ఆండ్రూ కార్నెగీ (జీవితచరిత్ర)/సంకటపు సంవత్సరాలు

వికీసోర్స్ నుండి

సంకటపు సంవత్సరాలు

2

అలిఘనీ, 1848 లో మాగుడువాసన, బురా, కొల్ల కొల్లగా గడ్డిపట్టి వుండే వీధులు, ప్రతివసంతంలోను వచ్చి బాధపెట్టే వరదలు, అప్పుడప్పుడు విజృభించే కలరాలతో ఆకర్షణ ఏమాత్రమూ లేని నగరాలలో వొకటిగా వుంటుండేది అయితే అది క్రమరహితంగా మాత్రం వుండేదికాదు. అయితే అందులో ఇరవై రెండువేల మంది నివసిస్తున్నా అక్కడి రక్షకభటుల సంఖ్య నలుగురుమాత్రమేనని ఆండ్రూ కజిన్ డాడ్‌కు వ్రాసిన వుత్తరంలో సగర్వంగా తెలియజేశాడు. ఇందులోని జనంలో యెక్కువమంది ప్రతినిత్యమూ ఉదయము, సాయంకాలము అలిఘనీ బ్రిడ్జిమీదగా నడిచివెళ్ళి పిట్స్‌బర్గులో పనిచేస్తుంటారు.

ఆత్మబంధువులైన మిసెస్ థామస్ హోగన్, ఆంట్ అన్నా ఐట్కిన్‌లు కార్నెగీలకు హృదయపూర్వకమైన స్వాగత మిచ్చారు. వీరు అందరు రెబెక్కా వీధిలో నివాసాలు ఏర్పరచుకొన్నారు. వీళ్ళల్లో ఎవరూ సంపత్తి కలవారు కారు. అయినా భద్రత లభించటంవల్ల తాము సుఖంగా వున్నామనే భావిస్తున్నారు. అంహల్ టామ్ హోగన్ వొక క్రోకరీ దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. సుఖపదమయిన చిన్ని రెండతస్తుల ఇంట్లోవుంటూ దానికి అద్దె చెల్లింప గలుగుతున్నాడు. చాలా సంవత్సరాలకు పూర్వమే భర్త చనిపోయిన ఆంట్ ఐట్కిన్ ఇప్పుడు ఒక చిల్లరదుకాణానికి యజమానురాలైంది. అంకుల్ టామ్ సోదరుడయిన ఆండ్రూ హోగన్ ఆంట్ ఐట్కిన్ నివసిస్తున్న ఇంటికి చివరలో ఉన్న చిన్న ఇంట్లో వుంటూ నేత నేస్తుండేవాడు. ప్రస్తుతం అందులో నుంచి మారబోతున్నాడు. ఆంట్ ఐట్కిన్ దాన్ని కార్నెగీలకు ఇచ్చింది.

"అన్నా ! అద్దె యెంత వుంటుంది !" అని విలియం అడిగాడు.

"మీకు కొంత నిలువ దొక్కుకున్నదాకా ఏమీ వుండదు" అన్నది దయామూర్తి ఆ ఆంట్. విలియం అందుకు అభ్యంతరం చెప్పాడు కాని ప్రస్తుతం అతనికి అంత కంటే గత్యంతరం లేదు.

ఇక ఇప్పు డతడు, వెనక స్కాట్లండులో చేస్తున్నట్లుగానే చేనేతపని ప్రారంభించాడు. అయితే అమెరికాలో చేనేతను మరమగ్గాలనేత అతివేగంగా త్రోసిపుచ్చటంవల్ల అతడు అక్కడికంటే ఇక్కడ ఎక్కువ ఇబ్బందులమధ్య పనిచేయ వలసి వచ్చింది. డన్ఫ్‌ర్మ్‌లైన్‌లో నేసిన వాటికంటే చౌకరకం బల్లగుడ్డలను, తీసిపారవేయదగ్గ ప్రత్తి జాతి గుడ్డలను నేసి విలియం ఇంటింటికి తిరిగి అమ్ముతుండేవాడు. ఈ సమయంలో అతడిభార్య చెప్పులు కుట్టుట మనే ప్రాతపనిని ఎత్తుకొని మిష్టర్ ఫిలిప్ అనే చిన్న చెప్పుల దుకాణదారుకు చెప్పులు కుట్టియిస్తుండేది. ఫొలిప్ దుకాణంలో ఇద్దరు లేదా ముగ్గురు, ఇంటిదగ్గర పనిచేసి మార్గరెట్ కార్నెగీ వంటి కొందరు సహాయకులతో దొరకిన ఆర్డర్లకు అనుగుణంగా చెప్పులు కుట్టించి ఇవ్వటమే కాక ఇతరరకాల పాదరక్షలను కూడా తయారుచేయించి వాటిని మోసుకొనిపోయి అలిఘనీ, పిల్స్‌బర్గులకు చుట్టుప్రక్కల వున్న గ్రామ సీమల్లోకి కూడా వెళ్ళి అమ్ముతుండేవాడు.

