కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/రసికజన మనోరంజనము-ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

రసికజన మనోరంజనము.

ద్వితీయాశ్వాసము.

రసికజనమనోరంజనము

బెనుమావికొమ్మకుఁ బెద్దతడవులేని
కోయిలపల్కుల కొమరుగలిగె

నింతకెన్నఁడు నిలుకడ నెఱుఁగనట్టి
గాలికిమ్మెయి నెమ్మది చాలఁగలిగెఁ
జెప్పనొప్పునె యామనియొప్పిదంబు
చిలువయెకిమీనికైనను నలువకైన.

సీ. పొంకమగుచుఁజను పూవుగుత్తులనొప్పి
కోయిలపల్కుల కొమరుమిగిలి
ముద్దులుగుల్కెడు మొగలిరేకులమించి
చెలువంపుఁబాపటఁ జెన్నుమీఱీ
వింతవింతలతీఁగె దొంతులసొగనూని
పలుమల్లెమొగ్గల చెలువుదాల్చి
బొట్టుగలకడింది పొలువున నలరారి
మోవిచిగురుల బఠీవిఁ బడసి
యాముటేనుఁగు నడకల నల్లదనరి
కన్నులకుఁ బండువొనరించెఁగాన లచ్చి
యెల్లవారికి సంతస మెదలలోన
వెల్లిగొలిపి యయ్యామని నెల్లతఱిని.

గీ. పురుడులేకుండ నక్కానపువ్వుబోఁడి
యలరు కొమరుఁగనిన వల్కులాలకించి
యీడులేకుండ నత్తఱినెల్లపులుఁగు
గములుఁబిల్లలఁ బెట్టంగఁగడఁగెఁ గడఁక.

చ. కొలఁకులనాడుచుం బొగడగున్నుల డాఁగురుమూఁతలాడుచుం
దొలఁగక చల్లులాడి పువుదుమ్మెగఁ జిమ్ముచుఁ దీవెతూఁగుటు

ద్వితియాశ్వాసము

య్యెలలనునూగి పుప్వూపొదరిండ్లను దూఱ్ కదల్బి తోటలో
నలరులు రాల్చుచుందిరిగె నామనిసెమ్మెర పిన్నలెయ్యెడన్.

చ. వలివువునీటికాలువల పజ్జలకుంని యేలలాడీ మే
ల్చలువలదాల్చి గాడ్ఫూనెఱజాణడూ మెల్లనబూవుదొటలలొ
నలరుల కొమ్మజజేసి చిగురాకు మునుంగు దొలంగజేసి య
వ్వల విరిగుబ్బగుత్తులను వ్రాలుచుబైకొని తావులంటేడూన్

చ. అలరులతేనె నావగను హయిగంమెయుచు నేగుతేటీచా
ళూలుఱుముల జెలగు మెయిలు గమిగాగ జెలంగకూయు కో
యిల రొదనెమ్మికూతగను నెల్లెడగొజ్జగి పూవునీరువం
కలగమిగాగనొప్పి ననకారుచెలంపెను వానకానక్

సీ. వాతెఱమఱుగైన పలుచాలుచాడ్ఫూన
జిగురాకులో లేతమొగడలమర
గబ్బిగుబ్బలనొప్ప కప్పఱానరులునా
బూలగుత్తుల దేటీచాలుదనర
గైదోయినలదిన గందంవుబూతన
గొమ్మలబుప్పొడీ కొమరుమోఱ
జెమ్మటపోనీచు చిఱువీవెనయనంగం
బండాకుగాలిచే బ్రక్కగదల
బొదలువేడుక ముద్దులు మూటగట్ట
జాలుసింగారములు వెదచల్లుచున్న
పూవుదోటను గై సేసితావి తియ్య
కన్నెమామిడి యొక్కటీ చెన్నుమోరె

చ. చిగురుగటారినూఱి వెడసింగిణీ కేలనమర్చి నూరెలం
దగిగొఱవంక పౌజుగడూ దాడిగరావడీ నారిదీటుచుం

రసిక జనమనొరంజికమము

బొగరుసజిల్కతెజిమళూపుల్ దుమికింవుచు దెటూలార్వగా
జగములమాదికినొవడలెజక్కరవిలుడూమచకంబునన్
వ.అటీయామనియందు

ఉ.పనుగనన్ను మిన్న చెలువమమ్మటువవీనులవిందుగాగము
నన్న దివిన్న వించి చిలుక ల్ద గమిన్ను నఁ జన్న నుండియున్
గన్ని యారూవు కన్ను ఁగవఁ గట్టిన యట్టుగ బిట్టుతో ఁపఁగాఁ
గన్నుల వింటిదంట తనకై వడి చూపెను గ్రీడిపై వడిన్.


