అయ్యయ్యో నీవంటి అన్యాయ దైవము

Wikisource నుండి
template error: please do not remove empty parameters (see the style guide and template documentation).


   ముఖారి రాగం    త్రిపుట తాళం

ప: అయ్యయ్యో నీవంటి అన్యాయ దైవము

నెయ్యడ గాననయ్య శ్రీరామయ్య || అయ్యయ్యో ||


అ.ప.: ఇయ్యెడ నేను కుయ్యాడిన ఆలకించ

వయ్యయ్యో యేమందు అయ్యా రామచంద్ర || అయ్యయ్యో ||


చ1: ఎంతని వేడుదు ఎంతని పాడుదు

ఎంతని దూరుదు ఏమిసేతు రామ

సుంతైనగాని నీ అంతరంగమదేమో

వింత కరుగదు ఎంతో నమ్మినందుకు || అయ్యయ్యో ||


చ2: శరణన్న జనముల బిర బిర బ్రోచేటి

బిరుదు గలిగినయట్టి దొరవని నే నీ

మరుగు జొచ్చినందు కరమర జేయుట

పరువే కరుణింప బరువే హరి హరి || అయ్యయ్యో ||


చ3: కామిత మందార కలుష విదూర

తామసమేల తాళజాలనురా నీ

మోము జూపుము స్వామి భద్రాచల

రామదాసుని ప్రేమ రయమున నేలుము || అయ్యయ్యో ||


PD-icon.svg ఈ కృతి జనవరి 1, 1923 ముందు ప్రచురించబడుట లేక రచయిత మరణించి కనీసం 100 సంవత్సరాలైనందున ప్రపంచవ్యాప్తంగా ప్రజాపరిధి లో వున్నది .