ఇంటిపని తక్కువగా వున్నప్పడల్లాను, కొన్ని సమయాలల్లో అర్థరాత్రివరకూ చెప్పులు కుట్టుటంలో యెంతో శ్రమపడి మిసెస్ కార్నెగీ వారానికి దరిదాపుగా నాలుగుడాలర్ల సంపాదించగలిగేది. యిప్పుడు చిన, టాయ్‌కుకూడా సాయపడవలసిన వంతు వచ్చింది. బడి లేనప్పుడు అతడు తల్లికి ప్రక్కన క్రిందుగా చిన్న పీటమీద కూచుని సూదులకు దారాలెక్కించి ఇవ్వటం, దారాలపై మైనం వ్రాసి అందివ్వటం చేస్తుండేవాడు. ఆ సమయంలో ఆమె అతనికి అద్భుతమయిన తన జ్ఞాపకశక్తితో స్కాచ్ వైతాళికులు పాడిన కొన్ని వీరగీతాలనో, వాల్టర్ స్కాట్ రచించిన దీర్ఘ కావ్యాలల్లోనుంచి కొన్ని భాగాలన్ కంఠస్థం చేసిన వాటిని వినిపిస్తుండేది. ఎంతో చక్కగా ఉల్లాసం కల్పించగల దన్న ఆమె కీర్తి పరిసరాలల్లో వున్న పిల్లలో బాగా వ్యాపించి పోయింది. ఆమె స్కాచ్ చరిత్రలోనుంచి కథలను చెపుతుంటేనో,

"Nine-and-twenty Knights of fame
Hung their shields in Branksone Half
Nine-and twenty squires of name
Brought then their steeds to bower
from stall.
Nine-and twenty Yoemant all
Waited, duteous, on them all.
They were all knights of mettle trwe,
Krismar to the blod Buvvle wch."

మొదలయిన ఉద్రేకపూరిత కావ్య భాగాలను సర్ వాల్టర్ ఉద్గ్రంథాలనుంచి పఠిస్తుంటేనో ఆతనరతతో కొన్ని వేళ్ళల్లో ఆమెచుట్టూ పిల్లలు గుంపులు చేరేవాళ్ళు.

తొలుతగా కార్నెగీలు అలిఘనీలో నివాసమేర్పరుచు కొన్నప్పుడు ఆండ్రూ ఇంత పొట్టిగా, నలు చదరపు దవడతో, ఒక దాని------కొంతదూరంగా వుండేటట్టు పొదగబడ్డ కళ్ళతో---- తెల్లని దనిపించే జుట్టుతో స్పష్టమైన ------వుంటుండేవాడు. "బాటం హూషి -----------బడే పరిసర ప్రాంతాలల్లోని పిల్లలు (అలిఘని ----ప్రాంతవల్ల వీరి కీ పేరు వచ్చింది) ఇతణ్ని ----- నవ్వుతూ "స్కాచీ" అని పిలిస్తే ఆండే దానికి స్కాచ్ బాలుని వుచ్చారణతో "అవును నేను స్కాచీనే. అందుకు గర్విస్తున్నా!" నని గట్టిగా తిరిగి దెబ్బకొట్టినట్లు సమాధానం చెబుతుండేవాడు. ఇలా ఎగతాళిచేసే వాళ్లల్లో ఎక్కువమంది పిల్లలు తామే స్వచ్ఛమయిన స్కాచ్ వాళ్లు స్కాట్లండునుంచి వలసవచ్చిన వాళ్ళ బిడ్డలు-కావటం ఇందు లోని హాస్యాస్పదమయిన అంశం. వీరూ ఆండీ లాగానే అమెరికాలో కాక తమ పూర్వ దేశమయిన స్కాట్లండులో పుట్టినవాళ్లు. అయితే కొద్ది కాలంలోనే ఆండీ ఆ తన స్కాచ్ యాసను అతి వేగంగా పోగొట్టుకొన్నాడు. కొద్దొ నెలల్లోనే తానుకూడా "బాటాయ్ హూషియర్ల"లో ఒకడయినాడు. ఆ పిల్లలందరూ తరువాతి కాలంలో ఎంతో అభివృద్ధికి వచ్చి ప్రముఖపౌరులైనారు. ఉచ్ఛస్థితికి రావటానికి వాళ్ళలో కొందరికి ఆండీ తొలుతగా దోహదంచేశాడు. ఇది గమనించవలసిన మరో విషయం.

