ఆ భా 3 1 091 to 3 1 120

వికీసోర్స్ నుండి

వోలం సురేష్ కుమార్


వ. అంత. 091

ఉ. న్యాయవిదుండు గామ్యక వనంబున ధర్మరాజు నొద్దనుండి మై త్రేయుఁడు ధీయుతుం డరుగుదెంచిన నప్పుడ యమ్మనీంద్రు నిం ద్రాయితుఁ డాంబికేయుఁ డుచితస్థితిఁ బుజితుఁ జేసె నాత్మని శ్శ్రేయసలాలసుం డయి విశేష సపర్యలఁ జేసి భక్తితోన్. 092

వ. ఇట్లు దనచేతం బూజితుండై సుఖ విశ్రాంతుం డైన మునివరునకు ధృతరాష్ట్రుండు ముకుళిత హస్తుండై భట్టారకా యెందుండి వచ్చితి రని యడిగిన నతనికి మైత్రేయుం డిట్లనియె. 093

చ. అలఘతపాభరంబున జటాజినముల్ ధరియించి రూక్షవ ల్కలములు గట్టి కూరలును గాయలుఁ బండులు భోజనంబుగా నలయక కామ్యకం బను మహావిపినంబున నున్న పాండవే యులకడ నుండి వచ్చితిఁ గరూత్తమ నీ సుతు నిన్నుఁ జూడఁగన్. 094

వ. ఏ నఖిల తీర్థ దర్శనార్థంబు పరిభ్రమించుచుఁ గురుజాంగలంబున కరిగి యందు గురుకులోత్తము లైన పాండు పుత్త్రులం జూచితి. 095

ఆ. అనిన నవనతాస్యుఁ డయి ధృతరాష్ట్రుఁ డి ట్లనియె నెట్లు సెప్పుఁడయ్యయందుఁ బాండవులకు సత్యభాషణులకుఁ గుశ లంబె వార లిట దలంతురొక్కొ. 096

క. అమిత భజశక్తి నంతక సము లప్పాండుసుతు లిందు సౌభ్రాత్రస్నే హమునకు విచ్ఛేదముగా సమయాతిక్రమము సేయ సమ కట్టరుగా. 097

వ. అనిన మైత్రేయుం డిట్లనియె. 098

క. చనుదెంచి మహామహామునివరు లనవతరము వారలకుఁ బ్రియం బొనరఁగ దీ వన లీగిఁ జేసి కుశలమ మనుజేశ్వర వారు ధర్మమతియుతు లగుటన్. 099

క. వారలు సమయము దప్పిన వారిజ రిపుహితులగతు లవశ్యముఁ దప్పున్ వారికి నకారణం బని కారము నీ కొడుకుసేసెఁ గడు నహితుండై. 100

వ. అని దుర్యోధనుం జూచి యయ్యా నీవు బుద్ధి గలవేనిఁ బాండవులతే విరోధం బుడుగు మట్లయిన నీకును వారికిం గురుకులంబునకు లగ్గగు నా పలుకుఁ జేకొనుము. 101

సీ. వజ్ర సంహనను హవార్య పరాక్రముల్ పాండు కుమారు లాఖండలాభు లందఱు నాగశతాయుత త్రాణు లుగ్రాహవకాంక్షు లుత్సాహపరులు వారలలో బలవంతుండు బక హిడింబాసురు లను వారి నాసురమునఁ జంపె నాగాయుతసత్త్వు జరాసంధు నెక్కటి యోర్చిన యక్కజుండు

తే. ఘోర వనమున వీరుఁ గిమ్మీరుఁ డను సు రారి నిశ్చల ఘన భీకరాంగుఁ బట్టి పోర వధియించి నట్టి సమీరజునకు భూరిభుజునకు మార్కొనువారుఁ గలరె. 102

