పుట:హరివంశము.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 4.

329

సీ. కొలఁదిపెట్టఁగ రానికోలలు హరిమీఁద నేసె దిగ్భాగంబు లెల్లఁ గప్ప
     భౌముండు పేర్చి సప్తతిసహస్రాంబకముల వైనతేయునిఁ బొదివె దాన
     నొక్కింత యలిగి యదూద్వహుం డయిదునెన్మిదియును బదియును మెఱుఁగుతూఁపు
     లోలి రక్కసునిపై నొండొండ నిగుడించి మఱియు నేడమ్ముల నెఱఁకులందు
తే. నాట నరకుఁడు నలిగి యానలిననాభు, నంగకంబులఁ గీలించె నాఱు తీవ్ర
     సాయకంబుల నొచ్చి యాచక్రధరుఁడు, దట్టకెంపున లోచనాంతములు మెఱయ.155
ఉ. శాత్రవుప్రాణముల్ గొనఁగఁ జాలెడుతోరపుఁ దూపొకండు లో
     కత్రయవిస్మయావహముగా నడరింపఁగ దాని దానవుం
     డత్రసదంతరంగుఁ డయి యంతరమార్గమునంద త్రుంచి వే
     పత్రరథేంద్రు నొక్కపటుబాణమునం [1]దరలంగ నేసినన్.156
తే. వజ్రహతిచేత శైలంబు వడఁకుభంగి, వైనతేయుణడు వడవడవడఁకి యలుకఁ
     గడిఁది పగతుని నెఱకల నడిచి తీవ్ర, ముష్టిఁ బొడిచినఁ జెచ్చెర మూర్ఛ మునిఁగి.157
క. నరకాతురుఁ డగు కిల్బిషు, పరుసున నరకుండు దలఁకి భావము నొయ్యం
     బురికొల్పికొని శరాసన, పరిస్ఫురిత[2]గుణరవంబు పర్వఁగ మఱియున్.158
మ. అతిఘోరం బగు శాతసాయక మొకం డాకర్ణపూరంబుగాఁ
     గృతహస్తుం డగుటన్ వెసం దిగిచి లక్ష్మీనాథుఫాలంబు ప్ర
     క్షతిఁ బొందంగఁ గడంక నేయుటయు రక్తం బాస్యము న్ముంప మూ
     ర్ఛితుఁ డై వ్రాలె జగత్ప్రభుండు భుజగారిస్కంధపీఠంబునన్.159
చ. కనుఁగొని సత్యభామ మదిఁ గంపము నొందక నాఁటియున్నయా
     సునిశితబాణము న్బెఱికి శోణితము న్గరపల్లవప్రమా
     ర్జనముల నొయ్యఁ బాపుచును జామరమారుతసంప్రయుక్తిచేఁ
     దను పొనరించి వల్లభు గతవ్యధుఁ జేసే ముహూర్తమాత్రలోన్.160
వ. సుపర్ణుండును నిజపక్షపవనంబునఁ బ్రభునకు నాశ్వాసం బొనరించె నట్లు దెలిసి
     నగుచు నగధరుండు మగువ నెమ్మొగంబునం జూడ్కి నిలిపి యేను పరిపీడితుండ నై
     డస్సితి నొక్కింత నీవు కయ్యంపుమోపు మోవు మని [3]సమంచితోత్సాహసాహస
     విభాసిని యగు నాభామినిచేతికిఁ దన శార్ఙ్గం బిచ్చి యంపపొదు లనువుగా నమ
     ర్చినం బేర్చి యాక్షణంబ.161

సత్యభామ నరకాసురునితో యుద్ధంబు చేయుట

శా. వీరం బాఁడుఁదనంబు నొందె నవఁగా విక్రాంతి[4]సౌందర్యల
     క్ష్మీరేఖం [5]బచరించె నాఁగ ధృతి యక్షీణాకృతిం జెందె నా

  1. దలరంగ
  2. రణగుణంబు
  3. జనితోత్సాహ
  4. శాలిత్వ (పదపట్టిక చూ.?)
  5. బనరించె