దరిదాపుగా ఫలంహితమైన బేరపుతిరుగుడు తిరిగివచ్చి అమ్ముడుపోని గుడ్డలను ఒక మూలపడేసి నిట్టూరుస్తూ "అమ్మా ! ఇదేమీ ప్రయోజనం లేదు. ఈ రకంగా అయితే జీవనోపాధిని సంపాదించుకో లేము. ఇక బ్లాక్ స్టాక్ కాటన్ మిల్లులో వుద్యోగం చూసుకోక తప్పదు!" అని ఒక రోజున అన్నాడు. విలియం కార్నెగీ అక్కడ తనకు పని దొరుకుతుందని ముందుగానే విచారణచేశాడు. పనికి కుదిరాడు. తరువాత కొద్ది దినాలకు "ఆండ్రా ! మిల్లులో నీకు పనికూడా ఉంది" అన్నాడు.

ఆండీ పనికోసం వెతుకుతున్నాడు. ఎక్కడకు వెళ్ళినా అతణ్ని చాలా చిన్న వాడంటున్నారు. ఇప్పుడు అతడికి అమితోత్సాహం కలిగింది. "ఎటువంటి పని నాన్నా !" అని అడిగాడు.

"ఉండలు చుట్టటం"

"అందుకు మరి నాకు జీతమిస్తారా!" "నీకు వారానికి ఒక డాలరు ఇరవై సెంట్లు వస్తుంది". అది నమ్మ లేనంత తక్కువజీతం. అయినా, అది కుటుంబనిర్వహణానికి తానుకూడా సాయపడిన వాడనౌతానన్న వుద్దేశంతో ఆండీ అది విని పరవశుడైనాడు. తరువాత అతడు తండ్రి సూర్యోదయానికి పూర్వమే లేచి - చలికాలంలో ఇంకా ముందుగానే లేచి అతి వేగంగా ఉదయ భోజనంచేసి స్థిమితంగా సాయంత్రం ఆరుగంటలవరకూ పనిచేయట కోసం కర్మాగారానికి ఉరుకులెత్తే వాళ్లు. లిల్లీ కార్నెగీ వ్యక్తిత్వగల భావకుడు. ఇతరుల ఆజ్ఞలకు లోబడి ఒక నిర్ణీత కార్య క్రమాన్ని అనుసరించి కూలికి ఒకరి దగ్గర పనిచేయటానికి ఏమాత్రం తగనివాడు. నేతపని యంత్రంమీద జరుగుతుండడాన్ని చూసి అతని అంతరాత్మ ఎదురు తిరుగు తుండేది. తట్టుకో లేక కొన్ని నెలలు గడచిన తరువాత కర్మాగారాన్ని వదలి వేశాడు. పెరటిలో ఉన్న మగ్గాన్ని చేరుకొని బల్లగుడ్డలు మరిన్నిగా అడపా దడపా తయారుచేసి ఇంటింటికి మైళ్ళ తరబడిగా నడచివెళ్ళి ఒకటో రెండో ఆ బల్లగుడ్డలను అమ్ముకొస్తుండేవాడు.

