము

దీపములు పెట్టిన కొంతసేపటికి వాద్యములచప్పుడు వినఁబడి నందున రాజశేఖరుఁడుగారు మొదలగు వారందరును వీధిలోనికి చూడ వచ్చిరి. బలముగా ద్వాదశోర్ద్థ్వపుఃదడ్రములను ధరించి యొకవైష్ణవస్వామి పల్లకిలో గూరుచుండి యిరుప్రక్కల నిద్దఱునింజామరులు వీచుచుండ కరదీపిక లనేకములు వెలుఁగ నూరేగు చుండెను.ఆ వెనుక కొందరు దెలగాణ్యులును నొకవైష్ణవుఁడును గంధములు పూనుకొని తాళవృంతములతో విసరుకొనుచు నడుచుచుండిరి. ఆ వైష్ణవుని రాజశేఖరుఁడుగా రెఱుఁగుదురు గనుక దగ్గఱకు పిలిచి యీప్రకారముగా ముచ్చటింప నారంభిచిరి.

రాజ----మీరు ధవళేశ్వరములో నున్న గూడూరువారికి గురువులు కారా?
వైష్ణ---- అవును. ఆపల్లకిలో గూరుచున్నవారి కీగ్రామములో నవసరాలవారు శిష్యులు.
రాజ---- వెనుక నేను చూచినప్పుడు మీరు గురువులుగాను, మీకాయన శిష్యుడుగాను ఉండెడివారు కారా?
వైష్ణ---- మాలో మాకటువంటి భేదము లేదు. నాకు శిష్యులున్న గ్రామములో నతఁడు శిష్యుఁడుగాను, అతనికి శిష్యులున్న గ్రామములో నేను శిష్యుఁడనుగాను, మాఱుచుందుము. ఆయన తాతయు మాతాతయు సహోదరులు;

వారితండ్రి ప్రతివాదిభయంకరము గండభేరుండాచార్యుల వారు జగదేకపండితులు. వారు పరమపదమునకు వేంచేసిన తరువాత వారు సంపాదించిన శిష్యులను మాతాతలును తండ్రులును పాళ్ళువేసికొని పంచుకున్నారు. ఈ గ్రామములోనివారు మావాని వంతునకును ధవళేశ్వరములోనివారు నావంతునకును వచ్చినారు. మా కాపురపు గ్రామమైన శ్రీకూర్మము విడిచి యీప్రకారముగా సంవత్సరమున కొకసారి శిష్యసంచారము చేయుదుము. ృ:రాజశేఖర చరిత్రము