మైత్రేయుఁడు దుర్యోధనుని శపించుట సం. 3-11-27

వ. వారికి వాసుదేవ ధృష్టద్యమ్నులు సంబంధ సహాయులు జరామరణవంతు లైన మనుజులు వారిం జెనకి యెట్లు జీవింతురు. నీవు వారితో నొడంబడి యుండు మిది కార్యం బనిన మైత్రేయు పలుకు లాదరింపక పాదాంగుష్ఠంబున నేల వ్రాయుచు బాహువెత్తి దొడలు సఱచి నగుచున్న యా దుర్యోధను జూచి మైత్రేయుం డలిగి యీ యపరాధంబున నావహంబగు నందు భీము గదాఘాతంబున నీ యూరు యుగళంబు భగ్నం బయ్యెడమని శాపంబిచ్చిన వెఱచి ధృతరాష్ట్రుండు మునీంద్రా యట్లు గాకుండ బ్రసాదింపు మనిన నమ్మునివరుం డిట్లనియె. 103

తే. కడఁగి సమబుద్ధి వీనికిఁ గలిగె నేనిఁ గాదు శాపఫలం బట్లుగాక బుద్ధి హీనుఁడై గర్వితుం డగునేని శాప హవ్యవాహఫలంబు వీఁ డనుభవించు. 104

వ. అని ప్రసన్నుండైని మైత్రేయునకు నాంబికేయుం డిట్లనియె. 105

కిమ్మీరుం డను రక్కసుఁ డమ్మారుత తనయుచేత నత్యుగ్రవనాం తమ్మున నిహతుం డయిన వి ధ మ్మెట్టులు సెప్పు మద్భుతం బిది యనినన్. 106

వ. నా పలుకులు నీ కొడుకు వినం డయ్యె నేనేల చెప్పెద దీనిం బాండవసహాయులైన విప్రుల చేత విదురుం డిమ్ముగా నెఱింగినవాఁ డతనివలన విను మని చెప్పి మైత్రేయుం డరిగినం గిమ్మార వధకథాశ్రవణ పరుండై తన్నడిగిన ధృతరాష్ట్రునకు విదురుం డిట్లనియె నిందుండి చని పాండవులు మూఁ డహో రాత్రంబులు నిరంతర ప్రయాణంబు సేసి కామ్యకవనంబుఁ జొచ్చువారొక్కనాటి యర్ధరాత్రంబున రాక్షస ప్రచారవేళయందుఁ బరిభ్రమించుచు రాక్షసమాయ గావించుచున్న వాని నతినిశితోదష్ట్రా కరాళంబైన తనవదన గహ్వరంబుఁ దెఱచి గ్రుడ్లుమెఱవ బభ్రుకేశంబులు దూల బాలార్క రశ్మియుతం బయిన బలాహకంబునుంబోలె సకలప్రాణి భయజననంబుగా గర్జిల్లుచున్న వాని నిజపాద ఘట్టిత మహీతల ప్రచలన వేగ వేతవల్లీ పల్లవ బాహు పరిరంభణ సుఖంబుఁ బాదపంబుల కాపాదించు చున్న వాని నెదుర నొక్క రక్కసుం గనిరంత వాఁడును బ్రాహ్మణ సంఘంబు ముందటఁ గృష్ణాజినా వృతులై వచ్చు పాండవుల దవ్వులంగని మార్గనిరోధియై మహాపర్వతంబును బోలె నున్న నదృష్టపూర్వ ప్రమాణం బైనవాని దేహంబు జూచి నిమీలిత నయన యయి దుశ్శాసన కరాకృష్టనిరీర్ణవేణీరంబు వెనువెంట నొలయం బాంచాలి పంచపర్వతంబులనడిమి నదియుంబోలెఁ బతుల నడుమ భయ వ్యాకులచిత్తయైన నింద్రియంబులు విషయ రతిం బరిగ్రహింబునట్టు లేవురు నక్కోమలిం బట్టకొని భయపడకుండ నాశ్వాసించు చున్నంత. 107

క. రక్షోఘ్న మంత్రముల నా రాక్షస మాయా పరిస్ఫురణఁ జెఱిచెఁ గ్రియా దక్షుఁడు ధౌమ్యుఁడు పాండవు లీక్షించుచు నుండఁగా నహీనప్రతిభన్. 108

వ. అంత. 109

క. ప్రతివిహితమాయు నత్యా యంభుజ యుతుఁ గోపఘూర్ణి తారుణ విస్ఫా రితనేత్రు నసురఁ జూచి భ రతకుల వర్ధనుఁడు ధర్మరా జిట్లనియెన్. 110