కుటుంబానికి తమ పూర్వ దేశంనుంచి వలసవచ్చిన వారితో పరిచయం వృద్ధిపొందుతున్న రోజుల్లో ఆండ్రూ మరొక స్కాట్లండ్ దేశీయుడైన జాన్ హెను కలుసుకున్నాడు. అతడు అతనికి చాలా ఎక్కువ జీతంతో - అంటే వారానికి రెండు డాలర్లు. ఒక వుద్యోగ మిస్తా నన్నాడు. ఇంతవరకు అతడు చేయవలసివచ్చిన అసంతృప్తికరమైన పనులన్నిటిలోకీ అది దొడ్డది. చిన్న ఇంజనుమీద దృష్టినిలిపి, దాని బాయిలర్ కిందనిప్పు వేస్తూ వికారమైన ఒక చీకటికొట్లో అతడు పనిచేయాలి. అటువంటి పరీక్షా సమయంవస్తే దాన్ని సర్ విలియం వాలెస్ ఎలా ఎదుర్కొనేవాడో అని ఊహిస్తూ తన వుద్యోగంమీద వుత్సాహాన్ని నిలుపుకోటానికి అతడు యత్నించాడు. ఉద్యోగం ఎంత అసంతృప్తికరమైనది. అయితే నేం అతడు దాన్ని ఎంతగా అసహ్యించుకుంటున్నాడో అతడు తల్లిదండ్రులకు తెలియనివ్వకూడదు.

తన కర్మాగారంలో ఒకమూల బల్లవేసుకొని కూర్చున్న మిస్టర్ హా - అతని కార్యాలయాని కంతటికీ అతడొక్కడే వుద్యోగవర్గం - ఒక రోజున కుర్రవాడైన ఆండీని పిలిచి అడిగాడు. "నీకు లెక్కలు బాగా తెలుసునా !" అని.

"ఆర్యా! తెలుసుననుకొంటాను" అన్న సమాధాన వచ్చింది.

"నీవు బాగా వ్రాయగలవా !"

"ఆర్యా ! చాలా అందంగా వ్రాయగలను."

"ఎలా వ్రాస్తావో చూడనీ. యిక్కడ కూర్చో."

ఆండీ చేతిలో ఒక కలాన్నిదోపి కాగితాన్ని ముందుకు తోశాడు. "ఆ చెడ్డగా లేదు. చెడ్డగా లేదు"అన్నాడు. వ్రాసింది చూస్తూ, నాకు బిల్లులు వ్రాసి పెట్టటం నీ కిష్ట మేనా!"

"ఓ తప్పక చేస్తాను." అని ఆశ్చర్యపడుతూ తాను పనిచేస్తున్న చీకటి కొట్టులోనుంచి బయటపడటానికి అతడు ఎంత ఆతురత వహిస్తూన్నాడో వెల్లడించే ఉత్సాహంతో అన్నాడు. వెనుకటంత చెడ్డది లేదా అంతకంటె మరీ చెడ్డది అయిన పని తనకు రానున్నదని అతడు అప్పుడు కొంచమైనా వూహించ లేదు. అతడు మిస్టర్ హా యిచ్చిన "సింగిల్ ఎంట్రీ బుక్ కిపింగ్" పని కొద్ది కాలంలోనే పూర్తిచేస్తుండే వాడు. యిది అతని పనికాలంలో సగానికైనా సరిపోదు. అందువల్ల మిగిలిన రోజంతా అతడు కండెలను నూనె తొట్టిలో ముంచి సరిచేస్తుండేవాడు. ఆ నూనెకు ఎంతో కష్టంమీదగాని అతడు సహించలేనంతటి కంపువుండేది. మనస్సును బూస్, వాలెస్ లమీద ఎంతగా లగ్నం చేసినప్పటికి యితడు దాన్ని సహించలేక పోతున్నాడు. ఓర్చుకోలేక పళ్లు మెలికలు తిప్పి కొరుకుతుండేవాడు. అయినా తను బాధపడుతున్నది తల్లిదండ్రులకు ఏమాత్రం తెలియనిచ్చేవాడు కాడు.

సాయంత్రం అతడు ఒక గంట సేపు ఫిలిప్ చెప్పుల దుకాణం దగ్గర జాన్ ఫిలిప్‌తోను, యితర బాలురతోను గడుపుతుండేవాడు. వీళ్ళలో ఎక్కువ మంది స్కాచ్ బాలురు. ఒకనాటి సాయంత్రం అతడు తన బుక్కీపింగు పనిని గురించి వాళ్ళకు చెబుతున్నప్పుడు టామ్‌మిల్లర్ "హా వ్యాపారం వంటి చిన్నదానికి సింగిల్ ఎంట్రీ బుక్కీ పింగు పనికివస్తే రావచ్చునుగాని పెద్దకంపెనీలన్నీ తమ లెక్కలను డబుల్ ఎంట్రీ విధానంలోనే వ్రాయిస్త"నన్నాడు.