సీ. కనఁడెట్టయెదుర నిల్చిన వారలను నైనఁ
గనియెనేనియు నఱగంటఁజూచుఁ
జెవిఁజొనుపఁ డొరులు చెప్పెడుమాటలఁ
జొనిపె నేనియు నేమిటను చునడుగుఁ
బలుకరించఁడు తన చెలికాండ్రనైనను
బలుకరించిన వెడపలుకు పలుకుఁ
బిలిపించుకొనునుదాఁబలుమాఱుఁదిండికి
నెంత నేపటికిని నేగళుండు
మిన్ను మన్నునుగాక మెలఁతమీఁది
కూర్మిఁబలువింత వలవంతఁ గుందుచుండె
నడు మసిరి యెత్తుకొన్నచో మిడిసి పడెడు
ములుచ మానిసిఁబోలి యప్పుడమిఱేడు.

సీ. గట్టువిల్కాని నెక్కటి నోరిచి నగండు
చెఱకు విల్తునిమీదఁ జెల్లదయ్యె
మింటిమీనను గూలమీటి నయెదుటింతి
కనుమీల మీదఁ గదియదయ్యె
వింటివారల నెల్ల వెఱవించు లావన్ను
బొమవిండ్లపై ఁజూపఁ బొసఁగదయ్యె

ద్వితీయాశ్వాసము

జగములెల్ల నుగెల్చు పొగరుగ్మనిపిరుందు దీవులమిదను దివురదయ్యె దొల్లిద్రోవది పెండ్లిముందల్ల మిను నొక్కయేటన బడనేసియున్ననాటి మగతనంబేమియు నచటమరుసిమీను నెదుటసాగింపలేడయ్యె నిపుడుక్రీడి

క.చాలమునుచిల్కచెప్పగ నాలించిన చెపిరిందు నందవుజూవున్ నేలకుగోలకు దెచ్చెను వాలాయము రేనిమేనుబలుడెందంబున్

గీ.ఎనితీసిన గ్రమ్మర నెప్పటట్ల యూరుచుండెడు బల్ తూపులున్నవాని రెండుమూడమ్ములున్న మరుండె గెలిచె నహహ నలువచెయువుల నేమనగవచ్చు

ఉ.ఆమనిగోయిలల్ చిలుక లామని నేయగ దాళలేకలో దామరకంటి నెన్నుచును దామరలింపగరాని కోర్కితో వేమరు దుంటవిల్లుగొని వేమరుడేయగ నొచ్చికుందు నా లేమనుజూడ కిప్పు డెటు లేమనువాడ నటించు నిచ్చలిన్

గీ.ఏకంతబున ననబోడి నెదనుదలప నేకతంబున ననవిల్తుడేయకుండు నలరువింటన నవ దూపులల్ల దొడికి యలరువింటను నడయాడు నరదమెక్కి,

వ.ఇట్లు చెరకువిలుకడు పరవు కరకుటంపర నెరకులుదూర నోరవ లేక యాకవ్వడి పడంతుక తనకన్నులం గట్టిట్టులయినం

దనలోదానిట్లని పలవింపదొడంగె
రసికజనమరంజనము

చ ,కలికిలొయిప్పుడేమి యలుకాలుకా వలుకాడవిట్లు న
న్నలమటఁబెట్ట నాయమగునా తగునా తెగునాయిఁకింతటన్
వలపిదియేలుకొమ్ము మగువా పగవానియట్ట నన్
దలఁపఁగ జాలిచూపలదా వలదావలఁదాళనేర్తువే.]

ఉ .నాయనుఁగుంవెలంది

ద్వితీయాశ్వాసము

<poem>గ్రాల్గంటి నెఱసోయగముఁజూడఁగాఁగోత నొండేదికన్ను లకొప్పడయ్యెఁ దలిరుబోఁడి నెమ్మెయి మెత్తతనముఁగోర నొడలికిని బడదయ్యెఁవేఱొకటిసోఁక నేమిచెప్పుదుఁ గవ్వడియింతినొక్క దానిఁదక్కంగ మఱి యున్న వానిమఱచె.

గీ. ఇట్లునెలఁతమీఁది యెదఁద్రిప్పకొనలేక యలరుఁదోట కేగనన్ని యచటఁ జక్కఁబడునటంచుఁజనియెఁబూఁదోఁటకుఁ జెలులుకొందఱవలఁజేరిరాఁగ.

