పుట:హాస్యవల్లరి.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సో - పొట్టిప్లీడరింటో వాళ్ళమ్మాయికి......

రా - పదార్థాలు !

సో - మామూలే!

రా - కూరలు!

సో - ఎన్నైతేం అన్నాను! చెబితే దిష్టి కొడుతుందేమో గాని, అన్నంయావత్తూ ఒక్కవంకాయి కూరతోటే వెళ్ళిపోయిందంటే నమ్మొరీ!

రా - ఇహ దిద్దేమిటిగాని నీ పిండం, అది ఏ దిశగా వెడతా? 

105

కాశీ - ఒరేయ్‌సుబ్బూ! పందుంపుడక కావాలి, తే!

సు - అడితీకి కబురంపు! నీకు పుట్టి ఉండాలి లేకపోతే చాలదు.

కా - ఓహోఅదా! నీకు అక్కర్లేదా?

సు - నాకు తెలియకుండా ఉంటుందా?

కా - ఎమో! నీపెళ్ళాం వెళ్ళి నాలుగేళ్ళయింది. ఆవిడికి తెలుస్తే చాలదా?

106

సిద్దాంతి - బావా! ఈరోజులూ ......... ఊహూ వెళ్ళి పోతున్నాయిగందా! ఇవి వెళ్ళి ఎక్కడుంచున్నాయో, ఎవరైనా చెప్పగల్రేమో!

బా - ఎవరో యెందుకు మళ్ళీనూ! నీకు తెలియదుషోయ్!

సి - నాకా?

బా - అవును.

సి - ఎట్లా?

బా - అవన్నీ నువ్వుచేసి పారేసిన పాతపంచాగాల్లో పడిలేవుషోయ్! ముందు

సి - ఒహోహో! అవును! తీద్దాం!

107

గొల్లది - ఇది బేడముంత, పుచ్చుకుంటారమ్మా!

ఆవిడ - నేనూ మా ఆయనా ఇద్దరమే కాట్టే! ఎందుకింతా? పులుపుచిచ్చు పైగానూ!

గొ - చెబుదురూ!

ఆ - అవతల పోపు మాడిపోతోంది. ఇంతకి తక్కువైతే పొయ్యనని చెప్పూ ముంతా!

గొ - అడగండి.

ఆ - అర్థణా!

గొ - యెల్లవమ్మా! ఆడావు ఆడబేరం! అర్ధణాకిత్తే జుర్రుకోగల్రేం నువ్వూ మీ ఆయనానూ! అప్పుగల్తే ఎక్కువ కాదు కాబోలు!

108

బిచ్చగాడు - ఏదో మొహమాటం చొప్పున పెద్దలు నలుగురూ సత్కరిస్తున్నారండి.

పెద్దమనిషి - ఎదో పితలాటం చొప్పున పెద్దలు నలుగురూ నన్ను తిడుతున్నారు. నీపనే చాలాబాగుంది. దంచూ! వెళ్ళు!

బి - అన్నంలేనివాణ్ణి బాబయ్యా! ఒక్కకాని దయచెయించండి. మీరు తమలపాకు ఊసేసినంత లేదు!

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

95

హాస్యవల్లరి