యిది ఆండీకి క్రొత్త విషయం. అతడు ఆ క్రొత్త పద్ధతిని గురించి యింకా ఎక్కువగా తెలుసుకో దలచుకున్నాడు. అయితే దీన్ని గురించి టామ్‌కు వున్న జ్ఞానం చాల తక్కువ. కొన్ని సాయింతనాలు గడిచిన తరువాత ఎవరో ఒకవ్యక్తి క్రమమైన రుసుము తీసుకుని సాయంసమయాలల్లో ఆ బుక్‌కీపింగు విధానాన్ని పాఠం చెపుతాడనీ టామ్ తెలియ జేశాడు. కొన్నాళ్లు ఆలోచనలు సాగించిన తరువాత ఆండీ, టామ్, జాన్‌ఫిలిప్స్, లిల్లీకౌలీలు వాళ్ళకు వచ్చే కొద్ది రాబడులలోనే చిన్న మొత్తాలను ఆ పాఠాలు నేర్చుకునేటందుకు దాచుకుందామని నిశ్చయించారు. అప్పటినుంచి వారు డబల్ ఎంట్రీలోని విశేషాలను నేర్చుకుంటూ కొన్ని సాయంత్రాలు గడిపారు.

గత్యంతరంలేక ఇష్టంకాకపోయినా చేయవలసివచ్చిన పనిలో అమెరికాలో అతడు గడిపిన మొదటి ఒకటిన్నర సంవత్సరాలకాలమే అతని జీవిత మంతటిలోనూ ఆనంద విహీనమయిన సమయం. అయితే అతని అదృష్టంలో మార్పు సిద్ధంగా వుంది.

అప్పుడు 'తంతి' బాల్యావస్థలో వుండ తూర్పునుంచి పిట్స్‌బర్గువరకూ ఒకలైను పూర్తి చేశారు. దాని వ్యాపారం అతివేగంగా వృద్ధిపొందుతున్నది. దానికి స్థానిక కార్యనిర్వహకుడు డేవిడ్ బ్రూక్స్ అలిఘనీలో కార్నెగీలకు పొరుగువాడు. అతడు, అంకుల్ టాయ్ హోగన్ ఇరువురూ సాయంతన వేళల్లో చదరంగ మాడుకుంటూ ఆనందిస్తుంటారు.

ఒకరాత్రి వాళ్లు అప్పుడే ఒక ఆట పూర్తి చేశారు. మరొక ఆటకోసం పావులను అమరుసుండగా మిస్టర్ బ్రూక్స్ "మా వ్యాపారం అతి వేగంగా పెంపొందు తున్నది. అందు వల్ల మాకు తంతులను బట్వాడా చేసేటందుకు మరొక వార్తాహారి బాలుడు కావలసి వచ్చాడు. మంచివాడు, గట్టిగా నమ్మదగ్గవాడు మీ కెవరైనా తెలుసునా !" అన్నాడు.

మిస్టర్ హోగన్ తన మనుష్యుల నందరినీ ఒక్కమారు చివరవరకూ జ్ఞాపకం చేసుకొనిక్షణమాలోచించాడు. "నా కొక నెప్వూ వున్నాడు. వాడు ఈ పని చెయ్యవచ్చు. పేరు ఆండ్రూ కార్నెగీ, క్రొత్త డాలర లా మెరుస్తుంటాడు. నమ్మదగ్గవాడు. మనస్ఫూర్తిగా పనిచేస్తాడు. ఎంతపనికీ వెరవడు" అని తరువాత అన్నాడు.

"వయస్సెంత!"

స్మృతికి తెచ్చుకొని అంకుల్ టాయ్ అన్నాడు "పదునాలుగున్నర వయసులో చిన్నవాడయినా వయసుకు మించిన చురుకుతనం వున్నవాడు. అటువంటి బాలుడికి మీరే మిస్తారు!"

"వారానికి రెండున్నర డాలర్లు. ఇది అతడికి తృప్తిగా వుంటే నా కార్యాలయానికి పంపించి నాతో మాట్లాడమంటారా!"