సీ. బలుమల్లెమొగ్గలు పలుచాలుదలఁపించుఁ దుమ్మెడల్ కురులచెల్వమ్ముఁజూవుఁ జిగురుటకులు కేలిచెలువంబు వెలయించు నేనుఁగుల్నెన్నడ నెన్నఁజేయు దొండపండులుమేవి నిండుచెల్వముఁజెప్పు నంపంగిననముక్కు పెంపునుడువు నరఁటిచెట్లు తొడలయందమ్ముఁగాంపిచు జిలుకలుపలుకుల చెలువుఁదెలుపుఁ దానరూపును మఱపంగఁగానకేగఁ దెఱవరూవుఁదక్కఁగ నన్నిమఱచిపోయెఁ దప్పునే తానొక తెఱంగుఁదలచుకొనంగ దయ్య మొండొకతెఱఁగుఁదాఁదలఁచుననుత.

ఉ. కమ్మని తెమ్మఁదెమ్మెరలు గ్రమ్మఁగఁ గమ్మనివింటిదంట వూ

వమ్ములు చిమ్మ జుమ్ముమని యామునఁ దుమ్మెదదిమ్ముద్రిమ్మరన్

రసికజనమనోరంజనము
గొమ్మలనెమ్ములిమ్ములను గూయఁగఁజెమ్మట గ్రమ్మితమ్ములొ
క్కుమ్మడి దొమ్మిసేయ దొర యుమ్మలికం బువుఁదోటఁగ్రుమ్మఱు౯.
సీ.అదెకొమ్మకాఁబోలుననిడాయుఁగాకున్నఁ
                  జెట్టుకొమ్మయటంచుఁజెప్పఁదివురుఁ
       గలికి కప్రంపుఁ బల్కులనిచేరుఁగనక

ద్వితీయా శ్వాసము

వెలయు పంచదార పలుకులు నీకబ్బఁ
జేయవలయు నేమొ చెప్పమయ్య.

వ.అనినం గూరిమిచెలికాని నేరువు మాటలచేత నాతండు చిలుకకుం
దనకు నడచిన నుడువులచందంబును దనడెందం జొక్కచక్కెర
బొమ్మపయిండగిలి మక్కువం జిక్కియున్న తెఱంగును నెఱింగెనని
తలపోసి తెంపుచేసి యింక నెయ్యునికడం దన యల్లంబులోని
కోరిక చెప్పక కప్పివుచ్చుట కర్జంబుకాదని యెంచి వెంటవచ్చినవారి
నెల్లర నాయాపనులు చెప్పి సాగనంపి మంతనంబున సంగడికానితో
రాచిలుకలు వచ్చినది మొదలుకొని నేఁటిదనుకం జరిగినడంతయుం
బూసగ్రుచ్చినట్లుగాఁ దెలిపి యిట్లనియె.

ఉ.ఇట్టుగనుండె నాతెలివియెల్ల నిఁ కేమని తిట్టుకొందు నాఁ
డట్టులు ప్రేముడింజిలుక యాచెలిసుద్దులె తెల్పువోఁజెవిం
బెట్టక యూరకుంటి నిటుమించినదానినె త్ర వ్వుకొంచునేఁ
డిట్టులు కమ్మవిల్తు విరియేటులు నాఁటఁగనుంటి నక్కటా:

ఉ. గుట్టునఁజేడె వీడడుగఁగోరిక లీరికలెత్తినోరికిం
దొట్టినయంతఁబంతమున దోసపుసిగ్గొక తడ్డునచ్చినన్
గట్టిగ నోరునొక్కఁ దమిగ

రసికజనమనోరంజికము

<poem>జనువున మాటలు చెప్పుచుఁ గొనిచనియె విశారదుండు కొండొకయెడకున్.

క.అటునెయ్యెనిఁగొని చమచు౯ దటుకునఁజెలికాండ్రకెల్ల దగువనులెలమి౯ దిటవుగనుజెప్పి వారల నటునిటువడిఁ బంపివేసి యక్కఱదోఁపన్.

వ.ఇంతంతనరాని సంగడికాని వలవంతం దలంచి తల పంకించి మరుని మీఁదఁగినుక వొడమి.

గీ.మూడు కన్నులవానితో మొనసిమున్న చచ్చిబ్రతికియు వలఱేఁడ చలముతోడ వేయికన్నులదేవర బిడ్డమీఁది కేమొగంబునవచ్చితివిపుడుమరల.

గీ.అనుచు మరుదూఱిముందుచేయంగ వలయు కర్జమెదలోనఁ దలపోసి కాంచెయొకటి మదికి సరిపడ్డపిమ్మటఁబొదలువేడ్క సరగఁగ్రీడికిట్లనియె విశారదుండు.

సీ.ఁముచ్చలచేనల్ల పుడమివేలుపునిన్న

            నావునుగోల్పోయి యారటమునఁ

దనయావు విడిపింపుమనుచు నీయొద్దకుఁ

           బరునెత్తుకొనివచ్చి పలుఁదెఱఁగుల

వేఁడిన నాతనివిన్న పంచాలించి

          కనికరంబున మదికరఁగఁబాఱి

విల్లుదెచ్చుటకును వెడలి పరాకున

           నన్నద్రోపదితోడనున్న తఱిని ద్వితీయా శ్వాసము

బడకయిలునీవు వడిఁ జొరఁ బాఱుకతన
మున్ను మీలొన మీరు చేకొన్న యట్టి
కట్టూఁబాటున నొక్క యేఁడ ట్టెనీవు
పుడమివలగొని తిరుగంగఁ బూనలేచె.

