189
ఒక బ్రాహ్మడూ ఒక శూద్రుడూ దొంగతనం జాయింటుగా చేసి పట్టుబడిన ఒక కేసు జడ్జియెదటికి తేబడగా.
జ - ముందే కూడబలుక్కుని వెళ్లిన బాపతామీది? లేకపోతే, ప్రత్యేక ప్రయత్నంలో కలుసుగున్నదా?
శూ - నాకేమీ తెలియదండి.
జ - చాల్లేస్తూ మాట్లాడొచ్చావ్ పైగానూ! స్థలం సందర్భం లేదునీకూ? ప్రతీచోటా అవతలవాడితో పోటీయేనా నీకు?
శూ - నాకేమీ తెలియదండి.
జ - ఛీ ఇక్కడ నీకు జాగాలేదు. అధమం ఇక్కడేనా ఆపోటీ మట్టం చెయ్యాలి. అవతలికినడు. పో, తక్షణం !
190
పుల్లయ్య తనుచేస్తూన్న భూమికి ఖామందులైన అప్పారావు గారితో మాట్లాడుతూ.
పు - ఏమండీ. అప్పారాయలగారూ! మరి తమరు ఎక్కడలేనిడబ్బూ పోసి బోలిడంత శాస్త్రం చదివారు గందా! అద్దాలు అవీ సూస్తారుగందా! నచ్చిత్రాల్ని పిలుస్తారు గందా! మా మంగలోడి అద్దంలో నెమిలి కనిపిస్తుందీ, అదేటి చెప్పండి!
అ - హారినీముండామొయ్యా, అదిటోయ్? దుర్భిణీలద్దం గాబోలు! క్షౌరం తరవాత చూసుకో, నెమిలి అప్పుడు కనిపించదు.
191
సుబ్రహ్మణ్యం - ఏరా, అచ్యుతరామయ్యా! అయిందీ “కాంపిటిషను”?
అ - ఆ
సు - ఎన్నీ తినవలిసిన మిఠాయి ఉండలు ?
అ - పెద్దరకం. నలభై.
సు - 'ప్రైజు' నీదేనా ?
అ - ఆ.
సు - ఎంత ?
అ - రూపాయిన్నర.
సు - అదేమిటి ? అల్లా పెట్టారేం?
అ - బండిచార్జి ఓ అర్థనుకో, డాక్టరు రూపాయి తక్కువకి మాట్టాడతాడామరి !
192
సీతయ్య - ఎక్కడికిరా, బయల్దేరావ్?
సూరప్ప - చెప్పనా?
సీ - కానీ.
సూ - సురభి నాటకానికి.
సీ - ఏం తొందర?
సూ - ఈవాళమరి ఆఖరాటకాదూ?
సీ - కూచోవోయ్, రేపెళ్ళచ్చు!
భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1
41
హాస్యవల్లరి