"అలాగే చేస్తాను."

మిత్రులిద్దరూ ఆట పూర్తిచేశారు. వెంటనే మిస్టర్ హోగన్ కార్నెగీల ఇంటికి వెళ్ళాడు. అప్పటికి సాయంకాలం చాలవరకు గడిచిపోయింది. అయినా మిసెస్ కార్నెగీ చెప్పులు కుడుతున్నది.

అంకుల్ టాయ్ తెచ్చిన వార్తమీద ఉల్లాసకర మయిన చర్చలు సాగాయి. ఆండీ ముఖం వుద్రేకంతో మెరిసిపోతున్నది. ఓహో! ఆ దారపుకండెల తొట్టెదగ్గిర నుంచి దూరంగా వెళ్ళిపోవటం! అతడికి ఏవో నూతన ప్రపంచద్వారాలు తన కోసం వితృతాలైనట్లు తోచింది. కానీ అతని తండ్రి మాత్రం అనుమానిస్తున్నాడు.

"ఆండా ఎంత చిన్నవాడో మిస్టర్ బ్రూక్స్‌కు తెలిసి వుండ" దని అతడు అడ్డుపెట్టాడు. "ఆండు యిస్తానన్న జీతాన్ని బట్టి ఇంతకంటే వయసున పెద్దవాడు బలిష్ఠుడు అయిన కుర్రవాడు కావలెనని అతడు వుద్దేశించి వుంటాడు.

"ఆండీ వయసున చిన్నవాడె. కానీ అసాధారణమైన చురుకుతనం వున్న వాడని నేను అతడికి వివరించి చెప్పాను" అన్నాడు. అంకుల్ టాయ్ "అతడు ఇంతకంటే పెద్దవాడు కావలెనని వుద్దేశించ లేదు ఆండీ అతడికి సంతృప్తిని కలిగించ గలడని నా విశ్వాసం".

మిస్టర్ కార్నెగీ తల ఊపాడు. "థామస్ ! నీవు ఇందులోని మంచి చెడ్డల నన్నిటిని ఆలోచించినట్లు లేదు. అతణ్ని నానారకాలైన స్థలాలకు పంపిస్తుంటారు. అందులో కొన్ని కుర్రవాళ్లు వెళ్ళదగ్గవిగా వుండవు. వార్తలను చేతికిచ్చి చీకటి రాత్రుల్లో బయటికి పంపించవచ్చు. బహుశ: గ్రామసీమలకు కూడా పంపించవచ్చు అంతే కాదు. మొదట అతనికి ఈమహానగరమే సరిగా తెలియదు" అన్నాడు నొక్కి పలుకుతూ. "నేను త్వరలో తెలుసుకొంటాను" ఆదుర్దాతో వణికిపోతూ ఆండి మధ్యలో జోక్యం కల్గించుకొని అన్నాడు.

"కాదు, కాదు" అన్నాడు తండ్రి. "నీవు అందులో చేరవద్దు".

పనిచేసుకొంటూనే విషయాన్ని గురించి ముందు వెనుకలు ప్రశాంతంగా ఆలోచిస్తూన్న తల్లి ఈ క్షణంలో తన నిర్ణయాన్ని బయటపెట్టింది. ఆమె అన్నది: "చేరడమేఆండ్రాకూ చాలా మంచిది. నా అభిప్రాయం" "అల్లిక దారపు కర్మాగారంలోనే అతడు నిరంతరం పనిచేస్తుండాలని మనం అనుకోటానికి వీల్లేదు. అక్కడ అతడి అభివృద్ధికి ఎటువంటి అవకాశం లేదు"

"నేను దానిలోనుంచి బయటపడదా మనుకుంటున్నా" నన్న ఆండీ గొంతు భావోదేగ్రంవల్ల గాద్గద్యం వహించింది. "అట్టినూనెకంపును ఒక్క క్షణకాలంకూడా నేను భరించ లేనని ఎన్నో తడవలు అనుకుంటుండే వాణ్ని".

అతనివంక తండ్రి ఆశ్చర్యంతో చూశాడు. ఈ వ్యతిరేక భావాన్ని గురించి అతడికి తెలియదు.

"ఈ విషయం మాకు ఎందుకు చెప్ప"లేదని తల్లి అడిగింది.