రసికజనమనోరంజనము

గీ. నిదుర లేకుంటఁ జెమ్మట నిండుటయును వెసను వేల్పుఁదనమును మానిసితనంబు నెపుడు నెమ్మేనఁ గాంనింప నెల్లతఱిని గాంచె నరంవెూడ్పూ క్రాల్గంటి కన్ను దోయి.

సీ. పువ్వులుముడువదు పూబోఁడి యయ్యవి తొవవిందునల్లుని తూవులనియెు యద్దంబుఁజూడదుముద్దియ దానఁగ నడువెూము మున్నీటిపాపయనియెు కురులుచేముట్టదు విరిబోఁడియయ్యవి క్రొవ్వారుతుమ్మెదగుంపులనియుె చెలులపల్కులు వినదెలనాగయవియెల్లఁ జిల్కమెుత్తంబుల పల్కులనియుె యతంకంతకు వలవంతదోఁప మరుఁడు పూముల్కులడరించి కరమునేఁ ప నెడఁదఁ గవ్వడిపయిఁగోర్కి యెపు చూప సన్నగాలియు నెమ్మేని చెన్నుచూప

చ. చెలులను మాతికింగదుముఁ జిల్కలఁ బల్మఱు వీసడించు నం చలఁదఱుము౯ నెమళ్ళనొగిసారెకుఁ బాఱఁగఁదోలు గండుఁగో యిలపలుకుల్ వినందులకు నేఁచికలంచును గోరువంకల౯ గలికి మదింగడింది వెతగల్గిన రోఁతలుగావె యన్ని యున్.

గీ. బోటినెమ్మేను బంగారమాటనపుడు కమ్మవిల్కానిచిచ్చునఁ గరఁగుచున్న దోయనంగ వైుఁజెమ్మట యుెప్పుమిఱి

వెల్లువగుచును బాఱెను బెల్లుదనరి.
ద్వితీయాశ్వాసము

సీ. ఆవెల్లత త్తడి యతఁడొడ ల్సేర్పక
                    వెలనువెండ్రుకయట్లఁ జులక నగునె
యల్లమానిసీసింగ మక్కు నఁజెర్పక
                    యించువిల్తుని బెదరింపనగునె
యాపజదొరక్క నౌమెముదార్పక
                   కొదమరాయంచలో ఁ గొనఁగనగునె
యల్లజగముచుట్ట మలరించియేలక
                   తుమ్మెదదిమ్ముపెఁగ్రమ్మనగునె

యనుచు నయ్యింతి సగమను నంతకంత
కొగినిలిచినచోట నిలువకుండుఁ బెల్ల
దనముపూను వెన్నెలకును దలముడుందుఁ
దలిరువిల్కాని కాఁకకుఁ దాళలేక.

గీ. చీగురుబోఁడికిఁ గోయిలల్ పగవియయ్యెఁ
గొమ్మ కెంతయు ఁ దెమ్మెరకూళయయ్యె
నలరుఁబోడికిఁ గిట్టనినయ్యెఁదేంట్లుఁ
దమ్మికంటికి రేఱేఁడు దాయయాయ్యే.

చ. మరునకుఁ దూపునేనరయ మామవునీవును గాననట్టిచో
     నిరువుకిట్టిపట్టిపగయేటికిఁ బాటయె యంచుఁదెల్పిచం
     దురుమది దేర్ప నాతని నెదుర్కొనఁ దామరచేరెనోయన౯
     దరియెఁగఁజేర్చె ఁ జామ చెయిదామరచెక్కున వెచ్చనూర్చుచున్.

ఉ. కన్నులకాటుకంగలిసి కల్కిచనుంగవమీఁద జిందు వా
      ల్గన్నుల నీటితుంపరల గారవమెన్నుఁగనయ్యె నయ్యెడన్
      జెన్నెసలారుతామరల చెల్వపుఁదేనియలాని యంతటన్
      గ్రొన్ననగుత్తులంగదియు కోరికనేగెడు తేఁటులోయనన్.

