ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/తరిగొండ వెంకమ్మ

వికీసోర్స్ నుండి


తరిగొండ వెంకమ్మ.


ఈమె మంచి విద్వాంసురాలు. ఈమె చేసినపుస్తకములు తఱిగొండ నృసింహస్వామి కంకితము చేయబడినవి. తరిగొండ కడపమండలములో వాయిల్పాడునకు నాలుగుమైళ్ళదూరములో నున్నది. ఈమెరచియించిన గ్రంథములలో రాజయోగసార మను ద్విపదకావ్యమును వేంకటాచలమాహాత్మ్యమను పద్యకావ్యమును ముద్రింపబడియున్నవి. ఈమె తాను భాగవతము ద్వాదశస్కంథములను ద్విపదకావ్యముగా రచియించినట్లు వేంకటాచలమాహాత్మ్యములోని యీ క్రిందిపద్యములో జెప్పుకొన్నది. పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/224 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/225


పిండిప్రోలు లక్ష్మణకవి.


ఇతడు లంకావిజయమనబడెడు రెండాశ్వాసముల ద్వ్యర్థికావ్యమునుజేసెను. ఇత డాఱువేలనియోగిబ్రాహ్మణుడు; ఆపస్తంబసూత్రుడు; భారద్వాజగోత్రుడు; గోపాలామాత్యపుత్రుడు. ఈకవి గోదావరిమండలములోని రామచంద్రపురమునకు