"మీకు ఇబ్బంది కలిగించటం నాకు ఇష్టం లేకపోయింది".

"మిస్టర్ బ్రూక్స్ రేపు తన్ను కలుసుకోమన్నా" డన్నాడు అంకుల్ టాయ్. తంతి కార్యాలయం ఫోర్తు అండ్ వుడ్ వీధులమధ్య వుంది". ఆండ్రూకు ఆరాత్రి నిద్రపట్టటం కష్టమయింది. అతడు మర్నాడు ఉదయమే పెందలకడ మేల్కొన్నాడు.

ఉదయ భోజనవేళ తండ్రి ఇలా అభిప్రాయ ప్రకటన చేశాడు. "మిస్టర్ బ్రూక్స్‌ను చూసేటప్పుడు నేను కూడా నీవెంట వస్తాను. అయితే దీన్ని గురించి ముందుగా మిస్టర్ హోతో ఆలోచిస్తాను".

చాలా చిన్న విషయాన్ని గురించి తండ్రి పెద్దగొడవ చేస్తున్నాడని ఆండ్రీకి అనిపించింది. విషయాన్ని తనకు వదలిపెడితే సూటిగా మిస్టర్ బ్రూక్స్ కార్యాలయానికి వెళ్ళి "నేను ఉద్యోగంలో చేరుతాను" అని చెప్పేవాడు. అయితే తండ్రి అంటే అతనికి "అమితగౌరవం. అందువల్ల ఏమీ అనలేదు. మిస్టరు హాన్‌తో ఆలోచించటానికి మిస్టర్ కార్నెగీ అతత్వ తంగా వెళ్లాడు.

అతణ్ణి పోగొట్టుకోటంవల్ల నాకు ఎంతో అసౌకర్యం కలుగుతుంది కానీ అందువల్ల ఆండ్రూకు బహుశా: అధిక ప్రయోజనం ఉండవచ్చు కనుక అతణ్ణి నాదగ్గరనుంచి మార్చవలసిందే అని నేను సలహా ఇస్తా ది తంతివారు అంగీకరించకపోతే అతడు తిరిగి ఇక్కడికి రావచ్చు" అన్నాడు సత్యాన్ని పలికే మిస్టర్ హె

ఇంతలో ఆండీకి మంచి పంట్లాం తొడిగి మంచి నీలవర్ణపు జాకెట్టువేసి ముఖంతుడిచి, బూడిదరంగు జుత్తును జాగ్రత్తగా సరిదిద్ది దువ్వి, చివర దిదుళ్లు పూర్తిచేసి పరికిస్తున్నది తల్లి వసంతపు ఉదయవేళ అతడు, ఆతని తండ్రి రెండు మైళ్లు నడిచి పిర్త్ అండ్ వుడ్ వీధుల మూలలలో ఉన్న తంతి కార్యాలయం దగ్గరికి చేరారు. మిస్టర్ బ్రూక్స్ కార్యాలయం రెండవ అంతస్థులో కనిపించింది. మెట్లగది ద్వారం దగ్గర ఆండ్రూ త్రోవలో తాను చేసుకొన్న నిర్ణయానికి తగ్గట్టుగా ప్రవర్తించాడు.

ఆగి తండ్రికి ఎదురు మళ్లగా నిలిచి అతడు "నాన్నా! దయవుంచి మీరు ఇక్కడి ఉండిపొండి. ఈపనిని నన్నే స్వయంగా చెయ్యనివ్వండి. మిస్టర్ బ్రూక్స్‌తో నన్ను అన్నాడు. ఒంటరిగా మాట్లాడ నివ్వండి" అయితే తన భయమేమిటో అతడు చెప్ప లేదు. తండ్రి తన చిన్ని రూపంమీద దృష్టినిలి చేటట్లు మాట్లాడి ఉద్యోగాన్ని పొందే అవకాశం అతిస్వల్పంగా ఉండేటట్లు చేస్తాడేమో అన్నది. అతని భయం. "నాన్నా! ఈపని నంతటినీ నేనే స్వయంగా చేసుకొంటా"నని వేడుకొన్నాడు.

తండ్రి అతనివంక శోధనాపూర్వకంగా చూసి అన్నాడు. "మంచిది. నీకోసం నేను ఇక్కడ ఎదురు చూస్తుంటాను". అందువల్ల తండ్రి ప్రవేశద్వారం దగ్గర ఆగిపోయాడు. ఆండ్రూ మేనేజరును చూడటానికి వెళ్లాడు.