 

రసికజనమనోరంజనము

ఉ.పుత్తడిచాయ మోమునకు ముక్కున క ఱ్తికి జెక్కుదోయికి
బొత్తుగవెల్లదమ్మినువుబువ్వూ జిందము నిగ్గుటద్దమున్
గుత్తగబోల్చి కబ్బముల కూర్పరులాడినమాట చెల్లెనా
నిత్తఱి జానమేను తెలుపెక్కెను బువ్విలుకానికాకల

ఉ.అప్పుడు ముద్దురాలివితమారసి నందియు మొంది నెచ్చెలు
మెప్పాదవంగ జేరజని మేకొనియుంచుక పట్టిచూచి కే
ల్నిప్పులమీద బెట్టినటు నెట్టనదోచిన నుల్కుచెంది యా
యెప్పులకుప్పుతోడ జెలులొక్కట నిట్లనిరుమలంబునన్.

సీ.వీనుదోయికిజూల విందు సేయుచువీణె
మెల్లన కొనగోట మీటనేమి
ముద్దుబల్కుల నింపుపుట్టంగ నెప్పుడు
బెంపుడుజిల్కల బిలువవేమి
యఱచేతజప్పుటల్ చఱచి హెచ్చరికతో
నింటి నెమ్మళ్ళవాడింపవేమి
చవితిచందురుదూఱం చక్కనినుదుటపై
దేటకస్తురిబొట్టు దీర్పవేమి
కలికిరాయంచబోదల గారవించి
తీరుగా నెన్నడల్ తగదిద్దవేమి
మేలిమిపసిండి క్రొంజాయమీఱజూలు
మేన నాడెంపు దొడవులుపూనవేమి.

గీ.మగువ నీ తెఱగేమియో మాకుజూడ
వింతగాదోచుచును గడువెఱవు గొలుపు
చున్నదిదె వేడుకొనెదము నిన్ను మేము
చెచ్చెరను నీదుమదివంత చెప్పవమ్మ.

ద్వితీయాశ్వాసము

<poem> గీ.ఎంత వేఁడిన మదివ ంత నిగురుబోఁడి సిగ్గుపెంపున జప్ప లెక యుల్ల మల్లాడ డల్లవచి యూకకున్న మరియు నిట్ట్టని రపూడా మగువలెల్ల.

రసికజనమనోరజనము

క. ఎక్కడినే నెక్కడి ఱేఁ
     డక్కున ననుగారవించు నతఁడనుకొనియుం
     టెక్కడ యీవలపుఁగడలి
     నెక్కటి నేనీఁదుటేడ యీవేసటతోన్.

ఉ. ఎవ్వరిఁబంపుదానఁ జనియిప్పుడు చెల్వునితోడ నావెతల్
     నెవ్వడివిన్నవించి తననేరుపుచూసి మదింగరంచఁగా
     నివ్వలవంత నెక్కణి నీఁగుదుతక్కట చిల్కలైనమం
     దవ్వులకేగ కియ్యెడను దానుననుండిన నన్నుఁగాచుఁగా.

క. అనుచుండఁ దలఁవులోననె
     చనుదెంచెను జిలుకకవయుఁ జదలుననటకులన్
     విని ఱెక్కచప్పుడొక్కట
     ననుఁగుం జెలులెల్ల ఱెప్పలార్పకచూడ౯.

గీ. చేరవచ్చి చిత్రాంగద చేతిమీఁద
     వాలి ముద్దిడి సేమంబువరుసనడిగి
     పలుకు వెలఁదుక తమ్మియ్యఁబంచినట్టి
     యీగిర్మాఁకుల క్రొవ్విరులెలమినిచ్చి.

చ. నలువ జగంబునందలి వినందగువింతలు కొన్ని తెల్పి యా
     వలఁ దమ కూర్మినెచ్మెలిని బాఱఁగనుంగొని యామెమేను మి
     క్కిలి వసివాడియుండుటయుఁ గీడ్వడిమోమునఁ దొంటితెల్వియి
     మ్ములఁ దిలకింపరామియును ముంగ్నల సంతసపాటులేమియున్.

క. కనిపట్టి డెందమందున
     వనటం దిగులొంది తోడివారలనెలమిన్
     వనబోఁడి యట్లు చిక్కుట
     కును గతమడుగంగ వారు కూరిమిమీఱన్

ద్వితీయాశ్వాసము

ఉ. మున్నులమింటిమీను నొకముల్కినిగూలిచి క్రీడి ద్రోవది౯
     గొన్న తెఱంగు జవ్వనులకుం గడువాసలు గొల్పురూపునుం
     గన్నదివేయినోళ్ళ ముదుకల్గొనియాడఁగ నాలకించి యీ
     యన్నులమిన్న పొంగి యెదయాతనిపై నెలకొల్పి వెవ్వగ౯.

క. కుందుచు నెవ్వరితోఁదన
     డెందంబునకోర్కివెల్ల్లడింపక లోలో
     వందురి యంతంతకుమెయి
     యందముచెడ సన్నగిల్లి యలసగమైన౯.

