ఆనం - ఏం ఏం! ఎందుకూ?
ఒకడు - ఇందులో దేంట్లోనో ఇరుక్కుపోయావు! జన్మ పిరాయించు గోవాలిగాని, నువ్వు ఇవతలకిరావడం అంచూ మళ్ళీ ఉంచుందిషోయ్.
12
ఒకడు తను గొప్ప వేషధారినని ఒకసభలో కోస్తూండగా.
ఒక సభ్యుడు - ఎవ్వరికీ తెలియనే తెలియదండీ! సాధారణంగా ఏపాత్రం మీది?
ఒకడు - అర్జునపాత్రమండి, సర్వత్రా. మొన్న నేను అభినయించిన రాత్రి నాకు ఒక మెడల్సు ఇద్దామని గుసగుస లాడుకున్నారు.
ఒక సభ్యుడు - ప్రసన్న యాదవంనాటి రాత్రేనా.
ఒకడు - మరే.
ఒక సభ్యుడు - మీ వేషాలు నాటకరంగం మీద తప్ప కడంచోట్లలా ఉన్నాయి. మరి గయోపాఖ్యానంలో ఏం వేస్తారు?
ఒకడు - గయునిఫ్ఠీవనం వేస్తాను.
13
కామయ్య - ఎక్కడికిరా, రామకృష్ణా!
రామ - బట్టలషాపుమీదికి. చొక్కాలు చింపించాలి.
కా - మొన్న కుట్టించి నెల తిరిగిందోలేదో, అప్పుడే ఎందుకురా మళ్ళీ పారేశావా, చిరిగాయా?
రా - ఉన్నాయి కాని, పిగిలాయి. నెలనెలా ఇదే ఇబ్బంది.
కా - సరిపోయింది. ఈమాటు నామాట విని బనియన్ గుడ్డ చింపించు, నెలనెలా ఎందుకొచ్చింది ఈ ఇబ్బంది !
14
ఒక బాలుడు - ఒక బొమ్మ గీసి దానికింద 'ఆవుదూడ' అని రాయగా
మేష్టరు - ఏమోయ్! నువ్వు ఫస్టుక్లాసు దూడేశావు. మళ్ళీ రాశావు కూడా ఎందుకు. కింద?
బా - నేను లోపల అనుకున్నది అందరికీ తెలియడానికండి.
15
“పుస్తకాలన్నింటిలోకీ అధమాధమం ఐనదానికి గొప్ప బహుమతీ!” అని పేపర్లో ప్రకటనచూసి చాలామంది రాయడం మొదలెట్టగా, అందులో ఇద్దరైన వెనకయ్య భూతయ్యలు ఒకనాడు కలుసుగుని, మాటల్లో,
వె - పూర్తిచేశావుటోయ్, బావా!
భూ - ఏదో, అయిందనిపించాను. ఏంపేరెట్టావ్?
వె - 'విధవేశ్వరవిజయం.' నువ్వు?
భూ - 'కుంకేశ్వరవిలాసం.'
వె - ఏడిశావులే, నాకు యోగ్యతాపత్రిక ఉందిలే మరి. ఒక ఒక గొప్పవాడే ఇచ్చాడు - అనగా నేనేరాస్తే సంతకం చేశాడు. “ఇంత అభాగ్యపుస్తకం నేచూడలేదు” అని.
భూ - నాకూ ఉందిలే మరి, “ఇంత దౌర్భాగ్యపు పుస్తకం ఇదే” అని.
భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1
5
హాస్యవల్లరి