మిస్టర్ బ్రూక్స్ ఎంతో దయగా అప్పుడే కుర్రవాడికి ధైర్యం చెప్పాడు. జీతాన్ని గురించిన ప్రసంగంలో కూడా ఉదారంగా ఉండటానికి యత్నించాడు.

పిట్స్‌బర్గ్ నాకు పూర్తిగా తెలియదు. అయితే, అతిత్వరితంగా తెలుసుకొంటాను. నేను చిన్నవాడినని నాకు తెలుసు, బహుశ: ఈ ఉద్యోగానికి తగినంత బలిష్ఠుణ్ని కాక పోవచ్చు. కానీ నిర్వహించగలనన్న నమ్మకం నాకుంది. నేకోరేదల్లా నాకొక అవకాశ మిప్పించమని".

జీతం - వారానికి రెండున్నర డాలర్లు - నీకు సంతృప్తికరంగా ఉందా !" అని అడిగాడు మేనేజరు.

"ఇంకా నేను ఎక్కువ సంపాదించుకో గలిగేదాకా సంతృప్తికరమే".

"పని ఎప్పుడు ఆరంభిస్తావు!"

దీన్ని గురించిన నిర్ణయం చేయటానికి ఆండ్రీకి రెండుక్షణాలకంటే ఎక్కువకాలం అవసరం లేకపోయింది. "మీరు కోరితే ఇప్పుడే ఆరంభిస్తాను".

"చాలా బాగుంది" అని గొంతు పెద్దదిచేసి అతడు "జార్జీ!" అని పిలిచాడు.

ఆండీ కంటే పెద్ద కుర్రవాడొకడు ప్రక్కగదిలోనుంచి వచ్చాడు.

"జార్జీ ! ఇతడు మన నూతనవార్తా హరి, ఆండ్రూ కార్నెగీ" అన్నాడు మిష్టర్ బ్రూక్స్ . ఆండ్రూ, జార్జి మెక్లైన్ నీకు నగరాన్ని, మా పద్ధతులను పరిచయం చేస్తాడు".

జార్జి ఆండీవంక తిరస్కార పూర్వకంగా చూస్తున్నాడు. "ఇతడు మనకెందుకు పనికివస్తాడు. చెయ్యవలసిన పనికి ఇతడు చాలా చిన్న వాడు" అన్నాడు.

"ఆ నిర్ణయం చేయటం నాకు విడిచిపెట్టు అని మిష్టర్ బ్రూక్స్ ముక్తసరిగా సమాధానం చెప్పాడు. "వెంటనే ఆండ్రూని లోపలికి తీసుకుపో ఆపరేటర్ల దగ్గర నుంచి వార్తలను పుచ్చుకో ఇవాళ ఇతణ్నీ నీవెంట తీసుకో వెళ్లు, నువ్వు ఎలా పనిచేస్తావో చూస్తాడు".

ఆపరేటర్ల గదిలో ఆండీ కొద్ది నిముషాలు జార్జితో గడిపాడు. అప్పుడు అతడికి తండ్రి విషయం జ్ఞప్తికి వచ్చింది.

"అరె" అని కేక పెట్టాడు. మా నాన్నను అక్కడ ప్రక్కదారి దగ్గర నిలువబెట్టి వచ్చాను. క్రిందికి వెళ్ళి ఆయనకు చెప్పి వస్తాను".

పరుగెత్తుకుంటూ మెట్లు దిగాడు. "నాన్నా! అంతా నిర్ణయమైంది". పెద్దగా అన్నాడు. "నాకు ఉద్యోగమిచ్చారు. వెంటనే పని ప్రారంభించాలి".

కాంతిని విరజిమ్ముతున్న అతని ముఖం అతడెంత సంతోషంగా ఉన్నాడో తండ్రికి తెలియ జెప్పి ది.

కుర్రవాడి బుజంమీద చెయ్యి ఉంచి "నిన్ను గురించి నా కెంతో సంతోషంగా ఉంది. బాబూ!" "ఇందుకు మీఅమ్మ సంతోషిస్తుంది. నీవు చేతనై నంత బాగా పని చేస్తావని నాకు తెలుసు", అన్నాడు.