ఉ. తత్తఱమొందిదీనికిఁ గతంబెఱిఁగింపఁగదమ్మయంచు
     మిత్తఱి వేయిచందముల నీమెనువేఁడిన నెట్టకేలకున్
     బిత్తరి యంతియుదెలిసి బేలతనంబునఁ బల్కులాడి తా
     నుత్తలపాటుతోడ మిము నొక్కటఁ బేర్కొని మీరలుండిన౯.

క. తనకియ్యెడఁ గడుఁదోడయి
     పనిపూనికడిందికోర్కి పండింత్రుగదా
     యని వేచియున్నదిదే మ
     న్ననమీచెలి నప్పగించినారముమీకున్.

ఉ. మా బరువంతయుం దొలఁగె మాచెలియనన్మిముఁ గూర్చినార మిం
     కీబలితంవుఁ గర్జమెటు లీరలుదీర్చెదరోసుఁడీ యన౯
     జాబిలి చల్వచూపులను జామనుగగ్నొని మంజువాణి గా
     రాబముమీఱనిట్ల నె@ంగరమ్మును దేనియలొల్కుపల్కులన్.

సీ. మేమిద్ద్దఱముమున్ను మీయొద్ద సెలవొంది
                                   నలువజగమ్మున కలరువేడ్క
     మింటను జనుచుండి మిట్టలుపల్ల ముల్
                                  చదునునేలలయట్ల మదికిఁదోఁపఁ.

రసికజనమనోరంజనము

     గుప్పముల్ పల్లెలుఁ గుప్పవోపినయట్లు
                                కనువిందుగాఁగను గానఁబడఁగఁ
     జెఱువులుమడువులుఁ జిన్న యద్దపుబిళ్ళ
                                లట్లుచూడ్కికిఁ జాలనందగింప
     వేడ్కపడుచును నెడనెడ వింతలెల్ల
     నొండొరులతోడఁ జెప్పుకొంచొక్కచోట
     నూరిపఱగడ సింగార మొలుకుచున్న
     పూవుఁదోటలో నోక్క క్రొమ్మావిక్రింద.

సి. బవరిగడ్డమువాని బవడంబుఁ గ్రొత్త చెం
                                  దొవడంబుఁదెగడు కేల్దోయివాని
     తలిరిఁబాయమువాని వలఱేనినిండుక
                                  ల్వలఱేని నగియెడు చెలువువాని
     తళుకుఁజెక్కులవాని తేఁతులమీలమొ
                                   త్తమ్ములనగు కన్నుదంటవాని
     తేనెమాటలవాని తేఁటులఁగప్పుఱా
                                    తేటలనగుసిగతీరువాని

     చెలులతోడను ముచ్చటల్పలుపువాని
     కవ్వడినిజూచి యాసోయగంబునకును
     నెచ్చెరువునొందుచును గ్రిందికల్లడిగ్లి
     కంటిమాతనిఁ గన్నులకఱవుతీఱ.

సీ. దొరవేనిదొరమోవి దొండపండెన్న నే
                                      చెలుకలకొల్కిలోఁ దలఁపకుండు
     పుడమియేలికమేలి బుజము తూడులఁజెప్ప
                                       వేయంచయాన కన్నిడకయుండు
     

ద్వితీయాశ్వాసము

     నలఱేసిమోము వెన్నెలఱేనిఁగొనియాడ
                                  నెకల్వకంటి లోనెంచకుండు
     నొడయనిపొక్కిలి మడువుటెక్కెన్నవే
                                   జక్కవచంటిలో స్రుక్కకుండు

     నట్టిజెగజెట్టిఁ జేపట్టునట్టిమేలు
     పొదలు నిమ్ముద్దరాలికి నొదవెనేనిం
     బదిలముగఁ బదియార్వన్నె పసిఁడితోడ
     మంచి కెంపునుగూర్చిన మాడ్చియనుచు.

క. తలపోసి యతనిఁ గగ్నొని
     వెలయన్మముఁ దెల్పికొంచు వెలఁదుకమచ్చోఁ
     బలుకుల వెబడిఁ బేర్కొని
     చెలువెల్ల నుబొగడి మున్నె చెప్పినదాన౯.

ఉ. అంతియచాలునంచుఁ దఱుచాడక యత్తఱినూరకుండి నా
     యంతనుబోయితిం బయబమై సెలవాయనయొద్దఁబొంది ని
     ప్నొంతల ల్వవీటికిని ముద్దియ నీమది గొంతిపట్టిపై
     నింతగనిల్చియుంట యొక యింతయు నప్పుడు నేనెఱుంగమి౯.

క. అనిమఱీయు వేమొచెప్పఁగఁ
     జనుచిలుకం జెప్పనీక సడలినతాల్మిన్
     గనుఁగొనల నీరు కాఱఁగ
     ననియెం జిత్రాంగద గడు నడలుప్పొంగ౯.
      