వ. నీ వెవ్వారివాఁడ వెవ్వండ నివ్వనంబున నేల యున్నవాఁడ వనిన వాఁ డిట్లనియె. 111 క. ఏను బకాసురు ననుజుఁడఁ గీనాశుఁడ మానవులకుఁ గిమ్మీరుఁ డనం గా నెగడుదు నీ కామ్యక కాననమున సర్వసత్త్వ ఖాదన బుద్ధిన్. 112

క. పాయక యుండుదు రాక్షస మాయల సమరంబు సేసి మనుజుల విగతో పాయులఁ జంపుచు భక్షణ సేయుదు నమరాదులకు జేయుఁడఁ బోరన్. 113

వ. నాకు వెఱచి యెల్లవారును దూరంబున దీనిం బరిహరింతురు మీ రెవ్వరిందుల కేల వచ్చితిరి మిమ్ము వధియించి యిపుడు భక్షించెద ననిన వానికి యుధిష్ఠిరుం డిట్లనియె. 114

ఆ. ఏను ధర్మసుతుఁడ నీతఁడు భీముండు వాఁడు విజయుఁ డల్లవారు గవలు పాండవులము సమయపడి వనవాసంబు సేయ వచ్చితిమి విశేష యుక్తి. 115

సీ. అనవుడు రాక్షసుం డట్టహాసంబుతె నెట్టెట్టు భీముండె యీతఁ డేమి పుణ్యమో వీని నెప్పుడు సంపఁగాంతునో యని యున్నచోఁ దాన యరుగుదెంచె నధికు మాయన్న బకాసురు నా యిష్టసఖు హిడింబాసురుఁ జంపి యున్న ఖలు మ్రింగి జీర్ణంబు గావింతు వాతాపిఁ దడయక మ్రింగిన తపసి యట్ల.

ఆ యనిన రక్కసునకు నలిగిన యగ్రజు నలుక యెఱిఁగి వీరుఁ డర్జునుండు మొనసి గాండివంబు మోపెట్టె సునిశిత ఖడ్గపాణు లైరి కవలు నంత. 116

కిమ్మీరుఁ డను రాక్షసుఁడు భీముచేఁ జచ్చుట సం. 3-12-42

ఉ. ఘోరపరాక్రమున్ ప్రబల కోపపరుల్ పృధు సారభూరిభూ మీరుహపాణు లుద్ధతు లమిత్రవిఘాతులు వీరబృంద బృం దారకు లార్చు చొండొరులఁ దాఁకిరి దారుణభంగిఁ బొంగి కి మ్మీర సమీరసూనులు సమీరవిధూతపయోధు లట్లయై. 117

తరలము. పొరిని వారల చేతియున్నత భురుహాయుధముల్ పర స్పరకఠోర శిరస్థ్సలంబులపై వడిం బడి మత్తకుం జరశిరః పతితంబు లైన లసన్మృణాళము లట్ల జ ర్జరిత మయ్యెఁ దదారవ ప్రతిశబ్ద మొప్ప నభంబునన్. 118

వ. ఇట్లొక్క ముహూర్తంబు వృక్షయుద్ధంబు సేసి యాసన్నమహీరుహంబులు సమసిన నయ్యిద్దఱు శిలాయుద్ధంబునకుఁ దొడంగి చేయు నెడం బవన జనిక్షిప్త నిష్ఠు శిలాహత హృదయుండై భాను బట్టుకొను స్వర్భానుండునుం బోలెఁ గిమ్మీరుండు భీము బట్టకొనిన భీముండును వాని హీనంబలుం గా నెఱింగి కృతాంత దండాలుకారంబు లయిన తన బాహు దండంబుల నమ్మలుజకంటకు కటికంఠ ప్రదేశంబులు పట్టుకొని నేలంబెట్టి దేహయష్టి విఱిచి బకుం జంపిన విధంబునఁ గిమ్మీరు విగతప్రాణుం జేసి. 119

తే. బకహిడింబులు హతులైన బనివిపనివి యఱచి శోకింపఁ గానక యమపురమున కరిగి తక్కట రాక్షస యనుచుఁ దెరువు వాయఁ బావని దత్కళేబరము వైచె. 120


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com