ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి

వికీసోర్స్ నుండి

దేవత (1964) సినిమా కోసం వీటూరి రచించిన లలితగీతం.

పల్లవి :

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ

ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతీ || ఇల్లాలే || ||| ఆలయాన |||


చరణం 1 :

పతి దేవుని మురిపించే వలపుల వీణా

జీవితమే పండించే నవ్వుల వానా || పతి ||

కష్టసుఖాలలో తోడు నీడగా

తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ || కష్టసుఖాలలో ||

మగువేగా మగవానికి మధుర భావన ||| ఆలయాన |||


చరణం 2 :

సేవలతో అత్తమామ సంతసించగా

పదిమందిని ఆదరించు కల్పవల్లిగా || సేవలతో ||

తనయుని వీరునిగా పెంచే తల్లిగా

సతియే గృహసీమను గాచే దేవతగా || తనయుని ||

సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా ||| ఆలయాన |||