రసికజనమనొర <poem>ద్వితీయాశ్వాసము

గీ . వల యీలాగునిండిన యింటిలోనఁ

    గుడిచికూర్చుండి  పనిలేని  గొడవయొకటి
    పైనివేసుక  పొగలెదు  పడఁతిమిన్న
   చాలుఁబదివేలువచ్చె  నీచలము  విడువు.

గీ. తానుబోయిన పిమ్మట దేనితోడ

    నై నఁబనియేమి  తెంపునేయంగవలదు
   తలఁపఁజనునమ్మ  నీయంతదానికట్టి
   వెడఁగుఁబనులక్కటా యెంతవెఱివీవు.

ఉ. చానరొ పోలుపొం దెఱుఁగఁజాలక యూరక కుందనేల నె

    ద్దీనె ననంగఁగొట్టమున  నీవలిగుంజను  గట్టుమన్న  యే
   మైనను  జెప్పఁగాఁదరమె   యాతఁడు   నాఁడటు  మాఱకుల్క  కే
    మానినదానికింగతము  మన్నన   విన్ననుగాక   నాకింక౯.

గీ. అనుడు నాచిలుకలకొల్కి యవలఁ జిలుక

    చెప్పఁబోయెడు   సుద్దిని  జివరదనుక
   వినెడువేడ్క   యువ్విళ్ళూర  వెచ్చనూర్చి
   యీవలావలి   చెలులతో  నిట్టులనియే.

గీ. మదికలంకఁజేసి యిది యనంగాఁదగు

    నిదియనఁదగదనెడి   యెఱుక  లేక
   యేమియోపలికితి  నింతెకా   కుసురులు
   విడువఁదలఁప  నంతవెర్రినమ్మ.

గీ. అకట నవుటాలకూరకే యన్నమాట

    నిజముఁగాఁబట్టి   యివుడింత   నెలఁతలార
   పట్టిపల్లార్చి   నామీఁద  వట్టి  లేని
   పోని  వాదువేయఁగఁ  బాడియౌనెమీకు.<poem> <poem>రసికజనమనోరంజనము

గీ. రవ్వపెట్టక యఁకనైన రమణమీఱ

   జాలిమెయిఁజిల్క   యేదియో  మేలిపలుకు
   చెవిని  వేయంగ  నుంకించెఁ  జెలియలార
   వినఁగ  నీరమ్మమొక్కెద   వీనులలర.

వ. అనుడు నప్పుడప్పుడంతులెల్ల జప్పుడు సేయక యొప్పుల కుప్పయగు నప్పులుగుచెలువ యొప్పిదంబుగాఁ జెప్పఁబోవు మెప్పుమాటల చొప్పటింప నుల్లంబు లువ్విళ్ళూర నూరకున్న నాచిలుకలకి కలికి పలుకుల నాచెలువల చెవులకుఁ జవులు గొలుపుచు గిలుకుటెలుంగున నిట్లసి చెప్పుందొడంగె .

సీ. అలపూవుఁదోఁటలో బలుకువెండిమున్ను

                               పొలఁతినీరూపు   నేఁబొగడినపుడు
     వలపు  డెందములోనఁ  గలిగియుఁగొండంత
                               యొక్కింతయును   వెలికుబ్బనీక
     యగ్గలంబుగఁదొట్టు  సిగ్గుకతంబున
                               దానినంతయు    మదిలోనెయడఁచి
      కల్లగుట్టొకయింత  కాంపింపఁబైటికి
                               నౌనుగాదనుమాట   యనకయుండె

నువిదరో యంతెకాని వేఱొండుగాదు వినుము వినుపింతుఁ దరువాత వెర్రియగుచు వలవుతలకెక్క నాతఁడు మెలఁగినట్టి నడత చందమించుక తేటపడఁగ నీకు .

ఉ. నిన్నను నల్వవీడుకొని నేనరుదెంచుచుఁగంటిఁద్రోవలోఁ బెన్నకుఁజేరువం గనులవిందుగఁ జెన్నగునొక్కకోనయం దున్నగుడారముం దఱిసియొప్పెడు మామిడి గున్నక్రింద వే గన్నులవేల్పుపట్టి చెలికాఁడొకఁడూఁతగఁ గూరుచుండఁగన్ . <poem>ద్వితీయాశ్వాసము

క. కని వారేమనుకొందురొ

    వినవలెనని   వేడ్కపొడమి  వెననాలేమిరాఁ
    కునకుండిగి యొకకొమ్మను
    బనివడి నేఁగూరుచుంటి   బడలికవాయ ్ .

వ. అయ్యెడ నాకవ్వడి వెడవిలుక్స్స్నియలజడిం దెలివిచెడి యిదితగు నిదితగదనియెడి యెఱుకలేక యెదుటఁ గనఁబడు వానినెల్లం దడని యిట్లని పలవింపదొడంగె .