రాజ---- వెనుక మీరాయనను చదువు రాదని చెప్పినారే, ఆయన శిష్యుల కేమి యుపదేశము చేయును?
వైష్ణ---- ఆయన కెంతచదువు వచ్చునో నాకు సంతేవచ్చేను. శిష్యులకుపదేశించుట కేమి చదువు రావలెను? శిష్యుల కష్టాక్షరి చెవిలో నుపదేశించి నిత్యమును నస్టోత్తరశతము జపము చేసికొమ్మని చెప్పి, గురువే దైవమని నమ్మి కొలిచిన వైకుంఠము కరస్థ మని పలికి, బుజములమీఁద తప్తముద్రధారణము చేసి,మా గురుదక్షిణ పుచ్చుకొని మాదారిని మేము పోదుము. మే మెవ్వరితోను ప్రసంగించము గనుక మమ్మందరును పండితులే యనుకొదురు.
రాజ---- మీ రీగ్రామములో పదిదినములుందురా?
వైష్ణ---- ఉండము. రేపే వెళ్ళిపోయెదము. తరువాత సావకాశముగా దర్శనముచేసి మాటాడెదను.
అని యాతఁడు పల్లకీతోఁగలిసికొనుట కయి పరుగెత్తెను.
వారు వెళ్ళినతరువాత వీధితలుపు వేసివచ్చి మగవారు రాత్రి భోజనమునకుఁ గూరుచున్నతోడనే యెవ్వరో వచ్చి వీధితలుపుకడ "రాజశేఖరుడు మామగారూ " అని పిలువజొచ్చిరి. మాణిక్యాంబ నడవలోనికి వెళ్ళి 'యెవరువార ' ని యడుగఁగా 'నేను నృసింహస్వామి ' నని వెలుపలినుండి యొకరు పలికిరి. ఆ మాటయొక్కధ్వనియు పేరును విన్నతోడనే మాణిక్యాంబ భయపడి తటాలున లోపలికిఁ బరుగెత్తుకొని వచ్చి యాసంగతి భర్తతోఁజెప్పి ' నృసింహస్వామి పోయి అన్నాళ్ళయినది; ఎప్పుడును నాకీవరకు స్వప్నములోనినను గనఁ బడలేదు.ఇప్పు డీవిరుద్ధమే ' మని యాశ్చర్యపడఁ జొచ్చెను. ఇంతలో వీధితలుపువద్ద మరల గేకలువినఁబడెను.అప్పుడు రాజశేఖరుఁడు గారు భోజనముచేసి దీపము వెలిగించుకొని పోయి తలుపుతీసిరి,తీయఁగా నిజముగా నృసింహస్వామియే 'మామా' ' యని పలుకరించి,
పదమూడవ ప్రకరణము
ఆయనచేయి పట్టుకొనెను. ఆయన బ్రత్యక్షముగాఁ జూ మును నమ్మక మరలమరల దేహమును పట్టి చూచి, పాదములు చలము నైపునకు తిరిసెయుండక తిన్నగానే యుండటవలన మాయకాగార నిశ్చయించి యాతనిని లోపలికిఁ దీసికొనివచ్చి భార్యతో మన నృసింహస్వామియే వచ్చినాఁడని చెప్పి కాళ్ళుకడుకో నీళ్ళిమ్మని కొందరి పెట్టెను. ఆమెయు దీపము దగ్గరగా దీసికొనవచ్చి మొగము పాఱఁజూచి ' నాయనా ' యని కౌగలించుకొని కన్నీరునించెను. ఆయుద్రేకమంతయు నడఁగిన మీఁదట, నృసింహస్వామిలేచి కాళ్ళు కడుగుకొని భోజనము చేయుచు తాను కాశీయాత్ర వెళ్ళుటయు దారిలో తనమిత్రుడు తన్ను విడిచి వచ్చుటయు మొదలుగాఁగల సంగతి నీప్రకారముగా జెప్ప నారంభిచెను.
నాకు చిరకాలమునుండి కాశీయాత్ర చేసిరావలెనని మనసులో కోరిక యుండెను గాని తగినతోడు లేకపోవుటచేత నాకది దుర్లభమని యాతలఁపు విడిచి పెట్టితిని.ఇట్లుండఁగా నొకనాఁడు చామర్తివారి చిన్నవాడు శేషాచలము నాయొద్దకువచ్చి యెవ్వరితోను జెప్పనని నాచేతఁదనచేతిలో చేయివేయించుకొని రహస్యముగా దనకు హిమవత్పర్వతము దగ్గర తప్పస్సుచేసి స్వర్ణవిద్యను గ్రహింపవలెనని కోరిక గలదనియు,నేనుకూడ వచ్చినపక్షమున తనతో దీసికొనివెళ్ళి యావిద్య నుపదేశించెదననియు,మనమిద్దఱమును బంగారముచేయు యోగము గ్రహించిన మీఁదట మరల నింటికివచ్చి కావలసినంత బంగారమును జేసుకొని కోటీశ్వరులము కావచ్చుననియు చెప్పెను. ఆ మాటల మీఁద మనస్సులో నాకును మిక్కిలి యాశపుట్టి, తప్పక బయలుదేరి సాధ్యమయినయెడల కాశీయాత్రకూడ చేసికొనిరావలెనని నిశ్చయించితిని. తరువాత మేమిద్దర