సీ. అలలారయంచ తొయ్యలులార మీరైనఁ

                       జిత్రాంగదకు  నన్నుఁజెప్పగలరై
   తొగలార  మేలిసంపఁగులార  మీరై  నఁ
                       జిత్రాంగదకు  నన్నుఁజెప్పగలరై
   పొదలార   గండుతుమ్మెదలారమీరై  నఁ
                       జిత్రాంగదకు   నన్నుఁజెప్పగలరై
   విరులాన  చలువతెమ్మెరలారమీరై  నఁ
                     జిత్రాంగదకు  నన్నుఁజెప్పగలరై
   యెంతవేఁడిన  నొకరైన  నించుకంత
   పలుకనై  నను   నాతోడఁ  బలుకరేమి
   యేనుజేసిన   తప్పిద  మేదియైనఁ
   గలదె  యెల్లరు   నన్నిట్లు  చులకసేయ 

గీ.నేమమున నేను బండ్రెండు నెలలబట్టి

   యిన్ని  యేళ్ళకుఁజని  గ్రుంకులిడినయట్టి
  పున్నెముననై  న  నాకు   నాపువ్వుబోఁడిఁ
  గాంచుమేలైన  నొకసారి  గలుగరాదే .

క .అని పెక్కువగలఁదలఁకెడు

   ననుఁగుం  జెలికాని  లోని   యలజడితగ్గన్.<poem> <poem>రసికజనమనోరంజనము

మనమిదెచని చిత్రాంగదఁ గనుగొందము సుమ్మియెల్లి కన్నులతనియన్

క.అందాఁక నోర్చుకొమ్మని

   కందువమాటలను  జెల్మికాఁడొకఁడచ్చో
  డెందమునందలి   కుందున్
  డిందింపుచునుండ  నవుడ  నేనును  గడఁకన్ .

క.నీయెద యాతనిపయి నిటు

   లోయింతురొ  తగిలియుంట  యొక్కింతయు  నే
   నాయెడ  నెఱుఁగమిచే  నీ
   చాయలవచ్చితని  నంతెచాలు  నటంచు౯ .

క. నమ్ముమిది నేఁట ఱేపటఁ

    గొమ్మానింవదకిగొంచు  గొబ్బునఱేఁడీ
    యిమ్మునకేతెంచి  నినున్
    నెమ్మింజేపట్టు   నీదునెచ్చెలు  లలరన్ .

గీ.కాన నూఱడియుండుము నేనుబోయి

   యిపుడ  మీతల్లిదండ్రుల  కలమింరొక్కి
   వారసేమంబు   లారసి  వత్తుమరల
   ననుచుదిగ్గున   రాచిల్క  లరిగెఁజదల .

క. చిలుకలటుచన్నపిమ్మటఁ

    జెలికత్తియలంతిపురికిఁ  జెచ్చెరఁజెలువన్
   బిలుచుకొనిపోయి  రూఱడఁ
   బలుఁదెఱఁగుల   దిటవుగరపి   పాయనికూర్మిన్ .

వ. అటుతరువాత నడచినకత చెప్పమని జనమేజయం డడుగుటయు.<poem> <poem>ద్వితీయాశ్వాసము మాలిసివ్మత్తము.

    జగము  లకయువాఁడ  సాదులం   బోచుఱేఁడా
    పొగరుఁ  బసులగొంగా    పూసబల్వెన్నదొంగా
    పగయెఱుఁగనివేల్పాపైఁడిపుట్టంబుదాల్పా
    వగలుతొలఁచుమిన్నా వాసిగ౯కొల్లపిన్నా.

కందగర్భిత మజగణనికక్క.

    చిలువదొరపు  జెలువునఁజెలఁన్
    సిలుగుల  నడఁచెడు  సిరిచెలిమగఁడా
    నలువయుఁ  గొడుకయి  నలువుగ  వెలయ౯
    బెలుకుఱఁబగతుర  బిగిచెఱుచుదొరా .
                                                  గ  ద్య  ము
ఇది  శ్రీమదాపస్తంబసూత్ర   లోహితపగోత్ర  శుద్ధాంధ్ర  నిరోష్ట్య  నిర్వచన
    నైషధమహాకావ్య  రచనాతురీధురంధర  సధ్యశోబంధుర  కందు
     కూరివంశపయఃపారావా రాకాకై రవమిత్రసుబ్రహ్మణ్యామాత్య
       పుత్ర  సుజనవిధేయ   వీరేశలింగ   నామధేయప్రణీతంబయిన
               రసికజనమనోరంజనంబను     ప్రబంధరత్నంబునఁ
                                ద్వితీయాశ్వాసము<poem>